Central Minister Nirmala sitharaman
-
ఆత్మహత్యలు వద్దు.. ఆదుకుంటాం
సాక్షి, విజయవాడ బ్యూరో: పొగాకు రైతుల్ని ఆదుకుంటామని, అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె గేట్‌వే హోటల్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లు లేక రాష్ర్టంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయని, పొగాకు రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాయని చెప్పారు. మృతి చెందిన మూడు రైతు కుటుంబాల్లో రెండు కుటుంబాలను పరామర్శించగలిగానని, పొగాకు బోర్డు ద్వారా వారికి కొంత పరిహారం ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల పరిహారంతోపాటు కేంద్ర సాయం కోసం ప్రయత్నిస్తానన్నారు. అధికారికంగా 177మిలియన్ కిలోల పొగాకు సాగు జరిగితే ఈ నెల 15 నాటికి 148మిలియన్ కిలోలకుపైగా కొనుగోలు జరిగిందని, మరో 28.22మిలియన్ కిలోలు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో పామాయిల్, సెరికల్చర్ రైతుల్ని అదుకుంటామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. పట్టిసీమకు నీరిచ్చాం... : గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేశామని, శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు పట్టిసీమ నీరు ఒక పంపు ద్వారా విడుదల చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పామాయిల్, సెరికల్చర్ రైతుల్ని ఆదుకోవాలని సీఎం కేంద్రమంత్రికి విజ్జప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. శుక్రవారం ఆమె ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా పొగాకు కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలంపై రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. నిర్ధిష్టమైన హామీ ఇవ్వకుండా వెళ్లిపోతున్నారంటూ మంత్రిని అడ్డుకున్నారు. -
'తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్'
హైదరాబాద్: తెలంగాణలో డ్రైపోర్టు, లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఏ రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసం చేయదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనుద్దేశించి ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి నిధుల కేటాయింపులపై కసరత్తు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
మహిళలకు రుణ మంజూరులో వివక్ష వద్దు
బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి ముంబై: చిన్న చిన్న పట్టణాలలో మహిళలకు రుణాల్ని ఇచ్చే ప్రక్రియలో బ్యాంకులు ఎలాంటి వివక్షను ప్రదర్శించవద్దని కేంద్ర వాణి జ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం మనీలైఫ్ ఫౌండేషన్ ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వ్యాపార రంగంలో మహిళల పాత్రను పెంచటానికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాలలోని బ్యాంకులు రుణాలను ఇచ్చే క్రమంలో రుణగ్రహీతల మెరిట్‌ను మాత్రమే చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి చిన్న చిన్న పట్టణాలలో భిన్నంగా ఉందన్నారు. చిన్న పట్టణాలలో మహిళలు రుణాల్ని తీసుకోవడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అలాంటి పరిస్థితులలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన చుట్టూ ఎంతో మంది వినూత్న మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళా రుణ మంజూరులో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ఇతర బ్యాంకులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రిఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) బ్యాంక్ వంటి కార్యక్రమాల వల్ల మహిళా పారిశ్రామికవేత్తలకు రిఫైనాన్స్, క్రెడిట్ గ్యారెంటీ సౌకర్యాలు లభిస్తాయని పేర్కొన్నారు.