సాక్షి, అమరావతి: జనరంజక పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏలూరు కార్పొరేషన్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు.
12 కార్పొరేషన్లను వైఎస్సార్‌సీపీ దక్కించుకుందన్నారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్‌సీపీది అపూర్వ చరిత్ర అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏలూరులో జనమంతా ఒకేమాటగా వైఎస్సార్‌సీకి ఓటేశారు. ఏలూరులో వైఎస్సార్‌సీపీకి 56.3 శాతం మంది ఓటేశారు. టీడీపీ ఏలూరులో 28.2 శాతానికే పరిమితమైంది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లోనూ ఇవే ఫలితాలు కనిపిస్తాయని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment