ఢిల్లీలో రూ.12 కోట్ల ఆభరణాల చోరీ | Delhi: On Diwali night, jewellery worth Rs 12 crore stolen from two units in Karol Bagh | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో రూ.12 కోట్ల ఆభరణాల చోరీ

Published Tue, Oct 24 2017 2:54 AM | Last Updated on Tue, Oct 24 2017 3:51 AM

Delhi: On Diwali night, jewellery worth Rs 12 crore stolen from two units in Karol Bagh

న్యూఢిల్లీ: ఢిల్లీలో దొంగలు భారీ చోరీకి తెగబడ్డారు. నగరమంతా దీపావళి సంబరాల్లో ఉండగా దుండగులు నగల తయారీ యూనిట్లలో చొరబడి చేతివాటం ప్రదర్శించారు. రూ.12 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. సెంట్రల్‌ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఈ చోరీ జరిగింది. కరోల్‌బాగ్‌లోని ఓ భవనంలో రెండు నగల తయారీ యూనిట్లు ఉన్నాయి.

వీటిపై కన్నేసిన దొంగలు ఈ నెల 19వ తేదీ రాత్రి వచ్చి గ్యాస్‌ కట్టర్‌తో తాళాలను తెరిచారు. ఒక యూనిట్‌లో రూ.6.80 కోట్ల విలువైన నగలు, మరోదానిలో రూ.5.20 కోట్ల విలువైన నగలను చోరీ చేశారు. ఈ తతంగమంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. మరునాడు యజమానులు వచ్చి చూసేసరికి దొంగతనం విషయం బయట పడిం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement