Former Minister Alla Nani Fires On Pawan Kalyan Over His Remarks On Volunteers - Sakshi
Sakshi News home page

Ex Minister Alla Nani: ‘వలంటీర్ల వ్యవస్థపై విషం.. చంద్రబాబు, పవన్‌ కుట్రలను తిప్పికొట్టాలి’

Published Sun, Jul 16 2023 1:24 PM | Last Updated on Sun, Jul 16 2023 3:54 PM

Former Minister Alla Nani Fires On Pawan Kalyan - Sakshi

సాక్షి, ఏలూరు జిల్లా: వలంటీర్ల వ్యవస్థపై కొంతమంది విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొట్టాలన్నారు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు.

వలంటీర్ల వ్యవస్థను కూల్చడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదువుతున్నాడు. వలంటీర్ వ్యవస్థ అధ్యయనం చేయకుండా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల తల్లిదండ్రులు సైతం బాధ పడేలా పవన్‌ నీచంగా మాట్లాడుతున్నారు. మహిళల అక్రమ రవాణాకు, వలంటీర్లకు సంబంధం ఏంటి? అంటూ ఆళ్ల నాని ప్రశ్నించారు.
చదవండి: బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో!

‘‘తణుకు సభలో పవన్  తీరు పరాకాష్టకు చేరింది. ఉన్మాదిలా,అసాంఘిక శక్తిలా మాట్లాడాడు. వలంటీర్ల ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడాడు. మామిడి పళ్ల బుట్టలో రెండు  కుళ్లి పోతే వాటిని తేసి బయట పడేస్తారు.. బుట్ట మొత్తం పారేయరు. పవన్ రెండు నాలుకల ధోరణి ప్రజలు గమనించాలి. పవన్ కల్యాణ్ అసత్య ప్రచారాలు మనుకోవాలి. వలంటీర్ల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని ఆళ్ల నాని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement