ఏసీనే సేప్టీ లాకర్గా మార్చుకున్నాయి... | snakes in visakhapatnam sbi branch | Sakshi
Sakshi News home page

ఏసీనే సేప్టీ లాకర్గా మార్చుకున్నాయి...

Published Thu, Mar 19 2015 8:32 AM | Last Updated on Mon, Oct 22 2018 2:22 PM

ఏసీనే సేప్టీ లాకర్గా మార్చుకున్నాయి... - Sakshi

ఏసీనే సేప్టీ లాకర్గా మార్చుకున్నాయి...

విశాఖపట్నం:  బ్యాంకులో అందరూ డబ్బు దాచుకుంటారు. ఇక్కడ పాము కూడా అదే పని చేసింది. దాచుకుంది డబ్బులు కాదండోయ్... తన పిల్లలకి రక్షణగా బ్యాంకులో పుట్టనే నిర్మించుకుంది. విశాఖపట్నంలోని భెల్ సంస్థలో ఉన్న ఎస్బీఐలో చీఫ్ మేనేజర్ కె.శ్రీనివాస్ గదిలోని ఏసీని పాములు సేప్టీ లాకర్గా మార్చుకున్నాయి. ముందుగా మంగళవారం రాత్రి ఏసీ కంప్రెషర్ నుంచి ఒక పాము బయటకు వచ్చింది.

భయాందోళనతో సిబ్బంది స్నేక్ సేవర్ సొసైటీ సభ్యుడు కిరణ్ కుమార్ సహాయంతో దానికి పట్టుకుని ఊరి బయటకు  వదిలేశారు. బుధవారం కూడా ఏసీ నుంచి మరో మూడు పాములు బయటకు వచ్చాయి. దీంతో కిరణ్ కుమార్ వచ్చి ఏసీ కంప్రెషర్ను తొలగించగా మొత్తం 10 పాములు కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు.  అన్ని పాములు ఒక్కసారిగా కనిపించటంతో బ్యాంక్ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. వాటిని పట్టుకుని జనావాసాలకు దూరంగా వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement