భారత్‌లో బెస్ట్ బ్యాంక్‌గా ఎస్‌బీఐ | SBI Honoured as The Best Bank in India For 2024 | Sakshi
Sakshi News home page

భారత్‌లో బెస్ట్ బ్యాంక్‌గా ఎస్‌బీఐ

Published Sun, Oct 27 2024 3:44 PM | Last Updated on Sun, Oct 27 2024 5:58 PM

SBI Honoured as The Best Bank in India For 2024

ప్రభుత్వ రంగ బ్యాంక్ 'ఎస్‌బీఐ' (SBI) 'భారతదేశంలో అత్యుత్తమ బ్యాంక్'గా గుర్తింపు పొందింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 'బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా'గా ఎంపిక చేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ సమావేశంలో భాగంగా.. వాషింగ్టన్ డీసీలో జరిగిన 31వ యానివెర్సరీ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్‌ ప్రధానోత్సవం జరిగింది. ఈ సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్.. సీఎస్ సెట్టి ఈ అవార్డును స్వీకరించారు.

22,500 పైగా శాఖలు.. 62,000 కంటే ఎక్కువ ఏటీఎంలతో విస్తృత నెట్‌వర్క్‌ కలిగి ఉన్న ఎస్‌బీఐ.. యోనో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా భారతీయ బ్యాంకింగ్ రంగంలో తన వృద్ధిని బలోపేతం చేస్తోంది. 2024-25 మొదటి త్రైమాసికంలో 63 శాతం సేవింగ్స్ ఖాతాలు డిజిటల్‌ విధానంలో ఓపెన్ అయ్యాయి. అంతే కాకుండా యోనో ద్వారా మొత్తం రూ. 1,399 కోట్ల వ్యక్తిగత రుణాల చెల్లింపులు జరిగినట్లు సమాచారం.

ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలు

భారతదేశంలో చాలామంది.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎస్‌బీఐ బ్యాంకులో ఖాతాలో ఓపెన్ చేయడానికి లేదా లావాదేవీలను జరపడానికి ఆసక్తి చూపుతారు. ఎస్‌బీఐ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువవుతూనే ఉంది. ఇలా మొత్తం మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. భారతదేశంలో అత్యుత్తమ బ్యాంకుగా అవతరించింది. ఈ కొత్త అవార్డు సాధించినందుకు స్టమర్‌లకు, ఉద్యోగులకు, ఇతర వాటాదారులందరికీ ఎస్‌బీఐ ధన్యవాదాలు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement