రేపు డ్రైలాండ్‌ హార్టికల్చర్‌పై రైతులకు శిక్షణ | Horticulture farmers in dryland training tomorrow | Sakshi
Sakshi News home page

రేపు డ్రైలాండ్‌ హార్టికల్చర్‌పై రైతులకు శిక్షణ

Published Mon, Apr 10 2017 11:21 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Horticulture farmers in dryland training tomorrow

అనంతపురం అగ్రికల్చర్‌: వర్షాధార పండ్లతోటల పెంపకం (డ్రైలాంండ్‌ హార్టికల్చర్‌)పై రేపు (బుధవారం) స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్‌ ఎస్‌.చంద్రశేఖర్‌గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.శ్రీనివాసులు హాజరై ప్రస్తుత వేసవిలో డ్రైలాండ్‌ హార్టికల్చర్‌ పండ్లతోటల్లో ఆచరించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించి వివరిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 08554–270430, 81420 28268 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement