రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ | Rajkot Express, massive theft | Sakshi
Sakshi News home page

రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ

Published Thu, Jan 30 2014 3:41 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

Rajkot Express, massive theft

  •    రూ.15 లక్షలకు పైగా సొత్తు ఎత్తుకెళ్లిన దుండగులు
  •      ఘటన గురించి ‘సాక్షి’కి ఫోనులో వివరించిన ఓ బాధితురాలు
  •   సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెళ్తున్న రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.17081)లో బుధవారం ఉదయం భారీ చోరీ జరిగింది.  మహా రాష్ట్రలోని వసాయ్ వద్ద జరిగిన ఈ ఘటనలో నగరానికి చెందిన పలువురు ప్రయాణికులు దాదాపు రూ.15 లక్షలకు పైగా సొత్తును పోగొట్టుకున్నారు. అదే రైలులో ప్రయాణిస్తున్న నగరవాసి విజయలక్ష్మి ఆ వివరాలను ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు.

    ఆమె కథనం ప్రకా రం... మంగళవారం సాయంత్రం రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. సూరత్‌లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు 30 మందితో కూడిన సింధీ కుటుంబంతో (వీరిలో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు) పాటు నగరానికి చెందిన మరికొంద రు బయలుదేరారు. వీరంతా ఏసీ టూ టైర్ కోచ్‌లో ఉన్నారు. బుధవారం ఉదయం 6.30 కి ట్రైన్ వసాయి మీదుగా వెళ్తుండగా.. రైలులో ఉన్న వారెవరో డోర్ తెరిచారు. బయటకు వెళ్తే డోర్ దగ్గర ఉండే సీట్లలో కూర్చున్న, పడుకున్న మహిళల్ని టార్గెట్‌గా చేసుకున్న ఓ ముఠా వారి పర్సులు, ఇతర వస్తువుల్ని తీసుకుని దూకేసింది.

    సింధీలకు చెందిన సామగ్రికి రాత్రంతా కాపలాగా ఉన్న వృద్ధురాలు నిర్మ లా రోచారమానీ అదే సమయంలో నిద్రకు ఉ పక్రమించగా ఆమె పర్సునూ దొంగ లు ఎత్తుకెళ్లారు. ఏ-1 కోచ్‌లో ఓ దుండగుడు పర్సు చోరీ చేస్తుండగా ఓ ప్రయాణికురాలు గ మనించి తన సోదరుడిని అప్రమత్తం చేసిం ది.  అతను అడ్డుకోబోగా చేతిపై గాయపర్చి.. తో సేసి నడుస్తున్న రైలు నుంచి దుండగుడు దూకేశాడు.

    ఈ ఉదంతంపై ప్రయాణికులు వాసిలో రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన చర్యలు తీసుకుంటే తప్ప రైలును ముం దుకు తీసుకెళ్లవద్దంటూ నిరసన తెలిపారు. దీంతో అక్కడి రైల్వే ఏఎస్పీ పలాష్ రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి సూరత్ వరకు ప్రయాణిస్తూ బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.  ఈయన దిగిపోయిన తర్వాత తమ తమ గ మ్యస్థానాల్లో మరో ముగ్గురు ప్రయాణికులు దిగారు. ఆ సమయంలో వారి సామాన్లు కూడా కనిపించకపోవడంతో ఆనంద్, సూరత్‌ల్లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.
     
     రైల్వే పోలీసుల నిర్లక్ష్యం వల్లే చోరీ: విజయలక్ష్మి
     ‘ఈ ఉదంతం కచ్చితంగా రైల్వే అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీలు, దోపిడీ ఘటనలు గతంలోనూ ఎన్నో జరిగాయి.  అయినా ఈ రైలుకు అధికారు లు సరైన భద్రత కల్పించడంలేదు. మేము ప్రయాణిస్తున్న ఏసీ కోచ్ అద్దం గతంలోనే పగిలిపోయి, నేరగాళ్లకు అనుకూలంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. రాజ్‌కోట్‌లో వాడి నుంచి షోలాపూర్ వరకు మాత్రమే పోలీసుల భద్రత కల్పిం చారు. ఆ తర్వాత రైలులోకి మరో బృందం ఎ క్కాల్సి ఉన్నా... ఒక్క గార్డుకు కూడా రాలేదు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ చోరీ జరిగింది.’
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement