
సాక్షి, ఏలూరు: ప్రేమోన్మాది పాశవిక దాడిలో గాయపడి.. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తేజస్వినిని శనివారం డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..విద్యార్థినిపై దాడి ఘటన దురదృష్టకరమని..తేజశ్విని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. దాడికి పాల్పడిన ప్రేమోన్మాదిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. తేజస్వినికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను డిప్యూటీ సీఎం కోరారు. భవిష్యత్‌లో విద్యార్థినికి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా ఇటువంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని.. కఠినంగా వ్యవహరిస్తామని ఆళ్ల నాని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment