
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు నగరంలో టీడీపీకి షాక్ తగిలింది. ఏలూరు మేయర్ నూర్జహాన్ వర్గానికి చెందిన నలుగురు టీడీపీ కార్పొరేటర్లు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏలూరు కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ మరియు కార్పొరేటర్ గుడివాడ రామచంద్ర కిషోర్, ఏలూరు కార్పొరేషన్.. కార్పొరేటర్లు జిజ్జువరపు ప్రతాప్, రేవులగడ్డ జాన్సిలక్ష్మిభాయ్, గాడి నాగమణిలు ఏలూరు మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఆళ్ల నాని వారిని వైఎస్సార్ సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఐదు సంవత్సరాల మేయర్ పదవీ కాలంలో పార్టీల కతీతంగా ఎంతో సేవ చేశాం. తెలుగుదేశం పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యాం. రాష్ట్ర ప్రజలు, ఏలూరు ప్రజలు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఐదేళ్లలో వచ్చిన మా జీతాన్ని సైతం పేద ప్రజల సంక్షేమంకోసం వెచ్చిచాం. ఐదేళ్ల పదవీకాలంలో ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పకుండా నిజాయితీగా పనిచేశాం. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర మాకు స్ఫూర్తి. వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం. మాతో పాటు ఏలూరు కార్పొరేషన్ నలుగురు కార్పొరేటర్లు నాని సమక్షంలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలుపుకుని ఆళ్ల నాని గెలుపుకు కలిసి పనిచేస్తాం’’మని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment