
సాక్షి, అమరావతి:దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు స్ధాయిలో వ్యాక్సినేషన్ చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.కేవలం నిన్న ఒక్క రోజే వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ద్వారా కొత్త రికార్డు సృష్టించమాని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో వలంటీర్ల వద్ద నుంచి వైద్య సిబ్బంది వరకూ అందరూ చాలా కష్టపడ్డారని వారందరినీ సీఎం వైఎస్ జగన్ వారందరినీ అభినందించారాని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సంఖ్యలో వాక్సినేషన్ చేసేందకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన మీడియా తో తెలిపారు.మన రాష్ట్రంలో కేంద్రం ఎన్ని డోసులు వాక్సిన్ పంపినా వెంటనే వేసేందుకు తగిన సామర్థ్యం ఉందని ,వాలంటీర్ల వ్యవస్థతో పాటు వైద్య సిబ్బంది అంతా మనకు బలాన్ని చేకూర్చారని ఆయన ఆభిప్రాయడ్డారు.ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న అందరికీ తన తరపున ధన్యవాదాలు తెలిపారు.
చదవండి:జగనన్న కాలనీలో గృహప్రవేశం
Comments
Please login to add a commentAdd a comment