పర్యాటకంగా కొల్లేరు అభివృద్ధి
పర్యాటకంగా కొల్లేరు అభివృద్ధి
Published Wed, Jul 20 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
ఆటపాక(కైకలూరు) :
కొల్లేరు సరస్సు, పరివాహక ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని అటవీశాఖ హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్ పీసీసీఎఫ్ మిశ్రా అన్నారు. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరో పీసీసీఎఫ్ (అడ్మినిస్ట్రేటీవ్) ఆర్‌జీ కలగాటితో కలసి బుధవారం సందర్శించారు. పక్షుల దొడ్డి విస్తీర్ణం, ఈఈసీ కేంద్రాన్ని పరిశీలించారు. మిశ్రా మాట్లాడుతూ టూరిజం పాయింటుగా కొల్లేరును అభివృద్ధి పరుస్తామన్నారు. మరో రెండు నెలల్లో సమావేశమై ప్రణాళికపై చర్చిస్తామని తెలిపారు. అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ కొల్లేరులో నీటి లభ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ఏకో టూరిజం సీసీఎఫ్ రమణారెడ్డి, రాజమండ్రి సీఎఫ్ ఎం.రవికుమార్, ఏసీఎఫ్ వినోద్‌కుమార్, డీఎఫ్‌వో నాగేశ్వరచౌదరి, రేంజర్ అరుణ్‌కుమార్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
Advertisement