Alla Nani Fires On Pawan Kalyan And Chandrababu - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై బురద చల్లేందుకే పవన్‌ యాత్ర: ఆళ్ల నాని

Published Tue, Jun 27 2023 6:06 PM | Last Updated on Tue, Jun 27 2023 6:38 PM

Alla Nani Fires On Pawan Kalyan And Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: పవన్‌ భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, సీఎం జగన్‌పై బురద చల్లేందుకే పవన్‌ యాత్ర అంటూ మాజీ మంత్రి ఆళ్ల నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి మాకు అధికారం ఇస్తే పలానా మేలు చేస్తామని చెప్పుకుంటారు. కానీ పవన్ మాత్రం సీఎం జగన్‌ను దూషించటానికే యాత్ర చేస్తున్నారు’’ అని ఆళ్ల నాని మండిపడ్డారు.

‘‘చంద్రబాబుని ఎలాగైనా సీఎం చేయాలనే ఉద్దేశంతో పవన్‌ పని చేస్తున్నారు. ఎన్నిరకాలుగా మమ్మల్ని దూషిస్తున్నా మేము సహనంతో ఉన్నాం. అంతేతప్ప చేతగానితనం కాదు. మా నాయకులేనే కాదు.. ప్రజలను కూడా దూషిస్తున్నారు. గత ఎన్నికలలో తనను ఓడించారనే అక్కసుతో మాట్లాడుతున్నారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో అలజడి సృష్టిస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాయలసీమ గూండాలు అంటూ ప్రాంతాల మధ్య గొడవలు పెడుతున్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ అనేదే లేదన్న సంగతి రాష్ట్రమంతటా తెలుసు. కానీ తన స్వార్దం కోసం కులాలు, ప్రాంతాలను వాడుకుంటున్నారు’’ అంటూ ఆళ్ల నాని నిప్పులు చెరిగారు.

‘‘అంతర్వేదిలో రథం దగ్ధమైతే సీబిఐ విచారణకు జగన్ ఆదేశించారు. అంతేకాదు కొత్త రథాన్ని తయారు చేయించి ఆయనే స్వయంగా ప్రారంభించారు. టీడీపీ హయాంలో ధ్వంసం చేసిన ఆలయాలను జగన్ పునఃనిర్మించారు. అంతర్వేది రథం టీడీపీ హయాంలో దగ్ధం అయితే దాన్ని నిస్సిగ్గుగా జగన్ మీద వేసేవాడు. కానీ మేము ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ మీద వేయలేదు. వారాహి యాత్రని ఇలాగే కుట్రలతో కొనసాగితే మీకు గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా జనం గెలవనీయరు’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘ఒకోసారి ఒక్కడినైనా గెలిపించండి అంటాడు. ఇంకోసారి జగన్‌ను దించటమే లక్ష్యం అంటాడు. ఆ మర్నాడే తానే సీఎంని అంటాడు. ఇలాంటి నిలకడలేని మాటలు పవన్ కళ్యాణ్ కే సాధ్యం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లది ఒకే గొంతు, ఒకే నాలుక. ఇద్దరూ కూడబలుక్కునే ఒక ప్రణాళిక ప్రకారం మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ అనేది కేవలం ఉభయగోదారి జిల్లాకే పరిమితమా?. మిగతా రాష్ట్రంతో పనిలేదా?. వైసీపీ ఓట్లు చీల్చటానికి పవన్, చంద్రబాబు గోదావరి జిల్లాలో ఎన్ని కుట్రలు చేసినా జగన్ గెలుపును ఆపలేరు’’ అని ఆళ్ల నాని స్పష్టం చేశారు.
చదవండి: నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్‌ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం..

‘‘పోలవరం ప్రాజెక్టు పురోగతి లేదని పవన్ ఎలా మాట్లాడతారు?. అసలు పోలవరమే కాదు, ఏ విషయం గురించి మీకు పూర్తిగా తెలుసు?. ఏదైనా అధ్యయనం చేసి పవన్ మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు హయాంలో ఆగిపోయిన పోలవరాన్ని జగన్ పరుగులు పెట్టిస్తున్నారు. గాంధీ సిద్దాంతాలను అవమానించేలా పవన్ మాట్లాడతారు. పవన్ తన తీరు మార్చకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారు’’ అని ఆయన పేర్కొన్నారు.

అన్నదమ్ముల్లాగా గోదావరి జిల్లాలో ప్రజలు ఉన్నారు. కానీ వారి మధ్య చిచ్చు పెట్టి, ఓట్లను చీల్చాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నారు. పవన్ మీద రెక్కీ నిర్వహించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. సానుభూతి కోసమే ఇలాంటి మాటలు మాట్లాడున్నారు.పవన్ ఇలాంటి యాత్రలు ఎన్ని చేసినా జగన్ని ఆపలేరు. గతంలో కూడా జగన్‌ని సీఎంని కానివ్వను అన్నారు ఏమైందో జనం చూశారు. ఈసారి కూడా అలాగే జరుగుతుంది ఇది ఖాయం’’ అని ఆళ్ల నాని చెప్పారు.
చదవండి: ఏపీలో వింతరాజకీయం.. పొత్తుల్లేని చెట్టాపట్టాల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement