
'తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్'
హైదరాబాద్: తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. హైదరాబాద్లో శనివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఏ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసం చేయదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనుద్దేశించి ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్కి నిధుల కేటాయింపులపై కసరత్తు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.