
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిందని.. సీఎం జగన్ జనరంజక పాలనకు నిదర్శనమే ఈ విజయం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు.
సాక్షి, ఏలూరు: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిందని.. సీఎం జగన్ జనరంజక పాలనకు నిదర్శనమే ఈ విజయం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల్లో కూడా చంద్రబాబు శవరాజకీయాలు చేశారని.. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు.
విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ సంక్షేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడితే భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా టీడీపీకి ఇవే ఫలితాలు వస్తాయని ఆళ్ల నాని అన్నారు.