Allanani
-
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్
-
రికార్డు స్థాయిలో వాక్సినేషన్ చేస్తున్నాం: ఆళ్ల నాని
సాక్షి, అమరావతి:దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు స్ధాయిలో వ్యాక్సినేషన్ చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.కేవలం నిన్న ఒక్క రోజే వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ద్వారా కొత్త రికార్డు సృష్టించమాని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో వలంటీర్ల వద్ద నుంచి వైద్య సిబ్బంది వరకూ అందరూ చాలా కష్టపడ్డారని వారందరినీ సీఎం వైఎస్ జగన్ వారందరినీ అభినందించారాని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సంఖ్యలో వాక్సినేషన్ చేసేందకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన మీడియా తో తెలిపారు.మన రాష్ట్రంలో కేంద్రం ఎన్ని డోసులు వాక్సిన్ పంపినా వెంటనే వేసేందుకు తగిన సామర్థ్యం ఉందని ,వాలంటీర్ల వ్యవస్థతో పాటు వైద్య సిబ్బంది అంతా మనకు బలాన్ని చేకూర్చారని ఆయన ఆభిప్రాయడ్డారు.ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న అందరికీ తన తరపున ధన్యవాదాలు తెలిపారు. చదవండి:జగనన్న కాలనీలో గృహప్రవేశం -
వైద్యరంగాన్ని బలోపేతం చేస్తోన్న ఏపీ ప్రభుత్వం
-
కోవిడ్ బాధితులతో ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్
-
రాష్ట్రంలో 16 కొత్త మెడికల్ కాలేజ్లు
-
దాడులకు పాల్పడితే కఠినచర్యలు: ఆళ్ల నాని
సాక్షి, ఏలూరు: ప్రేమోన్మాది పాశవిక దాడిలో గాయపడి.. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తేజస్వినిని శనివారం డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..విద్యార్థినిపై దాడి ఘటన దురదృష్టకరమని..తేజశ్విని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన ప్రేమోన్మాదిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. తేజస్వినికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను డిప్యూటీ సీఎం కోరారు. భవిష్యత్లో విద్యార్థినికి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా ఇటువంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని.. కఠినంగా వ్యవహరిస్తామని ఆళ్ల నాని హెచ్చరించారు. -
ఏలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా ఆళ్ల నాని నామినేషన్
-
‘వైఎస్సార్ పాలనలో ప్రజలు ధైర్యంగా ఉన్నారు’
సాక్షి, పశ్చిమ గోదావరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కొల్లేరు ప్రాంతాల ప్రజలు ధైర్యంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ నేతలు ఆళ్ల నాని, కోటగిరి శ్రీధర్, కొఠారు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం కొల్లేరు నేతల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొల్లేరు గ్రామంలో మంచి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. కొల్లేరు డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కొల్లేరు అంటే ఆదాయ వనరులుగా, ఆ ప్రాంత భూములను ఎలాగ కాజేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ కొల్లేరుకు పూర్వవైభవం రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. కొల్లేరు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని చెప్పారు. -
వైసీపీ దూకుడు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే వ్యూహాలకు పదును పెడుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ హడావుడి చేస్తున్నా వార్డులు, డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు తేలిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కనీసం 20 శాతం వార్డుల్లో కూడా అభ్యర్థులను పోటీకి దింపలేక చేతులెత్తేసింది. జిల్లా కేంద్రమైన ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని వ్యూహాత్మకంగా ముందుకువెళుతూ అన్నీ తానై నడిపిస్తున్నారు. డివిజన్లలో విసృ్తతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రచారంలో వెనుకబడింది. ఆ పార్టీ నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఎస్ఎంఆర్ రియల్ ఎస్టేట్ అధినేత పెదబాబు భార్య నూర్జహాన్ను పోటీకి దింపగా, అంతగా ప్రభావం చూపలేకపోతున్నారని ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో వైసీపీ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ నేతృత్వంలో కౌన్సిలర్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుల మధ్య విభేదాలు తారస్థారుుకి చేరారుు. ఈ పరిస్థితి ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. జనాదరణ పెంచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందంజలో పయనిస్తోంది. పాలకొల్లులో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరడంతో అక్కడ రాజకీయం ఏకపక్షంగా మారింది. టీడీపీ పోటీలో ఉన్నా దాని ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోం ది. తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య గట్టిపోటీ నెలకొంది. రెండు పార్టీలు విసృ్తతంగా ప్రచారం చేస్తున్నాయి. కొవ్వూరు మునిసిపాలిటీలోనూ వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వైసీపీ నేతలు ఏకతాటిపై నిలబడి అభ్యర్థుల గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే టీవీ రామారావుపై టీడీపీ నేతల మధ్య నెలకొన్న వ్యతిరేకత అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. నిడదవోలును చేజిక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నా వైసీపీ సమన్వయకర్త రాజీవ్కృష్ణ తిప్పికొడుతున్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో వైసీపీ ముందంజలో ఉంది. ఆ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిగా పట్టణ ప్రముఖుడైన తల్లాడి సత్తిపండు సతీమణి వరలక్ష్మిని ప్రకటించడంతో టీడీపీ ఆందోళనలో మునిగిపోయింది. ఇక అన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. 291 వార్డులుండగా, ఆ పార్టీ 47వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలపగలిగింది. మొత్తంగా మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ ముందంజలో పయనిస్తోంది.