రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కూసుమంచి : సాగర్ ఆయకట్టు పరిధిలోని ఆరుతడి పంటలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని హట్యాతండాలో రూ.1.65కోట్లతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు మంత్రి తుమ్మల శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. పాలేరు కాలువకు ప్రతి 15 రోజులకోసారి సాగునీటిని విడుదల చేస్తామని, రైతులు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీళ్లు చివరి పొలాలకు పారేలా చర్యలు చేపట్టాలని ఎన్నెస్పీ అధికారులను మంత్రి ఆదేశించారు. పాలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు గోదావరి, కృష్ణా జలాలను పారించి.. సస్యశ్యామలం చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని అన్నారు. పాలేరును సస్యశ్యామలం చేసేందుకు భక్తరామదాసు పథకం తీసుకొచ్చారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ వడిత్య రాంచంద్రునాయక్, సర్పంచ్ బాణోత్ నాగేశ్వరరావు, ఎంపీటీసీ జూకూరి విజయలక్ష్మీ, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, జెడ్పీ సీఈఓ మారుపాక నాగేష్, తహసీల్దార్ వెంకారెడ్డి, ఎంపీడీఓ విద్యాచందన, పీఆర్ ఏఈ రామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ పుష్పలత, ఏడీ వాణి, ట్రాన్స్‌కో ఏడీఏ ఆనంద్‌కుమార్, ఉద్యాన శాఖ అధికారి రమణ, ఏఓ అరుణజ్యోతి, ఏఈలు శ్రీనివాస్, జగదీష్, రమేష్‌రెడ్డి, అరుంధతి, టీఆర్‌ఎస్ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, బాదావత్ బిక్షంనాయక్, వీరవెల్లి నాగేశ్వరరావు, ఆసిఫ్‌పాషా, భూక్యా బీక్యానాయక్, బజ్జూరి రాంరెడ్డి, వెంకటరెడ్డి, బారి వీరభద్రం, మాదాసు ఉపేందర్ పాల్గొన్నారు.