కొల్లేరు ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారు? | dont cheat kolleru people | Sakshi
Sakshi News home page

కొల్లేరు ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారు?

Published Sat, Aug 27 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

dont cheat kolleru people

కైకలూరు :
 ఎన్నికల ప్రచారంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5 నుంచి 3వ కాంటూరుకు కుదిస్తామని చెప్పి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని నాయకులు పెద్దింట్లమ్మ వారధి శంకుస్థాపన పేరుతో అమాయక కొల్లేరు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పాట్రిక్‌పాల్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు శంకుస్థాపనకు వస్తున్నారన్నారు. వారు కాంటూరు కుదింపు, సొసైటీ, జిరాయితీ భూముల పంపిణిపై స్పష్టమైన హామీ ప్రకటించాలని కోరారు. కొల్లేరు ప్రజలకు న్యాయం జరగకపోతే పార్టీ తరుపున నిరాహార దీక్ష చేపడతామన్నారు. కొల్లేరులో తాగునీటి చెరువులను మంత్రి కామినేని తవ్వుకోమని చెబుతూ, మరో వైపు కేసులు పెట్టిస్తున్నారని డీఎన్నార్‌ ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి పంజా రామారావు, మండల మహిళా అధ్యక్షురాలు చింతల శ్యామలా, రైతు విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లూరి మంగారావు, నాయకులు అబ్దుల్‌ హమీద్, దండే రవిప్రకాష్, షేక్‌ సాలర్, బొల్లా సత్యనారాయణ, శ్యామ్‌సుందర్, మాలిక్, రామ్మోహనరావు, నంగెడ్డ నాగరాజు, సిరాజుద్దిన్, బాషా, రాము, ర ఫాయేలు, మంగిన భాస్కర్‌లు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement