సాక్షి, తూర్పుగోదావరి: ‘కాపు నేస్తం’ పథకం ద్వారాం ఒంటరి మహిళలకు మేలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందచేసే సాయంతో ఇప్పటివరకు (నాలుగేళ్లలో) ఈ పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయం అదించినట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నిడదవోలులో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మీ ప్రేమాభిమానాలకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన
అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. పేద కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యమని అన్నారు. నాలుగు లక్షల మంది కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధిపొందినట్లు తెలిపారు. లంచాలకు అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు.
కేబినెట్‌లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత
గతంలో ఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేయలేదని సీఎం చెప్పారు. కులం, మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామ్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.30 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించామని చెప్పారు. నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. కేబినెట్‌లో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం జగన్.. ఇది ప్రజలందరీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ కాపు సామాజిక వర్గానికి ప్రధాన్యత కల్పించామన్నారు.
చదవండి: పొత్తులో సీటు ఫట్!.. జనసేన, టీడీపీ నేతల్లో ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment