ఖమ్మం: ఖమ్మం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి పాల్వంచలోని కేటీపీఎస్ జెన్‌కో కాలనీలో 10 ఇళ్లలో దొంగలు భారీగా దోచుకున్నారు. ఈ చోరీలో సుమారు కోటి రూపాయల విలువైన బంగారం, నగదును తస్కరించారు.
శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో కాలనీ వాసులు తమ సొంత గ్రామాలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు కాలనీలో పడి భారీ చోరీ చేసి ఉడాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దొంగల ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.