కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లివచ్చేసరికి ఇంటిలోని సొత్తు చోరీకి గురైంది.
నిడదవోలు: కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లివచ్చేసరికి ఇంటిలోని సొత్తు చోరీకి గురైంది. ఈఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మద్ది సూరిబాబు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.70వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం బాధితులు ఇంటికి చేరుకోగా దొంగతనం జరిగినట్లు తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.