తెచ్చారు.. ఎండబెట్టారు... | And drying, were.. | Sakshi
Sakshi News home page

తెచ్చారు.. ఎండబెట్టారు...

Published Thu, Aug 18 2016 12:28 AM | Last Updated on Fri, May 25 2018 2:20 PM

తెచ్చారు.. ఎండబెట్టారు... - Sakshi

తెచ్చారు.. ఎండబెట్టారు...

వరంగల్‌ : హరితహారంలో భాగంగా నాటేందుకు తెచ్చిన మొక్కలు ఎండకు ఎండిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో హరితహారంలో భాగంగా 12.50లక్షల మెుక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 8,44,860 మొక్కలు నాటారు. అయితే, ఇంకా వేల సంఖ్యలో మెుక్కలు తెప్పించగా అందులో చాలా వరకు నాటడం లేదు. గ్రేటర్‌ వరంగల్‌ శివారు ఏనుమాముల వార్డు కార్యాలయం వద్ద మూడు వేలకు పైగా మెుక్కలు ఉన్నాయి. వాటిని నాటకపోవడంతో ఎండకు ఎండిపోతున్నాయి. వివిధ డివిజన్లలో మెుక్కల కోసం ప్రజలు బల్దియా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడేమో సిద్ధంగా ఉన్న మెుక్కలను నాటకుండా, ప్రజలకు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement