Eluru Corporation
-
ఏలూరు మేయర్‌గా నూర్జహాన్
-
రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్సీపీది అపూర్వ చరిత్ర: సజ్జల
సాక్షి, అమరావతి: జనరంజక పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏలూరు కార్పొరేషన్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. 12 కార్పొరేషన్లను వైఎస్సార్సీపీ దక్కించుకుందన్నారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్సీపీది అపూర్వ చరిత్ర అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏలూరులో జనమంతా ఒకేమాటగా వైఎస్సార్సీకి ఓటేశారు. ఏలూరులో వైఎస్సార్సీపీకి 56.3 శాతం మంది ఓటేశారు. టీడీపీ ఏలూరులో 28.2 శాతానికే పరిమితమైంది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లోనూ ఇవే ఫలితాలు కనిపిస్తాయని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
‘సీఎం జగన్ జనరంజక పాలనకు నిదర్శనమే ఈ విజయం’
సాక్షి, ఏలూరు: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని.. సీఎం జగన్ జనరంజక పాలనకు నిదర్శనమే ఈ విజయం అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల్లో కూడా చంద్రబాబు శవరాజకీయాలు చేశారని.. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ సంక్షేమాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడితే భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా టీడీపీకి ఇవే ఫలితాలు వస్తాయని ఆళ్ల నాని అన్నారు. -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు జై కొట్టారు. భారీ మెజార్టీతో ఏలూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లకు 47 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగరవేసింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఒక్క స్థానం కూడా జనసేన, బీజేపీ గెలవలేక పోయాయి. ఓట్ల లెక్కింపు మొదలైననప్పటి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకుపోయారు. ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్ల ఉండగా, అందులో మూడు డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగతా 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 171 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ►1వ డివిజన్ ఎ.రాధిక (YSRCP) విజయం ►2వ డివిజన్ జె.నరసింహారావు (YSRCP) గెలుపు 788 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం ►3వ డివిజన్ బి.అఖిల (YSRCP) విజయం ►4వ డివిజన్ డింపుల్ (YSRCP) విజయం 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు ►5వ డివిజన్ జయకర్ (YSRCP) విజయం 865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం ►6వ డివిజన్ చంద్రశేఖర్ (YSRCP) విజయం 1753 ఓట్ల మెజార్టీతో చంద్రశేఖర్ విజయం ►7వ డివిజన్ పి.శ్రీదేవి (YSRCP) విజయం 822 ఓట్ల మెజారిటీతో పి.శ్రీదేవి గెలుపు ►8వ డివిజన్ వి.ప్రవీణ్ (YSRCP) విజయం 28 ఓట్ల మెజారిటీతో వి.ప్రవీణ్ గెలుపు ►9వ డివిజన్ జి.శ్రీనివాస్ (YSRCP) విజయం 534 ఓట్ల మెజారిటీతో జి.శ్రీనివాస్ గెలుపు ►10వ డివిజన్ పైడి భీమేశ్వరరావు (YSRCP) గెలుపు ►812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం ►11వ డివిజన్ కోయ జయగంగ (YSRCP) గెలుపు ►377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం ►12వ డివిజన్ కర్రి శ్రీను (YSRCP) గెలుపు 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం ►13వ డివిజన్ అన్నపూర్ణ (YSRCP) విజయం 13339 ఓట్ల మెజార్టీతో అన్నపూర్ణ విజయం ►14వ డివిజన్ అనూష (YSRCP) విజయం 711 ఓట్ల మెజార్టీతో అనూష విజయం ►15వ డివిజన్ రామ్మోహన్రావు (YSRCP) విజయం 83 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్రావు విజయం ►17వ డివిజన్ టి.పద్మ (YSRCP) విజయం 755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు ►18వ డివిజన్ కేదారేశ్వరి (YSRCP) విజయం 1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు ►19వ డివిజన్ వై.నాగబాబు (YSRCP) విజయం 1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం ►20వ డివిజన్ ఆదిలక్ష్మి (YSRCP) విజయం 4,320 ఓట్ల మెజార్టీతో ఆదిలక్ష్మి విజయం ►21వ డివిజన్ ఎ.భారతి (YSRCP) విజయం 835 ఓట్ల మెజార్టీతో ఎ.భారతి గెలుపు ►22వ డివిజన్ సుధీర్‌బాబు (YSRCP) గెలుపు 468 ఓట్ల మెజార్టీతో సుధీర్‌బాబు విజయం ►23వ డివిజన్ కె.సాంబశివరావు (YSRCP) విజయం 1828 ఓట్ల మెజార్టీతో కె.సాంబశివరావు గెలుపు ►24వ డివిజన్ మాధురి నిర్మల (YSRCP) గెలుపు 853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం ►25వ డివిజన్ గుడిపూడి శ్రీను (YSRCP) గెలుపు 744 ఓట్ల మెజార్టీతో గుడిపాడి శ్రీను విజయం ►26వ డివిజన్ అద్దంకి హరిబాబు (YSRCP) గెలుపు 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం ►27వ డివిజన్ బి.విజయ్ కుమార్ (YSRCP) గెలుపు 687 ఓట్ల మెజార్టీతో బి.విజయ్ కుమార్ విజయం ►29వ డివిజన్ పి.భవానీ (YSRCP) గెలుపు 1267 ఓట్ల మెజార్టీతో పి.భవానీ విజయం ►30వ డివిజన్ పి.ఉమా మహేశ్వరరావు (YSRCP) గెలుపు 38 ఓట్ల మెజార్టీతో పి.ఉమా మహేశ్వరరావు విజయం ►31వ డివిజన్ లక్ష్మణ్ (YSRCP) విజయం 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు ►32వ డివిజన్ సునీత రత్నకుమారి (YSRCP) గెలుపు ►33వ డివిజన్ రామ్మోహన్రావు (YSRCP) విజయం 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్రావు గెలుపు ►34వ డివిజన్ వై.సుమన్ (YSRCP) విజయం 684 ఓట్ల మెజార్టీతో వై.సుమన్ గెలుపు ►35వ డివిజన్ జి.శ్రీనివాస్ (YSRCP) విజయం 724 ఓట్ల మెజార్టీతో జి.శ్రీనివాస్ గెలుపు ►36వ డివిజన్ హేమ సుందర్ (YSRCP) విజయం 724 ఓట్ల మెజార్టీతో జి.శ్రీనివాస్ గెలుపు ►38వ డివిజన్ హేమా మాధురి (YSRCP) విజయం 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు ►39వ డివిజన్ కె.జ్యోతి (YSRCP) గెలుపు 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం ►40వ డివిజన్ టి.నాగలక్ష్మి (YSRCP) గెలుపు 758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం ►41వ డివిజన్ కల్యాణి దేవి (YSRCP) విజయం 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం ►42వ డివిజన్ ఎ.సత్యవతి (YSRCP) గెలుపు 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం ►43వ డివిజన్ జె.రాజేశ్వరి (YSRCP) గెలుపు 968 ఓట్ల మెజార్టీతో జె.రాజేశ్వరి విజయం ►44వ డివిజన్ పి.రామదాస్ (YSRCP) గెలుపు 410 ఓట్ల మెజార్టీతో పి.రామదాస్ విజయం ►45వ డివిజన్ ముఖర్జీ (YSRCP) గెలుపు 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం ►46వ డివిజన్ ప్యారీ బేగం (YSRCP) విజయం 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు ►47వ డివిజన్ (YSRCP) విజయం ►48వ డివిజన్ స్వాతి శ్రీదేవి (YSRCP) విజయం 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు ►49వ డివిజన్ డి.శ్రీనివాసరావు (YSRCP) గెలుపు 1271 ఓట్ల మెజార్టీతో డి.శ్రీనివాసరావు విజయం ►50వ డివిజన్ షేక్ నూర్జహాన్ (YSRCP) విజయం 1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు -
ఏలూరు కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం
-
ఏలూరు కార్పొరేషన్ వైఎస్సార్సీపీ కైవసం
లైవ్ అప్డేట్స్ వైఎస్సార్సీపీ ప్రభంజనం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఏలూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఏలూరు మేయర్ పీఠం వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 50 డివిజన్ల ఫలితాలు వెల్లడికాగా, 47 డివిజన్లలో వైఎస్సార్సీపీ గెలుపు సాధించింది. కేవలం 3 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ► 1వ డివిజన్ ఎ.రాధిక (వైఎస్సార్సీపీ) విజయం ►2వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నరసింహారావు గెలుపు, 787 ఓట్ల మెజార్టీతో జె.నరసింహారావు విజయం. ► 3వ డివిజన్ బి.అఖిల (వైఎస్సార్సీపీ) విజయం ► 4వ డివిజన్ డింపుల్ (వైఎస్సార్సీపీ) విజయం, 744 ఓట్ల మెజార్టీతో డింపుల్ గెలుపు ► 5వ డివిజన్ జయకర్ (వైఎస్సార్సీపీ) విజయం, 865 ఓట్ల మెజార్టీతో జయకర్ విజయం ► 10వ డివిజన్ పైడి భీమేశ్వరరావు (వైఎస్సార్సీపీ) గెలుపు, 812 ఓట్ల మెజార్టీతో పైడి భీమేశ్వరరావు విజయం ► 11వ డివిజన్ కోయ జయగంగ (వైఎస్సార్సీపీ) గెలుపు, 377 ఓట్ల మెజార్టీతో కోయ జయగంగ విజయం ► 12వ డివిజన్ కర్రి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు, 468 ఓట్ల మెజార్టీతో కర్రి శ్రీను విజయం ► 17వ డివిజన్ టి.పద్మ (వైఎస్సార్సీపీ) విజయం, 755 ఓట్ల మెజార్టీతో టి.పద్మ గెలుపు ► 18వ డివిజన్ కేదారేశ్వరి (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో కేదారేశ్వరి గెలుపు ► 19వ డివిజన్ వై.నాగబాబు (వెస్సార్సీపీ) విజయం, 1012 ఓట్ల మెజార్టీతో వై.నాగబాబు విజయం ► 22వ డివిజన్ సుధీర్‌బాబు (వైఎస్సార్సీపీ) గెలుపు ► 23వ డివిజన్ కె.సాంబ (వైఎస్సార్సీపీ) విజయం, 1823 ఓట్ల మెజార్టీతో కె.సాంబ గెలుపు ► 24వ డివిజన్ మాధురి నిర్మల (వైఎస్సార్సీపీ) గెలుపు, 853 ఓట్ల మెజార్టీతో మాధురి నిర్మల విజయం ► 25వ డివిజన్ గుడుపూడి శ్రీను (వైఎస్సార్సీపీ) గెలుపు ►26వ డివిజన్ అద్దంకి హరిబాబు(వైఎస్సార్సీపీ) గెలుపు, 1,111 ఓట్ల మెజార్టీతో అద్దంకి హరిబాబు విజయం ► 31వ డివిజన్ లక్ష్మణ్ (వైఎస్సార్సీపీ) విజయం, 471 ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గెలుపు ► 32వ డివిజన్ సునీత రత్నకుమారి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 33వ డివిజన్ రామ్మోహన్రావు (వైఎస్సార్సీపీ) విజయం, 88 ఓట్ల మెజార్టీతో రామ్మోహన్రావు గెలుపు ►36వ డివిజన్ హేమ సుందర్ (వైఎస్సార్సీపీ) విజయం ►38వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 261 ఓట్ల మెజార్టీతో హేమా మాధురి గెలుపు ►39వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 799 ఓట్ల మెజార్టీతో కె.జ్యోతి విజయం ►40వ డివిజన్ టి.నాగలక్ష్మి (వైఎస్సార్సీపీ) గెలుపు, 758 ఓట్ల మెజార్టీతో టి.నాగలక్ష్మి విజయం ► 41వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి కల్యాణి విజయం, 547 ఓట్ల మెజార్టీతో కల్యాణి దేవి విజయం ► 42వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి విజయం, 79 ఓట్ల మెజార్టీతో ఎ.సత్యవతి విజయం ► 43వ డివిజన్ జె.రాజేశ్వరి (వైఎస్సార్సీపీ) గెలుపు ► 45వ డివిజన్ ముఖర్జీ (వైఎస్సార్సీపీ) గెలుపు, 1058 ఓట్ల మెజార్టీతో ముఖర్జీ విజయం ► 46వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి ప్యారీ బేగం విజయం, 1,232 ఓట్ల మెజార్టీతో ప్యారీ బేగం గెలుపు ► 48వ డివిజన్ స్వాతి శ్రీదేవి (వైఎస్సార్సీపీ) విజయం, 483 ఓట్ల మెజార్టీతో స్వాతి శ్రీదేవి గెలుపు ►50వ డివిజన్ షేక్ నూర్జహాన్ (వైఎస్సార్సీపీ) విజయం, 1495 ఓట్ల మెజార్టీతో షేక్ నూర్జహాన్ గెలుపు ► 26 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ► 50వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి షేక్ నూర్జహాన్ ఆధిక్యం ►ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా ►20 డివిజన్లలో వైఎస్సార్సీపీ ముందంజ ►41వ డివిజన్లో వైఎస్సార్‌సీపీఅభ్యర్ధి కల్యాణి విజయం ► 8వ డివిజన్లో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► 2,10, 31, 33, 36, 39, 45, 46, 47 డివిజన్లలో ఫైనల్ కౌంటింగ్ కొనసాగుతోంది. ► ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ► 50 పోస్టల్ బ్యాలెట్లలో పోలైన ఓట్లు 15, ► వైఎస్సార్సీపీ- 11, చెల్లనవి- 2, నోటా-1, టీడీపీ-1 ► ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ► తొలుత 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్లింపు అనంతరం డివిజన్ల వారీగా ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి ప్రతీ రౌండ్లో1000 ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి 25 ఓట్లని బండిల్‌గా కట్టి 40 బండిల్స్‌గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. ► ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైంది. సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్‌పై ఒకే రౌండ్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తై తుది ఫలితాలు వెల్లడికాన్నాయి. నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్ వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీతో పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ టెస్టులు, మాస్క్, ఫేస్ షీల్డ్ లేనిదే కౌంటింగ్ హాలులోకి అనుమతి నిరాకరిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. కాగా, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 50 డివిజన్లలో ఇప్పటికే మూడు డివిజన్లు వైఎస్సార్సీపీకి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు నేడు వెల్లడి కానున్నాయి. -
నేడు ‘ఏలూరు కార్పొరేషన్’ ఫలితాలు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు డివిజన్లు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మరో 47 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా.. వీటికి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో 47 టేబుళ్లపై ఏకకాలంలో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 47 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, మరో 254 మంది సిబ్బందితోపాటు, అదనంగా 200 మంది ఏలూరు కార్పొరేషన్ సిబ్బంది ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారని నగర కమిషనర్ డి.చంద్రశేఖర్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు జరిగే సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం సందర్శించారు. కౌంటింగ్ హాళ్లను, టేబుళ్ల అమరికను పరిశీలించారు. అనంతరం అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆమెకు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ విధించామని, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. మొత్తం 175 మంది పోలీసులను నియమించామన్నారు. -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు లైన్‌క్లియర్
-
ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా
-
‘ఏలూరు’ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, కానీ..
-
‘ఏలూరు’ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, కానీ..
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు జరిపి ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 23కి వాయిదా వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై సోమవారం హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ విషయం తెలిసిందే. కాగా, ఆ స్టేను ఎత్తివేస్తూ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చదవండి: తుది ఓటర్ల జాబితాలో అనేక తప్పులున్నాయన్న హైకోర్టు -
తూతూ మంత్రం
ముగిసిన రెండో విడత జన్మభూమి ప్రజాప్రతినిధుల హాజరు అంతంత మాత్రమే నామినేటెడ్ వరం దక్కక తగ్గిన ‘తమ్ముళ్ల’ హడావిడి ఏలూరు :జిల్లాలో రెండో విడత జన్మభూమి - మా ఊరు సభలు ఆదివారంతో తూతూ మంత్రంగా ముగిశాయి. ఈ నెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు 48 మండలాలు, ఏలూరు కార్పొరేషన్, ఏడు మునిసిపాలిటీలు, ఓ నగర పంచాయతీలోను కలిపి 1197 సభలను నిర్వహించారు. ఈ నెల నాలుగో తేదీన తణుకు మండలం వేల్పూరు గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న విషయం తెలిసిందే. మండలాల్లో అయితే రోజుకు ఐదారు, పురపాలక సంఘాల్లో ఐదు నుంచి 10 వరకు సభలు జరిపారు. తక్కువ వ్యవధిలో పూర్తిచేసిన ఈ సభల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు వినవస్తున్నాయి. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటి వరకు 50 వేలకు పైగా వినతులు వచ్చినట్టు సమాచారం. డ్వాక్రా పెట్టుబడి నిధి కింద రూ.197 కోట్లను మహిళలకు పంపిణీ చేయడమే ప్రధాన ఎజెండాగా జన్మభూమి సభలు సాగాయి. నామినేటేడ్ పదవులు ఇప్పటి వరకు వరించకపోవడంతో తెలుగు తమ్ముళ్లు హడావుడి గ్రామసభల్లో పెద్దగా కనిపించలేదు. ఎమ్మెల్యేలు కూడా రుణాల పంపిణీ, పింఛన్ల మంజూరుకు సంబంధించిన పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేసి వెళ్లిపోయారు. జిల్లాకు చెందిన మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు వారి నియోజకవర్గాల్లోని సభలకే పరిమితం అయ్యారు. ఎంపీలు కూడా తళుక్కుమని మెరిసి వెళ్లిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిన నేపథ్యంలో ఎక్కడ నిలదీత పర్వాలు ఎదురవుతాయోనన్న ఆందోళన ప్రజాప్రతినిధులను వెంటాడినట్టు అనిపించింది. అయితే ఎక్కువగా నిలదీతలు లేకపోవడంతో రెండో విడత జన్మభూమిని ముగించి ప్రజాప్రతినిధులు గట్టెక్కారు. జన్మభూమి సభల నిర్వహణకు రూ.కోటి సొమ్ము కరిగిపోవడం తప్ప ఓవరాల్‌గా పల్లెలు, పట్టణాల్లో పూర్తి స్థాయిలో సమస్యలను చర్చించే సమయం ఎవరికీ చిక్కలేదు. చివరిరోజు ఆదివారం ఆచంట, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోని సభలకు హాజరయిన జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధు చెక్కులను పంపిణీ చేశారు. అయితే ‘జన్మభూమి అంటే పథకాల పంపిణీ కోసం కాదని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే’నని చెప్పడం కొసమెరుపు. -
ఇదేమి దా‘రుణం’
ఏలూరు :జిల్లా పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు రుణం అందని ద్రాక్షలా ఊరిస్తోంది. వీరికి రుణం అందించే అంశంపై ఎవరూ పట్టించుకోకపోవడంతో కనీసం 35 శాతం కూడా లక్ష్యానికి బ్యాంకర్లు చేరువ కాలేదు. 2014 ఏప్రిల్ నాటికే రుణం అందజేతకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి ఉండగా, అక్టోబర్ నెలలో ఈ తంతు చేపట్టారు. దీంతో రుణం అందరికీ అందటం గగనంగా మారింది. ఏలూరు కార్పొరేషన్‌తో పాటు ఏడు పురపాలక సంఘాలు, ఓ నగర పంచాయతీలో కలిపి దాదాపుగా పదివేల సంఘాలున్నట్టు అంచనా. కాగా ఇందులో కేవలం 2014-15 ఆర్థిక సంవత్సరానికి 3243 సంఘాలకు రూ.95 కోట్లు రుణం అందివ్వాలన్న లక్ష్యం కాగా కేవలం 1093 సంఘాలకు రూ.36.19 కోట్లు బ్యాంకర్లు ఇచ్చారు. ఒక్క పాలకొల్లు మున్సిపాల్టీలో మాత్రం 70 శాతం వరకు రుణం ఇచ్చారు. ఏలూరుతో పాటు మిగిలిన అన్ని సంఘాల్లోను రుణం తూతూ మంత్రంగా ఇచ్చినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుణమాఫీతోనే సంఘాల తంటాలు డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయన్న కారణంగా కొన్ని సంఘాలు గతంలోని రుణాలు తీర్చలేదు. దీనికితోడు బ్యాంకు లింకేజీ రుణం కూడా నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రుణం సకాలంలోచెల్లించిన సంఘాలకు మొదటి విడతగా రూ.75 వేలు, రెండో విడతగా రూ.1.50 లక్షలు, మూడో విడతగా రూ.2.50 లక్షలు సంఘంలోని 10 నుంచి 15 మంది సభ్యులకు ఇవ్వాల్సి ఉండగా ఎక్కడా కూడా రూ.లక్షకు మించి ఇవ్వడం లేదని మహిళా సం ఘాలు పెదవి విరుస్తున్నాయి. కాగా సకాలంలో రుణం చెల్లించినా బ్యాం కర్లు మాత్రం చాలా పట్టణాల్లో మోకాలడ్డుతుండటంతో మహిళలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెప్మా పీడీ పోస్టు ఖాళీ... పర్యవే క్షణ శూన్యం జిల్లాలో పురపాలక సంఘాల్లో రుణాల అందజేతను మున్సిపల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రాజెక్టు డెరైక్టర్ పర్యవేక్షించాలి. కాగా ఈ పోస్టు మూడు నెలల నుంచి ఖాళీగా ఉంది. జిల్లా ముఖ్యప్రణాళిక శాఖ జాయింట్ డెరైక్టర్ కె.సత్యనారాయణ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా జిల్లా స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో అటు బ్యాంకర్లు, ఇటు మునిసిపల్ అధికారులు రుణం జారీ చేసే విషయంలో బ్యాంకర్ల సహకారం అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇది మహిళల ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అధికారులు, బ్యాంకర్లు స్పందిస్తే తమ సమస్య తీరుతుందని పలు మహిళా సంఘాలు అంటున్నాయి. రుణ లక్ష్యం...మంజూరు చేసిన విధం పురపాలక సంఘాల వారీగా ఇలా.. పురపాలక సంఘం ఎస్‌హెచ్‌జీలు లక్ష్యం పొందిన రుణ మొత్తం రూ.కోట్లలో సంఘాలు (రూ.కోట్లలో) ఏలూరు కార్పొరేషన్ 759 19.75 216 8.02 భీమవరం 500 15 158 5.69 జంగారెడ్డిగూడెం 187 8 58 1.58 కొవ్వూరు 199 6.45 76 2.13 నర్సాపురం 268 7.50 95 2.67 నిడదవోలు 199 6.30 97 2.82 పాలకొల్లు 259 8.15 175 6.91 తాడేపల్లిగూడెం 500 14.85 102 3.56 తణుకు 372 9 116 2.77 మొత్తం సంఘాలు 3243 95 1093 36.19 -
పడతులే ప్రధానం
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని మునిసిపాలిటీల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యత. రానున్న మునిసిపల్ ఎన్నికల్లో 145 వార్డులు/డివిజన్లలో అందలం ఎక్కేదీ అతివలే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించటంతో వారికి సమన్యాయం జరగనుంది. జిల్లాలో భీమవరం మినహా ఏలూరు కార్పొరేషన్, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం, తణుకు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 17 వేల 234 మంది అధికంగా ఉన్నారు. గతేడాది జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 442 సర్పంచ్, 4,842 మంది వార్డు సభ్యుల పదవులను మహిళలు అలంకరించారు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.