
ఎస్వీ కృష్ణారెడ్డి, జగన్ మోహన్, రాజేంద్ర ప్రసాద్, అచ్చిరెడ్డి
‘‘అనుకోని ప్రయాణం’ అద్భుతమైన కథ. నా మనసుకు నచ్చింది. నా చిత్రాల్లో ది బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ నాలో మొదలైంది’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో డా.జగన్‌మోహన్ డీవై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’లో నాది సీరియస్ పాత్ర. అందుకే ఆ సినిమా విడుదలైనప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. కానీ, అందరూ నవ్వి నవ్వి వంద రోజులు చూశారు. ఇప్పుడు ‘అనుకోని ప్రయాణం’ కూడా అంత పెద్ద విజయాన్ని అందుకుంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నరసింహ రాజు.
‘‘కరోనా సమయంలో ఈ కథ రాశాను’’ అన్నారు డా.జగన్ మోహన్ డీవై. ‘‘ఈ చిత్రం అందరి హృదయాలను టచ్ చేస్తుంది’’ అన్నారు వెంకటేష్ పెదిరెడ్ల.
‘‘అనుకోని ప్రయాణం’ సంచలన విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి . ‘‘ఈ చిత్రం కొత్తగా ఉంటుంది’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. దర్శకులు కె.విజయభాస్కర్, నందినీ రెడ్డి, వీరభద్రం, నటుడు సోహైల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment