ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీలపై 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఎస్‌బీఐ (SBI) వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రేట్లు అక్టోబర్ 15, 2022 నుంచి అమలులోకి వస్తాయి. వీటితో పాటు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అన్ని కాలాలకు సంబంధించిన వడ్డీ రేట్లను కూడా పెంచింది.
దీంతో ఇకపై కస్టమర్లు 3శాతం నుంచి 5.85 శాతం మధ్య వడ్డీ రేట్లను పొందవచ్చు. అంతేకాకుండా, సీనియర్ సిటిజన్లు సాధారణ వడ్డీ రేటుపై అదనపు వడ్డీని పొందుతారు. బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్-రేట్ డిపాజిట్లపై (FDలు) వడ్డీ రేట్ల ఇలా ఉన్నాయి. సామాన్య ప్రజలకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5శాతం ఉంది. 46 నుంచి 179 రోజుల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న FDలు ఇకపై.. 4 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం ఇవ్వనుంది.
మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 5.60% నుంచి 5.80%, సీనియర్ సిటిజన్లకు 6.10% నుంచి 6.30%కి పెంచింది. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న రుణాల వడ్డీ రేటును 5.65 శాతం నుంచి 5.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం నుంచి 6.65 శాతానికి బ్యాంక్ పెంచింది.
చదవండి: ఐఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్!
Comments
Please login to add a commentAdd a comment