కొల్లేరులో విదేశీ పక్షుల కిలకిలారావాలు, రెక్కల సవ్వడి
శీతాకాలపు విడిది కోసం వేల మైళ్ల దూరం నుంచి ఎగిరొచ్చున అతిథులు
పక్షుల కిలకిలారావాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు
పెలికాన్‌లు, ఉల్లంకిలు, కింగ్‌ఫిషర్‌లు.. సందడి చేస్తున్న పక్షులు ఎన్నో
సంతానోత్పత్తి చేసుకుని మార్చిలో స్వస్థలాలకు పయనం
శీతాకాలం వచ్చేసింది..
కొల్లేరు సరస్సుకు విదేశీ అతిథుల రాకా మొదలైంది. వేల మైళ్ల దూరం నుంచి ఎగిరొచి్చన రంగురంగుల పక్షులు కిలకిలారావాలతో పర్యాటకులను అలరిస్తున్నాయి. విదేశీ పక్షుల స్వస్థలాల్లో వాతావరణ మార్పు కారణంగా మనుగడ కోసం తరులు, గిరులు, సాగరాలను దాటి ఏలూరు జిల్లా కొల్లేరుకు చేరుతున్నాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో మార్చి చివర్లో సొంతూర్లకు వెళ్లిపోతాయి. ఏటా వచ్చే ఈ అతిథులను ఇక్కడి ప్రజలు సొంతబిడ్డల్లా ఆదరిస్తారు. వీటిని చూసి ఆనందించేందుకు వచ్చే పర్యాటకులతో పక్షుల విహార కేంద్రాలు కళకళలాడుతున్నాయి.
రాష్ట్రంలో పక్షుల విహార కేంద్రాలు
⇒ కొల్లేరు – ఏలూరు జిల్లా
⇒ పులికాట్ సరస్సు, నేలపట్టు – నెల్లూరు జిల్లా
⇒ ఉప్పలపాడు – గుంటూరు
⇒ తేలినీలపురం, తేలుకుంచి – శ్రీకాకుళం
⇒ కౌండన్య – చిత్తూరు జిల్లా
77,138 ఎకరాల విస్తీర్ణంలో..
ప్రకృతి సోయాగాల ఆరాధకులను కనువిందు చేస్తుంది కొల్లేరు సరస్సు. ఏలూరు జిల్లాలో 77,138 ఎకకాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ ఆటపాక, మాధవపురం పక్షుల విహార కేంద్రాలు ప్రశిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో వందలాది జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి. మన దేశానికి ఏటా వలస వచ్చే పక్షి జాతులు 1,349 ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కొల్లేరు ప్రాంతానికి వస్తుంటాయి. ఏషియన్ వాటర్ బర్ట్స్ నివేదిక ప్రకారం గతేడాది ఇక్కడ 105 పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులు విడిది చేశాయి. ఈ ఏడాది మార్చిలో 50 వేల పక్షులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
వలస పక్షులకు విడిది
వలస అనేది పక్షుల జీవన శైలి. రుతువుల్లో మార్పులు వచ్చునప్పుడు దాదాపు 4,000 పక్షి జాతులు అనువైన ప్రదేశాలను వెతుక్కుంటూ వలసలు వెళతాయి. వీటిలో సుమారు 1,800 జాతులు అత్యంత సుదూర ప్రాంతాలకు వెళ్తాయి. కొల్లేరుకు సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరప్, అ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి పక్షులు వస్తున్నాయి. వీటిలో ఆఫ్రికా నుంచి రెడ్ క్రిస్టెడ్ పోచార్డ్ (ఎర్ర తల చిలువ), అలాస్మా నుంచి పసిఫిక్ గెల్డెన్ ఫ్లోవర్ (బంగారు ఉల్లంకి), ఐర్లండ్ నుంచి కామన్ రెడ్ షాంక్ (ఎర్ర కాళ్ల ఉల్లంకి), ఐరోపా నుంచి యురేíÙయన్ స్పూన్ బిల్ (తెడ్డు మూతి కొంగ), దక్షిణాఫ్రికా నుంచి బ్రాహ్మణి షెల్ డక్ (బాపన బాతు), ఫిలిప్సీన్స్ నుంచి వైట్ పెలికాన్ (తెల్ల చింక బాతు) వంటివి ముఖ్యమైనవి.
చిత్తడి నేలల నెలవు ‘కొల్లేరు’
చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు పక్షుల జీవనానికి అనువైనది. ఇక్కడి ఆటపాక పక్షుల కేంద్రం పెలికాన్ (గూడబాతు) పక్షుల ఆవాస ప్రాంతంగా పేరుగడించింది. దీనిని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. కొల్లేరు సరస్సులో గూడబాతుతో పాటు ఎర్ర కాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), నల్ల రెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్), తెడ్డు ముక్కు కొంగ (ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్) కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), చిన్న నీటి కాకి (లిటిల్ కార్మోరెంట్), సాధారణ కోయిలలు (స్వాలో), పెద్ద చిలువ బాతు (లార్జ్ విజ్లింగ్ డక్), చెరువు బాతు (గార్గనే), తొండు వల్లంకి (బ్లాక్ టయల్డ్ గాట్‌విట్) వంటి 105 రకాల పక్షి జాతులు ఉన్నాయి.
పక్షులు మంచి నేస్తాలు
పక్షులు పర్యావరణ సమతుల్యతకు మంచి నేస్తాలు. వాటిని సంరక్షించుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉంది. వలస పక్షుల్లో అనేక జాతులు అంతరించేపోయే ప్రమాదంలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కొల్లేరులో చిత్తడి నేలల ప్రదేశాలు వలస పక్షులకు ఆవాసాలుగా ఉన్నాయి. పక్షులకు ఏ విధమైన హాని తలపెట్టకుండా సంరక్షించుకోవాలి. –దీపక్ రామయ్యన్, వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్, హైదరాబాద్
ఆకాశమే వాటి హద్దు
సమశీతల వాతావరణాన్ని వెతుక్కుంటూ పక్షులు వలస వస్తాయి. ఆకాశమే వాటి హద్దు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం వీటికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కడుతుంది. అందువల్ల అవి సెంట్రల్ ఆసియన్ ఫ్‌లైవే (సీఏఎఫ్) మీదుగా మన దేశానికి వస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు ద్వారా పక్షులను దగ్గరగా తిలకించే అవకాశం ఉంది. –కేవీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, కైకలూరు.
Comments
Please login to add a commentAdd a comment