తాళం వేశారు... అయినా | Massive theft in a locked house | Sakshi
Sakshi News home page

తాళం వేశారు... అయినా

Published Mon, Mar 20 2017 9:04 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

Massive theft in a locked house

కామారెడ్డి: కామారెడ్డి రూరల్‌ మండలం దేవన్‌పల్లిలో పట్టపగలు ఓ తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంట్లో దాచిన 15 తులాల బంగారం, రూ.1.8 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని గంగా భూషణం ఐటీఐ కాలేజీ వైస్‌ ప్రిన్సిపల్‌. ఆయన భార్య జయశ్రీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌. ఇద్దరూ డ్యూటీ నిమిత్తం ఇంటికి 11 గంటలకు తాళం వేసి బయటకు వెళ్లారు. పన్నెండున్నర సమయంలో గంగా భూషణం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. చోరీ జరిగిన విషయం గమనించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement