
సాక్షి, పెద్దపల్లి జిల్లా: మంథని మండలం గుంజపడుగు ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. 18 లక్షల 46 వేల నగదు, 6 కిలోల బంగారాన్ని దుండగులు అపహరించారు. గ్యాస్ కట్టర్‌తో స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేసి చోరీకి తెగబడ్డారు. ఫింగర్ ప్రింట్ ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరా డీవీఆర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. పకడ్బందీగా అలారం మ్రోగకుండా బ్యాటరీల కనెక్షన్ తొలగించి, బ్యాటరీలను సైతం దుండగులు ఎత్తుకెళ్లారు.
సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఘటన వివరాలను వెల్లడించారు. దొంగలను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హైలీ ప్రొఫెషనల్ దొంగలు చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు. త్వరలోనే చోరీకి పాల్పడ్డ వారిని పట్టుకుంటామని సీపీ తెలిపారు.
చదవండి:
నిర్మాత ఇంట్లో డ్రగ్స్.. అరెస్టు
విషాదం...ఆటోలో నటుడి మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment