
తణుకులో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్
తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అక్కతోపాటు పాఠశాలకు వెళుతున్న ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. హోండా యాక్టివా మీద వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి సోమవారం బాలుడిని అపహరించాడు. బాలుడి అక్క దుండగుడిని ప్రతిఘటించినా... ఆ చిన్నారిని తోసేసి.. ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. కిడ్నాప్ దృశ్యాలను సీసీటీవీ కెమెరా బంధించింది.
ఈ దృశ్యాల ఆధారంగా కిడ్నాపర్ ను గుర్తించి.. బాలుడిని చెర విడిపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కిడ్నాప్ కు గురయిన ఐదేళ్ల బాలుడి పేరు హేమంత్ అని, కంటికిరెప్పలా చూసుకునే తమ చిన్నారిని విడిచిపెట్టాలని అతని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.