Massive theft
-
శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ
-
పుట్టపర్తిలో భారీ చోరీ
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని కర్ణాటక నాగేపల్లి వద్ద ఉన్న సాయి సందీప్ విల్లాస్–2లో భారీ చోరీ జరిగింది. పుట్టపర్తి రూరల్ సీఐ సురేష్, ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు... సాయి సందీప్ విల్లాస్–2లోని 40 నంబర్ ఇంట్లో పుట్టపర్తి వ్యవసాయాధికారి వెంకట బ్రహ్మం, కొత్తచెరువు అగ్రి ల్యాబ్ ఏవో శ్రీవాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారు బుధవారం రాత్రి తమ ఇంట్లోని పై అంతస్తు గదిలో నిద్రించారు. అర్ధరాత్రి వేళ కింద హాలులో చప్పుడు రావడంతో వెంకట బ్రహ్మం కిందకు వచ్చి చూడగా, ఇంటి తలుపు తెరిచి ఉంది. బెడ్ రూంలోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు కనిపించలేదు. ఆయన వెంటనే అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పుట్టపర్తి ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ కృష్ణమూర్తి వచ్చి దొంగల కోసం చుట్టపక్కల వెదికినా కనిపించలేదు. గురువారం ఉదయం రూరల్ సీఐ సురేష్ ఘటనాస్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. ఏడో తరగతి చదువుతున్న తమ కూతురుకు ప్రతి జన్మదినం రోజున బహుమతిగా ఒక బంగారు నగ చేయిస్తామని, ఆ విధంగా చేయించిన లాంగ్ చైను, పూసల దండ, డాలర్లు, కమ్మలు, చైన్లు కలిపి మొత్తం 37 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేలు నగదును దొంగలు అపహరించారని వెంకట బ్రహ్మం, శ్రీవాణి దంపతులు తెలిపారు. దొంగలు పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. విల్లాస్‌లో ప్రవేశించిన దొంగలు తొలుత ఓ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారని, ఆ ఇంట్లో ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న వెంకట బ్రహ్మం ఇంట్లో చోరీ చేశారని గుర్తించారు. కాగా, దొంగలు విల్లాస్‌లోకి ప్రవేశించే సమయంలో అదే కాలనీలో ఉన్న ఒకతను గుర్తించి సెక్యూరిటీని అప్రమత్తం చేశారని, అయినా ఉపయోగం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. -
సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు!
చీమకుర్తి(ప్రకాశం జిల్లా): ఆ మాల్ వద్దకు ముగ్గురు వచ్చారు. ఒకరు బయట కాపలా ఉన్నారు.. ఇద్దరు లోపలకు వెళ్లారు. క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.4.60 లక్షలు తీసుకున్నారు. అక్కడే డబ్బులు లెక్కేసుకున్నారు. పావు గంటలో పని ముగించేసుకొని గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన దారిలోనే వెళ్లారు. గురువారం తెల్లవారు జామున చీమకుర్తిలోని కర్నూల్ రోడ్డుకు సమీపంలో ఉన్న బీవీఎస్ఆర్ ఫర్నిచర్ మాల్లో ఈ దొంగతనం జరిగింది. షాపు యజమాని సతీష్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ ఆస్పత్రికి సమీపంలో ఉన్న బీవీఎస్ఆర్ ఫర్నిచర్ మాల్ నాలుగంతస్తులు ఉంటుంది. మొదటి అంతస్తులో దొంగతనం జరిగింది. రెండో అంతస్తులో ఫ్రిజ్‌లు, ఏసీలు, మూడో అంతస్తులో జిమ్ నిర్వహిస్తున్నారు. నాలుగో అంతస్తులో షాపు యజమానులు నివాసం ఉంటున్నారు. షాపునకు బయట, షాపు లోపల ఉన్న సీసీ పుటేజీలో ఎంత మంది దొంగలు వచ్చారు. వారు ఎలా దొంగతనం జరిగిందనే విషయాలు పూర్తిగా సీసీ పుటేజీలో రికార్డు అయింది. రోజూలాగే బుధవారం కూడా షాపులో ఫర్నిచర్‌ను అమ్మిన డబ్బులు క్యాష్ కౌంటర్లో ఉంచి దానికి తాళం వేసి రాత్రి పైన నాలుగో అంతస్తులో యజమాని కుటుంబం నిద్రించింది. దొంగతనానికి ముగ్గురు వచ్చినట్లు బయట ఉన్న సీసీ పుటేజీలో రికార్డు అయింది. ఒకరు బయట ఉన్నారు. మిగిలిన ఇద్దరూ మొదటి అంతస్తులో డోర్‌ను చాకచక్యంగా తీశారు. లోపల క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న అద్దాల బాక్స్‌లో అమ్మకానికి తెచ్చన రూ.4 లక్షల విలువ చేసే సెల్ఫోన్ల జోలికి వెళ్లలేదు. యజమాని సెల్‌ఫోన్ రూ.70 వేలు ఉంటుంది. దాన్ని కూడా వారు టచ్ చేయలేదు. అదే అంతస్తులో విలువైన సామగ్రి, రెండో అంతస్తులో విలువైన ఫ్రిజ్‌లు, ఏసీలు కూడా ఉన్నాయి. వాటిలో వేటిని తీసుకోకుండా కేవలం కౌంటర్లో ఉన్న రూ.4.60 లక్షలు తీసుకున్నారు. అక్కడే లెక్కేసుకున్నారు. వేకువ జామున 3.15 గంటలకు మొదలైన దొంగతనం మొత్తం పావుగంట సమయంలో ముగించేసి వచ్చిన దారిలోనే వెళ్లినట్లు సీసీ పుటేజీలో స్పష్టంగా కనిపిస్తోందని యజమాని పోలీసులకు తెలిపారు. షాపు డోర్ లాక్ చేయకుండా వేలితో లోపల గడిని తీసే విధంగా ఉందని, దాన్ని తెలిసిన వారు తప్ప మిగిలిన వారు తీసే అవకాశం లేదని షాపు యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. షాపు యజమాని బొమ్మిశెట్టి సతీష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగశివారెడ్డి, క్లూస్ టీమ్ సభ్యులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. వేలిముద్రలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. -
ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ
సాక్షి, పెద్దపల్లి జిల్లా: మంథని మండలం గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. 18 లక్షల 46 వేల నగదు, 6 కిలోల బంగారాన్ని దుండగులు అపహరించారు. గ్యాస్ కట్టర్‌తో స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేసి చోరీకి తెగబడ్డారు. ఫింగర్ ప్రింట్ ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరా డీవీఆర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. పకడ్బందీగా అలారం మ్రోగకుండా బ్యాటరీల కనెక్షన్ తొలగించి, బ్యాటరీలను సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఘటన వివరాలను వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హైలీ ప్రొఫెషనల్ దొంగలు చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు. త్వరలోనే చోరీకి పాల్పడ్డ వారిని పట్టుకుంటామని సీపీ తెలిపారు. చదవండి: నిర్మాత ఇంట్లో డ్రగ్స్.. అరెస్టు విషాదం...ఆటోలో నటుడి మృతదేహం -
జ్యువెలరీ షాపులో భారీ చోరీ..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలోని జ్యువెలరీ షాపులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. శుక్రవారం తెల్లవారు జామున రూ.21.30 లక్షల విలువైన 1.2 కేజీల బంగారం, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షాపు యాజమాని డ్రైవర్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి డ్రైవర్ చోరీకి స్కెచ్ వేసినట్లు నిర్థారించారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
లాకర్‌నే లాక్కెళ్లారు..
ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఏ వస్తువూ చెక్కుచెదరలేదు. షట్టర్ తాళం పగలగొట్టి లోనికొచ్చారు. రూ.36 లక్షల సొమ్మున్న 50 కేజీల ఐరన్ లాకర్ మోసుకెళ్లారు. సీసీ ఫుటేజి హార్డ్ డిస్్క ను సైతం తస్కరించి చల్లగా జారుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ చోరీ జరగగా.. సోమవారం ఉదయం ఉద్యోగులు విధులకు వచ్చే వరకు విషయమే తెలీదు. ఇంత పక్కాగా జరిగిందంటే ఇంటి దొంగల ప్రమేయం ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని పెదపాడు రోడ్ పరిధిలో గల పద్మపూజిత ఆటో ఫైనాన్స్ (నీలమణి దుర్గా ఆటో కన్సల్టెన్సీ) కంపెనీలో భారీ చోరీ జరగడంతో ఒక్కసారిగా యజమానులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. సోమ వారం ఉదయం 9 గంటలకు షాపు తెరిచేందుకు వచ్చిన ప్యూన్ తాళాలు తీసి కార్యాలయం తుడిచి వాహనాలు బయట పెట్టే పనిలో ఉన్నాడు. విధులకు వచ్చిన ఉద్యోగి బసవ సత్యనారాయణరాజు ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్లి.. థంబ్ ఇంప్రెషన్‌తో బయోమెట్రిక్ హాజరు వేసుకుంటూ.. సీక్రెట్ లాకర్ రూమ్ తెరిచి ఉండటాన్ని గమనించారు. క్యాషియర్ హరిగోపాల్, అసిస్టెంట్ క్యాషియర్ తేజ సుబ్రమణ్యంలకు సమాచారం ఇచ్చారు. వీరు వచ్చి లాకర్లో ముందు రోజు ఉంచిన రూ.36 లక్షల సొమ్ము చోరీకి గురయ్యిందని గ్రహించి అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కంపెనీ పార్టనర్స్ ఫణికుమార్, సత్యనారాయణలకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం ఎలా జరిగిందంటే.. ఆదివారం ఆఫ్ డే కావడంతో మధ్యాహ్నం రెండు గంటలకు పనిముగించుకొని ఉద్యోగులు వెళ్లిపోయారు. అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో ఈ దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు షాప్ వెనుక భా గంలో ఉన్న షట్టర్ తాళాలు విరగ్గొట్టి లోనికి వచ్చారు. అక్కడ నుంచి ఆఫీస్ క్యాబిన్ రూమ్‌లోకి వెళ్లి సీక్రెట్ లాకర్ రూమ్‌లో ఉన్న ఐరన్ లాకర్‌ను పట్టుకుపోయారు. దీంతోపాటు సీక్రెట్ కెమెరాల్లో రికార్డయ్యే హార్డ్ డిస్క్‌లను సై తం తస్కరించారు. షట్టర్‌ను దించేసి, ఆ పక్కనే బాత్రూంలో ఉన్న సర్ఫ్ పౌడర్‌ను నీటిలో కలిపి, తమ వేలిముద్రలు గుర్తించకుండా నురగను ఆ పరిసరాల్లో పోసి పరారయ్యారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రాక విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతోపాటు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. పోలీసు శునకం ఫైనాన్స్ కంపెనీ పక్క భవ నంపైకి వెళ్లి కార్యాలయం లోపలికి వచ్చి చుట్టూ తిరిగి కంపెనీ వెనుక గల ముళ్లపొద ల వద్దకు వెళ్లి తిరిగి వచ్చింది. క్లూస్‌టీం వేలిముద్రల జాడలను సేకరించింది. ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న 25 మంది సిబ్బంది వేలిముద్రలను సైతం పోలీసులు తీసుకున్నారు. వీరి పాత్రతోపాటు 25 మంది కలెక్షన్ ఏజెంట్ల గురించి కూడా ఆరా తీస్తున్నారు. 50 కేజీల లాకర్‌ను మోసుకెళ్లారంటే.. నలుగురైదుగురు ఈ ఘటనలో పాలుపంచుకున్నారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. 26, 27 తేదీల్లో వచ్చిన నగదు లాకర్లో ఉందని హెడ్ క్యాషియర్ చెబుతున్నారు. ఇంటి దొంగల పనేనా? దొంగతనం జరిగిన తీరు చూస్తుంటే ఇది ఇంటిదొంగల పనే నా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా దుండగులు సునాయాసంగా లోనికి ప్రవేశించినట్టు అక్కడి పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల హస్తం ఉండి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎంట్రన్స్‌లో ఉన్న కెమెరాను పగలకొట్టి లోపలికి వచ్చారు. మరే కెమెరాను ముట్టుకోలేదు. ఏకంగా సీసీ ఫుటేజి రికార్డయ్యే హార్డ్ డి స్్కలను తస్కరించడంతో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దొంగతనమని అర్థమవుతోంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది గురించి ఆరా తీశారు. ఆయనతోపాటు వన్‌టౌన్ సీఐ అంబేద్కర్, రూరల్ ఎస్ఐ లక్ష్మణరావులు ఉన్నారు. -
2 గంటలు.. ఇద్దరు దొంగలు
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ పురానీహవేలీలో ఉన్న మస్రత్ మహల్‌లోని నిజాం మ్యూజియంలో 3వ తేదీ తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దుండగులు కచ్చితంగా నిర్దేశించుకున్న గ్యాలరీలోకే దిగడానికి మ్యూజియం పైకప్పుపై మూడుచోట్ల మార్కింగ్ పెట్టుకున్నట్లు గుర్తించారు. గ్యాలరీలోకి ప్రవేశించిన వీరు దాదాపు 2 గంటల పాటు అక్కడే గడిపినట్లు తేల్చారు. ఈ యువకులు స్థానికులుగానే అనుమానిస్తున్న దర్యాప్తు అధికారులు ఆయా ప్రాంతాల్లో జల్లెడపడుతున్నారు. మరోపక్క నగర వ్యాప్తంగా ఉన్న పురాతన వస్తువుల అమ్మకం దుకాణాలు, క్రయవిక్రేతల పైనా కన్నేసి ఉంచారు. ‘టిఫిన్ బాక్స్’ కోసం స్కెచ్ ఇలా... ఈ చోరీ కోసం స్కెచ్ వేసిన నిందితులు పక్కాగా రెక్కీ చేశారు. ఒకటికి రెండుసార్లు మ్యూజియం లోపల, బయట, పై భాగంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ మార్గంలో రావాలి? ఎక్కడ నుంచి మ్యూజియం పైకి ఎక్కాలి? ఏ వెంటిలేటర్ వద్ద నిజాం టిఫిన్ బాక్స్‌తో కూడిన గ్యాలరీ ఉంది? దాని వద్దకు ఎలా వెళ్లాలి? సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి విషయాలన్నీ పక్కాగా అధ్యయనం చేశారు. ఆపై అదును చూసుకుని మ్యూజియం పైకి చేరుకుని ప్రధాన గోడపై పక్క భాగంలో ‘యారో’(బాణం), పై భాగంలో ‘స్టార్’(నక్షత్రం) గుర్తులు పెట్టుకున్నారు. టిఫిన్ బాక్స్ ఉన్న మూడో గ్యాలరీ సమీపంలోని వెంటిలేటర్ వద్ద మరో ‘యారో’ మార్క్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి ఆధారంగానే తెల్లవారుజామున రంగంలోకి దిగారు. మ్యూజియం ప్రహరీ వెనుక వైపు ఉన్న ప్రార్థనా స్థలం వరకు బైక్‌పై వచ్చారు. ముందుగా ఓ దుండగుడు దాని పక్కనే ఉన్న ఇంటి మెట్ల మీదుగా పైకి వెళ్లి పరిస్థితిని గమనించి వచ్చాడు. దీనికోసం తన సెల్ఫోన్లో ఉన్న ‘టార్చ్‌లైట్’ను వినియోగించాడు. రెండు నిమిషాల తర్వాత అంతా తమకు అనుకూలంగా ఉందని నిర్ధారించుకుని రెండో దుండగుడికి సమాచారం ఇచ్చాడు. దీంతో అతడు ఓ బ్యాగ్‌తో ముందుకు కదిలాడు. ఈ తతంగం అంతా ఆ ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ‘ఇనుప మెట్లెక్కి అద్దాన్ని తొలగించి... దీనికి ముందు దాదాపు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో ఇద్దరిలో ఓ దుండగుడు ఆ ప్రార్థనా స్థలం వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. అక్కడి పరిస్థితుల్ని గమనించిన తర్వాత వెనక్కు వెళ్లిపోయాడు. దాదాపు 15 నిమిషాల తర్వాత ఇద్దరూ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. 3.20 గంటల ప్రాంతంలో ఇద్దరూ మ్యూజియం వెనుక వైపు ఉన్న ఇళ్ల పైకప్పుల నుంచి అనుసంధానించి ఉన్న పురాతన ఇనుప మెట్లను వినియోగిస్తూ మ్యూజియం పైకి వెళ్లారు. అప్పటికే ఉన్న మార్క్‌ల ఆధారంగా మూడో గ్యాలరీ వెంటిలేటర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా పైభాగంలో ప్రత్యేక గమ్ అతికించిన అద్దాన్ని తొలగించి పక్కన పెట్టారు. ఆపై ఉన్న ఇనుప గ్రిల్‌కు లోపలి వైపు నుంచి కొట్టిన మేకుల్ని తొలగించారు. గ్రిల్‌ను అద్దం పెట్టిన వైపు కాకుండా మరో వైపు పెట్టారు. ఏది ధ్వంసం చేసినా ఆ శబ్దానికి అంతా అప్రమత్తం అవుతారనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని పోలీసులు చెప్తున్నారు. టీ.. టిఫిన్.. సాసర్ బ్యాగులో సర్ది.. వెంటిలేటర్ ద్వారా తాడు సాయంతో మూడో గ్యాలరీలోకి ఓ దుండగుడు దిగాడు. ఈ తాడును వెంటిలేటర్‌కు 30 అడుగుల దూరంలో ఉన్న ఇనుపమెట్లకు కట్టారా? లేక ఒకరు పట్టుకోగా మరొకరు దిగారా? అనేది స్పష్టత రాలేదు. మ్యూజియం లోపలివైపు ఉన్న సీసీ కెమెరా తాడు లోపలకు పడటాన్ని రికార్డు చేసింది. ఆపై లోపలికి దిగిన దుండగుడు తన కాలితో ఆ కెమెరాను నేల వైపునకు తిప్పేశాడు. బంగారం టిఫిన్ బాక్స్ ఉన్న ర్యాక్ అద్దాన్ని దుండగులు పగులకొట్టలేదు. దీని తలుపులు రెండూ కలిసేచోట కింది భాగంగా చిన్న రాడ్‌ను దూర్చి పైకి లేపడం ద్వారా సెంట్రల్ లాక్, పైన, కింద ఉన్న బోల్ట్‌లు విరిగిపోయేలా చేశాడు. ఆపై దర్జాగా టిఫిన్ బాక్స్, టీ కప్పు, సాసర్, స్పూన్ తీసుకుని తన బ్యాగ్‌లో సర్దుకున్నాడు. తర్వాత వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 5.20 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులూ తిరిగి వచ్చినట్లు ప్రార్థనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. తిరిగి వస్తున్న సమయంలో వీరు మాస్క్‌లు ధరించి ఉండగా.. ఓ దుండగుడు ఎడమ కాలితో కుంటుతున్నాడు. దీంతో ఇతడే లోపలకు దిగి ఉండొ చ్చని, ఆ ప్రయత్నాల్లోనే కాలికి గాయమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
68 తులాల బంగారం చోరీ
మోమిన్‌పేట: బంగారం తాకట్టు దుకాణంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షాపు వెంటిలేటర్ ఊచలు తొలగించి 68 తులాల పసిడి, రూ. 96 వేల నగదు అపహరించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మోమిన్‌పేట నూతన బస్టాండ్ సమీపంలోని శ్రీశాంకరీ ఎంటర్ ప్రైజెస్‌లో నిర్వాహకులు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకొని నగదు అప్పుగా ఇస్తుంటారు. గురువారం రాత్రి గుర్తు తెలియని దండగులు దుకాణం వెనుక భాగంలో వెంటిలేటర్‌కు ఉన్న ఊచలను తొలగించి లోపలికి ప్రవేశించారు. షాప్‌లోని ఇనుప పెట్టెను తెరిచి అందులోని 68 తులాల బంగారం, రూ. 96 వేల నగదును అపహరించారు. శుక్రవారం ఉదయం నిర్వాహకులు దుకాణం తాళం తెరిచి చూడగా ఇనుప పెట్టె తెరిచి ఉంది. డీఎస్పీ శిరీష, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్‌కుమార్‌తో పాటు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ బృందం ఘటనా స్థలాన్ని సందర్శించారు. పని చేయని సీసీ కెమెరాలు: సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన 9 మంది డైరెక్టర్లుగా శ్రీశాం కరీ ఎంటర్ప్రైజెస్ పేరుతో గతేడాది బంగారం తాకట్టుపై అప్పులు ఇచ్చే వ్యాపారం మొదలుపెట్టారు. అందులోని ఒక డైరెక్టర్ మల్లేశ్ వ్యాపార లావాదేవీలు చూస్తుంటారు. మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన రియాద్‌ను సహాయకుడిగా పెట్టుకున్నారు. డబ్బులు దాచిపెట్టే ఇనుప పెట్టె తాళం చెవులు దుకాణంలోనే వీరిద్దరికీ తెలిసిన చోటే పెడుతుంటారు. గురువారం ఉదయం నుంచి సీసీ కెమెరాలు మరమ్మతుకు గురవడంతో పనిచేయడం లేదని మల్లేశ్ తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఢిల్లీలో రూ.12 కోట్ల ఆభరణాల చోరీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో దొంగలు భారీ చోరీకి తెగబడ్డారు. నగరమంతా దీపావళి సంబరాల్లో ఉండగా దుండగులు నగల తయారీ యూనిట్లలో చొరబడి చేతివాటం ప్రదర్శించారు. రూ.12 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. సెంట్రల్ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఈ చోరీ జరిగింది. కరోల్‌బాగ్‌లోని ఓ భవనంలో రెండు నగల తయారీ యూనిట్లు ఉన్నాయి. వీటిపై కన్నేసిన దొంగలు ఈ నెల 19వ తేదీ రాత్రి వచ్చి గ్యాస్ కట్టర్‌తో తాళాలను తెరిచారు. ఒక యూనిట్లో రూ.6.80 కోట్ల విలువైన నగలు, మరోదానిలో రూ.5.20 కోట్ల విలువైన నగలను చోరీ చేశారు. ఈ తతంగమంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. మరునాడు యజమానులు వచ్చి చూసేసరికి దొంగతనం విషయం బయట పడిం -
చినబాబు గదిలోకి దుండగుల చొరబాటు
-
చౌదరి భవంతిలో భారీ చోరీ
♦ చినబాబు గదిలోకి దుండగుల చొరబాటు ♦ రూ. 57.55 లక్షల సొత్తు అపహరణ ♦ తెల్ల వారుజామున 2.30 గంటలకే ♦ రంగంలోకి దిగిన పోలీసులు ♦ సీసీ కెమెరాల పుటేజీల సేకరణ తూర్పుగోదావరి: మండపేట పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి. చౌదరిగారి వీధిలోని పెద్ద భవంతిలోనే ఆయన నివసించేది. ఆయనపై గౌరవ భావంతో ఆ ఇంటివైపు చూడాలంటేనే స్థానికులు ఆలోచిస్తారు. సమీప బంధువులు, ఇంటిలో పనిచేసే పనివాళ్లు తప్పించి ఇతరులెవరూ లోనికి పోరు. అటువంటి ఇంటిలోకి దుండగలు చొరబడి రూ. 57.55 లక్షల సొత్తును దోచుకుపోయారు. ఈ ఘటన మంగళవారం మండపేటలో తీవ్ర సంచలనం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. చౌదరి దత్తపుత్రుడైన వల్లూరి నారాయణమూర్తి (చినబాబు) వల్లూరి వారి వీధిలో గల తన ఇంటిని ఆధునికీకరిస్తుండటంతో ఆయన కుటుంబం కొద్దిరోజులుగా చౌదరి భవంతిలో నివాసముంటున్నది. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు చినబాబు స్వయానా వియ్యంకుడు. తన భార్య సుజాతతో కలిసి చినబాబు కింది భాగంలో నివసిస్తుండగా, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే వేగుళ్ల అల్లుడైన సాయికుమార్ కుటుంబంతో కలిసి పై అంతస్తులో ఉంటున్నారు. కాగా సోమవారం అర్ధరాత్రి 2.15 గంటల సమయంలో చినబాబు భార్య సుజాతకు మెలకువ వచ్చి బాత్రూంకు వెళ్లారు. ఇంతలోనే బీరువా తెరుస్తున్న శబ్ధం రావడంతో భర్త అనుకుని లోపలి నుంచే ఎవరూ అని పిలిచారు. సమాధానం లేకపోవడం, బీరువాలు తెరుస్తున్న శబ్దాలు రావడంతో దుండగులు చొరబడ్డారని గ్రహించి భయంతో ఆమె బయటకు రాకుండా బాత్రూంలోనే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత వెలుపలికి వచ్చి చూసే సరికి బీరువా తెరిచి ఉంది. అందులోని విలువైన ఆభరణాలు చోరీకి గురికావడాన్ని గుర్తించారు. అస్వస్థతతో పక్క గదిలో నిద్రపోతున్న చినబాబుకు, పై అంతస్తులోని కుమారునికి వెంటనే సమాచారం అందించారు. వెంటనే విషయాన్ని రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తులెవరైనా కావచ్చునని భావించి మండపట అర్బన్, రూరల్ సీఐలు గీతారామకృష్ణ, వి.పుల్లారావుల నేతృత్వం లో ప్రత్యేక బృందాలు తెల్లవారు జాము మూడు గంటల సమయం నుంచే నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ద్వారపూడి, అనపర్తి, రాజమహేంద్రవరం ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ముమ్మరంగా గాలించారు. బాగా తెలిసున్న వారి పనేనా ? ఇతరులు ఎవరూ లోపలికి వెళ్లేందుకు సాహసించలేని ఇంటిలో చోరీ జరిగిన తీరు చూస్తుంటే తెలిసిన వారు చేసిన పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఎనిమిది అడుగులకు పైగా ఎత్తు ఉండే పెద్ద ప్రహారీని దాటుకుని లోపలికి వెళ్లడంతో పాటు సుజాతమ్మ బాత్రూంకు వెళ్లిన సమయంలోనే ఇంటిలోకి చొరబడటాన్ని బట్టి దుండగుడు అప్పటి వరకు బయటే నక్కి ఉండవచ్చునంటున్నారు. తొలుత గోడ బీరువాకు ఉన్న తాళం చెవిని తెరిచి అందులోని బంగారు గాజులు తీసుకోవడంతో పాటు పక్కనే ఉన్న పర్సులోని తాళం చెవిని తీసుకుని బీరువా తాళం తెరిచి బంగారు ఆభరణాలు, నగదులను చోరీ చేశారు. 30 బంగారు గాజులు, 12 డైమండ్ గాజులు, 108 బంగారు పువ్వులు, మూడు జతల చెవి దుద్దులు, మూడు లాకెట్లతో కూడిన మూడు డైమండ్ గొలుసులు, బంగారపు చైన్, రూ. 55 వేలు నగదు, ఒక ఐఫోన్ చోరీ అయినట్టు గుర్తించారు. ఆభరణాల విలువ మొత్తం సుమారు రూ. 57 లక్షలు కాగా అందులో దాదాపు 600 గ్రాముల వరకు బంగారం, మిగిలినవి వజ్రాల విలువగా పోలీసులు చెబుతున్నారు. కాగా చోరీసొత్తు విలువ రూ. 70 లక్షలు పైబడే ఉంటుందని అంచనా. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో మండపేట అర్బన్, రూరల్ సీఐలు గీతా రామకృష్ణ, వి.పుల్లారావు, మండపేట, రూరల్, అనపర్తి ఎస్ఐలు ఎండీ నసీరుల్లా, విద్యాసాగర్, మురళీకృష్ణ తదితరులు ఐదు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. చౌదరి, చినబాబు ఇళ్లల్లో పనిచేసే సిబ్బంది, వారివారి సంస్థల్లో పనిచేసే సిబ్బందిని విచారిస్తున్నారు. అలాగే పాత భవంతి కావడంతో వృద్ధులు ఉంటారని భావించి పాత నేరస్తులు ఎవరైనా ఈ చోరీకి పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ తరహా చోరీల్లో అనుభవం ఉన్న పాత నేరస్తుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా వల్లూరి వారి వీధి, కలువపువ్వు సెంటర్ మీదుగా డాగ్ టౌన్‌హాలు వరకు వెళ్లింది. సీసీ టీవీల పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను సేకరించారు. -
కోరుట్లలో భారీ దొంగతనం
కోరుట్ల(జగిత్యాల): పట్టణంలో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. స్థానిక ప్రకాశం రోడ్డులో నివాసం ఉండే రాజేంద్రప్రసాద్ సోమవారం కుటుంబసభ్యులతో పాటు హైదరాబాద్ వెళ్లారు. తిరిగి మంగళవారం వేకువజామున ఇంటికి చేరుకున్నారు. వారు వెళ్లేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో చూడగా బీరువాలోని 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు కనిపించలేదు. గుర్తు తెలియని దుండగులు తన ఇంట్లో రూ.6.50 లక్షల విలువైన అభరణాలను ఎత్తుకుపోయారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కృష్ణకుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తాళం వేశారు... అయినా
కామారెడ్డి: కామారెడ్డి రూరల్ మండలం దేవన్‌పల్లిలో పట్టపగలు ఓ తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లో దాచిన 15 తులాల బంగారం, రూ.1.8 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని గంగా భూషణం ఐటీఐ కాలేజీ వైస్ ప్రిన్సిపల్. ఆయన భార్య జయశ్రీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇద్దరూ డ్యూటీ నిమిత్తం ఇంటికి 11 గంటలకు తాళం వేసి బయటకు వెళ్లారు. పన్నెండున్నర సమయంలో గంగా భూషణం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. చోరీ జరిగిన విషయం గమనించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో భారీ చోరీ
-
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు: కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లివచ్చేసరికి ఇంటిలోని సొత్తు చోరీకి గురైంది. ఈఘటన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మద్ది సూరిబాబు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 10 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.70వేల నగదును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం బాధితులు ఇంటికి చేరుకోగా దొంగతనం జరిగినట్లు తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. -
భారీ చోరీ
భాగ్యనగర్‌కాలనీ: కూకట్పల్లి ఠాణా పరిధిలో ఓ భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.21 లక్షల విలువ చేసే 71 తులాల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లగా.. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు...హెచ్ఎంటీ శాతవాహననగర్‌లో నివాసం ఉంటున్న పాండురంగయ్య అనే వ్యక్తి ఆగస్టు 20న శ్రావణ శుక్రవారం ఉండటంతో బ్యాంక్ లాకర్లో ఉన్న నగలు తెచ్చి.. లక్ష్మీపూజలో పెట్టారు. తర్వాత వాటిని బీరువాలో భద్రపర్చారు. అదే రోజు రాత్రి ఇంటి యజమానులు నిద్రలో ఉండగా.. కిటికీ నుంచి తలుపు గడియ తీసి దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 71 తులాల నగలు ఎత్తుకెళ్లారు. అదే రోజు బాలాజీనగర్‌లో వరుసగా మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు బాధితులను రాళ్లతో కొట్టి పరారయ్యారు. బాధితుడు పాండురంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మరునాడే నిందితుడిని పట్టుకున్నట్టు తెలిసింది. అయితే, పోలీసులు ఈ చోరీ విషయాన్ని బయటకు పొక్కకుండా దర్యాప్తు చేస్తుండటం గమనార్హం. -
దుప్పటి అడ్డుపెట్టి దోపిడీ
20 నిమిషాల్లో ‘పని’ పూర్తి అపెక్స్’ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులుహైదరాబాద్: తాళం పగలగొట్టలేదు.. షట్టర్ ధ్వంసం చేయలేదు.. ఏడుగురు వచ్చారు.. ఇద్దరు లోపలికి వెళ్లారు.. 20 నిమిషాల్లో ‘పని’ పూర్తిచేసుకుని రూ.25 లక్షలు సొత్తు ఎత్తుకుపోయారు. మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ‘అపెక్స్’ యాపిల్ మొబైల్ ఔట్లెట్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ నేపథ్యమిది. షాపు నిర్వాహకుల నిర్లక్ష్యం సైతం దుండగులకు కలిసొచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. ఏడుగురు దొంగలు.. రెండు దుప్పట్లు.. ‘అపెక్స్’ దుకాణం బయట ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను బట్టి ఏడుగురు సభ్యుల ముఠా ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. వీరిలో నలుగురి వీపులకు బ్యాగులు ఉన్నాయి. తెల్లవారుజామున 3.39 గంటలకు దుకాణం దగ్గరకు వచ్చిన దోపిడీ గ్యాంగ్.. బ్యాగుల్లోంచి రెండు దుప్పట్లు బయటకు తీసింది. షట్టర్‌కు కుడివైపుగా ఇద్దరు దుండగులు వాటిని తెరిచి అడ్డంగా పట్టుకున్నారు. ఎవరైనా ఆ సమయంలో వాళ్లను చూస్తే దుప్పట్లు పర్చుకుని పడుకున్నారని భావించేలా జాగ్రత్తపడ్డారు. దుకాణం షట్టర్‌కు సెంటర్ లాక్ వ్యవస్థ ఉన్నప్పటికీ నిర్వాహకులు అది వేయలేదు. కుడి, ఎడమ చివర ఉండే తాళాలు మాత్రమే వేశారు. షట్టర్ సాధారణం కంటే కాస్త ఎక్కువ వెడల్పు ఉండడం కూడా దొంగలకు కలిసొచ్చింది. దుండగులు రాడ్‌తో షట్టర్ ను కాస్త పైకి ఎత్తారు. ఆ ఖాళీ లోనుంచి ఇద్దరు లోపలికి ప్రవేశించగా.. మిగిలిన వారు ‘దుప్పటి మడతపెట్టి’ దూరంగా వెళ్లి కాపుకాశారు. 2 నిమిషాల్లోనే ఈ తతంగం పూర్తి చేశారు. షట్టర్ వెనుక.. దుకాణం లోపలి వైపు గ్లాస్ ఫిటింగ్, డోర్ ఉన్నప్పటికీ దానికి లాక్ లేకపోవడంతో దుండగుల పని తేలికైంది. ఫోన్లు మాత్రమే.. దుకాణంలో యాపిల్ ఫోన్లతో పాటు లాప్టాప్స్ కూడా ఉన్నా దొం గలు కేవలం సెల్ఫోన్లు ఉన్న సెల్ఫ్‌ను చిన్న రాడ్డుతో పగులకొట్టారు. ఒకడు అందులోని ఫోన్లను బయటకు తీసి ఇస్తుండగా.. మరొకడు బాక్సుల్లో నుంచి ఫోన్లను వేరుచేశాడు. తర్వాత క్యాష్ కౌంటర్‌ను పగులకొట్టి అందులోని రూ.51 వేల నగదు తీసుకున్నారు. ఆపై రూ. 24.85 లక్షల విలువైన ఫోన్లను బ్యాగ్‌లో సర్దుకుని పారిపోయారు. ఈ మొత్తం చోరీ 20 నిమిషాల్లో పూర్తయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఉత్తరాదికి చెందిన అంతర్రాష్ట్ర ముఠా పక్కా రెక్కీ తర్వాత ఈ చోరీ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. యాపిల్ ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిటీ(ఐఎంఈఐ) నంబర్లు క్లోనింగ్ చేయడం సాధ్యం కాదు. వాటిని దేశంలో ఎక్కడ విక్రయించినా పోలీసులు సాంకేతికంగా ట్రాకింగ్ చేసి గుర్తిస్తారు. దీంతో సొత్తును వివిధ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించే ఆస్కారం ఉందని అనుమానిస్తున్నారు. దుండుగులు వచ్చిపోయిన మార్గాలను గుర్తించడానికి ‘అపెక్స్’ నుంచి అన్ని వైపులకు ఉన్న రహదారుల్లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. వీరు రైలులో వచ్చి వెళ్లి ఉంటారనే అనుమానంతో రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించాలని నిర్ణయించారు. -
అత్తిలిలో భారీ చోరీ
అత్తిలి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అత్తిలి గ్రామానికి చెందిన బొర్రా సుబ్బారావు అనే ధాన్యం వ్యాపారి ఇంట్లో బుధవారం వేకువజామున దొంగలు పడ్డారు. ప్రధాన ద్వారం ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగలగొట్టి రూ.4 లక్షల నగదు, 23 కాసుల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో ఇంట్లో వాళ్లందరూ మేడ మీద నిద్రిస్తున్నారు. ఉదయం చోరీ జరిగిన విషయం గమనించిన సుబ్బారావు పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. తణుకు సీఐ రాంబాబు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరు జిల్లాలో భారీ చోరీ
రేపల్లె: పండుగ సెలవులకు ఊరు వెళ్లి వచ్చేసరికి భారీగా సొత్తు అపహరణకు గురైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం ప్రకారం 40 సవర్ల బంగారం, 10 కిలోల వెండి అపహరణకు గురైందని తెలుస్తోంది. రేపల్లె మండలం సింగుపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఇంటికి తాళం వేసి పండుగ కోసం హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చిన వారికి ఇంట్లో ఉన్న బంగారం, వెండి కనపడక పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో భారీ చోరీ
హైదరాబాద్: మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్‌చందర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాన్ని రంపంతో కోసి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు 30 తులాలు బంగారం, 20 తులాల వెండి, రూ.20 వేల నగదును అపహరించుకుపోయారు. స్థానికంగా నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి మహ్మద్ అఫ్జల్ తన తల్లి పింఛన్ కోసం శుక్రవారం రాత్రి మెదక్ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇంటి తాళం తీసి ఉండడాన్ని గుర్తించిన పాలుపోసే వ్యక్తి స్థానికులకు తెలుపగా, వారు పోలీసులకు సమాచారాన్ని అందించారు. -
కిటికీ గ్రిల్స్ తొలగించి భారీ చోరీ
- 53 తులాల బంగారం, కిలోవెండి, రూ. 2 లక్షల నగదు అపహరణ - వివరాలు సేకరించిన ఏసీపీ రఫీక్, క్లూస్ టీం - కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే చొరబడిన దొంగలు జవహర్‌నగర్: కుటుంబీకులు ఇంట్లో నిద్రిస్తుండగానే దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి చొరబడిన దొంగలు 53 తులాల బంగారం, కిలో వెండితో పాటు రూ. 2 లక్షల నగదు అపహరించుకుపోయారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ తులసి గార్డెన్‌లోని డూప్లెక్స్ నంబర్ 53లో నివాసముంటున్న ఓ వ్యాపారవేత్త కంపెనీ పనిమీద శుక్రవారం ఢిల్లీకి వెళ్లాడు. ఆయన భార్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లోని పైగదిలో నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి కిందిపోర్షన్ వెనక భాగంలోని కిటికీ గిల్స్ తొలగించి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఆమె కింది పోర్షన్లో ఉన్న బెడ్రూంలోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. ఇంట్లో ఉన్న 53 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ. 2 లక్షల నగదు పాటు విలువైన సామగ్రి చోరీ అయిందని ఆమె గుర్తించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ, క్లూస్‌టీం ఆదివారం ఆలస్యంగా సమాచారం అందుకున్న అల్వాల్ ఏసీసీ రఫీక్, సీఐ వెంకటగిరి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి ఇంటి పరిసరాల్లో పరిశీలించారు. స్థానికులే చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా పూర్తి వివరాలు వెల్లడించేందుకు బాధితులు నిరాకరించారు. దాదాపు 100 డూప్లెక్స్ ఇళ్లు ఉన్న తులసి గార్డెన్లో సీసీ కెమెరాలు అసలే లేవు. ఈమేరకు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దొంగలు దొరికారు
ఔరంగాబాద్‌లో చోరీ.. హైదరాబాద్‌లో పట్టివేత - టీవీల లోడ్ కంటైనర్ అపహరణ - ఐదు నెలల క్రితం ఘటన - ఛేదించిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు - నలుగురి అరెస్టు: రూ. 30 లక్షల సొత్తు స్వాధీనం హైదరాబాద్: ఐదు నెలల క్రితం ఔరంగాబాద్‌లో జరిగిన భారీ చోరీని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.30 లక్షల విలువైన 216 ఎల్ సీడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఐదు నెలల క్రితం ఔరంగాబాద్‌లోని ఒనిడా టీవీ తయారీ కంపెనీ నుంచి టీవీలు లోడ్‌తో ఉన్న భారీ కంటైనర్ (లారీ) చోరీకి గురైంది. శనివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి, నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్‌తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... ఔరంగాబాద్‌లోని క్రాంతిచౌక్ ప్రాంతంలో ఒనిడా టీవీ తయారీ కంపెనీ ఉంది. ఈ కంపెనీ నుంచి సూరత్‌లోని టీవీ షో రూమ్‌లకు తరలించేందుకు గతేడాది సెప్టెంబర్ 29వ తేదీ రాత్రి 10 గంటలకు భారీ కంటైనర్‌లో 417 టీవీలను లోడ్ చేశారు. డ్రైవర్ కంటైనర్‌ను కంపెనీ గేటు బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న దాబా వద్ద భోజనం చేసేందుకు నిలిపాడు. భోజనం ముగిశాక ఉదయం లేచి సూరత్‌కు వెళ్దామనుకొని డ్రైవర్ అదే దాబాలో పడుకున్నాడు. ఇదే అదనుగా భావించిన హైదరాబాద్ బహుదూర్పురాలోని తాడ్బంద్లో స్కాప్ వ్యాపారం నిర్వహిస్తున్న ఔరంగాబాద్‌కు చెందిన షేక్ హుమాయూన్(49) ఆ టీవీ లోడ్‌తో ఉన్న భారీ లారీని తస్కరించి నగరానికి తీసుకొచ్చాడు. లోడ్‌తో ఉన్న ఆ కంటైనర్‌ను ఫలక్‌నుమాకు చెందిన వస్త్ర వ్యాపారి, తన బంధువు సయ్యద్ వాసిమ్(28), ఫలక్‌నుమాకు చెందిన విద్యార్థి ఎంఏ అలీఖాన్(23)లకు అప్పగించాడు. అందులోని టీవీలను విక్రయించేందుకు ఈ ముగ్గురు కలిసి బండ్లగూడకు చెందిన టీవీ మెకానిక్ మహ్మద్ ఇద్రీస్ (32)ను సంప్రదించారు. అతని సహకారంతో ‘హుమాయిన్ ఎలక్ట్రానిక్స్’ పేరుతో నకిలీ బిల్లులు తయారు చేశారు. ఈ బిల్లుల సహాయంతో నగరంలో వివిధ షాపులలో 173 టీవీలను విక్రయించారు. వచ్చిన డబ్బులో రూ.4.5 లక్షలు హుమాయూన్కు ఇచ్చారు. మరో రూ.27 లక్షలు తర్వాత ఇస్తామని అలీఖాన్, ఇద్రీస్‌లు హుమాయున్‌తో నమ్మబలికారు. మిగిలిన 244 టీవీలను ఔరంగాబాద్‌కు చెందిన అమీర్, కర్ణాటకకు చెందిన షేరులకు విక్రయించారు. ఇలా పట్టుబడ్డారు... టీవీల లోడ్ కంటైనర్ చోరీపై ఒనిడా కంపెనీ యాజమాన్యం ఔరంగాబాద్‌లోని క్రాంతిచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే కేసు నమోదు చేశారు. అక్కడి ఎస్ఐ సిద్దిక్ విచారణలో కంటైనర్ హైదరాబాద్‌కు బయలుదేరిందని తేలడంతో అక్కడి అధికారులు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, ఇన్స్పెక్టర్ ఆనంద్‌కుమార్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని టీవీ షాపులలో ఒనిడా టీవీలు విక్రయించిన విషయాన్ని పసిగట్డంతో హుమాయున్ గుట్టు రట్టైంది. నిందితులు షేక్ హుమాయూన్, సయ్యద్ వాసిం అక్రం, ఎం అలీఖాన్, మహ్మద్ ఇద్రీస్లను అరెస్టు చేసి వారి నుంచి ఒనిడా కంపెనీకి చెందిన 50, 24, 20 అంగుళాల 216 టీవీలు, 4 సెల్ఫోన్లు, 2 కంప్రెషర్స్ స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ ఆచూకీ మాత్రం ఇంకా దొరలేదు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఔరంగాబాద్ పోలీసులకు బదిలీ చేసి, నిందితులను అప్పగించారు. మిగిలిన టీవీలు పరారీలో ఉన అమీర్, షేరు నుంచి రావాల్సి ఉంది. షోరూమ్‌లా మారిన టాస్క్‌ఫోర్స్ ఆఫీస్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను నిందితులను అదుపులోకి తీసుకుని టీవీలను స్వాధీనం చేసుకుని వాటిని తమ కార్యాలయంలో పెట్టారు. బారులుగా ప్లాస్మా, ఎల్ఈడీ, ఇతర టీవీలను పెట్టడంతో కార్యాలయం టీవీ షోరూమ్‌లా మారిపోయింది. స్థలం లేకపోవడంతో కొని టీవీలను బయటే పెట్టారు. -
పాల్వంచలో భారీ చోరీ
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి పాల్వంచలోని కేటీపీఎస్ జెన్కో కాలనీలో 10 ఇళ్లలో దొంగలు భారీగా దోచుకున్నారు. ఈ చోరీలో సుమారు కోటి రూపాయల విలువైన బంగారం, నగదును తస్కరించారు. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో కాలనీ వాసులు తమ సొంత గ్రామాలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు కాలనీలో పడి భారీ చోరీ చేసి ఉడాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దొంగల ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఖమ్మం నగర శివారులో భారీ చోరీ
ఖమ్మం : ఖమ్మం నగర శివారులోని పోలేపల్లి గ్రామ పరిధి కరుణగిరి సమీపంలోని రెండు అపార్ట్మెంట్లలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. సాయి రాఘవ అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు చావా దుర్గాప్రసాద్-ప్రభావతి, ఇదే అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న సాయిరాం టవర్స్‌లో విశ్రాంత సర్వేయర్ మర్ల వెంకటరమణ దంపతులు నివాసముంటున్నారు. దుర్గాప్రసాద్-ప్రభావతి దంపతులు తమ ప్లాట్‌కు తాళం వేసి ఈ నెల 26న హైదరాబాద్ వెళ్లారు. మర్ల వెంకటరమణ దంపతులు కూడా తాళం వేసి ఈ నెల 30న బంధువుల ఊరు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఈ రెండు ప్లాట్ల తాళాలను పగులగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. దుర్గాప్రసాద్ ప్లాట్లోని బీరువాను ఇనుప చువ్వలతో తెరిచి, అందులో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు తీసుకెళ్లారు. వెంకటరమణ ప్లాట్ బీరువాను కూడా ఇలాగే తెరిచి 20 తులాల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి ఎత్తుకెళ్లారు. ఈ రెండు ప్లాట్లలో చోరీ సొత్తు విలువ రూ. 20 లక్షల పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. -
కరీంనగర్లో భారీ చోరీలు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు వేర్వేరు చోట్ల బంగారం చోరీ చేశారు. వివరాలు.. నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన చవోటి విజయవర్షిణి కిరాణా దుకాణం వద్దకు వెళ్లి పాలు తీసుకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆమె మెడలోని 3 తులాల పుస్తెలతాడు తెంచుకుని పారిపోయాడు. విద్యానగర్‌కు చెందిన పెండ్యాల విద్యాగౌతమి (34) ఆలయానికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని 5 తులాల పుస్తెలతాడు, నల్లపూసల దండ తెంపుకొని పారిపోయారు. అదే కాలనీలో ఉంటున్న కొమ్మ విజయ (45) కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సిగరెట్ అడిగాడు. అది ఇవ్వడానికి రాగా ఆమె మెడలోని మూడున్నర తులాల పుస్తెలతాడును తెంచుకుని పారిపోయాడు. ఆమె అరిచినా సమీపంలో ఎవరూ లేకపోవడంతో దొంగ తన బైక్‌పై పారిపోయాడు. ముగ్గురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టుటౌన్ సీఐ హరిప్రసాద్ తెలిపారు. -
భీమవరంలో భారీ చోరీ
భీమవరం అర్బన్ : భీమవరంలో మరో భారీ చోరీ జరిగింది. క్రిస్మస్ సందర్భంగా బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లి తిరిగొచ్చేసరికి దొంగలు ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి అందులో ఉన్న సుమారు రూ.4,27,300 నగదు, నగలు అపహరించారు. వన్‌టౌన్ ఎస్సై వి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేరళ రాష్ట్రానికి చెందిన అబ్రహం చాక్‌రాజు పట్టణంలో ఏసీఆర్ సీ ఫుడ్స్ కంపెనీని నిర్వహిస్తున్నారు. స్థానిక కఠారి నగర్‌లోని రెండు పోర్షన్ల డాబా ఇంటిలోని ఒక పోర్షన్లో అద్దెకు ఉంటున్నారు. మరో పోర్షన్లో ఉంటున్న వారు భద్రాచలం వెళ్లడంతో వారింటికీ తాళం వేసి ఉంది. కిస్మస్ కావడంతో చాక్‌రాజు బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో చర్చికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చి చూసుకునే సరికి ఇంటి తలుపునకు వేసిన తాళం లేకపోవడం, తలుపు తెరచి ఉండటాన్ని గమనించారు. వెంటనే లోపలకు వెళ్లి చూసుకునే సరికి బీరువా తెరచి ఉంది. కంగారుగా అందులో ఉన్న కంపెనీకి చెందిన రూ.3,97,300 నగదు, మూడు కాసుల బంగారు తాడు కోసం వెతకగా అవి కనిపించలేదు. దీంతో అవి చోరీకి గురయ్యాయని నిర్ధారించుకుని గురువారం భీమవరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్‌టీమ్ సీఐ జె.నరసింహమూర్తి ఘటనా ప్రాంతంలో వేలిముద్రలను సేకరించారు. వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్న ప్రజలు భీమవరం వన్‌టౌన్‌లో ఇటీవల జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇళ్లలో జరిగే చోరీలతో పాటు చెయిన్ స్నాచింగ్‌లు కూడా ఎక్కువయ్యాయి. స్థానిక గూడూరి ఆంజనేయులు వారి వీధిలో ట్రాక్టర్ మెకానిక్ అల్లాడి శంకర్ వీరవెంకట కృష్ణప్రసాద్ ఇంటిలో దొంగలు పడి తొమ్మిది కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పార్కు వద్ద నడిచి వెళుతున్న మహిళ నుంచి బంగారు ఆభరణాలు తెంపుకుని పారిపోయారు. గునుపూడిలోని రామాలయంలో ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యిన విషయం తెలిసిందే. ఇలా వరుస దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
జ్యూయలరీ షాపులో భారీ చోరీ
అచ్చంపేట :అచ్చంపేట నడిబొడ్డు, 24 గంటలూ ఇసుక లారీల రాకపోకలతో రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలిలోని ఆంజనేయస్వామి విగ్రహ సెంటర్‌లోగల గంగాభవానీ జ్యూయలరీ షాపులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కొందరు దుండగులు షాపు పైకప్పునకు కన్నం వేసి మూడు కిలోల బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదు దోచుకుపోయారు. జ్యూయలరీ షాపులో సీసీ కెమెరాలు కూడా లేవు. పోలీసు అధికారులు సంఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మండలంలో సంచలనం సృష్టించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు రోజూలాగే షాపును నిర్వహించి అనంతరం తాళాలు వేసి యజమాని మణికంఠ ఇంటికి వెళ్లారు. యధావిధిగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన ఆయన షాపు షట్టర్ తాళాలు తీసి లోపలికి వెళ్లాడు. షో కేసుల్లో బంగారు ఆభరణాలు, క్యాష్ బాక్స్‌లో ఉంచిన నగదు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంటూరు రూరల్ సీసీఎస్ అదనపు ఎస్పీ శోభామంజరి, సత్తెనపల్లి డీఎస్పీ ఎన్ఆర్ వెంకటేశ్వరనాయక్, క్రైం డీఎస్పీ శ్రీనివాసరావు, సత్తెనపల్లి టౌన్ సీఐ శోభన్‌బాబు, సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. గుంటూరు నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. షాపు వెనుకభాగాన సీలింగ్‌కు, పైకప్పుకు మధ్య ఉన్న గోడకు నాలుగు పలకలుగా కన్నం వేసి దుండగులో షాపులోకి వచ్చినట్లు గుర్తించారు. అక్కడ రెండు మద్యం సీసాలు పడివుండడంతోపాటు అన్నం తిన్న ఆనవాళ్లు ఉన్నాయి. గోడ పగులగొట్టేందుకు ఉపయోగించిన పెద్దసైజు ఉలి కూడా లభ్యమైంది. గోడను కట్ చేసేందుకు ఎలక్ట్రానిక్ కట్టర్ మిషన్‌కు ఉపయోగించే విద్యుత్ వైర్లు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి కట్టర్ సహాయంతో గోడను కట్‌చేసి, ఉలితో గోడకు ఉన్న ఇటుకలను ఒక్కొక్కటి జాగ్రత్తగా తొలగించి మనిషి పట్టేవిధంగా నాలుగు పలకలుగా రంధ్రం చేసి, జాగ్రత్తగా కిందకు దిగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు షో కేసుల్లోని మూడు కిలోల బంగారు ఆభరణాలు, క్యాష్ బాక్స్‌లోని రూ.8 లక్షల నగదు అపహరించారు. వారు వెండి వస్తువుల జోలికి వెళ్లలేదు. ఆభరణాల్లో బ్రాస్లెట్స్, నెక్లెస్‌లు, ఉంగరాలు, వంద గ్రాముల బరువుగల మూడు బంగారు బిస్కెట్లు ఉన్నాయి. మొత్తం రూ.70లక్షల నుంచి 80 లక్షల వరకు విలువైన ఆభరణాలు, నగదు దోచుకున్నారని బాధితుడు మణికంఠ తెలిపారు. తన తండ్రి పత్తి వ్యాపారానికి సంబంధించి రూ.8 లక్షల నగదును షాపులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్ని కోణాల్లో పరిశోధన చేశారు. సాయంత్రం వచ్చిన డాగ్ స్క్వాడ్ ఘటనాస్థలం నుంచి సత్తెనపల్లి రోడ్డులోని సాయిబాబా గుడివరకు వెళ్లి ఆగిపోయింది. షాపు యజమానుల విచారణ.. షాపు యజమాని బొగ్గవరపు పుల్లారావు, ఆయన కుమారుడు మణికంఠలను విచారిం చారు. క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన పుల్లారావు రెండేళ్ల క్రితం అచ్చంపేటలో జ్యూయలరీ షాపు నెలకొల్పాడు. తాను పత్తి వ్యాపారం చేసుకుంటూ జ్యూయలరీ షాపును కుమారుడు మణికంఠకు అప్పగించారు. ఆరు నెలలుగా మణికంఠ జ్యూయలరీ షాపు పూర్తి బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. వారం రోజుల క్రితం షాపు పైకప్పు పాక్షికంగా దెబ్బతినడంతో మరమ్మతులు చేయించారు. ఈ క్రమంలో షాపులో చోరీ జరగడంతో తాపీ మేస్త్రీలు, విద్యుత్ వర్కర్లపైనా, ఇతరత్రా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జ్యూయలరీ వ్యాపారం కూడా ఒడిదుడుకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చోరీ కేసును ఛేదిస్తామని ఏఎస్పీ శోభామంజరి పేర్కొన్నారు. -
ఎన్టీపీసీ పీటీఎస్‌లో భారీ చోరీ
37 తులాల బంగారు నగలు అపహరణ జ్యోతినగర్ : రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని పలు క్వార్టర్లలో గురువారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. నున్న వెంకటశ్రీనివాసరావు ఇంట్లో 37.5 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మరో ఉద్యోగి రవికుమార్‌కు చెందిన క్వార్టర్ తలుపు తాళాలు పగులగొట్టారు. రవికుమార్ స్థానికంగా లేకపోవడంతో ఇంట్లో ఏ వస్తువులు పోయూయో తెలియలేదు. రవికుమార్ క్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన వెంకట శ్రీనివాసరావు కెమికల్ ఇంజినీరింగ్‌గా ఎన్టీపీసీ సంస్థలో పని చేస్తున్నాడు. ఇటీవల విశాఖపట్నం సింహాద్రి ప్రాజెక్టు నుంచి రామగుండం ప్రాజెక్టుకు బదిలీ అయ్యారు. ప్రాజెక్టు పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని సీ-12/44లో కుటుంబసభ్యులతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల హైదరాబాద్‌లోని సోదరుని ఇంటికి కుటుంబసభ్యులతో వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గురువారం రాత్రి ఇంట్లో లైటు వెలిగి ఉండడంతో స్థానికులు గమనించి శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంట్లో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలాన్ని రామగుండం సీఐ నారాయణ సందర్శించారు. కరీంనగర్‌కు చెందిన క్లూస్ టీం సభ్యులు రాంప్రసాద్, స్వర్ణజ్యోతి, కనకయ్య ఆధారాలు సేకరించారు. బాధితుడు శ్రీనివాస్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పర్మినెంట్ టౌన్షిప్ హైసెక్యూరిటీ జోన్లో ఉంది. రెండు వైపులా ఉన్న గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది కాపలా, సీసీ కెమెరాలున్నాయి. అరుునా చోరీ జరగడంపై ఉద్యోగులు ఆశ్చర్య వ్యక్తంచేస్తున్నారు. -
భారీ చోరీ
విజయనగరం క్రైం: ఇంతవరకు తాళంవేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు..నేడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటుండగానే దర్జాగా చోరీలకు తెగబడుతున్నారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఇంటి గోడకు ఆనుకుని ఉన్న మరో ఇంట్లో శనివారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. ఇటీవల జరిగిన రెండుభారీ దొంగతనాలు మరువక ముందే తాజాగా విజయనగరం పట్టణంలో మరో దొంగతనం జరగడం పట్టణ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇందుకు సంబంధించి బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాన్సాస్ సంస్థ కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ పొందిన పాకలపాటి సత్యనారాయణరాజు(పీఎస్ఎన్.రాజు) పట్టణంలోని కుసుమగజపతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య పార్వతమ్మ మొదటి అంతస్తులో ఉంటుండగా కిందన ఆయన కార్యాలయం ఉంది. శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ మొదటి అంతస్తులోని ఓ గదిలో నిద్రిస్తున్నారు. కిటికీలు అన్నీ తెరిచిఉన్నాయి. దొంగలు కిటి కీ మెస్‌ను కత్తిరించి గడియను తీసి ప్రధాన ద్వారానికి ఉన్న సెంట్రల్ లాక్‌ను స్క్రూలతో తొలగించి లోపలికి చొరబడ్డారు. పీఎస్ఎన్.రాజు పడుకున్న గదికాకుండా పక్క గదిలో ఉన్న బీరువాలు, అలమరాల్లో ఉన్న బట్టలను చిందరవందరచేశారు. బీరువాలో ఉన్న రూ.40వేల నగదును అపహరించారు. ఆ తర్వాత దేవుడు గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న 55తులాల బంగారు అభరణాలు, 15కేజీల వెండి వస్తువులను అపహరించారు. ఆదివారం ఉదయం పీఎస్ఎన్.రాజు లేచి చూసేసరికితలుపులు తెరిచి ఉండడంతో వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సీఐ కె.రామారావు, ఎస్సై బి.రమణయ్య సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలానికి విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, సీసీఎస్ ఎస్సై లక్ష్మణరావు వచ్చి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ కె.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్జాగా మందు కొట్టిన దొంగలు.. పీఎస్ఎన్ రాజు ఇంట్లో బీరువాలో ఉన్న మద్యాన్ని దొంగలు తీసుకుని రెండు గ్లాసుల్లో పోసుకుని ఫ్రిడ్జ్‌లోని కూలింగ్ వాటర్ తీసుకుని దాంట్లో వేసుకుని దర్జాగా తాగినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. బంగారు అభరణాలు ఎక్కువగా ఉన్న దేవుడు గదిలో దొంగలు తెలివిగా నీరును చల్లి అనవాళ్లు లేకుండా చేశారు. గతంలో జరిగిన కొన్ని దొంగతనాల్లో ఫ్రిడ్జ్‌లో ఉన్న పెరుగును తినడం, కూల్‌డ్రింక్‌లను తాగిన వంటి సంఘటనలు ఉన్నాయి. ఇంట్లో ఉంటుండగానే దొంగతనం.. పీఎస్ఎన్.రాజు, భార్య ఇంట్లో పడుకుని ఉండగానే దొంగలు చోరీకి పాల్పడడం విశేషం. ఎపుడు ఆలస్యంగా పడుకునే రాజు శనివారం రాత్రి 9గంటలకే నిద్రలోకి వెళ్లారు. మద్యలో శబ్దం వచ్చిన గాలికి కిటికీలు కదులుతున్నాయేమోనని భావించారు. దొంగలు రాజు పడుకునే గదిని మాత్రం ముట్టలేదు. ఆయన ప్రతిరోజు పడుకునే ముందు పిస్టల్ పక్కనే పెట్టుకుంటారు. క్లూస్ టీం పరిశీలన సంఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి వేలి ముద్రలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని దొంగలు వెళ్లిన ప్రాంతాలను పరిశీలించింది. ఆ సమీపంలో ఉన్న ప్రముఖ లాయర్ ఎస్.ఎస్.ఎస్.ఎస్.రాజు ఇంటి వద్ద డాగ్ కాసేపు ఆగింది. దొంగలు అక్కడ కూడా రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. -
తీర్థయాత్రకు వెళ్తే.. ఇల్లు దోచేశారు
యలమంచిలిలో భారీ చోరీ స్వర్ణకారుడి ఇంట్లో 20 తులాల బంగారం.. రెండు కేజీల వెండి అపహరణ! తిరుమలలో ఉన్న బాధిత కుటుంబానికి సమాచారం రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ప్రొఫెషనల్ దొంగల పనేనని అనుమానాలు యలమంచిలి : తిరుమల తీర్థయాత్రకు వెళ్లిన స్వర్ణకారుడి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. సంచలనం కలిగించిన ఈ చోరీ ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు, బాధితుని మామ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో ఉలక్‌పేట వీధిలో స్వర్ణకారుడు బిల్లకుర్తి శ్రీనివాస్ కుటుంబం నివాసముంటోంది. గత గురువారం శ్రీనివాస్, భార్య శ్రీదేవి, కుమార్తె ఝాన్సీతో కలిపి కుటుంబమంతా తిరుమల తీర్థయాత్రకు వెళ్లారు. ఆదివారం ఉదయం పనిమనిషి నాగమణి వచ్చి ఇంటి ఎదుట శుభ్రం చేస్తుండగా ఇంటి ప్రధాన ద్వారానికి డోర్ కర్టెన్ పూర్తిగా వేసి ఉండటం గమనించింది. దగ్గరకు వెళ్లి చూడగా తలుపు తెరిచి ఉన్నట్టు గుర్తించింది. ఇదే విషయాన్ని చుట్టుపక్కల ఇళ్ల వారికి తెలియజేసింది. వారు వెంటనే ఫోన్ ద్వారా ఇంటి యజమాని శ్రీనివాస్‌కు సమాచారం అందజేశారు. ఇదీ దొంగతనం జరిగిన తీరు! ఈలోగా పట్టణ పోలీసులు చోరీ జరిగిన ఇంటికి చేరుకుని పరిశీలించగా ఇంట్లో పడక గదుల్లో బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. సీక్రెట్ లాకర్లు విరగొట్టబడి ఉన్నాయి. బీరువాల్లో దుస్తులన్నీ చిందరవందరగా పడవేసి ఉన్నాయి. హాల్, వంటగదుల్లోని సామాన్లు చిందరవందర చేయబడి ఉన్నాయి. 20 తులాల బంగారం, రెండు కేజీల వెండి, రూ.15వేల నగదు అపహరించుకుపోయినట్లు కుటుంబ యజమాని శ్రీనివాస్ మామయ్య ఆరిపాక నూకేశ్వరరావు అలియాస్ జయబాబు పోలీసులకు తెలిపారు. అల్లుడి నుంచి సమాచారం రాగా తాను ఇక్కడికి వచ్చానన్నారు. రూరల్ ఎస్ఐ కంచుమోజు రామకృష్ణ చోరీ జరిగిన ఇంటిని, పరిసరాలను గమనించారు. అనంతరం సీఐ మల్లేశ్వరరావుకు సమాచారం అందజేశారు. ఆయన రూరల్ ఎస్పీకి తెలియజేయడంతో, ఆయన ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ సభ్యులు హుటాహుటిన యలమంచిలి చేరుకున్నారు. రంగంలోకి క్లూస్ టీమ్ క్లూస్ టీమ్ ఏఎస్ఐ ఎస్.లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృందం ఉలక్పేటలో చోరీ జరిగిన ఇంటికి వెళ్లి ఆధారాలు సేకరించారు. తలుపులు, వస్తువులు, బీరువాలకు ఉన్న ఏడు రకాల వేలిముద్రలను సేకరించారు. దొంగలు ఇనుపరాడ్లతో ఇంటి ప్రధాన ద్వారా విరగ్గొట్టి లోనికి ప్రవేశించినట్టు గుర్తించారు. ప్రొఫెషనల్స్ పనే! గదుల్లో నేలపై కారంపొడి చల్లడంతో ఇది ప్రొఫెషనల్ దొంగలపనేనని పోలీసులు భావిస్తున్నారు. జిల్లాలోని సబ్బవరం, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో ఇటీవల వరుసగా చోరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో యలమంచిలిలో జరిగిన చోరీ కూడా దొంగల ముఠా సభ్యులే చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. చోరీ జరిగిన ఇంట్లో కుటుంబ సభ్యులంతా తిరుమల తీర్థయాత్రకు వెళ్లడంతో వారు సోమవారం యలమంచిలి చేరుకునే అవకాశం ఉంది. సోమవారం వారి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసును దర్యాప్తు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. -
శివమొగ్గ ఎస్బీఎంలో భారీ చోరీ
వెనుకవైపు కన్నం వేసి లోనికి ప్రవేశించిన దుండగులు సేఫ్టీ లాకర్, ట్రంక్ పెట్టెల తరలింపు గ్యాస్ కట్టర్‌తో తెరచి రూ. రెండు కోట్ల బంగారు నగలు, భారీ మొత్తంతో పరారీ శివమొగ్గ : జిల్లా కేంద్రమైన శివమొగ్గ తుంగానగర పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాచేనహళ్లి బీహెచ్.రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు శాఖలో ఆదివారం అర్ధరాత్రి దొంగలుపడి భారీ మొత్తంలో నగదు, న గలతో ఉడాయించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన పోలీసు అధికారుల్లో తీవ్ర సంచలనం రేపింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కౌశలేంద్రకుమార్, అదనపు ఎస్పీ బీ.దయాళుతో పాటు సీనియర్ పోలీసు అధికారులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. అనంతరం జాగిలాలు, వేలి ముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. అందిన సమాచారం మేరకు ... అర్ధరాత్రి బ్యాంకు వెనుక వైపున కన్నం వేసి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం బంగారు నగలు, నగదు ఉన్న సేఫ్టీ లాకర్, ట్రంక్ పెట్టెలను దుండగులు అక్కడి నుంచి ఒక నిర్జన ప్రదేశంలోకి తరలించారు. గ్యాస్ కట్టర్ సాయంలో వాటిని తెరచి అందులో ఉన్న ఏడు కిలోల బంగారు నగలు, రూ. లక్షల నగదుతో పారిపోయారు. జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ జాతీయ బ్యాంకులో భారీ చోరీ జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. దుండగులు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు ఎస్పీ చెప్పారు. -
బిగ్‌బజార్‌లో భారీ చోరీ
సుల్తాన్‌బజార్: ఒకప్పుడు ఉపాధినిచ్చి..ఆదుకున్న సంస్థకే కన్నం వేశారా ప్రబుద్ధులు. రూ.50 లక్షలకు పైగా విలువైన లాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దోచుకున్నారు. ఈ సంఘటన శనివారం నగరంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాచిగూడ క్రాస్ రోడ్‌లోని బిగ్‌బజార్‌ను శుక్రవారం రాత్రి ఎప్పటిలాగానే పని వేళలు ముగిసిన తరువాత మూసేశారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు సెక్యూరిటీ చెక్ నిర్వహించారు. డిస్ప్లేలో కొన్ని ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు కనిపించ కపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలిస్తున్నట్లు అందులో గుర్తించారు. వెంటనే విషయాన్ని బిగ్‌బజార్ ఉన్నతాధికారులకు సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించారు. ఏసీపీ రవికుమార్, డీఐ కిషోర్ లు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి, వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సిబ్బందిని విచారించారు. బిగ్‌బజార్ మేనేజర్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారమే... గతంలో బిగ్‌బజార్ లో పనిచేసి, మానివేసిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులుపక్కా ప్రణాళికతో చోరీ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తోంది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్‌లు బిగ్‌బజార్‌లో 3వ ప్లోర్లోని ఫైర్‌ఎగ్జిట్ ద్వారం నుంచి 2వ అంతస్తులోని ఎలాక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించి అక్కడున్న ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, కెమెరాలను, తర్వాత పక్కనే ఉన్న స్టోర్‌రూమ్, స్టాఫ్‌రూమ్‌ల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి రెండు బీరువాల తాళాలను పగులగొట్టి అందులో ఉన్న ఖరీదైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. మొత్తం పరికరాల విలువ రూ.50లక్షలకు పైనేనని సిబ్బంది చెబుతున్నారు. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి: ముగ్గురు వ్యక్తులు లోనికి వస్తూనే కొన్ని సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ఓ కెమెరా వైర్లు కత్తిరించకపోవడంతో చోరీ దృశ్యాలు చిక్కాయి. అర్ధరాత్రి 12 గంటల 52 నిమిషాల నుంచి ఒంటిగంటన్నర వరకు చోరీ చేశారు. నిందితులు 4 సూట్‌కేసులు, 6 బ్యాగులను తీసుకువచ్చి వాటిలో చోరీ చేసిన వస్తువులు తీసుకుని దర్జాగా ఆటోలో వెళ్లిపోయారు. చివరకు రాత్రి డ్యూటీలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ వద్ద నిందితుడు కూల్‌డ్రింక్ తాగి మరీ వెళ్లడం గమనార్హం. కీలకం కానున్న ఫోన్‌కాల్: చోరీ చేస్తున్న సమయంలో ముగ్గురిలో ఒకడు సరిగ్గా 1.05 గంటలకు ఎవరికో ఫోన్ చేశాడు. ఈ దృశ్యాలను సీసీ కెమెరాలో చూసిన పోలీసులు ఫోన్ కాల్‌పై దృష్టి పెట్టారు. బిగ్‌బజార్ నుంచిఆ సమయంలో వారు ఎక్కడికి ఫోన్ చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితుల బయోడేటా ఆధారంగా వారి ఫొటోలను సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలోనే నిందితులు? నిందితులు పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్ల పట్టుకునేందుకు 3 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిందితులు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన వారు. అసోం వె ళ్లేందుకు సోమవారం ఉదయం రైలుఉంది. మరే ఇతర మార్గాల ద్వారా నిందితులు వెళ్లినా పోలీసులకు దొరికిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీన్నిబట్టి నిందితులు న గరం, శివారు ప్రాంతాలలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకుంటాం: కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని బిగ్‌బజార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు 35 సెల్ఫోన్లు, 15 ల్యాప్‌ట్యాప్‌లు. 7 కెమెరాలు చోరీ చేశారని ఏసీపీ రవికుమార్ విలేకరులకు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. 3 బృందాలతో గాలింపు చర్యలు మొదలుపెట్టామని ఆయన తెలిపారు. తన పర్యవేక్షణలో సుల్తాన్‌బజార్ డీఐ కిషోర్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నార ని చెప్పారు. -
ఏపీజీవీబీలో రూ.4.50 కోట్ల సొత్తు చోరీ
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) శాఖలో శనివారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షలతో పాటు సుమారు నాలుగున్నర కోట్ల విలువైన 13.5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి...బాలానగర్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఏపీజీవీబీ శాఖ ఉంది. శనివారం అర్థరాత్రి దాటాక కొందరు దుండగులు గ్రిల్ ను విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల కనెక్షన్లు తొలగించి సేఫ్ లాకర్‌ను గ్యాస్ కట్టర్ సాయంతో కోశారు. అందులో ఉన్న 13.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదుతోపాటు సీసీ కెమెరా ఫుటేజీలు, ఐపీ స్టార్లను సైతం తమ వెంట తీసుకెళ్లారు. ఆదివారం సెలవు కావటంతో ఈ విషయం ఎవరూ గమనించలేదు. సోమవారం ఉదయం ఉద్యోగులు బ్యాంకుకు రాగా దొంగతనం బయటపడింది. దీని వెనుక పెద్ద ముఠా హస్తమే ఉండొచ్చని, పక్కా ప్రణాళికతోనే దుండగులు దోపిడీకి పాల్పడ్డారని డీఐజీ శశిధర్‌రెడ్డి తెలిపారు. ముందుగా రెక్కీ నిర్వహించి దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు వారు భావిస్తున్నారు. క్లూస్‌టీం అధికారులు, డాగ్ స్క్వాడ్ విచారణ జరిపారు. ఇదిలా ఉండగా, బ్యాంకులో రూ. 2.4 కోట్ల బంగారు రుణాలను ఇచ్చామని, చోరీకి గురైన బంగారమంతా ఖాతాదారులు దాచుకున్నదానితో పాటు రుణాల కోసం తాకట్టు పెట్టిందేనని మేనేజర్ రవికిశోర్‌రెడ్డి చెప్పారు. -
బందరులో భారీ చోరీ
కేజీ బంగారం, రూ.2 లక్షల నగదు అపహరణ మొత్తం విలువ రూ.30 లక్షలు! రంగంలోకి దిగిన పోలీసులు మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో భారీ చోరీ జరిగింది. శనివారం రాత్రి ఈ ఘటన వెలుగు చూసింది. కేజీ బంగారంతో పాటు రూ.2 లక్షల మేరకు నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు, టౌన్ సీఐ సుబ్బారావు, క్లూస్‌టీం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడి కుమారుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పరాసుపేటకు చెందిన కాంత్ కలర్ ల్యాబ్ యజమాని పీసీ కాంత్ ఇంట్లో పట్టణానికి చెందిన న్యాయవాది జేఆర్వీ సుబ్బారావు గత కొంతకాలంగా అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 18న తన మేనకోడలు ప్రసవించటంతో పలకరింపు కోసం బెంగళూరు వెళ్లాడు. అదే సమయంలో చెన్నైలో ఉంటున్న తన కుమార్తె నిషిత ఆరోగ్యం బాగోకపోవటంతో ఆమెను పరామర్శించేందుకు సుబ్బారావు భార్య ప్రసన్న 19న అక్కడికి వెళ్లారు. సుబ్బారావు కుమారుడు రామ్నితేష్ ఆర్యా గుంటూరులో జరుగుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనుల నిమిత్తం కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుండగులు వెనుకవైపు కిటికీ తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఇంటి యజమాని కాంత్ విషయాన్ని గ్రహించాడు. సుబ్బారావుకు ఫోన్ చేసి విషయం వివరించగా, ఆయన తన కుమారుడి ఆర్యాకు సమాచారం అందించారు. ఆర్యా హుటాహుటిన గుంటూరు నుంచి బయలుదేరి వచ్చారు. బీరువాలో ఉంచిన బంగారం, నగదు మాయమైనట్లు గుర్తించారు. గుంటూరులో జరుగుతున్న నిర్మాణ పనుల నిమిత్తం బంధువుల నుంచి సుమారు కేజీ బంగారం అప్పుగా తెచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ
రూ.15 లక్షలకు పైగా సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు ఘటన గురించి ‘సాక్షి’కి ఫోనులో వివరించిన ఓ బాధితురాలు సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెళ్తున్న రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.17081)లో బుధవారం ఉదయం భారీ చోరీ జరిగింది. మహా రాష్ట్రలోని వసాయ్ వద్ద జరిగిన ఈ ఘటనలో నగరానికి చెందిన పలువురు ప్రయాణికులు దాదాపు రూ.15 లక్షలకు పైగా సొత్తును పోగొట్టుకున్నారు. అదే రైలులో ప్రయాణిస్తున్న నగరవాసి విజయలక్ష్మి ఆ వివరాలను ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. ఆమె కథనం ప్రకా రం... మంగళవారం సాయంత్రం రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. సూరత్‌లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు 30 మందితో కూడిన సింధీ కుటుంబంతో (వీరిలో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు) పాటు నగరానికి చెందిన మరికొంద రు బయలుదేరారు. వీరంతా ఏసీ టూ టైర్ కోచ్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం 6.30 కి ట్రైన్ వసాయి మీదుగా వెళ్తుండగా.. రైలులో ఉన్న వారెవరో డోర్ తెరిచారు. బయటకు వెళ్తే డోర్ దగ్గర ఉండే సీట్లలో కూర్చున్న, పడుకున్న మహిళల్ని టార్గెట్‌గా చేసుకున్న ఓ ముఠా వారి పర్సులు, ఇతర వస్తువుల్ని తీసుకుని దూకేసింది. సింధీలకు చెందిన సామగ్రికి రాత్రంతా కాపలాగా ఉన్న వృద్ధురాలు నిర్మ లా రోచారమానీ అదే సమయంలో నిద్రకు ఉ పక్రమించగా ఆమె పర్సునూ దొంగ లు ఎత్తుకెళ్లారు. ఏ-1 కోచ్‌లో ఓ దుండగుడు పర్సు చోరీ చేస్తుండగా ఓ ప్రయాణికురాలు గ మనించి తన సోదరుడిని అప్రమత్తం చేసిం ది. అతను అడ్డుకోబోగా చేతిపై గాయపర్చి.. తో సేసి నడుస్తున్న రైలు నుంచి దుండగుడు దూకేశాడు. ఈ ఉదంతంపై ప్రయాణికులు వాసిలో రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన చర్యలు తీసుకుంటే తప్ప రైలును ముం దుకు తీసుకెళ్లవద్దంటూ నిరసన తెలిపారు. దీంతో అక్కడి రైల్వే ఏఎస్పీ పలాష్ రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి సూరత్ వరకు ప్రయాణిస్తూ బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఈయన దిగిపోయిన తర్వాత తమ తమ గ మ్యస్థానాల్లో మరో ముగ్గురు ప్రయాణికులు దిగారు. ఆ సమయంలో వారి సామాన్లు కూడా కనిపించకపోవడంతో ఆనంద్, సూరత్‌ల్లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం వల్లే చోరీ: విజయలక్ష్మి ‘ఈ ఉదంతం కచ్చితంగా రైల్వే అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీలు, దోపిడీ ఘటనలు గతంలోనూ ఎన్నో జరిగాయి. అయినా ఈ రైలుకు అధికారు లు సరైన భద్రత కల్పించడంలేదు. మేము ప్రయాణిస్తున్న ఏసీ కోచ్ అద్దం గతంలోనే పగిలిపోయి, నేరగాళ్లకు అనుకూలంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. రాజ్‌కోట్‌లో వాడి నుంచి షోలాపూర్ వరకు మాత్రమే పోలీసుల భద్రత కల్పిం చారు. ఆ తర్వాత రైలులోకి మరో బృందం ఎ క్కాల్సి ఉన్నా... ఒక్క గార్డుకు కూడా రాలేదు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ చోరీ జరిగింది.’ -
పంజగుట్టలో తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’
నగరం నడిబొడ్డున.. పంజగుట్టలో తనిష్క్ జ్యువెలర్స్‌కు ‘కన్నం’ లోపల గంటకుపైగా తీరిగ్గా గడిపిన వైనం పక్కా ప్రొఫెషనల్స్ పనేనా? 9 కౌంటర్ల నుంచి రూ.23 కోట్ల విలువైన 30 కేజీల పసిడి తస్కరణ సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. పంజగుట్టలోని తనిష్క్ జ్యువెలర్స్ వెనుక వైపు గోడకు రంధ్రం చేసి ప్రవేశించిన చోరుడు రూ.23 కోట్ల విలువైన 30 కేజీల బంగారం, విలువైన రాళ్లు పొదిగిన నగల్ని మూటగట్టుకుపోయాడు. పక్కా ప్రొఫెషనల్ నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసును నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్)కు బదిలీ చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ను బట్టి.. దొంగ మొదట స్విచ్ బోర్డు వద్దకు వెళ్లి లైట్లన్నీ ఆర్పాడు. దీన్నిబట్టి అంతకుముందు దుకాణం లోపలి నుంచి కూడా రెక్కీ చేశాడా? లేదా తెలిసిన వారు సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన రహదారిపైనే దుకాణం పంజగుట్ట కూడలి నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ ముగింపు దగ్గర తేజస్విని ప్లాజా ఉంది. ఇందులో టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన తనిష్క్ జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇది సెల్లార్+జీ+టూ భవనం కాగా... సెల్లార్లో పార్కింగ్, కింది అంతస్తులో బంగారు నగలు, మొదటి అంతస్తులో వజ్రాభరణాల విక్రయ విభాగాలు, రెండో అంతస్తులో సంస్థ పాలనా కార్యాలయం ఉన్నాయి. కింది అంతస్తులోనే ప్రధాన ద్వారం ఉంది. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు షాపు మూసివేశారు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంస్థ జనరల్ మేనేజర్ మణికందన్ వచ్చి దుకాణం తెరిచి లోపలకు వెళ్లారు. నగల విక్రయ విభాగంలోని 9 కౌంటర్లలో ఆభరణాలు కనిపించలేదు. వెంటనే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడా ఆధారాలు దొరక్కుండా.. రంధ్రం పరిమాణంతో పాటు ఇతర ఆధారాలను బట్టి పోలీసులు 25-30 ఏళ్ల మధ్య వయస్కుడైన బక్కపలుచని వ్యక్తి లోపలకు వచ్చినట్లు నిర్ధారించారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో చొరబడిన దుండగుడు గంటా పదిహేను నిమిషాల పాటు తచ్చాడుతూ, తీరిగ్గా చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగుడు ఎడమకాలు కుంటుతున్నట్లు గుర్తించారు. ముఖకవళికలు తెలియకుండా మాస్క్, వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు, పాదముద్రలు చిక్కకుండా కాళ్లకు పాలథిన్ కవర్లు ధరించాడు. రంధ్రంలోంచి లోపలకు వస్తున్నప్పుడు దెబ్బలు తగలకుండా పాదాల పై భాగంలో గోనెసంచులు కట్టుకున్నాడు. లోపల మొత్తం 15 కౌంటర్లు, డిస్ప్లేలు ఉండగా, తొమ్మిది కౌంటర్లలోని బంగారాన్ని ఖాళీ చేశాడు. డిస్ప్లేల జోలికి పోలేదు. పోలీసు జాగిలాలకూ ఆధారం దొరక్కుండా.. వెంట కారం తీసుకెళ్లి, అవి వాసన పీల్చే అవకాశం లేకుండా పలుచోట్ల చల్లాడు. పై అంతస్తులో వజ్రాభరణాలున్నాయని, దుండగుడు అక్కడికీ వెళ్లి ఉంటే చోరీ సొత్తు విలువ భారీగా ఉండేదని పోలీసులు చెప్పారు. దాదాపు 30 కేజీల సొత్తు తస్కరణకు గురైంది. చోరీ తీరును అధ్యయనం చేసిన పోలీసులు.. బయట మరో ఇద్దరైనా కాపు కాసి ఉంటారని అనుమానిస్తున్నారు. రంధ్రం నుంచి ముందు చేతులు పెట్టిన దొంగ ఆ తరవాత తలపెట్టి లోపలకు రావడం సీసీ కెమెరాల్లో నమోదైంది. పోలీసు జాగిలం దుకాణం లోపలకెళ్లి చోరీ జరిగిన భవనం వెనక వైపు తిరిగి అక్కడి నుంచి పక్కనే ఉన్న టోపాజ్ భవనం పక్క సందులోకి వెళ్లింది. ‘పాత కిటికీ’ని పగులగొట్టి లోపలకు.. తేజస్విని ప్లాజాకు వెనుక వైపు ఓ కమర్షియల్/రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉంది. దీని ప్రహరీగోడకు, తేజస్విని ప్లాజా గోడకు మధ్య రెండడుగుల ఖాళీ సందు ఉంది. కాంప్లెక్స్ ప్లాజా కంటే ఎత్తులో ఉండటంతో, దాని గ్రౌండ్ ఫ్లోర్ దీని ఫస్ట్‌ఫ్లోర్‌కు సమాన ఎత్తులో ఉంది. కాగా, జ్యువెలర్స్ నిర్వాహకులు.. భద్రత నిమిత్తం భవనం గోడలకు ఎవరూ రంధ్రం వేయడం సాధ్యం కాకుండా లోపల ఇనుప మెష్‌లు ఏర్పాటు చేశారు. అయితే కింది అంతస్తులోని బంగారం విభాగంలో మూడో పిల్లర్ పక్కన గతంలో కిటికీ ఉండేది. కొన్నేళ్ల క్రితం దీన్ని మూసేయడంతో అక్కడ ఇనుప మెష్ ఏర్పాటుకు ఆస్కారం లేకపోయింది. భవనం ఎడమ వైపు కాంప్లెక్స్‌కు దారితీసే మార్గం నుంచి సందు వరకు చేరుకున్న దుండగుడు.. బయటి వైపు నుంచి పాత కిటికీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడే రంధ్రం చేసి లోపలకు చొరబడ్డాడు. పాత నేరగాళ్ల పనిగా అనుమానం.. తనిష్క్ జీఎం మణికందన్ ఇచ్చిన ఫిర్యాదులో ప్లెయిన్, గోల్డ్ ఆర్నమెంట్స్ 18 కిలోలు (విలువ సుమారు రూ.11కోట్లు), కలర్ స్టోన్స్, ముత్యాలు పొదిగిన ఆభరణాలు 12 కిలోలు (విలువ రూ.12 కోట్లు) చోరీ అయినట్టు పేర్కొన్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది పాత నేరగాళ్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు నగరం, ఇతర రాష్ట్రాల ముఠాల వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో దొంగ కుంటుతున్నట్లు ఉంది. నిజంగానే అంగవికలుడా? లేక పోలీసుల దృష్టి మరల్చడానికి అలా చేశాడా? అనేది పరిశీలిస్తున్నారు. సీసీఎస్ అధికారులు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో దర్యాప్తు చేయడంతో పాటు ఇవి ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. పంజగుట్ట ప్రాంతంలోని ట్రాఫిక్ కెమెరాలు, పబ్లిక్ ప్లేసులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, శివార్లలోని టోల్గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సంస్థకు చెందిన వారు చోరులకు సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటనర్సయ్య, సీఐ తిరుపతిరావు, డీఐ సత్తయ్య పరిశీలించారు. అనురాగ్ శర్మ మాట్లాడుతూ... సీసీ కెమెరాల్లోని ఫీడ్ ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిర్లక్ష్యం ఖరీదు! ఘటనలో సెక్యూరిటీ గార్డుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో పూర్తిగా నిద్రపోయి ఉంటారని భావిస్తున్నారు జ్యువెలర్స్‌ను రాత్రి మూసివేసేట ప్పుడు నగలు, బంగారాన్ని కౌంట ర్లు, డిస్ప్లేల్లోంచి తీసి కట్టుదిట్టమైన చెస్ట్‌ల్లో భద్రపరుస్తారు. తనిష్క్ నిర్వాహకులు ఆ పని చేయలేదు రూ.కోట్ల విలువైన సరుకు ఉండే, లావాదేవీలు చేసే ఈ దుకాణం బయట, వెనుక సీసీ కెమెరాల్లేవు పక్కా రెక్కీ చేశాకే చోరీ చేసినట్లు స్పష్టమవుతోంది. ఘటనకు రెండ్రోజుల ముందు దుకాణానికి కస్టమర్లా వచ్చి వెళ్లిన ఓ అనుమానితుడిని సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. ఒకరోజు ముందు ఓ అనుమానితుడు దుకాణం వద్ద తచ్చాడాడని స్థానికులు చెబుతున్నారు శుక్రవారం రాత్రి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. దుకాణం వెనుక వైపు సందులో గడ్డపారలు, ఇతర వస్తువులతో రంధ్రం చేయడం సాధ్యం కాదు. దీన్నిబట్టి దుండగులు డ్రిల్లింగ్ మిషన్ వాడినట్లు పోలీసులు తేల్చారు. ఈ శబ్దాన్ని సెక్యూరిటీ గార్డులు వినలేదు తొమ్మిది అంగుళాల మందం గల గోడకు 1.5 అడుగుల ఎత్తు, అడుగు వెడల్పుతో రంధ్రం చేశాడు. అంతసేపూ గార్డులు పసిగట్టలేదు ఒక్కో కౌంటర్లోనూ చోరీ తరవాత దొంగ ఆ సొత్తును బయట ఉన్న మరో వ్యక్తికి రంధ్రం ద్వారా అందిస్తున్నట్లు కెమెరాల్లో అస్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారమూ సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు ఉదయం సంస్థకు వచ్చిన మణికందన్ లోపలకు వెళ్లి గుర్తించే వరకు చోరీ అంశం సెక్యూరిటీ గార్డులకు తెలియలేదు. దొంగలు దుకాణం ముందు కారం చల్లినా గార్డులు గుర్తించలేదు. -
చిన ఓగిరాలలో భారీ చోరీ
కారులో ఉంచిన రూ.4.77 లక్షలు అపహరణ దొంగల పనా..? తెలిసినవారే చేశారా..? చినఓగిరాల (ఉయ్యూరు), న్యూస్‌లైన్ : మండలంలోని చిన ఓగిరాల గ్రామంలో భారీ మొత్తంలో నగదు చోరీకి గురైంది. కారులో ఉంచిన రూ. 4.77 లక్షల నగదును దుండగులు అపహరించుకుపోయారు. గురువా రం పట్టపగలే చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మాజీ సర్పంచ్ పాల డు గు రామకృష్ణ కేసీపీ కర్మాగారానికి చె రుకు తోలారు. దానికి సంబంధించి సొమ్ము బ్యాక్‌లో జమ అయినట్లు తెలుసుకుని డ్రా చేసేందుకు ఉయ్యూ రు బయలుదేరారు. ముందుగా ఓ హోటల్లో భోజనం పార్శిల్ తీసుకున్నారు. తరువాత ఆంధ్రాబ్యాంక్‌కు వచ్చారు. ఉదయం 11.40 గంటల సమయంలో బ్యాంక్ నుంచి రూ. 4.77 లక్షలు డ్రా చేశారు. 467 వెయ్యి నోట్లు, 100 వంద నోట్ల కట్ట పేపర్లో చుట్టుకుని గేర్ రాడ్ సమీపంలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. చిన ఓగిరాలలో తన సోదరుడు, సిద్ధార్ధ అకాడమీ కార్యదర్శి లక్ష్మణరావు ఇంటి మరమ్మతులు జరుగుతుండగా పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. ఆ మార్గంలో లారీ వస్తుండటంతో కారును రోడ్డు పక్కనే నిలిపారు. లోనికి వెళ్లి పనులను పర్యవేక్షించి భో జనం ప్యాకెట్‌ను అక్కడున్న గుమస్తా కు అందజేశాడు. తరువాత కారు వ ద్దకు వచ్చి చూడగా అందులో ఉం చి న నగదు కనిపించలేదు. దీంతో స్థా నికుల సాయంతో పరిసరాల్లో వెది కినా సొమ్ము దొరకలేదు. దీనిపై రూ రల్ ఎస్సై కృష్ణమోహన్‌కు సమాచా రం అందించారు. ఆయన ఘటనాస్థలికి వచ్చారు. దొంగతనం గురించి ఈస్ట్ ఏసీపీ మహేశ్వరరాజు, సీఐ ప్రసాద్‌కు తెలియజేశారు. వారు హు టాహుటిన వచ్చి ఘటనాస్థలిని పరి శీలించారు. వేలిముద్రల నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. పోలీ సు జాగిలాన్ని కూడా రప్పించారు. లక్ష్మణరావు ఇంటి పనిలో పాల్గొన్న ఉయ్యూరుకు చెందిన ఓ కార్మికుడిపై అనుమానం రావటంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తనకేమీ తెలియదని, తాను కాలకృ త్యా లు తీర్చుకునేందుకు వెళ్లి వెంటనే వచ్చేశానని అతడు చెప్పాడు. రామకృ ష్ణ బ్యాంక్‌లో డబ్బు డ్రా చేయడాన్ని గమనించి దుండగులు వెంబడించి చిన ఓగిరాలలో కారు పార్క్ చేసిన తరువాత దొంగిలించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వ చ్చారు. ఇద్దరు యువకులు బైక్‌పై తన కారు వెంబడి వస్తున్నట్లు గమనించానని రామకృష్ణ చెప్పారు. దీంతో ఇది దొంగల ముఠా పనా..? లేక తెలిసిన వారు చోరీకి పాల్పడ్డారా? అని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈస్ట్ విభాగం సీసీఎస్ సీఐ కాశీవిశ్వనాథ్ సిబ్బందితో వచ్చి ఘట నాస్థలిని పరిశీలించారు. -
సిద్దిపేటలో భారీ చోరీ
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని అపార్ట్మెంట్లో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటలోని సీతారామాంజనేయ థియేటర్ వెనుక భాగంలో ఉన్న రావూస్ రెసిడెన్సీలోని ఫ్లాట్ నంబర్ 101లో గన్రాత్ భీమేష్ నివాసముంటున్నారు. ఈయన శివాజీ నగర్లో పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఓ పని నిమిత్తం మంగళవా రం రాత్రి ఆయన తానుంటున్న ఫ్లాట్‌కు తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం ఉదయం ఆయన తన ఫ్లాటుకు వచ్చేసరికి తలుపు తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా.. బెడ్రూం, బీరువా తాళాలు కూడా బద్దలై ఉన్నాయి. దీంతో ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశా రు. డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, వన్ టౌన్ సీఐ నాగభూషణంలు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం సంగారెడ్డి నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను ర ప్పించారు. కుక్క అపార్ట్మెంట్లోని ప లు ప్రాంతాలను తిరిగి హైదరాబాద్ రో డ్డుపైకి వెళ్లి తిరిగి మళ్లీ వాహనంలోకి వ చ్చి కూర్చొంది. క్లూస్ టీం వివిధ వస్తువులపై ఉన్న వేలి ముద్రలను సేకరిం చారు. సిద్దిపేట వన్ టౌన్ పోలీసు లు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు. బీరువాలో దాచిన ఆరు తులాల బంగారు చైన్, నాలుగు తులాల బంగా రు నెక్లెస్, 2 తులాల చైన్, 3.5 తులాల కమ్మలు, 2 తులాల ఉంగరాలు, 0.5 తులం కాయిన్, 3 తులాల బంగారు గాజులు మొత్తం 21 తులాల నగలు చోరీ అయినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం దాచిన భారీ మొత్తం కూడా అపహరణకు గురైనట్లు సమాచారం. ఇంట్లో చోరీ సంగారెడ్డి క్రైం : మండలంలోని గౌడిచెర్ల గ్రామ మాజీ సర్పంచ్ తలారి కృష్ణ ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు తలా రి కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం 11 గంటల సమయం లో ఇంటికి తాళం వేసి చేను వద్దకు వెళ్లారు. అనంతరం సాయంత్రం ఇంటి కి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం ప గులగొట్టి ఉంది. ఇంట్లో ఉన్న రూ. 46 వేల నగదు, తులం బంగారం దొంగలు అపహరించుకుని పోయారని బాధితుడు తెలిపారు. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. -
తాండూరులో భారీ చోరీ
తాండూరు, న్యూస్‌లైన్: తిరుమలేశుడి కల్యాణం జరిపించేందుకు వెళ్లిన ఓ వ్యాపారి ఇంట్లో దుండగులు తెగబడ్డారు. 13.3 తులాల బంగారు నగలు, నాలుగు కిలోల వెండితో పాటు రూ. 25 వేల నగదును అపహరించుకుపోయారు. పోలీసులు జాగిలాలతో వివరాలు సేకరించారు. ఈ సంఘటన శనివారం ఉదయం తాండూరు పట్టణంలో వెలుగుచూసింది. బాధితుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని యశోదనగర్‌లో నివాసం ఉంటున్న బెన్నూర్ కెళిగరి చంద్రయ్య భద్రేశ్వర్ చౌక్ సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆయన చిన్న కొడుకు వివాహం జరిగింది. అనంతరం తిరుమల వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిపించేందుకు చంద్రయ్య కుటుంబంతో కలిసి ఈనెల 19 తిరుపతికి వెళ్లాడు. శనివారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో చంద్రయ్య ఇంటి తలుపు తెరిచి ఉంది. పొరుగింట్లో ఉండే ఆయన తమ్ముడు అశోక్ గమనించి చోరీ జరిగిందని అనుమానించి తన కొడుకు ప్రవీణ్‌కుమార్‌కు విషయం చెప్పాడు. ప్రవీణ్‌కుమార్ వెంటనే పట్టణంలో ఉండే తన పెదనాన్న బామ్మర్ది రవీందర్‌కు సమాచారం ఇచ్చాడు. రవీందర్ ఫిర్యాదుతో ఉదయం తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, అర్బన్, రూరల్ సీఐలు సుధీర్‌రెడ్డి, రవికుమార్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగలు ఇంటి ప్రధాన ద్వారం గొళ్లెం పగులకొట్టి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. ఇంట్లోని రెండు గదుల్లో ఉన్న మూడు బీరువాలు ధ్వంసం అయి ఉన్నాయి. దుస్తులు, ఇతర సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయ. దుండగులు బీరువాల్లో ఉన్న 10.3 తులాల బంగారు అభరణాలు, నాలుగు కిలోల వెండి, రూ. 25 వేల నగదు అపహరించుకుపోయినట్లు గుర్తించారు. దొంగలు ఇంట్లో అణువణువు గాలించారు.పోలీసులు వికారాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించారు. డాగ్‌స్క్వాడ్ మొదట యశోదనగర్ పార్కు పక్కనే ఉన్న బచ్పన్ స్కూల్‌కు వెళ్లి ఆగింది. అనంతరం అంబేద్కర్ కళాశాల మార్గం మీదుగా ఐబీ అతిథి గృహం సమీపంలోని రైల్వే క్వార్టర్స్‌లోకి వెళ్లి మూడు ఇళ్లలోకి వెళ్లింది. అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్ వరకు వెళ్లింది. దుండగులు చంద్రయ్య ఇంటి ఆవరణలోని చిన్న ట్యూబ్‌లైట్‌ను తొలగించారు. ఓ లుంగీతో పాటు కొన్ని దుస్తులను ఇంటి గేటు వద్ద పడేసి వెళ్లిపోయారు. పోలీసులు వ్యాపారి ఇంట్లో పడి ఉన్న కాల్చిన బీడి ముక్కతో పాటు చేతులకు వేసుకునే గ్లౌజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు తమ చేతి వేలిముద్రలు లభించకుండా గ్లౌజ్‌లు ఉపయోగించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుపతిలో ఉన్న చంద్రయ్యకు చోరీ సమాచారాన్ని తెలియజేశారు. బంగారం, వెండి నగలతో పాటు నగదు విలువ రూ.7 లక్షలు ఉంటుందని పోలీసు లు అంచనా వేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. దీంతో పాటు పోలీసులు పాత నేరస్థుల కదలికలపై ఆరా తీస్తున్నారు. చంద్రయ్య కుటుం బాన్ని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లిన ఆటోలు, వాటి డ్రైవర్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చంద్రయ్య కుటుంబం తిరుపతికి వెళ్లిన విషయం పక్కాగా తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోనే ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి నివాసం ఉంది. రాత్రి పూట పోలీసులు సరిగా గస్తీ నిర్వహించకపోవడంతోనే చోరీ జరిగిందని పట్టణవాసులు మండిపడుతున్నారు. చంద్ర య్య బావమరిది రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అర్బన్ ఎస్ఐ రవి తెలిపారు. -
భీమవరంలో భారీ చోరీ
భీమవరం క్రైం, న్యూస్‌లైన్ : ఇంటి తలుపు గడియను పగలుగొట్టిన దొంగలు లోనికి ప్రవేశించి బీరువాలోని సుమారు 60 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయూరు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం ఏఎస్ఆర్ నగర్‌లోని గోకరాజు రంగరాజు వీధిలో నివాసముంటున్న గోకరాజు విశ్వనాథరాజు మొదటి అంతస్థులోని తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పెళ్లికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు తలుపు గడియను పగలగొట్టి లోనికి ప్రవేశించారు. గదిలోని బీరువాను తెరచి 23 బంగారు వస్తువులను అపహరించుకుపోయూరు. సోమవారం ఇంటికి చేరుకున్న విశ్వనాథరాజు, అతని కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ జయసూర్య, ఎస్సై విష్ణుమూర్తి, ఏఎస్సై రమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఏలూరు నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చి పరిశీలన చేశారు. చోరీకి గురైన 23 బంగారు వస్తువులు సుమారు 60 కాసులు ఉంటాయని బాధితులు చెబుతున్నారు. -
పట్టపగలు నడిరోడ్డుపై భారీ చోరీ
చాట్రాయి, న్యూస్‌లైన్ : సినీ ఫక్కీలో పట్టపగలు నడిరోడ్డుపై చోరీకి పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో సోమవారం జరిగింది. నగదు బ్యాగ్‌తో బైక్‌పై పరారై వస్తున్న ముగ్గురు నిందితుల్లో ఒకరిని చాట్రాయి పోలీసులు విస్సన్నపేట మండలం నర్సాపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పాల్గొనగా మరో ఇద్దరు వేరొక బైక్‌పై పరారయ్యారని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం వివరాలివీ... చింతలపూడిలోని భారత్ గ్యాస్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఎన్.శ్రీనివాసరావు సోమవారం ఉదయం 10.30 గంటలకు రూ.4.90 లక్షల నగదును అక్కడి ఆంధ్రాబ్యాంక్‌లో జమచేసేందుకు బయల్దేరారు. మార్గంలో వెనుక నుంచి పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సత్తుపల్లి ఎటు వెళ్లాలని అడిగారు. ఆయన దారి చూపే క్రమంలో మెడలోని నగదు బ్యాగ్‌ను లాక్కొని పరారయ్యారు. బాధితుడు శ్రీనివాసరావు వెంటనే చింతలపూడి సీఐ ఎం.వెంకటేశ్వరరావుకు విషయం తెలుపగా, ఆయన లింగపాలెం, ధర్మాజీగూడెం స్టేషన్లతో పాటు చాట్రాయి స్టేషన్ ఎస్ఐ సతీష్‌కు సమాచారం అందించారు. చాట్రాయి ఎస్ఐ వెంటనే అప్రమత్తమై స్టేషన్ వద్ద కానిస్టేబుల్ చారిని నిఘా ఉంచారు. విస్సన్నపేట మండలం నర్సాపురంలోని స్థానికులకు కూడా సమాచారం అందించారు. దీంతో వారు కూడా అప్రమత్తమయ్యారు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారీ... బైక్‌పై చాట్రాయి చేరుకున్న నిందితులు పోలీస్‌స్టేషన్ వద్ద తమను అడ్డగించబోయిన కానిస్టేబుల్ చారిని ఢీకొట్టి నర్సాపురం సెంటర్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడి హోంగార్డు శ్రీను వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు బైక్ అదుపుతపిప కిందపడ్డారు. అదే సమయానికి చాట్రాయి పోలీసులు కూడా రావడంతో బైక్‌పై వెనుక ఉన్న ఇద్దరు నిందితులు స్థానిక దళితవాడలోకి పరారయ్యారు. కిందపడిపోయిన పిల్లి ప్రవీణ్ అనే మూడో నిండితుడిని, నగదుతో సహా స్థానికుల సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నగదును లెక్కించగా రూ.3.40 లక్షలు మాత్రమే ఉన్నాయి. మిగతా రూ.1.50 లక్షలు పారిపోయిన నిందితుల వద్ద ఉండవచ్చని సమాచారం. అనంతరం చింతలపూడి సీఐ, ఎస్ఐ బి.మోహనరావులకు తిరువూరు సీఐ శ్యాంకుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని బైక్, నగదు సహా అప్పగించారు. ముందుగానే రెక్కీ... చోరీకి పాల్పడిన వ్యక్తులు కొన్ని రోజులు ముందుగానే రెక్కీ నిర్వహించారని తిరువూరు సీఐ శ్యాంకుమార్ చెప్పారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని విచారించగా ఈ విషయం వెల్లడించాడని వివరించారు. స్థానికుల సహకారంతో ఆ గ్రామంలో ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లావాదేవీలు జరిపేవారి వివరాలు సేకరించి, ఏ సమయంలో బ్యాంక్‌కు వెళ్లేదీ పూర్తి సమాచారం తెలుసుకొని చోరీలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. బ్యాంక్‌ల మేనేజర్లు కార్యాలయాల వద్ద తగిన సెక్యూరిటీ కల్పించి గట్టి నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ చోరీ ఘటనలో మొత్తం ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని, రెండు బైక్‌లపై వారు పరారయ్యారని ఆయన వివరించారు. ఎస్సై సతీష్, సిబ్బంది, సహకరించిన స్థానికులను ఆయన ప్రశంసించారు. -
పల్లెర్లమూడిలో భారీ చోరీ
పల్లెర్లమూడి(నూజివీడు రూరల్), న్యూస్‌లైన్ : మండలంలోని పల్లెర్లమూడిలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో భారీ దొంగత నం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షుడు పెదర్ల సత్యవరప్రసాద్ శుభకార్యం నిమిత్తం మంగళవారం రాత్రి నూజి వీడు వచ్చారు. వివాహం ముగిసిన తరువాత రాత్రి ఒంటిగంట సమయంలో స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూడగా ముఖద్వారానికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల బీరువా తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. అందులోని వస్తువులు, దుస్తులు మంచం మీద చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన రూ.90 వేలు నగదు, 45 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆయన గుర్తించారు. ఆభరణాల విలువ రూ.11.25 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఘటన జరిగిన రోజు వరప్రసాద్ భార్య వేరే ఊరికి వెళ్లారు. దొంగతనం గురించి సమాచారం అందుకున్న సీఐ సిహెచ్.వి.మురళీకృష్ణ, రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తెలిసినవారి పనే ? సంఘటన జరిగిన తీరును చూస్తే బాగా తెలిసిన వ్యక్తులే చోరికీ పాల్పడి ఉంటారని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమ యం చూసుకుని అర్ధరాత్రి ఒంటిగంట లోపే తాళం పగులగొట్టి సొత్తు దొంగిలించుకుపోవడాన్ని బట్టి వీరు ఆ విధంగా అంచనాకు వచ్చారు. సత్యవరప్రసాద్ వివాహానికి వెళ్లిన సంగతిని, ఆయన భార్య ఊరికి వెళ్ళిన విషయాన్ని బాగా గమనించి ఈ చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.