- కారులో ఉంచిన రూ.4.77 లక్షలు అపహరణ
- దొంగల పనా..? తెలిసినవారే చేశారా..?
చినఓగిరాల (ఉయ్యూరు), న్యూస్‌లైన్ : మండలంలోని చిన ఓగిరాల గ్రామంలో భారీ మొత్తంలో నగదు చోరీకి గురైంది. కారులో ఉంచిన రూ. 4.77 లక్షల నగదును దుండగులు అపహరించుకుపోయారు. గురువా రం పట్టపగలే చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామ మాజీ సర్పంచ్ పాల డు గు రామకృష్ణ కేసీపీ కర్మాగారానికి చె రుకు తోలారు. దానికి సంబంధించి సొమ్ము బ్యాక్‌లో జమ అయినట్లు తెలుసుకుని డ్రా చేసేందుకు ఉయ్యూ రు బయలుదేరారు. ముందుగా ఓ హోటల్‌లో భోజనం పార్శిల్ తీసుకున్నారు. తరువాత ఆంధ్రాబ్యాంక్‌కు వచ్చారు. ఉదయం 11.40 గంటల సమయంలో బ్యాంక్ నుంచి రూ. 4.77 లక్షలు డ్రా చేశారు. 467 వెయ్యి నోట్లు, 100 వంద నోట్ల కట్ట పేపర్‌లో చుట్టుకుని గేర్ రాడ్ సమీపంలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. చిన ఓగిరాలలో తన సోదరుడు, సిద్ధార్ధ అకాడమీ కార్యదర్శి లక్ష్మణరావు ఇంటి మరమ్మతులు జరుగుతుండగా పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు.
ఆ మార్గంలో లారీ వస్తుండటంతో కారును రోడ్డు పక్కనే నిలిపారు. లోనికి వెళ్లి పనులను పర్యవేక్షించి భో జనం ప్యాకెట్‌ను అక్కడున్న గుమస్తా కు అందజేశాడు. తరువాత కారు వ ద్దకు వచ్చి చూడగా అందులో ఉం చి న నగదు కనిపించలేదు. దీంతో స్థా నికుల సాయంతో పరిసరాల్లో వెది కినా సొమ్ము దొరకలేదు. దీనిపై రూ రల్ ఎస్సై కృష్ణమోహన్‌కు సమాచా రం అందించారు.
ఆయన ఘటనాస్థలికి వచ్చారు. దొంగతనం గురించి ఈస్ట్ ఏసీపీ మహేశ్వరరాజు, సీఐ ప్రసాద్‌కు తెలియజేశారు. వారు హు టాహుటిన వచ్చి ఘటనాస్థలిని పరి శీలించారు. వేలిముద్రల నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. పోలీ సు జాగిలాన్ని కూడా రప్పించారు. లక్ష్మణరావు ఇంటి పనిలో పాల్గొన్న ఉయ్యూరుకు చెందిన ఓ కార్మికుడిపై అనుమానం రావటంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తనకేమీ తెలియదని, తాను కాలకృ త్యా లు తీర్చుకునేందుకు వెళ్లి వెంటనే వచ్చేశానని అతడు చెప్పాడు.
రామకృ ష్ణ బ్యాంక్‌లో డబ్బు డ్రా చేయడాన్ని గమనించి దుండగులు వెంబడించి చిన ఓగిరాలలో కారు పార్క్ చేసిన తరువాత దొంగిలించి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వ చ్చారు. ఇద్దరు యువకులు బైక్‌పై తన కారు వెంబడి వస్తున్నట్లు గమనించానని రామకృష్ణ చెప్పారు. దీంతో ఇది దొంగల ముఠా పనా..? లేక తెలిసిన వారు చోరీకి పాల్పడ్డారా? అని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈస్ట్ విభాగం సీసీఎస్ సీఐ కాశీవిశ్వనాథ్ సిబ్బందితో వచ్చి ఘట నాస్థలిని పరిశీలించారు.