horticulture
-
బంతి విలాపం... చాందినీ వికాసం
నాటురకం బంతిపూలు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సాగు చేసిన రైతులు వాటిని రోడ్డుపై పారబోస్తున్నారు. దీంతో అన్నదాతలకు నష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఈ పూలతోటలు సాగు అధికంగా ఉంటుంది. అయితే హైబ్రిడ్ రకం పూలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటోంది. రైతులు ఈ హైబ్రిడ్ రకం పూల తోటలు సాగు చేస్తే లాభాలు పొందుతారని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూలసాగు ఎక్కువగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఉంటుంది. ఈ దఫా ఈ ప్రాంతంలో నాటు రకాలైన బంతి, చామంతిని సాగుచేసిన పూలరైతులు తీవ్ర నష్టాలబాటలో పయనిస్తున్నారు. బంతిపూలు కిలో రూ.4 కూడా పలకపోవడంతో కొనేవారు లేక పూలను రైతులు రోడ్డుపై పారబోస్తున్నారు. ఇదే సమయంలో చామంతిలో హైబ్రిడ్ రకాలైన సెంట్ రెడ్, ఎల్లో, వైట్, వైలట్ రకాలను సాగు చేసిన రైతులు లక్షాధికారులుగా మారుతున్నారు. ఇవి వారం రోజులైనా వాడకుండా ఉండడంతో, బొకేలకు, ఫంక్షన్ హాళ్ల అలంకరణకు వాడుతుండడంతో వీటికి మంచి డిమాండ్ ఉంది. దీంతో వీటి ధర ప్రస్తుతం కిలో రూ.వందకు పైమాటే. పూల రైతులు వారి పొలంలో కాస్త పెట్టుబడి ఎక్కువగా పెట్టి నాటీ రకాల బదులు డిమాండ్ ఎక్కువగా ఉన్న హైబ్రిడ్ రకాలను సాగుచేస్తే లాభాల పట్టేవారు. కానీ రైతులు అప్డేట్ కాకపోవడమే నష్టాలకు కారణమవుతోంది. లక్ష పెట్టుబడితో రూ.3 లక్షల లాభం హైబ్రిట్ రకాల పూల సాగు పంటకాలం నాలుగునెలలు. రెండో నెల నుంచే పూలు కోతకొచ్చి రెండునెలల పాటు కోతలు ఉంటాయి. ఎకరా పొలంలో 7 నుంచి 9వేల హైబ్రిడ్ రకాల సీడ్స్ అవసరం ఉంటుంది. ఒక్కో సీడ్ రూపాయిగా కర్ణాటకలోని తుముకూర్, తమిళనాడులోని రాయకోట నర్సరీలో వీటిని విక్రయిస్తున్నారు. ఎకరా పొలానికి పెట్టుబడిగా మల్చింగ్‌తో సహా రూ.లక్ష దాకా అవుతోంది. పంట బాగా వస్తే ఎకరానికి 30 టన్నుల ఉత్పత్తి ఉంటుంది. ప్రస్తుతం హైబ్రిడ్ రకాల పూల ధరలు కిలో రూ.100 వరకు ఉన్నాయి. ఈ లెక్కన 30 టన్నులకు రూ.3 లక్షలు వస్తుంది. అదే నాటి రకం పూలైతే.. నాటి రకమైన బంతి 70 రోజులకు కోతకొచ్చి ఆపై 40 రోజులు కటింగ్‌లు ఉంటాయి. అదే చామంతి అయితే 90 రోజులకు కోతకు వచ్చి ఆరునెలలు కటింగ్ ఉంటాయి. వీటి సాగు కోసం ఎకరా పొలంలో రైతు పంట పెట్టుబడిగా రూ.50వేలు పెట్టాలి. పంట దిగుబడి బాగా వస్తే పదిటన్నుల పూల ఉత్పత్తి ఉంటుంది. ఇప్పుడు ఉన్న ధర కిలో రూ.4తో రూ.40వేలు మాత్రమే దక్కుతుంది. దీంతో రైతుకు నష్టం తప్పదు. అందువల్ల రైతులు వారిపొలంలో నాటి రకాల పూలకు బదులు హైబ్రిడ్ రకాల పూలను సాగు చేసుకుంటే నికర లాభాలు రావడం తథ్యం.హైబ్రిడ్ పూల సాగులో లాభాలు.. పూలను సాగుచేసే రైతులు సంప్రదాయ రకాలైన బంతి, చామంతిని ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నారు. వీటికి ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అదే హైబ్రిడ్ రకాలైన కస్తూరి చాందిని రకాలైన సెంట్ రెడ్, వైట్, ఎల్లో, వైలట్ రకాలను సాగుచేసిన రైతులు లాభాల బాటలో ఉన్నారు. ఎందుకంటే ఈ రకం పూలు వారం రోజులైనా వాడకుండా ప్లాస్టిక్ పూలవలే వికసిస్తూ ఉంటాయి. వీటిని దూర ప్రాంతాలకు సైతం రవాణా చేసేందుకు వెలుసుబాటుగా ఉంటుంది. అదే నాటి రకాలు మూడురోజుల్లోనే వాడిపోతుంటాయి. దీంతో పూల వ్యాపారులు సైతం హైబ్రిడ్ రకాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ఈ రకం పూలను బొకేలకు సైతం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉండడంతో ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.హైబ్రిడ్ రకాలనే సాగు చేయాలి నాటి రకాలైన బంతీ, చామంతిలను సాగుచేసినష్టాలు బాట పట్టాం. అందుకే తమిళనాడులోని రాయకోట నుంచి సెంట్ ఎల్లో, వైట్, రెడ్ రకాల హైబ్రిడ్ రకాల పూలను సాగుచేసి నికర లాభాలను పొందుతున్నాం. రైతులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ డిమాండ్ ఉన్న పూలను సాగుచేయడం అలవర్చుకోవాలి. అప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. – రవీంద్ర, పూలరైతు, కూర్మాయి గ్రామం, పలమనేరు మండలంఅవగాహన కల్పిస్తూనే ఉన్నాం..సంప్రదాయ రకాలైన బంతి పూలకు ఇప్పుడు కాలం చెల్లింది. వీటికి ఎప్పుడు ధరలుంటాయో తెలియని పరిస్థితి. అందువల్ల రైతులు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న హైబ్రిడ్ రకాల పూలను సాగు చేసుకోవడం మేలు. ఎందుకంటే అదే పొలంలో కాస్త ఎక్కువగా పెట్టుబడి పెట్టి నికరంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిపస్తూనే ఉన్నాం. – డా.కోటేశ్వర్రావు, సహాయ సంచాలకులు, ఉద్యానశాఖ -
ఉద్యాన పంటల సాగు.. ‘ఉపాధి’తో అనుసంధానం
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ బుధవారం విజయవాడలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తన సోదరుడు నాగబాబుతో కలిసి అధికారిక కార్యాలయానికి వచ్చిన ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో సొంత భవనాలు లేని గిరిజన గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై పవన్ సంతకం చేసినట్టు తెలిపింది. అదే విధంగా ఉద్యాన పంటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసే మరో ఫైల్ మీద కూడా పవన్ సంతకం చేసినట్టు వివరించింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, అటవీ శాఖ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్‌ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి అభినందనలు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పవన్‌కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. శాఖలవారీగా సమీక్ష ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో శాఖాపరమైన విధుల్లో పాల్గొన్నారు. ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష చేశారు. సాయంత్రం అటవీ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవన్‌ను కలిసిన సీఎస్ నీరభ్‌కుమార్ బుధవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రత్యేకంగా కలిశారు. -
ఉద్యాన ‘ఘనం’..
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు గడిచి నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాలిచ్చింది. ముఖ్యంగా సాగు విస్తీర్ణం తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే లాభసాటి కాని వ్యవసాయ, వాణిజ్య పంటల స్థానంలో ఉద్యాన పంటలు విస్తరించేలా ప్రోత్సహించడంలో సఫలీకృతమైంది. రాష్ట్రంలో 2018–19 నాటికి 42.51 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఉద్యాన పంటలు నేడు 45.76 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. 4.23 లక్షల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించగా, కొత్తగా 3.25 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23లో 368.83 లక్షల టన్నులు రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 380 లక్షల టన్నులు దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫ్రూట్బౌల్గా గుర్తింపు పొందిన ఏపీ..కొబ్బరి, బొప్పాయి, టమోటాలో మొదటి స్థానం, బత్తాయి, అరటి, వంగ, మిర్చి, ఆయిల్‌పామ్‌లో రెండో స్థానం, మామిడి, ఉల్లి, జీడిపప్పులో మూడో స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో సంప్రదాయ పంటలైన మామిడి, జీడిమామిడి, సపోటా, బొప్పాయి వంటి పంటలను ఉపాధి హామీ పథకం కింద ప్రోత్సహించే వారు. ఏడాదికి 50వేల ఎకరాలు సాగులోకి రావడం గగనంగా ఉండేది. పంటల మార్పిడిని ప్రోత్సహించాలన్న ఆలోచన కూడా చేయలేదు. బోర్ల కింద ఉద్యాన పంటలు.. మరోవైపు.. పంటల వారీగా అమలుచేసిన ఏరియా ఎక్స్పాన్షన్ (విస్తరణ) ప్రాజెక్టులు కూడా సత్ఫలితాలిచ్చాయి. పెద్దఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చి ప్రోత్సహించడంతో లాభసాటి కాని వ్యవసాయ, వాణిజ్య పంటలు సాగుచేసే రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లారు. రాయలసీమ జిల్లాల్లో బోర్ల కింద వేరుశనగ, వరి స్థానంలో అరటి, బత్తాయి, బొప్పాయి, దానిమ్మ, మామిడి.. దక్షిణ కోస్తా జిల్లాల్లో పొగాకు, సుబాబుల్, యూకలిప్టస్ స్థానంలో నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి.. కృష్ణా, గోదావరి రీజియన్‌లో మొక్కజొన్న, చెరకుతో పాటు బోర్ల కింద వరి స్థానంలోనూ ఆయిల్‌పామ్, కొబ్బరి, కోకో, జామ, ఉత్తర కోస్తా జిల్లాల్లో క్యాసిరినాతో పాటు బోర్‌వెల్స్ కింద వరి స్థానంలో ఆయిల్ పామ్, జీడిమామిడి, కొబ్బరి తోటలను విస్తరించగలిగారు. గతంతో పోలిస్తే అంతర పంటల సాగు కూడా పెరిగింది. పెరిగిన ఆయిల్‌పామ్, మామిడి తోటలు పంటల మార్పిడి ద్వారా ఈ ఐదేళ్లలో వరుసగా 2019–20లో 1,36,628 ఎకరాలు, 2020–21లో 1,44,298 ఎకరాలు, 2021–22లో 1,56,173 ఎకరాలు, 2022–23 1,58,532 ఎకరాలు, 2023–24లో 1,58,532 ఎకరాల చొప్పున పంటల మార్పిడి ద్వారా ఈ ఐదేళ్లలో 7,54,163 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. ప్రధానంగా 1.69 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1.26 లక్షల ఎకరాల్లో మామిడి, 92వేల ఎకరాల్లో జీడిమామిడి, 84వేల ఎకరాల్లో బత్తాయి, 51వేల ఎకరాల్లో అరటి, 36వేల ఎకరాల్లో కూరగాయలు, 33వేల ఎకరాల్లో కోకో, 25 వేల ఎకరాల్లో కొబ్బరి, 24వేల ఎకరాల్లో జామ, 22వేల ఎకరాల్లో పూలతోటలు, 19 వేల ఎకరాల్లో నిమ్మ, 12వేల ఎకరాల్లో దానిమ్మతో పాటు నేరేడు, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, చింత, సీతాఫలం వంటి పంటల సాగు విస్తరించింది. ఎకరాకు రూ.15వేల చొప్పున రూ.1,123.82 కోట్లకు పైగా ఖర్చుచేశారు. రాయితీలు.. ప్రోత్సాహకాలతో.. ఈ 57 నెలల్లో కొత్తగా 269 ఉద్యాన రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీఓ)ను ఏర్పాటుచేశారు. 143 ఎకరాల్లో షేడ్‌నెట్స్‌కు రూ. 10.52 కోట్లు, 24.55 ఎకరాలలో పాలీహౌస్‌ల నిర్మాణంకోసం రూ. 3.68 కోట్లు ఖర్చుచేశారు. ఈ నాలుగున్నరేళ్లలో 29.83 ఎకరాల్లో కూరగాయల రైతులకు రూ.75.70 లక్షలు, 172.65 ఎకరాల్లో పువ్వులు సాగుచేసే రైతులకు రూ.5.85 కోట్లు చొప్పున ఆర్థిక చేయూతనిచ్చారు. కోత అనంతర నష్టాలను నివారించేందుకు ఎఫ్పీఓల కోసం ప్రత్యేకంగా 940 ఉద్యాన సేకరణ కేంద్రాలతోపాటు 340 కోల్డ్‌స్టోరేజ్‌ల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే 462 కలెక్షన్ సెంటర్లు, 84 కోల్డ్రూమ్స్ను ఎఫ్పీఓలకు అందించారు. 2,905 మంది రైతులకు వ్యక్తిగతంగా ప్యాక్‌హౌస్‌లను నిర్మించి ఇచ్చారు. ఫలించిన పంటల మార్పిడి.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు లాభసాటి కాని వ్యవసాయ, వాణిజ్య పంటల స్థానే ఉద్యాన పంటలను ప్రోత్సహించాం. ఐదేళ్లలో రికార్డు స్థాయిలో పంటల మార్పిడి ద్వారా 7.49 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురాగా, వీటిలో 3.25 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. 4.23 లక్షల ఎకరాల్లో పాత పంటల స్థానే కొత్త పంటలు సాగులోకి వచ్చాయి. వివిధ స్కీమ్‌ల ద్వారా అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలవల్లే ఇది సాధ్యమైంది. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ -
సీమ సిగలో మరో ఉద్యాన కళాశాల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో ఉద్యాన కళాశాల అందుబాటులోకి వస్తోంది. రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన విద్యకు ఊతమిచ్చేందుకు వీలుగా పులివెందులలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఉద్యాన కళాశాలను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ పరిధిలో నాలుగు ప్రభుత్వ కళాశాలలు (వెంకట్రామన్నగూడెం, అనంతరాజుపేట, పార్వతీపురం, చిన్నాలతరపి).. మరో నాలుగు అనుబంధ కళాశాలలు (అనంతపురం, తాడిపత్రి, వీఎస్ పురం, మార్కాపురం) ఉన్నాయి. దాదాపు అన్ని కళాశాలలు బీఎస్సీ హానర్స్ (హార్టి) కోర్సును అందిస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలల పరిధిలో 520, ప్రైవేటు కళాశాలల పరిధిలో 200 సీట్లు ఉన్నాయి. అలాగే, నాలుగు ప్రభుత్వ, ఏడు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు కూడా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్నాయి. రాయలసీమలో రెండో ఉద్యాన కళాశాలలు.. ఇక వైఎస్సార్ జిల్లా అనంతరాజుపేటలో ఇప్పటికే ఉద్యాన కళాశాల ఉంది. తాజాగా.. పులివెందులలో కొత్తగా మరో కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఉద్యాన పంటల హబ్‌గా పులివెందుల ఇప్పటికే గుర్తింపు పొందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్యాన విద్యకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కొత్తగా కళాశాల ఏర్పాటుచేసింది. బీఎస్సీ ఆనర్స్ (హార్టి) కోర్సులో 60 సీట్లతో ఈ కళాశాల ఏర్పాటవుతోంది. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ద్వారా 46 సీట్లను భర్తీచేశారు. మిగిలిన సీట్లను చివరి రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేయనున్నారు. పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్‌స్టాక్ (ఏపీ కార్ల్) భవన సముదాయంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన కళాశాలను గురువారం సీఎం జగన్ ప్రారంభిస్తారు. 100 ఎకరాల్లో రూ.110కోట్లతో భవనాలు.. మరోవైపు.. ఈ కళాశాల కోసం 100 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఆ మేరకు భూ కేటాయింపునకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. భవన సముదాయాల కోసం ఇప్పటికే రూ.110 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పరిపాలనా భవనం, తరగతి గదులు, అత్యాధునిక లేబొరేటరీలు, విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలు, సిబ్బంది కోసం క్వార్టర్స్, వెహికల్ పార్కింగ్ షెడ్లు నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఈ కళాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 టీచింగ్, 60 నాన్ టీచింగ్ పోస్టులను మంజూరు చేసింది. టీచింగ్ పోస్టుల్లో ప్రధానంగా 21 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 6 అసోసియేట్ ప్రొఫెసర్లు, 3 ప్రొఫెసర్ పోస్టులున్నాయి. వీటిని ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. ఈ పోస్టులు భర్తీచేసే వరకు విద్యాబోధనకు ఇబ్బందిలేకుండా అనంతరాజుపేట, వెంకట్రామన్నగూడెంలలోని ఉద్యాన కళాశాలల నుంచి ఐదుగురు అధ్యాపకులను పులివెందుల ఉద్యాన కళాశాలకు బదిలీ చేశారు. వీరంతా ఇప్పటికే విధుల్లో చేరారు. ఇక పులివెందులలో ఉద్యాన కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశామని వర్సిటీ వీసీ డాక్టర్ తోలేటి జానకీరామ్ ‘సాక్షి’కి తెలిపారు. కౌన్సెలింగ్ ద్వారా బీఎస్సీ ఆనర్స్ (హార్టీ)లో చేరిన విద్యార్థులకు గురువారం నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. -
హార్టీకల్చర్ హబ్‌గా ఏపీ
సాక్షి ప్రతినిధి కర్నూలు: వర్షాలపై ఆధారపడి అదృష్టాన్ని పరీక్షించుకునే రైతులకు ఏటా కచ్చితమైన ఆదాయం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పొడి భూముల్లో ఉద్యాన పంటలు (డ్రై ల్యాండ్ హార్టీకల్చర్) కార్యక్రమం కింద రైతులకు మొక్కలు నాటే సమయం నుంచి 100 శాతం సబ్సిడీ ఇవ్వడంతోపాటు మూడేళ్లపాటు సాగు ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో రాష్ట్రంలో పండ్ల తోటలు సాగు చేసే రైతుల సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులు స్థిరంగా లాభాల పంటను పండిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులను చూసి సంప్రదాయ పంటలు సాగు చేసే పొరుగు రైతులు కూడా పండ్ల తోటల సాగువైపు మళ్లుతున్నారు. సన్న, చిన్నకారు రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వమే దన్నుగా నిలుస్తుండటంతో దేశంలోనే ‘హార్టీ కల్చర్ హబ్’గా ఏపీ అభివృద్ధి చెందుతోంది. నాలుగేళ్లలో 2.35 లక్షల ఎకరాల్లో.. 2018–19 వరకూ రాష్ట్రంలో 17,62,240 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యేవి. ఆ విస్తీర్ణం ప్రస్తుతం 19,97,467.5 ఎకరాలకు సాగు పెరిగింది. అంటే నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో 2,35,227.5 ఎకరాల్లో పండ్ల తోటల సాగు పెరిగింది. 2018–19లో 1,76,43,797 టన్నుల పండ్ల దిగుబడులు రాగా.. ప్రస్తుతం 2,03,70,557 టన్నులకు పెరిగింది. అంటే 27,26,760 టన్నుల దిగుబడి పెరిగింది. పండ్ల తోటలతో పాటు పూలు, కూరగాయలు కలిపి మొత్తం రాష్ట్రంలో 47.02 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిద్వారా 3.63 కోట్ల టన్నుల దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత ఏడాది 2023–24లో రికార్డు స్థాయిలో 75 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 శాతం సబ్సిడీతో పండ్ల తోటల అభివృద్ధికి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా పండ్ల తోటల సాగు, అభివృద్ధి మోతుబరి రైతులు మాత్రమే చేసేవారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుండటంతో సన్న, చిన్నకారు రైతులు కూడా పండ్ల తోటలను సాగు చేయగలుగుతున్నారు. ఆ రెండు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వీరిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పండ్ల తోటల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుండటం విశేషం. ఈ జిల్లాల్లో ప్రత్యేకంగా 10 వేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేస్తున్నారు. కాగా.. పొండి భూములు అధికంగా ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 వేల ఎకరాల్లోను, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 11వేల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి జరుగుతోంది. ఇక ‘లక్ష’ణంగా ఆదాయం! కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నర్సిరెడ్డి. ఈయనకు అర ఎకరం పొడి భూమి ఉంది. వర్షాధారంగా పత్తి, మిరప వంటి పంటలు సాగు చేసేవాడు. అన్నీ అనుకూలిస్తే.. ఏటా రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేది. వర్షాలు మొహం చాటేస్తే నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. 2020 వరకు ఇదే పరిస్థితి. 2021–22లో డ్రైలాండ్ హార్టీకల్చర్ స్కీమ్ కింద డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇచ్చింది. పొలంలో గుంతలు తవ్వడం నుంచి మొక్కల వరకూ పూర్తిగా ప్రభుత్వమే రూ.1.70 లక్షల ఖర్చు భరించింది. తొలి ఏడాది రూ.22 వేలు, రెండో ఏడాది రూ.55 వేల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.లక్ష దాటుతుందని నర్సిరెడ్డి చెప్పాడు. ఈ పంట సాగువల్ల ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంటుందంటున్నాడు. రూ.750 కోట్లతో తోటల అభివృద్ధి పండ్ల తోటల అభివృద్ధికి ఎకరాకు కనిష్టంగా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ.2.44 లక్షల వరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోంది. ఎకరాకు సగటున రూ.లక్ష వరకూ సబ్సిడీ ఇస్తోంది. 2023–24లో 75 వేల ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి జరుగుతోంది. మామిడి, చీనీ, నిమ్మ, కొబ్బరి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ తదితర పండ్ల తోటలతో పాటు పూల తోటలను రైతులు అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హార్టీకల్చర్ అభివృద్ధికి ఈ ఏడాది రూ.750 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి 64,544 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి అంచనాలు రూపొందించగా.. 63,250 ఎకరాలకు పరిపాలన అనుమతులు లభించాయి. మరోవైపు పండ్ల మొక్కలు నాటే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెండెకరాల్లో మామిడి సాగు మాకు 2 ఎకరాల పొలం ఉంది. గత ఏడాది వర్షాధారం కింద ఆముదం, సజ్జ, కంది సాగు చేశాం. ఏ పంట వేసినా నష్టం తప్ప లాభం లేదు. ఈ ఏడాది ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో మామిడి మొక్కలు అందించింది. 2 ఎకరాల్లో 140 మామిడి మొక్కలు నాటుకున్నాం. కాపు వచ్చేదాకా 3–4ఏళ్లు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఏ ఖర్చు లేకుండా పండ్ల తోటలు సాగు చేశాం. సంతోషంగా ఉంది. కాపు వస్తే మా బతుకు మారుతుంది. – వై.లక్ష్మీదేవి, ప్యాపిలి, నంద్యాల జిల్లా -
సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతులు
పేరు కె.పూర్ణచంద్ర. నాలుగేళ్ల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు సచివాలయం గ్రామ ఉద్యాన సహాయకుడిగా నియమితులయ్యారు. నెల క్రితం రాయచోటి మండలంలో కేటగిరి–1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. 2019 ఉద్యోగ నియామక రాత పరీక్షలో సంబంధిత కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో, ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం కోటప్పనగర్కు చెందిన పులి శ్రీధర్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. 2019లో బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటలో గ్రామ ఉద్యాన సహాయకుడిగా నియమితులయ్యారు. 20 రోజుల క్రితం తెనాలి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. తాను పీహెచ్డీ చేస్తున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందని, అప్పట్లో ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావని కొందరు బెదరగొట్టారని శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకంతో దరఖాస్తు చేసుకోవడంతో మంచి జరిగిందన్నారు. తన భార్య కూడా గ్రామ ఉద్యాన సహాయకురాలిగా పనిచేస్తోందన్నారు. కాగా, అప్పట్లో ఇతను రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పదోన్నతులు పొందారు. సాక్షి, అమరావతి : నాలుగేళ్ల కిందట సచివాలయాల్లో గ్రామ ఉద్యాన అసిస్టెంట్ (విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్)గా నియామకమైన వారిలో కొందరు నెల కిత్రం అదే శాఖలో మండల స్థాయిలో కేటగిరి–1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. కొత్త బాధ్యతల్లో చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేటగిరి–1 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 53 ఖాళీ ఉండగా, ఆ పోస్టులన్నింటినీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతో భర్తీ చేసే ప్రక్రియను ఉద్యానవన శాఖ నెల రోజుల క్రితమే చేపట్టింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన.. శ్రీకాకుళం జిల్లాలో పది మంది, గుంటూరు జిల్లాలో ఒకరు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు చొప్పున నెల క్రితమే పదోన్నతులు పొందగా, మిగిలిన జిల్లాల్లోనూ 35 మందికి పదోన్నతుల ప్రక్రియ పురోగతిలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 కేటగిరి ఉద్యోగులు పని చేస్తుండగా, అందులో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. అంటే.. ఆ 17 కేటగిరి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన పదోన్నతులకు నిర్దేశించిన బాధ్యతల్లో ఖాళీలు ఏర్పడగానే, ఎప్పటికప్పుడు సచివాలయాల ఉద్యోగులకు అవకాశం దక్కుతుంది. మిగిలిన రెండు కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల విధివిధానాల ఖరారు తుది దశలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. మండల వ్యవస్థలో 13 ఏళ్లకు ఎంపీడీవో నియామకం నాలుగేళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకం చేపట్టినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు ఇవేవీ శాశ్వత ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఊడతాయేమోనని భయపెట్టాయి. ఆ మాటలు నమ్మని నిరుద్యోగులు అప్పట్లో ఏకంగా 21 లక్షల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో దాదాపు అందరూ ఏడాది కిందట ప్రొబేషన్ ఖరారు కూడా పూర్తి చేసుకొని అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే పే స్కేలుతో కూడిన వేతనం అందుకుంటున్నారు. వీరిలో ఇంకొందరు మండల స్థాయిలో పని చేసేందుకు పదోన్నతులు కూడా పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986లో మండల వ్యవస్థ ఏర్పాటైనప్పుడు ఆ మండలాల్లో పని చేసేందుకు ఉద్దేశించిన కీలక స్థాయి ఎంపీడీవోల ఉద్యోగాలకు తొలివిడత 13 ఏళ్ల తర్వాత 1999లో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత ఎంపీడీవోలు పదోన్నతులు పొందడానికి సంబంధించిన సర్వీసు రూల్స్‌కు సైతం 2022 వరకు అతీగతీ లేదు. అప్పడు ఎంపీడీవోగా నేరుగా ఉద్యోగం పొందిన వారికి సైతం 23 ఏళ్ల తర్వాత గానీ పదోన్నతి దక్కలేదు. ఉద్యోగాల భర్తీ ఓ రికార్డు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడం ఒక రికార్డు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెనువెంటనే పూర్తి చేయడం మరో రికార్డు. ప్రభుత్వ స్థాయిలో ఒక కొత్త శాశ్వత పోస్టు మంజూరు చేయాలంటే నెలలు, ఏళ్లు పడుతుంది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 1,34,524 కొత్త ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేయడం.. ఒకే విడతలో వాటి భర్తీకి నోటిఫికేషన్.. ఏకంగా 21,69,529 మంది దరఖాస్తు.. 35 రోజుల్లోనే రాత పరీక్షల నిర్వహణ.. ఆ తర్వాత 11 రోజులకే ఫలితాల వెల్లడి.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. సమస్యల పరిష్కారంపై దృష్టి గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియకు విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. ఆయా శాఖల ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో అంత పెద్ద సంఖ్యలో పని చేస్తున్న 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నాం. – లక్ష్మీశ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ -
ఉద్యానం.. మరింత విస్తారం
సాక్షి, విశాఖపట్నం: ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని విస్తృతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రైతులకు రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో ఉద్యాన విస్తరణ పథకం కింది ఏటా కొంతమేర దీనిని విస్తరించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నం జిల్లాలో 10,328 ఎకరాల ఉద్యాన పంటల విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది అదనంగా మరో 180 ఎకరాల్లో ఈ పంటలను విస్తరించాలని జిల్లా ఉద్యానశాఖ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రక్రియను ఉద్యానశాఖ అధికారులు చేపట్టారు. ఉద్యాన విస్తరణ పథకం కింద డ్రాగన్ ఫ్రూట్, టిష్యూ కల్చర్ అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర పంటలు సాగు చేస్తారు. వీటితో పాటు జిల్లాలో మరో 500 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకంలో సాగు చేసే పంటలకు ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. మొక్కలు, ఎరువులతో పాటు సాగుకు అవసరమైన పనిముట్లకు కూడా యూనిట్ ధరను బట్టి గరిష్టంగా 50 శాతం వరకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఆర్బీకే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యాన సాగు పెంపు ఆవశ్యకత, అధిక దిగుబడులనిచ్చే వంగడాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర అంశాలను రైతులకు వివరిస్తున్నారు. అదే సమయంలో వీటికి అర్హులైన రైతులను గుర్తింపు ప్రక్రియను కూడా మొదలు పెట్టారు. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం అవసరమైన నర్సరీలను కూడా ఎంపిక చేసి మొక్కలను పంపిణీ చేస్తారు. ఉద్యాన పంటల విస్తరణకు నీటి పారుదల, డ్రిప్, స్పింక్లర్లు వంటి సదుపాయాలు కలిగి ఉండాలి. మరోవైపు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో మొక్కలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఇందుకు అవసరమయ్యే కూలీలను కూడా ఈ పథకంలో సమకూరుస్తారు. ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు చేకూర్చనుంది. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం రైతులు పండించిన ఈ ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. ఈ ఉత్పత్తులను రైతు బజార్లలో విక్రయించేలా మార్కెటింగ్ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఈ రైతులకు కార్డులను జారీ చేస్తాం. ఉద్యాన పంటల నాణ్యత, దిగుబడులు పెంచడం, రైతులకు మంచి ధర గిట్టుబాటు అయ్యేలా చూడడం వంటివి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. – మన్మధరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, విశాఖపట్నం -
మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల!
ఉదయగిరి కేంద్రంగా వ్యవసాయ విద్యకు బీజం పడింది. మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల మారనుంది. మారుతున్న ప్రపంచీకరణలో తిరిగి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం పెరుగుతోంది. కంప్యూటర్ కోర్సులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మారిన ఎందరో తిరిగి ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉండడంతో ప్రస్తుతం విద్యార్థులు సైతం ఇంజినీరింగ్, మెడిసిన్ తర్వాత వ్యవసాయ విద్యకు ఆకర్షితులు అవుతున్నారు. ఉదయగిరి (పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాచరిక పాలనకు కేంద్రంగా విరాజిల్లిన ఉదయగిరిలో కాలక్రమేణా కరవు రాజ్యమేలింది. అలనాటి రాజుల స్వర్ణయుగం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రాబోతుంది. ఉదయగిరి కేంద్రంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.250 కోట్ల ఆస్తులను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అప్పగించి వ్యవసాయ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి ముందుగా వ్యవసాయ కళాశాలను మంజూరు చేసి అందుకు అవసరమైన నిధులు కేటాయించారు. ఈ నెల 18వ తేదీ నుంచి వ్యయసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీ మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్, çహార్టికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టనుంది. వ్యవసాయ రంగానికి ఈ ప్రాంత విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు వ్యవసాయ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రస్తుతం ఉదయగిరికి వ్యవసాయ కళాశాల మంజూరు కావడంతో అగ్రికల్చర్ కోర్సులు ఇక్కడే అభ్యసించే అవకాశం ఏర్పడింది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగు పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉంది. దాని పరిధిలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కళాశాల కూడా దీని పరిధిలోకి రానుంది. త్వరలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్పు చెందితే ఈ కళాశాలలన్నీ కూడా దీని పరిధిలోకి వచ్చే అవకాశముంది. రూ.250 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి త్వరగా జరుగుతుందనేది మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆలోచన. ఆయన అందుకు అనుగుణంగానే ఆది నుంచి విద్యా సంస్థల అభివృద్ధికి ఎంతో తోడ్పాటునందించారు. 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు ఉదయగిరిలో డిగ్రీ కళాశాలకు సొంత నిధులు ఇచ్చారు. అనంతరం వందెకరాల విశాల ప్రాంగణంలో మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. దీని విలువ ప్రస్తుతం రూ.250 కోట్ల వరకు ఉంది. ఈ మొత్తం మెట్ట ప్రాంత ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అప్పగించారు. మెరిట్స్‌లో ప్రస్తుతమున్న సదుపాయాలు 150 ఎకరాల ప్రాంగణంలో ఈ కళాశాల ఉంది. 5 లక్షల చ.అ. అకాడమీ బ్లాక్స్ ఉన్నాయి. సుమారు 1,350 మంది విద్యార్థులు నివాసముండేందుకు హాస్టల్ భవనాలున్నాయి. 89 మంది స్టాఫ్ ఉండేందుకు క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, విశాలమైన లైబ్రరీలో 27 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 3 బస్సులు, జనరేటర్లు, క్యాంటిన్, గెస్ట్‌హౌస్, ఎన్ఎస్ఎస్ భవన సముదాయాలు, ప్లేగ్రౌండ్, తదితర వసతులు కూడా ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి అప్పగించారు. మరో యాభై ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మెరిట్స్ కళాశాలలో పని చేసే 108 మంది బోధన, బోధనేతర సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కింద వ్యవసాయ కళాశాలకు తీసుకుంటూ కేబినెట్ ఆమోదించింది. దీంతో మెరిట్స్‌లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం మేలుచేకూర్చినట్టయింది. కేబినెట్ ఆమోదంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 18 నుంచి తరగతుల ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 250 మంది విద్యార్థులకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 18వ తేదీ నుంచి వ్యవసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి. నెల్లూరు, కడప, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉదయగిరి వ్యవసాయ కళాశాల అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరికి వ్యవసాయ కళాశాల రాకతో వ్యాపార ఆర్థిక కలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి ఈ వ్యవసాయ కళాశాలలో 250 మంది విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత మంది స్టాఫ్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మౌలిక వసతులు, వసతి గృహాలు, అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ కళాశాల ప్రముఖపాత్ర పోషించే అవకాశముంది. – డాక్టర్ కరుణసాగర్, ప్రిన్సిపల్, వ్యవసాయ కళాశాల, ఉదయగిరి -
పేద్ద.. గుమ్మడి: బరువు 1161 కిలోలు.. రికార్డులు బద్దలు!
వాషింగ్టన్: గుమ్మడికాయ అంటే గరిష్ఠంగా 10-20 కిలోల వరకు ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ, వెయ్యి కిలోల గుమ్మడిని ఎప్పుడైనా చూశారా? అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని హాఫ్ మూన్ బే సిటీలో జరిగిన పోటీల్లో ఏకంగా 2,560 పౌండ్లు(1161 కిలోలు) బరువైన గుమ్మడికాయను ప్రదర్శించి జాతీయ రికార్డును బద్దలుకొట్టారు ట్రావిస్ జింజర్ అనే ఉద్యానవన ఉపాధ్యాయుడు. హాఫ్ మూన్ బే సిటీలో మంగళవారం 49వ ప్రపంచ స్థాయి బరువైన గుమ్మడికాయల పోటీని నిర్వహించారు. ఈ పోటీకి భారీ గుమ్మడికాయను మిన్నెసోటా నుంచి తీసుకొచ్చేందుకు ఏకంగా 35 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిందని తెలిపారు ట్రావిస్ జింజర్. ఆ రెండు రోజుల ప్రయాణంలో గుమ్మడికాయను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లు చెప్పారు. దానిని ప్లాస్టిక్, తడి బ్లాంకెట్లతో చుట్టి ఉంచామన్నారు. ‘మిన్నెసోటాలో వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. గుమ్మడి సాగుకు ప్రతికూలమనే చెప్పాలి. రోజుకు 75 గ్యాలన్ల నీటిని అందించాలి. భారీ గుమ్మడికాయను తీసుకొచ్చి పోటీలో గెలుపొందటం చాలా సంతోషంగా ఉంది.’ అని తెలిపారు. 2020లోనూ జింజర్ పోటీలో గెలుపొందారు. గతవారం నమోదైన 2,554 పౌండ్ల బరువు గుమ్మడికాయ రికార్డును తాజాగా ఆయన బద్ధలు కొట్టారు. Travis Gienger, a horticulture teacher from Minnesota, set a new U.S. record Monday for the heaviest pumpkin after raising one weighing 2,560 pounds. https://t.co/T8vuqaCD2N pic.twitter.com/AbUj3cYwol — CBS News (@CBSNews) October 11, 2022 ఇదీ చదవండి: నీ పిచ్చి తగలెయ్య.. అది బెడ్రూం కాదురా అయ్యా!.. నడి రోడ్డు.. -
సాగుబడి @5:30Pm 05 అక్టోబర్ 2022
-
సాగుబడి : 30 September 2022
-
సాగుబడి @29 September 2022
-
వంగడాలకు ఊపిరి..
ఉద్యాన విత్తనం వ్యవసాయ క్షేత్రాల్లో సిరులు పండిస్తోంది.. రైతును రాజును చేస్తూ వారి గోతాల్లో విత్తం నింపుతోంది.. తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో 2007లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూతన వంగడాలకు ఊపిరి పోస్తోంది. రాష్ట్రంలోని ఉద్యాన రైతులకే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు లాభాల పంట పండించేందుకు ఈ వంగడాలు ఉపయోగపడుతున్నాయి. తాడేపల్లిగూడెం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన వెంకట్రా మన్నగూడెంలోని ఉద్యాన వర్సిటీ దేశంలోనే రెండోది కావడం గమనార్హం. ఉద్యాన రైతులకు జవసత్వాలు నింపుతూ చీడపీడలను తట్టుకుని, అధిక దిగుబడులు ఇచ్చేలా విత్తనాలను ఇక్కడ రూపొందిస్తున్నారు. వర్సిటీ పరిధిలోని 20 పరిశోధనా స్థానా ల్లో చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుల మేలు కోసం నేలసారానికి అనుగుణంగా మొలకెత్తడం, తెగుళ్లను తట్టుకోవడం, వాతావరణ ప్రతికూల ప్రభావాలను తట్టుకోవడం, టిష్యూ కల్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్‌కు అనువుగా ఉండేలా విత్తనాలను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకూ 14 రకాల ఉద్యాన పంటలకు సంబంధించి విడుదల చేసిన 23 వంగడాలు దేశంలో, రా ష్ట్రంలో రైతులకు లాభాల పంటను పండిస్తున్నాయి. ఉద్యాన వర్సిటీ వంగడాలను అందించడంతో పాటు ఆగ్రోటెక్నిక్స్, ప్లాంట్ ప్రొటెక్షన్, పోస్టు హార్వెస్టు టెక్నాలజీ పద్ధతులను రైతులకు చేరువ చేస్తోంది. 2017లో అధికారికంగా బయట ప్రపంచంలోకి వచ్చి న ఉద్యాన వంగడాలు ఐదేళ్లుగా రైతులకు ఎనలేని ప్రయోజనాలు కలిగిస్తున్నాయి. ఉద్యాన విద్యకు పెద్దపీట రాష్ట్రంలో 20 ఉద్యాన పరిశోధనా స్థానాలు కలిగి ఉన్న వర్సిటీలో ఉద్యాన విద్యకు పెద్దపీట వేస్తు న్నారు. నాలుగు ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రైవే ట్ ఉద్యాన కళాశాలలు, నాలుగు ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్‌లు, నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా విద్యకు ఉపకరించే అంశాలను బోధిస్తున్నారు. బీఎస్సీ హానర్స్ హార్టీకల్చర్, ఎమ్మెస్సీ హార్టీకల్చర్, పీహెచ్‌డీలో ప్రత్యేకంగా ఫ్రూట్ సైన్స్, విజిటబుల్ సైన్స్, ప్లాంటేషన్ స్పైసెస్, మెడిసినల్ క్రాప్స్, ఫ్టోరీకల్చర్ లాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్, పోస్టు హా ర్వెస్టు టెక్నాలజీ, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ కోర్సులను అందిస్తున్నారు. 13 రకాలు నోటిఫై ఉద్యాన వర్సిటీ ఊపిరిపోసిన 23 రకాల వంగడాల్లో 13 రకాలు నోటిఫై అయ్యాయి. వీటిని దేశవ్యాప్తంగా రైతులు వినియోగించవచ్చు. ఈ వంగడాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా వస్తాయి. నిరంతరం వంగడాల పరిశోధనలు సాగుతున్నాయి. ఒక కొత్త వంగడం విడుదల చేయాలంటే బహు వార్షిక పంటలకు 15 ఏళ్లు, ఏక వార్షిక పంటకు 8 ఏళ్లు పడుతుంది. కొబ్బరిలో నాలుగు, కర్ర పెండలం, ధనియాలు, పసుపు, చేమ, మిరపలో 620, 625, 111 మొదలైన 13 రకాలు నోటిఫై అయ్యాయి. – ఆర్వీఎస్కే రెడ్డి. ఉద్యాన వర్సిటీ పరిశోధన సంచాలకులు నిరంతర కృషి ఉద్యాన వర్సిటీ నుంచి నూతన వంగడాల విడుదలకు నిత్యం కృషి జరుగు తోంది. రాబోయే వంగడాలలో క్వాలిటీ డిసీజ్ ఫ్రీ ప్లాంటు మెటీరియల్, న్యూట్రిషన్ క్వాలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కొబ్బరి విషయంలో అంబాజీపేటతో విజయరాయిలో కూడా సీడ్ లింక్స్ తయారు చేస్తున్నాం. – డాక్టర్ తోలేటి జానకిరామ్, ఉద్యానవర్సిటీ వీసీ -
డ్రైల్యాండ్ హార్టికల్చర్‌లోకి ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగు
వర్షాధారిత భూముల్లో పండ్ల తోటల సాగు ద్వారా జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకం కింద ఏటా వివిధ రకాల పండ్ల మొక్కల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఉపాధి హామీ నిధులతో అమలు చేసే ఈ పథకంలోకి ఈసారి డ్రాగన్ ఫ్రూట్‌ను చేర్చింది. అనంతపురం టౌన్/నార్పల: జిల్లాలో పండ్ల తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. మామిడి, చీనీ, అరటి, బొప్పాయి, సపోటా, దానిమ్మ తదితర పండ్లతోటల విస్తీర్ణం ఏటా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 1,02,224 హెక్టార్లలో తోటలు విస్తరించి ఉన్నాయి. డ్రైల్యాండ్ హార్టికల్చర్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో రైతులు ఉద్యాన తోటల సాగుకు ముందుకు వస్తున్నారు. సంప్రదాయ పండ్ల తోటలే కాకుండా డ్రాగన్‌ఫ్రూట్ వంటి అరుదైన రకాలూ సాగు చేస్తూ ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. రైతుల ఆలోచనలకు తగ్గట్టే అధికారులు కూడా నూతన పండ్లతోటల సాగును ప్రోత్సహిస్తున్నారు. ‘డ్రాగన్’ సాగుకు ప్రోత్సాహం బహుళ పోషకాలు అందించే పండుగా డ్రాగన్ ఫ్రూట్ పేరుగాంచింది. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుండడంతో జిల్లాలోనూ డ్రాగన్‌ఫ్రూట్స్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 80 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగులో ఉంది. నార్పల, కనగానపల్లి, గార్లదిన్నె, పుట్టపర్తి తదితర మండలాల్లోని రైతులు సొంతంగా ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు పంట వేశారు. రైతుల ఆసక్తిని గమనించిన అధికారులు ఈ పంటను కూడా డ్రైల్యాండ్ హార్టికల్చర్ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) నుంచే ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈసారి దాదాపు 15 వేల ఎకరాలలో డ్రైల్యాండ్ హార్టికల్చర్ అమలుచేయనున్నారు. ఇందులో అన్ని పండ్లతోటలతో పాటు డ్రాగన్‌ఫ్రూట్‌కూ అవకాశం కల్పించారు. జిల్లా వాతావరణ పరిస్థితులు దాదాపు అన్ని పండ్లతోటల సాగుకు అనువుగా ఉన్నాయి. దీంతో డ్రాగన్‌ఫ్రూట్ పంట ద్వారానూ లాభాలు గడించవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఈ పంటకు చీడపీడలు, తెగుళ్ల బెడద ఉండదు. ఒక్కసారి పెట్టుబడితో కొన్నేళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో పండ్లు దాదాపు రూ.300 పలుకుతున్నాయి. స్థానికంగా విక్రయించుకున్నా రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు పెద్దసంఖ్యలో పంట సాగుకు ముందుకొచ్చే అవకాశముంది. అర ఎకరాకు రూ.2.50 లక్షల ప్రోత్సాహం డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుకు దరఖాస్తు చేసుకున్న రైతులకు అర ఎకరా వరకు అనుమతి ఇస్తారు. ఇందులో 400 మొక్కలు నాటవచ్చు. మొక్క ధర రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. మొక్కకు సపోర్ట్‌గా నిలువు స్తంభంతో పాటు దానిపై చక్రం ఏర్పాటు చేస్తారు. మొక్క నాటిన రోజు నుంచి మూడేళ్ల పాటు సంరక్షణ కోసం రైతులకు డబ్బు చెల్లిస్తారు. ఇలా ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల నిధులను ఉపాధి హామీ ద్వారా చెల్లించనున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఈ ఏడాది డ్రాగన్ ఫ్రూట్ పంటను డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకంలోకి చేర్చాం. ప్రతి రైతుకూ అర ఎకరా విస్తీర్ణంలో పంట సాగుకు అవకాశం కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటితోపాటు ఒక ఎకరా వరకు మునగ పంట సాగు చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తున్నాం. – వేణుగోపాల్‌రెడ్డి, పీడీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) -
హార్టికల్చర్‌లో యాంత్రికీకరణపై స్వరాజ్ ట్రాక్టర్స్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాగు రంగంలో.. ప్రధానంగా హార్టికల్చర్ తదితర విభాగాల్లో వివిధ దశల్లో యాంత్రికీకరణకు తోడ్పడే ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ డివిజన్ సీఈవో హరీశ్ చవాన్ తెలిపారు. ఇందులో భాగంగా కోడ్ పేరిట ఆవిష్కరించిన కొత్త ట్రాక్టరుకు భారీ స్పందన లభిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి కేవలం రెండు నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు, దేశవ్యాప్తంగా 2,700 పైగా బుకింగ్స్ వచ్చాయని మంగళవారమిక్కడ విలేకరులకు తెలిపారు. డిమాండ్‌ను బట్టి వచ్చే మూడేళ్లలో ఈ కోవకి చెందే మరో రెండు, మూడు ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు చవాన్ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 80 పైగా డీలర్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నట్లు చవాన్ చెప్పారు. పరిశ్రమపరంగా చూస్తే కోవిడ్ వ్యాప్తి సమయంలో 2020–21లో ట్రాక్టర్ల విక్రయాలు సుమారు 26 శాతం పెరిగి దాదాపు తొమ్మిది లక్షల స్థాయిలో నమోదయ్యాయని, అ యితే గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా (దాదాపు 4–5%) మేర క్షీణించాయని తెలిపారు. ఇతర అంశాలతో పాటు కొంత అధిక బేస్ ప్రభావం ఇందుకు కారణమన్నారు. ట్రాక్టర్ల విభాగంలో తమ గ్రూప్‌నకు దాదాపు 40 శాతం వాటా ఉందని చవాన్ చెప్పారు. సానుకూల వర్షపాత అంచనాల మధ్య ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ అమ్మకాలు ఆశావహంగా ఉండగలవని భావిస్తున్నట్లు వివరించారు. కీలక ముడివస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఉత్పత్తుల రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. తమ మొత్తం అమ్మకాల్లో ఏపీ, తెలంగాణ మార్కెట్ల వాటా 10 శాతం మేర ఉంటుందని, గత అయిదేళ్లలో 60,000 పైచిలుకు ట్రాక్టర్లు విక్రయించామని చవాన్ వివరించారు. చదవండి: అదరగొట్టిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..! -
వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!
ఆసియాలోని అతిపెద్ద పూల మార్కెట్ అయిన చైనా పూల మార్కెట్ రోజుకి వేలాదిమంది కస్టమర్ల ఆర్డర్లతో కళకళలాడుతుంది. ఇ-కామర్స్ అనేది చైనాలో అతి పెద్ద వ్యాపారం. అయితే ఇంతవరకు ఆన్లైన్లో సౌందర్య సాధనాలకు సంబంధించిన లగ్జరీ బ్రాండ్ల విక్రయాలతో శరవేగంగా దూసుకుపోయింది. కానీ ఇప్పడూ మాత్రం అనుహ్యంగా ఆన్లైన్ పూల మార్కెట్ మంచి ఆదాయ వనరుగా శరవేగంగా పుంజుకుంటుంది. అంతేకాదు ప్రజలంతా తమ స్మార్ట్ ఫోన్ల సాయంతో ఆన్లైన్లో తమకు నచ్చిన పూల బోకేలను లేదా పూలను ఆర్డర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చైనా పేర్కొంది. (చదవండి: అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!) పైగా చైనా దేశం తమ ఉద్యాన పరిశ్రమ ఆదాయం సుమారు 160 బిలియన్ యువాన్ల (రూ.180 కోట్లు) గా అంచనా వేసింది. అంతేకాదు ఈపూల మార్కెట్‌కి సంబంధించిన ఆన్లైన్ రిటైల్ ఇప్పుడు సెక్టార్ టర్నోవర్‌లో సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ మేరకు ఐదు పుష్పగుచ్ఛాలు, వెంటనే ఆర్డర్ చేసే వారికి కేవలం 39.8 యువాన్లు (రూ.468) మాత్రమే అంటూ చక్కటి ఆకర్షించే ఆఫర్లతో కస్టమర్లను మైమరిపించి కొనేలా చేస్తుంది. దీంతో ఆయా ఆన్లైన్ వ్యాపారా సంస్థలకు సంబంధించిన తమ రోజు వారి ఆదాయాలు మారుతూ వస్తున్నాయి. అంతేకాదు చైనాలో జీవన ప్రమాణాలు పెరగడం వల్ల కట్ ఫ్లవర్‌లకు డిమాండ్ పెరగడంతో దక్షిణ ప్రావిన్స్ యునాన్ ఆ విజృంభణకు కేంద్రంగా మారింది. పైగా ప్రాంతీయ రాజధాని కున్మింగ్ ఆసియాలోనే అతిపెద్ద పూల మార్కెట్‌ను కలిగి ఉంది. పైగా నెదర్లాండ్స్‌లోని ఆల్స్మీర్ తర్వాత ఇదే ప్రపంచంలో రెండవ అతిపెద్దది పూల మార్కెట్. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా స్థంభించిపోయిన ఈ పూల మార్కెట్ ప్రస్తుతం ఈ ఆన్లైన్ విక్రయాలతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ మేరకు ప్రజలు కూడా ఈ మహమ్మారీ భయంతో ఆన్లైన్లోనే విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నటు చైనా వ్యాపార నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రతిరోజూ సగటున నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ పువ్వులు అమ్ముడవుతున్నాయని, పైగా చైనా ఒక్క వాలెంటైన్స్ డే రోజునే దాదాపు 9.3 మిలియన్లను విక్రయిస్తుందని అంటున్నారు. (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
మిరప సహా కూరగాయలు, అలంకరణ మొక్కలకూ కొత్త రకం తామర పురుగుల బెడద
మిరప రైతులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న కొత్త రకం తామర పురుగులు మిరప పూలతో పాటు లేత మిరప కాయలను కూడా ఆశిస్తున్నట్లు డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. లక్షలాది హెక్టార్లలో సాంద్ర పద్ధతిలో సాగులో ఉన్న మిరప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దీని ఉనికిని గుర్తించారు. మిరప తోపాటు టమాటో, బంగాళదుంప, వంగ వంటి సొలనేసియే కుటుంబానికి చెందిన కూరగాయ పంటలకు కూడా కొత్త రకం తామర పురుగులు సోకే ప్రమాదం వున్నందున అప్రమత్తంగా ఉండాలని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది. గత ఏడాది జనవరి–ఫిబ్రవరిలో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, యడ్లపాడు మండలాల్లో మొట్టమొదటి సారిగా కొత్త రకం తామర పురుగులు మిరప పూలను ఆశిస్తున్నట్లు లాం లోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే గుంటూరు జిల్లాలో కొత్త రకం తామర పురుగు మిరప తోటలను ఆశించిందని లాం ఉద్యాన శాస్త్రవేత్తలు గమనించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లోని మిరప తోటలను తామరపురుగు ఆశించిందని సమాచారం. బెంగళూరులోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న వ్యవసాయ సంబంధ పురుగు వనరుల జాతీయ బ్యూరో (ఎన్.బి.ఎ.ఐ.ఆర్.) శాస్త్రవేత్తలతో సంప్రదించిన తర్వాత ఇవి ‘త్రిప్స్ పార్విస్పైనస్’ అనే కొత్త రకం తామర పురుగులని గుర్తించినట్లు డా. వైఎస్సార్ హెచ్.యు. వైస్ ఛాన్సలర్ డా. టి జానకిరాం, పరిశోధనా సంచాలకులు డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త రకం తామర పురుగులు ఇండోనేషియా నుంచి 2015లో మన దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. హవాయి, ఇండోనేషియా దేశాల్లో ఈ తామరపురుగులు సొలనేసియే కుటుంబానికి చెందిన మిరపతో పాటు టమాటో, వంగ, బంగాళ దుంప వంటి కూరగాయ మొక్కలను, అలంకరణ మొక్కలను కూడా ఎక్కువగా ఆశించే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొందరు రైతులు కొత్త రకం తామర పురుగులను చూసి ఎర్రనల్లి అని భావించి సంబంధిత మందులు వాడుతున్నారు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి తెలిపారు. బయో మందులు వాడితే రసంపీల్చే పురుగుల తీవ్రత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ పురుగు ఆశించిన పొలాల్లో రైతులు భయాందోళనలో విపరీతమైన, విచక్షణారహితంగా పురుగుమందులను కొడుతున్నారు. తద్వారా పురుగు ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందువల్ల తాము సిఫారసు చేసిన పురుగుమందులను సూచించిన మోతాదులో పిచికారీ చేయటం ద్వారా ఉధృతిని తగ్గించుకోవచ్చని డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి వివరించారు. సందేహాలు తీర్చుకోవటం ఎలా? ఈ సమస్య గురించి రైతులు మరింత సమచారం తెలుసుకోవాలంటే.. డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని లామ్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి – సీనియర్ శాస్త్రవేత్త డా. సి. శారద (94904 49466), శాస్త్రవేత్త డా. కె. శిరీష (99891 92223)లను అన్ని పని దినాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాల్ చేసి మాట్లాడవచ్చు. రేపు వెబినార్ అధిక వర్షాల సందర్భంగా ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలపై ఈ నెల 24 (బుధవారం) ఉదయం 11 గం. నుంచి మ. 1.30 గం. వరకు డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం జూమ్ ఆప్ ద్వారా వెబినార్‌ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. జూమ్ మీటింగ్ ఐ.డి.. 823 5000 1594 పాస్వర్డ్ – 863362. యూట్యూబ్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. మిద్దె తోటల సాగుపై 3 రోజుల ఆన్లైన్ కోర్సు ఇంటిపై కూరగాయలు, పండ్ల సాగులో మెలకువలు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికుల ప్రయోజనార్థం డిసెంబర్ 16–18 తేదీల్లో మూడు రోజుల పాటు ఆన్లైన్ పద్ధతిలో సర్టిఫికెట్ కోర్సును నిర్వహించాలని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, విస్తరణ విద్యా సంస్థ (ఇ.ఇ.ఐ.) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఆసక్తి గల గృహిణులు, ఉద్యోగులు, యువత తమ ఇంటి నంచే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా శిక్షణ పొందవచ్చని ఇ.ఇ.ఐ. సంచాలకులు డాక్టర్ ఎం. జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్లు డా. ఆర్. వసంత, డా. పి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ కోర్సు జరగనుంది. వంద మందికి మాత్రమే ప్రవేశం. కోర్సు ఫీజు రూ. 1,500. రిజిస్ట్రేషన్ కోసం... https://pjtsau.edu.in/www.eeihyd.org/ https://forms.gle/wPriDddKVao9Ecj16 ఆకాశ్ చౌరాసియా 5 రోజుల శిక్షణా శిబిరం సేంద్రియ సేద్య పద్ధతిలో బహుళ అంతస్థుల వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ 14 జాతీయ అవార్డులు దక్కించుకున్న యువ రైతు శాస్త్రవేత్త ఆకాశ్ చౌరాసియా తెలంగాణలో 5 రోజుల ఆచరణాత్మక శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు మెదక్ జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లెలోని ‘ఐ.డి.వి.ఎం. కామ్యవనం’ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుంది. మల్టీ లేయర్ ఫార్మింగ్ సహా 11 అంశాలపై శిక్షణ ఇస్తారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ చౌరాసియా ఆరుతడి పంటల ద్వారా ఏడాది పొడవునా అధికాదాయం పొందే ఆచరణాత్మక మార్గాలపై శిక్షణ ఇవ్వటంలో ఆయన ప్రసిద్ధి పొందారు. 50 మందికే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనదలచిన వారు భోజనం, వసతి, శిక్షణ రుసుముగా రూ. 4 వేలు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాల కోసం.. 94495 96039. - పతంగి రాంబాబు, సాగుబడి చదవండి: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
గ్రీన్ సిటీ ప్లానింగ్.. రొసారియో సక్సెస్ స్టోరీ ఇది!
పట్టణాలు.. నగరాల సరిహద్దు కమతాలు ప్లాట్లుగా.. బహుళ అంతస్తుల భవనాలుగా కనిపిస్తున్న సంగతి తెలుసు! అవే పట్టణాలు, నగరాల పొలిమేర భూములే కాదు.. నడిబొడ్డు ఖాళీస్థలాలు కూడా కూరగాయలు పండించే తోటలుగా మారుతున్న వైనం తెలుసా?! దీన్నే అర్బన్.. పెరీ అర్బన్ హార్టికల్చర్’ అంటున్నారు. సింపుల్‌గా ‘గ్రీన్ సిటీస్ ప్లానింగ్’ అన్నమాట!! ఇదే ప్రస్తుత ప్రపంచ ఒరవడి.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు గొప్ప వరం! అనుసరిస్తే పోయేది మురికివాడలు.. పెరిగేది ఉపాధి.. సిద్ధించేవి పర్యావరణ ప్రియ ప్రాంతాలు!! ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించడానికి వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ‘ప్రైజ్ ఫర్ సిటీస్’ అవార్డులనూ అందిస్తోంది రెండేళ్లకోసారి. ఈ ఏడు అర్జెంటీనాలోని ‘రొసారియో’ ఆ అవార్డ్‌ను అందుకుంది. అసలు గ్రీన్ సిటీస్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? రొసారియో సక్సెస్ స్టోరీ ఏంటీ? వివరాలు ఈ కవర్ స్టోరీలో.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరాలు, పట్టణాలు గతమెన్నడూ ఎరుగనంత వేగంగా విస్తరిస్తున్నాయి. ఉపాధిని వెతుక్కుంటూ పొట్ట చేత పట్టుకొని గ్రామీణులు వలస బాట పడుతున్న కారణంగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరాలు/పట్టణ ప్రాంత జనాభా నానాటికీ భారీగా పెరుగుతోంది. ప్రపంచంలో సగానికిపైగా జనం ఇప్పటికే నగరవాసులు. 2050 నాటికి ప్రపంచ జనాభా (900 కోట్లు)లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు పట్టణ ప్రాంతవాసులవుతారట. 2025 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో సగానికి సగం (350 కోట్ల) మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారని ఓ అంచనా. ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో నగరీకరణకు శతాబ్దాల కాలం పట్టింది. అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామికీకరణ నేపథ్యంలో వేగంగా పెరుగుతున్న తలసరి ఆదాయం మూలంగా రెండు–మూడు తరాల్లోనే నగరీకరణ వేగవంతమవుతోంది. ఉపాధి అవకాశాల మెరుగుకన్నా అధిక జననాల రేటు కారణంగానే ఈ పట్టణ ప్రాంతాల్లో జనాభా సాంద్రత పెరుగుతోంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని అల్పాదాయ దేశాల్లోని నగరాల జనాభా ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ నగరీకరణతో పేదరికం, నిరుద్యోగం, ఆహార అభద్రత కూడా పోటీపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు తగినంత ఆరోగ్య, నీటి, పారిశుద్ధ్య సదుపాయాలకు నోచుకోక, కాలుష్యపు కోరల్లో చిక్కి, కిక్కిరిసిన మురికివాడల్లో జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నగరాలు, పట్టణాల్లో నివాసం ఉండే 77 కోట్ల మందిలో సుమారు 30% మంది నిరుద్యోగులు లేదా అత్యల్ప ఆదాయంతో బతుకులీడుస్తున్న నిరుపేదలు. లాటిన్ అమెరికా దేశాల్లో పేదల్లో 85% మంది.. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని పేదల్లో సగానికి సగం మంది ఇప్పటికే నగరాలు, పట్టణ ప్రాంతాలకు చేరి ఉపాధి వెతుక్కుంటున్నారు. దీని అర్థం ఏమిటంటే.. సాంఘిక భద్రత, ఉపాధి అవకాశాలు కొరవడిన పేదలతో మన పట్టణాలు, నగరాలు గతమెన్నడూ ఎరుగనంతగా కిక్కిరిసిపోయి ఉన్నాయి. గ్రీన్ సిటీలే శరణ్యం చారిత్రకంగా నగరీకరణలో ఆశావహ పరిస్థితి కొరవడిందని చెప్పలేం. అయితే, నగరీకరణ జరుగుతున్న తీరు మాత్రం ప్రజలకు సుస్థిరమైన జీవనాన్ని అందించే రీతిలో లేదన్నది వాస్తవం. వందల కిలోమీటర్ల దూరం నుంచి రవాణా అయ్యే ఆహారోత్పత్తులపైనే నగరాలు, పట్టణాలు అమితంగా ఆధారపడుతుండటం పెను సవాలుగా నిలిచింది. దూర ప్రాంతాల నుంచి ఆహారోత్పత్తుల్ని తరలించడం వల్ల భూతాపం పెరుగుతున్నది. అస్థిర పద్ధతుల నుంచి మళ్లించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా నగరీకరణను నడిపించడం ఇప్పుడు మానవాళి ముందున్న పెద్ద సవాలు. నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్థానికంగా ఉత్పత్తి చేసుకునే పౌష్టికాహార లభ్యతతో కూడిన మెరుగైన సుస్థిర జీవనం వైపు.. ఆశావహమైన అవకాశాల దిశగా అడుగులు వేయాలంటే ‘గ్రీనర్ సిటీస్’ను నిర్మించుకోవటం అనివార్యమని, అసాధ్యమూ కాదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. భరోసా ఇస్తోంది. అర్బన్ హార్టికల్చర్‌కు పెద్ద పీట పర్యావరణ మార్పుల్ని తట్టుకోవటం, స్వావలంబన, సాంఘిక, ఆర్థిక, పర్యావరణ సుస్థిరత ప్రధానాంశాలే గ్రీన్ సిటీస్ భావన. పర్యావరణ అనుకూల సూత్రాలను ఇముడ్చుకున్న అత్యాధునిక భవన నిర్మాణ పద్ధతులు, సైకిల్ గ్రీన్‌వేస్, పట్టణ వ్యర్థాల పునర్వినియోగం.. వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. దీన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పటి నుంచో అమలుపరుస్తున్నాయి. అల్పాదాయ దేశాల్లో స్థితిగతులు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భిన్నంగా ఉన్నప్పటికీ గ్రీనర్ సిటీస్ నమూనాతో కూడిన పట్టణాభివృద్ధి ప్రణాళికను అనుసరించవచ్చు. ఆహార భద్రతను కల్పించడం, గౌరవప్రదమైన పనిని, ఆదాయాన్ని పొందే మార్గాలు చూపటం, శుద్ధమైన పర్యావరణాన్ని, సుపరిపాలనను ప్రజలందరికీ అందించాలన్నవి ఈ నమూనాలో ముఖ్యాంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే పట్టణ, నగర పరిధిలో, పరిసర ప్రాంతాల్లో ప్రకృతికి, ప్రజారోగ్యానికి హాని కలగని వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు వంటి ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యమివ్వటం గ్రీనర్ సిటీస్ నమూనా. అటు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, ఇటు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం గ్రీన్ సిటీ ప్లానింగ్‌లో ‘అర్బన్ అండ్ పెరీ అర్బన్ హార్టికల్చర్’కు చోటు కల్పిస్తుండటం ఆధునిక ధోరణిగా ప్రాచుర్యంలోకి వస్తోంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బంగాళదుంపలు, బీట్రూట్ వంటి దుంప పంటలు, అలంకరణ, ఔషధ మొక్కలను సాగు చేయవలసింది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాదు. పట్టణాలు, నగరాలు వాటి పరిసర ప్రాంతాల్లోనూ చేయాలి. ఇలా ప్రత్యేక శ్రద్ధతో రైతులు, పట్టణ పేదలతో సాగు చేయించడాన్నే ‘అర్బన్, పెరీ అర్బన్ హార్టికల్చర్’ అంటున్నాం. పట్టణాలు, నగరాల్లో తమ కుటుంబం తినటం కోసం, మిగతాది అమ్మటం కోసం ఉద్యాన పంటలు పండించే అర్బన్ ఫార్మర్స్ ఆఫ్రికాలో 13 కోట్ల మంది, లాటిన్ అమెరికాలో 23 కోట్ల మంది ఉన్నారని ఎఫ్.ఎ.ఓ. అంచనా. గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్ ప్రాంతాలకు వలస వచ్చిన పేదలు ఉద్యాన పంటలు సాగు చేసి పొట్టపోసుకోవటం కొన్ని దేశాల్లో సాధారణమే. మరికొన్ని దేశాల్లో అర్బన్ హార్టికల్చర్‌పై నిషేధం అమల్లో ఉంది. అయితే, క్రమంగా ఈ ధోరణిలో మార్పు వస్తోంది. సిటీ ఫార్మర్స్‌కు అడ్డంకిగా ఉన్న నిబంధనలు తొలగించి, ప్రోత్సాహకాలను అందించటం, శిక్షణ ఇవ్వటం వంటి విషయాలపై విధాన సహాయం కోసం ఇటీవల కాలంలో 20 ఆఫ్రికా దేశాలు ఎఫ్.ఎ.ఓ.ను ఆశ్రయించడం ట్రెండ్ మారుతున్నదనడానికి నిదర్శనం. నగర పరిసర ప్రాంతాల్లో వాణిజ్యస్థాయిలో విస్తృతంగా పంటల సాగు, మురికివాడల్లో మట్టి లేకుండా హైడ్రోపోనిక్ పద్ధతుల్లో మైక్రో గార్డెన్ల నిర్వహణ.. నగరాల్లో కిక్కిరిసిన ఇళ్లపై రూఫ్‌టాప్ కిచెన్ గార్డెన్ల సాగుపై ఎఫ్.ఎ.ఓ. మార్గదర్శనం చేస్తోంది. పట్టణ పేదలకు పౌష్టికాహార, ఆహార భద్రతను కల్పించడంలో, సాధికారత చేకూర్చడంలో అర్బన్, పెరీ అర్బన్ హార్టీకల్చర్ నిస్సందేహంగా దోహదపడుతున్నట్లు ఎఫ్.ఎ.ఓ. తదితర సంస్థల కార్యక్రమాల ద్వారా రుజువైంది. అర్బన్ హార్టీకల్చర్కు నగర అభివృద్ధి ప్రణాళికల్లో పెద్ద పీటవేయడం ద్వారా గ్రీన్ సిటీల వికాసం సాధ్యమేనని వివిధ దేశాల అనుభవాలూ తెలియజెబుతున్నాయి. రొసారియో.. ఓ వేగుచుక్క! లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనా లోని రొసారియో నగరం అర్బన్ హార్టికల్చర్‌పై ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. నగరాభివృద్ధి ప్రణాళికలో అర్బన్ హార్టికల్చర్‌ను అంతర్భాగం చేయటం ద్వారా బహుళ ప్రయోజనాలు సాధిస్తూ ప్రపంచ నగరాలకు ఆదర్శంగా నిలిచింది. మురికివాడల్లోని నిరుపేదలకు నగరంలో, నగర పరిసరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను శాశ్వత ప్రాతిపదికన లీజుపై కేటాయించారు. ఆయా స్థలాల్లో సేంద్రియ కూరగాయలు, పండ్లు పండించుకునేందుకు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో శిక్షణ ఇవ్వటంతోపాటు రొసారియో మునిసిపల్ కార్పొరేషన్ సదుపాయాలు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉద్యాన అధికారులను నియమించింది. కర్షక కుటుంబాలు తినగా మిగిలిన కూరగాయలు, పండ్లను, వాటితో తయారు చేసిన అనేక రకాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేసింది. తద్వారా వారు ఉపాధి పొందేందుకు వినూత్న అవకాశం కల్పించింది. నగరంలో ప్రతి పౌరుడికి 12 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న అత్యంత ఆకుపచ్చని అర్జెంటీనా నగరంగా రొసారియోను అమెరికా అభివృద్ధి బ్యాంకు 2019లో గుర్తించింది. నగరంలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగుతో పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా నగర వాతావరణాన్ని సైతం చల్లబరచుకోవచ్చని, భూతాపాన్ని తగ్గించవచ్చని రొసారియో రుజువు చేస్తోంది. ప్రజలకు అవసరమైన పంటలను వందల కిలోమీటర్ల నుంచి తీసుకురాకుండా నగరం పరిధిలోనే సాగు చేసుకొని తింటున్నందున హరిత గృహ వాయువులు 95% మేరకు తగ్గాయని రొసారియో నేషనల్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. 20 ఏళ్ల కృషి అర్జెంటీనాలో మూడో పెద్ద నగరం రొసారియో. ప్రముఖ మార్క్సిస్టు విప్లవకారుడు చేగువేరా జన్మస్థలం ఇదే. ప్రస్తుత జనాభా 17.5 లక్షలు. పరనా నది ఒడ్డున రొసారియో మునిసిపల్ కార్పొరేషన్ 179 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. పారిశ్రామిక కేంద్రంగా, వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విరాజిల్లిన రొసారియో.. 2001లో, సరిగ్గా 20 ఏళ్ల క్రితం, పెను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. చాలా పరిశ్రమలు మూతపడి నగరంలో సగానికిపైగా జనాభా నిరుపేదలుగా మారిపోయారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. ఆహారం ధరలు నాలుగు రెట్లు అధికమై.. జనం ఆకలి దాడులకు పాల్పడాల్సిన దుస్థితి. అటువంటి సంక్షోభ కాలంలో రొసారియో మునిసిపల్ కార్పొరేషన్ 2002లో అర్బన్ హార్టికల్చర్ పథకం ‘ప్రో–గార్డెన్’ అమలుకు శ్రీకారం చుట్టింది. రసాయనాలు వాడకుండా ఉద్యాన పంటలు సాగు చేయటంలో 700 కుటుంబాలకు తొలుత శిక్షణ ఇచ్చారు. వీరంతా పేదలే. మహిళలు, వయోవృద్ధులు, యువత, వలస జీవులు. మొదట్లో జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, స్థానికంగా ఆహార భద్రత, ఆదాయ భద్రత ఏర్పడుతున్న విషయం అర్థమయ్యేటప్పటికి అర్బన్ హార్టికల్చర్ ప్లాట్లకు, ఉమ్మడిగా నిర్వహించుకునే కమ్యూనిటీ గార్డెన్లకు గిరాకీ పెరిగింది. కనీస వేతనం కన్నా ఎక్కువగానే సంపాదన కనిపించసాగింది. ఒక దశలో పదివేలకు పైగా పేద కుటుంబాలు ఈ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. తొలి రెండేళ్లలోనే 800కు పైగా పౌర బృందాల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు నగరపరిధిలో ఉన్న ఖాళీ స్థలాలు 185 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సాగు చేస్తున్నారు. నగర పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో 2,400కు పైగా పేద కుటుంబాలు సొంతంగా ఫ్యామిలీ గార్డెన్లను పెంచుతున్నాయి. జాతీయ కుటుంబ వ్యవసాయదారుల జాబితాలో వీరి పేర్లు నమోదు కావడంతో సాంఘిక భద్రతా పథకాల ద్వారా ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటును వీరు అందుకోగలిగారు. పండించిన సేంద్రియ ఉద్యాన ఉత్పత్తులను ప్రజలకు విక్రయించుకునేందుకు 7 చోట్ల ప్రత్యేక శాశ్వత మార్కెట్లను నెలకొల్పారు. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో ఎక్కువగా జన్యుమార్పిడి సోయా చిక్కుళ్లను ఏకపంటగా రసాయనిక సాగు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. నగర పరిసరాల్లోని 1,977 ఎకరాల అర్బన్ భూముల్లో చిన్న ప్లాట్లలో రకరకాల సేంద్రియ ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా 2,500 టన్నుల సేంద్రియ పండ్లు, కూరగాయలను సాగు చేస్తూ స్థానిక ప్రజలకు అందిస్తున్నారు. 25 మంది ఉద్యాన నిపుణుల ప్రత్యక్ష సేవలను ఉపయోగించుకుంటూ ఆశాజనకమైన సేంద్రియ దిగుబడులు సాధిస్తున్నారు. ఇటు మునిసిపాలిటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు రెండు దశాబ్దాలు చురుగ్గా పాల్గొనడంతో రొసారియో అర్బన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ నగర పేదలకు ఆహార, ఆరోగ్య, ఆదాయ భద్రతతోపాటు గణనీయమైన స్థాయిలో పర్యావరణ సేవలను సైతం అందించడంతో సూపర్ హిట్ అయ్యింది. దీన్ని అర్బన్ ప్లానింగ్‌లోనూ చేర్చారు. ప్రకృతి వనరులను కలుషితం చేయకుండా, వ్యర్థాలను పునర్వినియోగిస్తూ ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తిని చేపట్టడంతో సిటీలోని అర్బన్ ఫామ్స్ ద్వారా కనీసం 40 వేల మందికి ఆహార భద్రత చేకూరింది. 340 ఉత్పాదక బృందాలు పంట దిగుబడులకు విలువ జోడించి రకరకాల ఉత్పత్తులను తయారు చేసే సామాజిక వ్యాపార సంస్థలుగా మారాయి. నగరంలో ఖాళీగా ఉండి ఎందుకూ పనికిరావనుకున్న ఖాళీ స్థలాలు, గతంలో చెత్తాచెదారం పోసిన డంపింగ్ యార్డులను సైతం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పునరుజ్జీవింప జేయటంతో పట్టణ ప్రాంతం అంతా పచ్చని పంటలతో నిండిపోయింది. అర్బన్ లాండ్ బ్యాంక్ ఉద్యాన పంటల కోసం అర్బన్ గార్డెన్లను ఏర్పాటుచేయడంతో అనాదరణకు గురైన పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ఉపాధి అవకాశాలు దొరికాయి. సాంఘికంగా పరపతి పెరిగింది. రొసారియో యూనివర్సిటీ ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాల వివరాలతో డేటాబేస్ తయారు చేసింది. మునిసిపల్ అధికారులు అర్బన్ లాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి, భూయజమానులకు, అర్బన్ ఫార్మర్స్‌కు అనుసంధానంగా పనిచేస్తూ దీర్ఘకాలిక కౌలు ఒప్పందం అమలు చేయడంతో ఇది సజావుగా సాగుతోంది. సామాజికంగా పరస్పరం సహకరించుకుంటూ నగర పేదలు సేంద్రియ ఆహారాన్ని ఉత్పత్తి చేసే సానుకూల పరిస్థితులు నెలకొనటం అర్బన్ హార్టికల్చర్ పథకం సాధించిన మరో ఘనతగా చెప్పవచ్చు. సేంద్రియ అర్బన్ హార్టికల్చర్ క్షేత్రాలను ‘ఆహార పర్యాటక’ కేంద్రాలుగా తీర్చిదిద్దటం మరో విశేషం. ‘రొసారియో గ్రాస్ రూట్స్’ పేరిట ప్రతి వసంత రుతువులో నిర్వహించే ఉత్సవానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు. అర్బన్ హార్టికల్చర్ ప్రయోజకతకు మా అనుభవమే రుజువు! 20 ఏళ్లుగా నిరంతరాయంగా విధానపరమైన మద్దతుతో అర్బన్ హార్టికల్చర్ పథకం దిగ్విజయంగా అమలవుతోంది. ‘ప్రైజ్ ఫర్ సిటీస్’ పురస్కారం ఉత్సాహంతో ఈ పథకం అమలును మరింత బలోపేతం చేస్తాం. అర్బన్ హార్టికల్చర్ ద్వారా సుస్థిర ఆహారోత్పత్తితోపాటు సాంఘిక, పర్యావరణపరమైన ప్రయోజనాలనూ చేకూర్చవచ్చని మా అనుభవం రుజువు చేస్తోంది. ప్రకృతితో వ్యవహరించే తీరు మార్చుకోవాల్సిన అవసరం గతమెన్నడూ లేనంతగా ఇప్పుడు మనకు అర్థమవుతోంది. – పాబ్లో జావ్కిన్, రొసారియో నగర మేయర్, అర్జెంటీనా ప్రైజ్ ఫర్ సిటీస్ ఈ నేపథ్యంలో రొసారియో నగరం ప్రతిష్ఠాత్మకమైన ‘ప్రైజ్ ఫర్ సిటీస్ అవార్డు–2021’ను ఇటీవల గెలుచుకుంది. వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ రెండేళ్లకోసారి రెండున్నర లక్షల డాలర్లతో కూడిన ఈ పురస్కారాన్ని అందిస్తుంటుంది. ‘మారుతున్న వాతావరణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటున్న నగరం’ పేరిట నిర్వహించిన పోటీకి 54 దేశాల నుంచి 262 నగరాలు దరఖాస్తు చేయగా రొసారియో విజేతగా నిలిచింది. అర్బన్ హార్టికల్చర్ పథకాలకు అమృతాహారం ద్వారా నగర పేదలు, మధ్యతరగతి ప్రజల ఆహార, ఉపాధి అవసరాలను తీర్చడంతోపాటు.. కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న నగరానికి పర్యావరణాభివృద్ధి చేకూర్చి ‘గ్రీన్ సిటీ’గా మార్చే శక్తి కూడా సమృద్ధిగా ఉందని రొసారియో సుసంపన్న అనుభవం చాటిచెబుతోంది. నగర పాలకులూ వింటున్నారా? – పంతంగి రాంబాబు -
హైదరాబాద్: నగరవాసులకు తీపి కబురు
సాక్షి, బంజారాహిల్స్: నగరవాసులకు తీపి కబురు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నర్సరీ మేళా వచ్చేస్తోంది. ప్రకృతి ప్రియులకు చేరువలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఆలిండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో పేరుతో పదో గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఈ నర్సరీ మేళాను నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ప్రవేశ రుసుము రూ.20. చదవండి: పేరుకి కోటీశ్వరులు.. మరి అందులో కక్కుర్తి ఎందుకో ► ఈ మేళాలో వివిధ రకాల మొక్కలు, వివిధ ప్రాంతాల అరుదైన జాతులను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా గార్డెనింగ్ మెథడ్స్, టెర్రస్ గార్డెనింగ్, వరి్టకల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్, కిచెన్ గార్డెనింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ► దేశవ్యాప్తంగా వివిధ జాతుల మొక్కలను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కల పెంపకంపై అవగాహన కలిగించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ మేళాలో వందస్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నర్సరీ ప్లాంట్లు కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ► గ్జోటిక్ ప్లాంట్స్, బోన్సాయ్, అడనీయం, ఇండోర్, అవుట్డోర్, హై క్వాలిటీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్, మెడిసినల్ అండ్ ఆక్సిజన్ ప్యూరిఫయింగ్ ప్లాంట్స్, ఆర్గానిక్ మొక్కలు, సేంద్రీయ ఎరువులు, సెరామిక్ అండ్ ఫైబర్ ప్లాంట్ స్టాండ్స్, హై క్వాలిటీ సీడ్స్, బల్బ్సŠ, టూల్స్, దేశీయ, అంతర్జాతీయ ఎక్విప్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ మేళా జరుగుతోంది. -
హార్టికల్చర్, సెరీ కల్చర్, మైక్రో ఇరిగేషన్‌పై సీఎం జగన్ సమీక్ష
-
అగ్రికల్చర్ విద్యార్థులు ఆర్బీకేల్లో నెల రోజులు పని చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: హార్టికల్చర్,సెరికల్చర్,వ్యవసాయ అనుబంధశాఖలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవాలి. నిరంతర పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అధ్యయనం, ప్రయోగాలు కొనసాగాలి. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూలమైన రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలు ఉండాలని’’ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కర్నూలులో ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టండి ‘‘కర్నూలు జిల్లాలో మంచి మార్కెట్ అవకాశాలున్న ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టండి. నాణ్యమైన మంచి రకం ఉల్లి సాగయ్యేలా చూడండి. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉన్న వెరైటీలు సాగయ్యేలా చూడాలి. టమోటను రోడ్డుమీద వేయడం, ధరలేక పొలంలోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే పరిస్ధితి కనిపించకూడదు. దీనికోసం సరైన పరిష్కారాలను చూపాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏపీ ఉద్యానపంటల్లో గరిష్ట సాగుతో ఏపీ ప్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై సీఎంకు వివరాలందించారు. వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. కొబ్బరి, బొప్పాయి, టమోట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిల్చిందని అధికారులు తెలిపారు. మిరప పంట విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. టిష్యూ కల్చర్ విధానంలో అరటిసాగు చేపడుతున్నామన్నారు. పుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులు మొదలు కావాలని సీఎం జగన్ అదేశించారు. అక్టోబరు నుంచి దశలవారీగా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. కొబ్బరికి మంచి ధర వచ్చేలా చూడాలి కొబ్బరికి కూడా మంచి ధర వచ్చేలా చూడాలని.. కొబ్బరిమీద నిరంతరం పరిశోధనలు చేయాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వీసీని సీఎం జగన్ ఆదేశించారు. కొబ్బరిసాగులో ఎదురవుతున్న సమస్యల మీద నిరంతరం పరిశోధనలు కొనసాగాలని.. అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సహకారం, సమాచార మార్పిడి నిరంతరం కొనసాగాలని తెలిపారు. దీనివల్ల మంచి వంగడాలను పెట్టడంతోపాటు సాగులో వస్తున్న సమస్యలకు మంచి పరిష్కారాలు లభిస్తాయన్నారు. వీటితోపాటు ప్రాసెసింగ్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపైనా ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరగాలన్న సీఎం.. వీటికి అనుగుణంగా సాగులో మార్పులు, అనుకూలమైన వంగడాలను సాగుచేసేలా తగిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ‘‘రైతుభరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలను నివృత్తి చేసేలా వ్యవస్థ ఉండాలి. ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆ సందేహాలను తీర్చేలా ఉండాలి. దీనివల్ల రైతులకు, అగ్రికల్చర్ అసిస్టెంట్లకు మధ్య మంచి వాతావరణం ఉంటుంది.. అనుకున్న ఫలితాలను సాధించగలుగుతాము. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలి. అగ్రికల్చర్ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలి. దీనివల్ల వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం వస్తాయని’’ సీఎం జగన్ తెలిపారు. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సిహించాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు. బోర్లు కింద వరిసాగు, సుబాబుల్, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల సాగుని క్రమంగా తగ్గించి, ఉద్యానపంటలసాగు వైపు మొగ్గుచూపేలా రైతులను మోటివేట్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. 2020–21లో ఈ విధంగా 1 లక్షా 42వేల 565 ఎకరాల్లో అదనంగా ఉద్యానపంటలు సాగు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. ఈ యేడాది 1,51,742 ఎకరాల్లో ఉద్యాన పంటల అదనపు సాగు లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు అధికారులు. పువ్వుల (ప్లోరీకల్చర్) రైతుల విషయంలో సరైన మార్కెటింగ్ అవకాశాలు, వాటి ప్రాసెసింగ్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీఎంఐపీ పైనా సీఎం సమీక్ష ‘‘తుంపరసేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలి. ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉండాలి. రివర్స్ టెండరింగ్‌కు వెల్లడం ద్వారా కూడా రేట్లు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన పరికరాలు మంచి రేట్లకు ప్రభుత్వానికి, రైతులకు అందుబాటులోకి వస్తాయి. అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలి’’ అన్నారు సీఎం జగన్. సెరికల్చర్ సాగు– ప్రోత్సాహం సెరికల్చర్ సాగు విధానం, ఉత్పాదకతపై అధికారులు సీఎం జగన్‌కు వివరాలందించారు. పట్టుగూళ్ల విక్రయాల్లో ఇ– ఆక్షన్ విధానం తీసుకొచ్చామని తెలిపారు అధికారులు. దీనివల్ల దేశవ్యాప్తంగా వ్యాపారులు కొనుగోలుచేస్తున్నారని, రైతులకు ధరలు వస్తున్నాయని తెలిపారు. 1250కి పైగా ఆర్బీకేల పరిధిలో పట్టుపురుగులు పెంచుతున్న రైతులు ఉన్నారన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. సెరికల్చర్ సాగు ప్రోత్సాహకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని.. రైతులకు షెడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని.. తద్వారా చిన్న రైతులను సెరికల్చర్ సాగులో ప్రోత్సహించినట్టవుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ, సహాకార, పశుసంవర్ధక, పాడిపరిశ్రామభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, హార్చికల్చర్ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ డాక్టర్ జి శేఖర్ బాబు, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ ఎల్ శ్రీధర్‌రెడ్డి, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీఓ డాక్టర్ హరినాథ్ రెడ్డి, వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి జానకిరామ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20వేల ఆర్థికసాయం: కన్నబాబు
సాక్షి, అమరావతి: నూజివీడును ఉద్యానవన పంటల హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సోమవారం నూజివీడులో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.250 కోట్లతో జామ, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.2600 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ఒక హార్టీ కల్చర్ హబ్, ఆయిల్ ఫామ్ రైతులకు ఓఈఆర్ ధర చెల్లిస్తున్నామని చెప్పారు. టన్ను రూ.7 వేల నుంచి రూ.19 వేలు దాటేలా చర్యలు తీసుకున్నామని, మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20వేల ఆర్థికసాయం అందించునున్నట్లు భరోసా ఇచ్చారు. చదవండి: బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే -
ప్రజా ఉద్యమంలా ఇంటిపంట
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఆహారం లో పురుగు మందుల అవశేషాలు ఎరుగుతున్న నేపధ్యం లో 2011లో ‘సాక్షి’ దినపత్రిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం, హార్టీకల్చర్ సొసైటీలు కలిసి హైదరాబాద్ నగరంలో ఇంటిలోనే, వున్న స్థలం లోనే కొన్ని కూరగాయలు పండించుకోవటం, ఇంటిలో ఉండే జీవ వ్యర్ధాల్ని కంపోస్ట్‌గా మార్చి వాడుకోవటం వాడుకోవటంపై కొన్ని శిక్షణలు, అనుభవాలు పంచుకోవటానికి ఒక వేదిక గా ‘ఇంటిపంట’ ప్రారంభించటం జరిగింది. ప్రతి వారం రెండు రోజులు సాక్షి పత్రికలో వ్యాసాలు, అనుభవాలు పంచుకోవటం, హైదరాబాద్ నగరం ఏదో ఒక ప్రాంతంలో ఒక సాయంత్రం దీనిపై శిక్షణ ఏర్పాటు చేయటం వలన వేల మంది ఇందులో పలు పంచుకునే అవకాశం కలిగింది. మా ఇంటితో పాటు నగరంలో చాలా ఇళ్లు ఇంటిపంటల ప్రదర్శన శాలలుగా మారాయి. ఉద్యానవన శాఖ, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఇంకా అనేక సంస్థలు తమ ఆఫీస్‌పైన కూడా కూరగాయలు పండించటం, భారతీయ విద్యా భవన్‌లాంటి స్కూళ్లలో కూడా పిల్లలతో ఇలాంటి ప్రయత్నాలు చేయటం జరిగింది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్ సంస్థల్లోను, స్వచ్ఛంద సంస్థలలోను ఈ శిక్షణలు ఏర్పాటు చేయటం, ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరిగింది. కొన్ని అపోహలు, సమస్యలు.. పరిష్కారాలు చాలా మందికి ఇంటిపైన పంటలు పెంచుకోవటానికి కుండీలు కాని, బెడ్స్ కాని ఏర్పాటు చేసుకుంటే బరువుకి ఇంటికి ఏమవుతుంది అని భయపడుతుంటారు. కుండీలు/ బెడ్స్‌లో సగానికంటే ఎక్కువ భాగం కంపోస్ట్, పావు వంతు కోకోపిట్ (కొబ్బరి పొట్టు) కలుపుకుంటే బరువు తగ్గుతుంది, నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది, అలాగే మట్టి గట్టిపడే సమస్య తగ్గుతుంది. నీరు పెట్టటం వలన ఇంటి పై కప్పు పాడయ్యే అవకాశం వుంటుంది అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. మనం కావలిసినంత మేరకే నీరు పెట్టుకోవాలి, నీరు కొద్దిగా బయటకు వచ్చినా పెద్ద సమస్య ఉండదు. సీజన్లో పండే కూరగాయలు, ఆకుకూరలు కలిపి ఈ కుండీలు/ కంటైనర్లు/ బెడ్స్ పైన పండించుకోవచ్చు. ‘ఇంటిపంట’తో వచ్చిన అనుభవాలతో ‘బడి పంట’ కూడా ప్రారంభించటం జరిగింది. చిన్న స్కూల్లో పిల్లలు నేర్చుకోవటానికి ఉపయోగపడే వాటి నుంచి, మధ్యాహ్న భోజన అవసరాలు తీరేలా, హాస్టల్ అవసరాలు తీరేలా ఈ బడి తోటలు డిజైన్ చేయటం జరిగింది. తెలంగాణ లో ఇప్పుడు కొన్ని రెసిడెన్సియల్ స్కూల్లో ఈ మోడల్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే, ఇంటిపంట సాగులో భాగస్వాములు అయిన అనేక మంది అనేక మోడల్స్ ఏర్పాటు చేయటం, విత్తనాల సేకరణ, పంచుకోవటం చేయటం చేసారు. ఒక సంవత్సరంలోనే 10 వేల మందికి పైగా ఇంటిపంటలు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ కార్యక్రమం ప్రభావం ఎంత వున్నది అన్నది అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికి అనేక పేర్లతో, అనేక వాట్సప్ గ్రూప్‌లలో, ఫేస్బుక్ గ్రూప్‌లలో ఇంటిపంటలు పండించుకునే వారు తమ తమ అనుభవాలు పంచుకోవటం, ఇతరుల నుంచి నేర్చుకోవటం చేస్తున్నారు. చిన్న స్థలాన్ని కూడా సమర్ధవంతంగా ఇంటి ఆహారం పండించుకోవటానికి ఎలా వాడుకోవచ్చు అని అర్ధం చేసుకోవటంతో పాటు రెండు కీలకమైన అంశాలు ఈ శిక్షణలో భాగస్వామ్యం అయ్యాయి. ఒకటి, ఇంటి వ్యర్ధాల్ని బయట పడేసి పర్యావరణాన్ని పాడు చేసే కంటే, ఇంటిలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో, కాలనీలలోనే కంపోస్ట్ చేసుకునే పద్దతులు, రెండు, ఇంటిపై, చుట్టూ పడిన వాన నీటిని ఫిల్టర్ చేసుకొని మరల వాడుకోవటానికి ప్రయత్నం చేయటం. ఈ మూడు పద్ధతులు కాని ప్రతి ఇంటిలో పాటిస్తే నగరంలో మనం చూస్తున్న చెత్త, వర్షం రాగానే జలమయం అవుతున్న రోడ్ల సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. ఇందుకు ప్రతి కాలనీ/అపార్ట్మెంట్ వేల్ఫేర్ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేయాలి. ఒక చిన్న ఆలోచన, చిన్న ప్రయత్నం ఒక ప్రజా ఉద్యమంగా ఎలా తాయారు అవుతుంది అన్న దానికి మన ‘ఇంటిపంట’ ఒక ఉదాహరణ. ‘సాక్షి’ దిన పత్రిక ఆ తర్వాత చేసిన ‘సాగుబడి’ ప్రయత్నం కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి తోడ్పడింది. ఇలాంటి అనేక ప్రయత్నాలు ‘సాక్షి’ చేయాలని, హైదరాబాద్ నగర వాసులు ఇలాంటి ప్రయత్నాలలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ అందరికీ అభినందనలతో పాటు ఇలాంటి ప్రయత్నాలకి మా వంతు సహకారం ఇస్తామని మరల, ఒకసారి ఇలాంటి ప్రయత్నం అందరం చేయాలనీ ఆశిస్తున్నాం. – డాక్టర్ జీ వీ రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం (90006 99702) -
ప్రాధేయపడినా కనికరించలేదు..
ఆయన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు. గతంలో అధ్యాపకుడిగా ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన పెద్దసారు.. కానీ తన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు రీయింబర్స్ చేసినా వాటిని విద్యార్థులకు ఇవ్వకుండా స్వాహా చేసేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు పదేపదే కళాశాలకు వస్తుండగా.. ముఖం చాటేసి తిరుగుతున్నారు. అనంతపురం: ‘పల్లె’ రఘునాథరెడ్డి విద్యా సంస్థల గురించి జిల్లాలో తెలియనివారు ఉండరు. అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించిన ఆయన విద్యాసంస్థల అధిపతిగా మారారు. ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేస్తూ తన పలుకుబడితో ఇబ్బడిముబ్బడిగా కళాశాలలు స్థాపించారు. కనీస సౌకర్యాలు లేకపోయినా నెట్టుకొస్తున్నారు. బోధనా ప్రమాణాలు తుంగలోతొక్కి ఫీజుల వసూలే లక్ష్యంగా విద్యాసంస్థలు నడుపుతున్నారు. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల స్వాహాకు సిద్ధమయ్యారు. పల్లె రఘునాథరెడ్డి టీడీపీ హయాంలోనే అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలను స్థాపించారు. ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల ఫీజు నిర్ణయించారు. ఇది చాలా ఎక్కువే అయినప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందన్న ఆశతో చాలా మంది నిరుపేద తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కళాశాలలో చేర్పించారు. 2016–20 బ్యాచ్ విద్యార్థులు ఇటీవలే బీఎస్సీ (హార్టికల్చర్)కోర్సును పూర్తి చేశారు. అయితే గత టీడీపీ ప్రభుత్వం రెండు విద్యా సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు. దీంతో ‘పల్లె’ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఫీజులు చెల్లించకపోతే పరీక్షలు రాయించబోమని హెచ్చరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు బయట వడ్డీలకు తెచ్చి మరీ ఫీజులు చెల్లించారు. ఇలా కళాశాలలోని 92 మంది విద్యార్థులు రూ.1.80 కోట్లు కళాశాలకు చెల్లించారు. తాజాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఏకకాలంలో మంజూరు చేసింది. 2020 మార్చి 30న ఈ మొత్తాన్ని ఆయా ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసింది. ఒక్క అనంతపురం జిల్లాకే రూ. 350 కోట్లు్ల ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే విద్యార్థుల నుంచి కట్టించుకున్న ఫీజులను తిరిగి వెనక్కి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ‘పల్లె’కు చెందిన శ్రీకృష్ణదేవరాయ హారి్టకల్చర్ కళాశాల మాత్రం రీయింబర్స్మెంట్ నిధులు విద్యార్థులకు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తోంది. ఒక వైపు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకుని.. మరో వైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని తీసుకుంది. ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తోంది. కళాశాల ఆధునికీకరణ సాకుగా చూపి.. తాము నూతనంగా కళాశాల ఏర్పాటు చేశామని, ఆధునీకరణకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశామని, అందువల్ల తమకు వీలైనపుడు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థులకు చెల్లిస్తామని శ్రీకృష్ణదేవరాయ హారి్టకల్చర్ కళాశాల యాజమాన్యం చెబుతోంది. ఇలా 7 నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులను తిప్పించుకుంటోంది. ఇప్పటికే తాము ఫీజు మొత్తం చెల్లించామనీ...ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వాలని కోరినా నిర్వాహకులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పల్లె విద్యా సంస్థ అయిన శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రాధేయపడినా.. ఫీజు రీయింబర్స్మెంట్ ఉందంటే కళాశాలలో చేరాను. గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో మాపై ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక మా అమ్మానాన్న వడ్డీలకు డబ్బులు తెచ్చి ఫీజులు చెల్లించారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మా ఫీజులను రీయింబర్స్మెంట్ చేసి ప్రిన్సిపల్ ఖాతాలో డబ్బులు వేసినా మాకు ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు కళాశాల యాజమాన్యాన్ని ప్రాధేయపడినా కనికరించడం లేదు. – బీఎస్సీ(హార్టికల్చర్ )విద్యార్థి -
తెల్లదోమ విజృంభణ
సర్పిలాకార తెల్లదోమ దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యానతోటలు అతలాకుతలమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలను ఇది పీల్చి పిప్పి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూల ð ¬క్కలకు ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలనూ తెల్లదోమ చుట్టుముట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల రైతాంగంతోపాటు తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంత కొబ్బరి, ఆయిల్ పామ్ రైతులను సైతం కలవరపెడుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఉద్యాన శాఖ సమీక్షలో ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం సీఎం ఆదేశాలతో నివారణ చర్యలను ఉధృతం చేసింది. రూగోస్ తెల్లదోమ ఇలా వ్యాపిస్తుంది ► వలయాకారపు తెల్లదోమ (రూగోస్) ప్రధానంగా గాలి ద్వారా తొలుత కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లను ఆశిస్తుంది. వీటిలో చక్కెర ఎక్కువ ఉండటమే దీనికి ప్రధాన కారణం. ► అక్కడి నుంచి జామ, మామిడి, పూలు, అలంకరణ మొక్కలను ఆశిస్తుంది. ► ఆకులో ఉండే పత్ర హరితాన్ని హరిస్తుంది. ► ఆకుల నుంచి రసాన్ని పీల్చి వేసి మైనం లాంటి తెల్లటి పదార్థాన్ని విసర్జిస్తుంది. దానిపై ’కాప్నోడియం’ అనే బూజు పెరిగి.. ఆకుపై నల్లటి పొర ఏర్పడుతుంది. దీని వల్ల సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగ ► క్రియ స్తంభించి చెట్టు పూర్తిగా నీరసించిపోతుంది. ► కొబ్బరిలో 40 శాతం, ఆయిల్ పామ్‌లో 35 శాతం దిగుబడి తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ► తెల్లదోమను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, నివారణే మార్గమంటున్నారు. ఎక్కడెక్కడ ఉందంటే..? ► తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొబ్బరి తోటల్ని, ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని వేలాది ఎకరాల ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించింది. ► తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతంలో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్ని కూడా తెల్లదోమ ఆశించింది. ► కడియం నర్సరీలలో కొబ్బరి, ఆయిల్ పామ్, జామ, అలంకరణ మొక్కలను సైతం తెల్లదోమ కమ్మేసింది. ► 1.60 లక్షల ఎకరాల కొబ్బరిని, అదే స్థాయిలో ఆయిల్ పామ్ తోటల్ని ఇది ఆశించినట్టు అనధికారిక అంచనా. సమగ్ర యాజమాన్యంతోనే తెల్లదోమకు చెక్ ► సర్పలాకార తెల్లదోమ సోకితే రసాయనిక పురుగుమందులు చల్లటం తగదు. వీటిని చల్లితే మిత్రపురుగులు నశించి తెల్లదోమ రెండు–మూడు రెట్లు విజృంభిస్తుంది. అందువలన అవాంఛిత పురుగుమందుల వాడకం నివారించి మిత్రపురుగులను పెంచుకోవాలి. ► జీవ నియంత్రణతో తెల్లదోమను అదుపు చేయొచ్చు. ► కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో పసుపు రంగు టార్పలిన్ అట్టలను ఎకరానికి 10 నుంచి 15 చొప్పున (1 మీ.“ 1 మీ. విస్తీర్ణం) అతికించి, వాటికి ఆముదం పూసి, తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించి, చంపాలి. ► వీటి ద్వారా దోమను పూర్తిగా అదుపు చేయకున్నా.. ఒక తల్లి దోమను చంపడం ద్వారా 100 పిల్ల దోమలను నిరోధించవచ్చు. ► తెల్లదోమ సోకిన మొక్కలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించకూడదు. ► డైకోక్రైసా ఆస్టర్ పురుగు తెల్లదోమ గుడ్లను తినేస్తుంది. డైకోక్రైసా ఆస్టర్ సంతతి వృద్ధికి దాని గుడ్లను తెల్లదోమ ఆశించిన తొలి దశలోనే చెట్ల ఆకులకు పిన్ చేసుకోవాలి. వీటిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా స్థానంలోనే దేశంలోకెల్లా మొట్టమొదటి సారిగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది 15 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి రైతులకు అందించారు. దేశవ్యాప్తంగా రోజుకు 3–4 లక్షల గుడ్లకు డిమాండ్ ఉంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు లక్ష గుడ్ల ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► మిత్రపురుగైన ఎన్‌కర్సియా గ్వడెలోపే అనే బదనికలు ఈ తెల్లదోమలను అదుపులో ఉంచుతాయి. ఈ పురుగును ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే అవకాశం లేదు. సహజ సిద్ధంగా కొబ్బరి తోటల్లో ఈ మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతుంటాయి. అక్కడి నుంచి సేకరించి తెల్లదోమ ఆశించిన ప్రాంతాల్లో విడుదల చేయాలి. ► రిజర్వాయర్ మొక్కలు / బ్యాంకర్ మొక్కలను పెంచడం వలన ఎన్కార్సియా గ్వడెలోపే సంతతి పెరుగుతుంది. ► పురుగు స్థాయి ఎక్కువగా ఉండి మిత్రపురుగులు లేకపోతే, 1 శాతం వేపనూనెకు 10 గ్రా. డిటర్జెంట్ పౌడర్ కలిపి ఆకు అడుగు భాగాలు పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► ఐసోరియ ఫ్యూమోసోరోసే అనే రకం కీటకాలను అరికట్టే శిలీంధ్రాన్ని లీటరు నీటికి 5 గ్రాముల స్పోర్స్ సాంద్రత 1“108గా ఉండాలి చొప్పున కలిపి తయారు చేసుకున్న శిలీంద్ర ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను అదుపులోకి తేవచ్చు. శిలీంద్రం సాంద్రత తగినంత లేకపోతే ఫలితాలు పాక్షికంగానే వస్తాయి. ఒక ప్రాంతంలో రైతులందరూ కలిసికట్టుగా చేయాల్సి ఉంటుంది. శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసుకునే పద్ధతిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మదర్ కల్చర్‌ను కూడా పంపిణీ చేస్తున్నారు. ► నీటికి కొరత లేకపోతే.. నీటిలో డిటర్జెంట్ పౌడర్ కలిపి తెల్లదోమ ఆశించిన మొక్కలపై 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ► పగటి ఉష్ణోగ్రత పెరగేకొద్దీ తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. 40 డిగ్రీల సెల్షియస్‌కు పెరిగేటప్పటికి తగ్గుతుంది. ► రైతులు సామూహికంగా నివారణ చర్యలు చేపడితే సర్పలాకార తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. – డా. ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధన స్థానం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, అంబాజీపేట, తూ.గో. జిల్లా – ఎ. అమరయ్య, సాక్షి బ్యూరో, అమరావతి -
బ్రిటన్ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
సాక్షి, హైదరాబాద్: ఉద్యాన పంటల కోత అనంతర యాజమాన్య పద్ధతులకు బ్రిటన్–భారత ప్రభుత్వ సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు తెలంగాణలో అవకాశాలపై ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చర్చ జరిగింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎన్.జనార్ధన్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్.వెంకట్రామిరెడ్డిలతో బ్రిటిష్ హైకమిషన్‌కు సం బంధించిన జేస్ దీప్ జస్వాల్ ఆధ్వర్యంలో 9మంది ఉద్యానరంగ నిపుణుల ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఎల్.వెంకట్రామి రెడ్డి తెలంగాణలో ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలను వివరించారు. రాష్ట్రంలో మామిడి, బత్తాయి, నిమ్మ, కూరగాయలు, పసుపు, మిరప వంటి పంటల కోత అనంతర నష్టాలను తగ్గించ టానికి, నిల్వ సామర్థ్యం పెంచటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, కోల్డ్ చైన్ అభివృద్ధి, ఎగుమ తి చేయటానికి అవసరమైన సదుపాయాలు, అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అవసరమైన నాణ్యత ప్ర మాణాలు, అవకాశాలు మొదలైన వాటిపై చర్చిం చామని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యాన విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ ఎ.భగవాన్ పాల్గొన్నారు. -
వెన్నపండు వచ్చెనండి
‘అవకాడో’ గురించి మీరెప్పుడైనా విన్నారా? దీన్ని తెలుగులో ‘వెన్నపండు’ అనుకుందాం. విని ఉంటారు గానీ.. తిని ఉండరు. అయితే ఎక్కడో బ్రెజిల్, సెంట్రల్ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు భారత్‌లోనూ పండుతోంది. సూపర్ మార్కెట్లలో కిలోకు రూ.300 వరకూ పలికే ఈ వెన్నపండు ఆంధ్రప్రదేశ్‌లోనూ మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో విరివిగా పండుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉద్యానపంటల్లో భాగంగా అవకాడోను పండించుకోవడం ద్వారా రైతులు లాభాలు గడించవచ్చునని అంటున్నారు.. జి.ఎన్.శ్రీవత్స. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన విభాగంలో సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీవత్స దేశంలో అవకాడో పంటకు సంబంధించిన సమాచారం ‘సాక్షి సాగుబడి’కి అందించారు. ఆ వివరాలు.. అర శతాబ్దంగా భారత్‌లో.. ముందుగా చెప్పుకున్నట్లు అవకాడో బ్రెజిల్, సెంట్రల్ అమెరికాకు చెందిన పండు. శాస్త్రీయ నామం పెర్సియా అమెరికానా. పచ్చటి రంగు, గుండ్రటి, కోలగా ఉండే రెండు రకాల్లో లభిస్తాయి. కొన్ని వందల ఏళ్ల క్రితమే బ్రెజిల్ నుంచి దేశాలు తిరిగి జమైకాకు.. ఆ తరువాత సుమారు 50–60 ఏళ్ల క్రితం భారత్‌కూ వచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరి ప్రాంతాల్లో ప్రస్తుతం ఎక్కువగా సాగవుతోంది. అవకాడో పండ్లలో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు గణనీయంగా ఉంటాయి. ఈ రకమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయని మనకు తెలుసు. ఈ పండుతో వచ్చే కేలరీల్లో 77 శాతం వరకూ కొవ్వుల ద్వారానే లభిస్తాయి. కాకపోతే అన్నీ శరీరానికి మేలు చేసే కొవ్వులు కావడం గమనార్హం. ఓలిక్ ఆసిడ్ రూపంలో లభించే కొవ్వులు శరీరంలో మంట/వాపులను తగ్గిస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రకంగా చూస్తే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు లభించే శాకాహారాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. తమిళనాడు తీర ప్రాంతాల్లో బాగా పండుతున్న అవకాడోకు తూర్పు కనుమల్లోనూ అనుకూలమైన వాతావరణం ఉందని శ్రీవత్స తెలిపారు. అంతర పంటలకూ అవకాశం.. అనేక ఉద్యాన పంటల మాదిరిగానే అవకాడో సాగులోనూ అంతర పంటలకు అవకాశాలు ఉన్నాయి. పది అడుగుల ఎడంతో మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. విత్తనం ద్వారా నేరుగా మొలకెత్తించే అవకాశం లేదు. విత్తనాన్ని పాక్షికం గా నీటిలో ఉంచేలా చేయడం ద్వారా రెండు నుంచి ఆరు వారాల్లో మొలకెత్తుతుంది. కొంతకాలం తరువాత నేలలో నాటుకోవచ్చు. ఆరేడు సంవత్సరాలకు కాపునిచ్చే అవకాడో జీవితకాలం సుమారు 50 సంవత్సరాలు. ఒక్కో చెట్టు ఏటా 200 నుంచి 500 వరకూ పండ్లు కాస్తాయని, వెరైటీని బట్టి ఒక్కో పండు 250 గ్రాముల నుంచి కిలో వరకూ బరువు తూగుతాయని శ్రీవత్స తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చులతో పోలిస్తే దేశీయంగా సాగు చేసుకోవడం ద్వారా అటు రైతులు, ఇటు ప్రజలకూ ప్రయోజనమని ఆయన వివరించారు. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అవకాడో సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉందని, అవసరమైన వారు జnటటజీఠ్చ్టిట్చఃజఝ్చజీ .ఛిౌఝ ఈ మెయిల్ ద్వారా తనను సంప్రదించవచ్చునని శ్రీవత్స తెలిపారు. -
పండిద్దాం.. తినేద్దాం..
సాక్షి, ఖమ్మం: జిల్లాలోనే కూరగాయలు పండించి.. అమ్ముకునే విధంగా ప్రభుత్వం కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. బయటి మార్కెట్లో ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతుండడం.. సామాన్యుడు కొని.. తినలేని పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల కాలనీల ఏర్పాటుకు పూనుకుంది. అన్ని రకాల కూరగాయలు పండించేలా చర్యలు చేపట్టింది. వీటితోపాటు పండ్ల తోటల పెంపకం కోసం రైతులకు రాయితీలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇవన్నీ అమలులోకి వస్తే బహిరంగ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉండడంతోపాటు చౌక ధరలకు లభ్యమవుతాయి. క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయడంలో భాగంగా ఉద్యానవన శాఖ ద్వారా ప్రతిపాదనలు రూపొందించి.. అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఆ శాఖ జిల్లాలోని 8 మండలాలను క్రాప్ కాలనీల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఖమ్మం నగరానికి రోజుకు 15 నుంచి 20 టన్నుల కూరగాయలు అవసరం కాగా.. ఇందులో అత్యధిక భాగం ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. జిల్లాలో పండించే కూరగాయలు.. నగర ప్రజల అవసరాలతోపాటు జిల్లా ప్రజల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి. దీంతో ఖమ్మం నగరానికి కూరగాయలను తాజాగా.. తెల్లవారుజాము వరకు తెచ్చే రవాణా సౌకర్యం ఉండే ప్రాంతాలను, నగరానికి అత్యంత సమీపంలో ఉండే ప్రాంతాల్లో కూరగాయల కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని రకాల కూరగాయలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 1,700 ఎకరాల్లో సాగు.. జిల్లాలోని 1,700 ఎకరాల్లో కూరగాయల కాలనీలు ఏర్పాటు చేసి.. అందులో సాగు చేపట్టేందుకు ఉద్యానవన శాఖ సమాయత్తమవుతోంది. కూరగాయల కాలనీలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 8 మండలాలను ఎంపిక చేశారు. ఇక్కడ పండించిన పంటలను ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు రైతుబజార్లో.. ఇతర ప్రాంతాల్లో విక్రయించుకునే వీలుంటుంది. అయితే క్రాప్ కాలనీల ఏర్పాటు కోసం రూ.4కోట్ల నిధులు అవసరం ఉంటాయని ప్రతిపాదనలు పంపించింది. పంట సాగు, విత్తనాలు, ఎరువులు, సూక్ష్మసేద్యం, మల్చింగ్, పందిళ్లు, పండించిన కూరగాయలను నిల్వ చేసుకునేందుకు గదుల నిర్మాణం తదితర వాటి కోసం ఈ నిధులు అవసరం ఉంటాయని ఉద్యానవన శాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇక కూరగాయల కాలనీల్లో 1,705 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్ల తోటల సాగుకు రాయితీ.. కూరగాయల కాలనీతోపాటు తాజా పండ్లను తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర ఉద్యాన మిషన్ పేరుతో పండ్ల తోటలను సాగు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో పండ్ల తోటలను సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులకు రాయితీ అందించాలని నిర్ణయించారు. మూడేళ్ల కాలంలో మొక్కలకు, ఎరువులకు, సాగుకు సంబంధించి రాయితీలు ఉంటాయి. ఇందులో భాగంగా మామిడిని 47 ఎకరాల్లో, నిమ్మ 16, జామ 43, దానిమ్మను 14 ఎకరాల్లో పండించాలని ఉద్యానవన శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అధిక ధరలతో.. కూరగాయలు బహిరంగ మార్కెట్లో అధిక ధర పలుకుతున్నాయి. సీజన్లో కొన్ని కూరగాయలు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండడంతో వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. వర్షాకాలంలో కొంత తక్కువగా ఉండే ధరలు.. వేసవిలో మాత్రం చుక్కలను అంటుతున్నాయి. వేసవిలో సామాన్యులు కూరగాయలు కొనుగోలు చేయలేని పరిస్థితి. కిలో రూ.80 నుంచి రూ.100 కూడా పలికిన సందర్భాలు ఉంటున్నాయి. కొంతకాలంగా జిల్లాలో కూరగాయ పంటల సాగు గణనీయంగా తగ్గింది. దీంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజల అవసరాలను తీర్చేందుకు పెద్ద ఎత్తున కూరగాయల సాగు చేపట్టాలని ఉద్యానవన శాఖ నిర్ణయించింది. కూరగాయల కాలనీలు అందుబాటులోకి వస్తే వేసవి కాలంలోనూ కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రయోజనకరం.. క్రాప్ కాలనీల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తాం. తక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంట సాగు చేసుకుని విక్రయించుకోవడం ద్వారా రైతులకు ప్రయోజనం ఉంటుంది. నగర పరిసరాల్లోని మండలాల్లో కూరగాయల పంటలు సాగు చేసుకోవడం ద్వారా ఆయా రైతులు నగరంలో పంటను విక్రయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రాప్ కాలనీలకు తగిన చర్యలు తీసుకుంటాం. – జి.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాభివృద్ధి శాఖ అధికారి -
పీపుల్స్ ప్లాజాలో ఉద్యానవన ప్రదర్శన
-
హార్టికల్చర్ విద్యార్థులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, కడప: అధికారంలోకి రాగానే హార్టికల్చర్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర అనంతరం జిల్లాకు వచ్చిన ఆయనకు ప్రజలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరులో హార్టికల్చర్ వర్శిటీ విద్యార్థులు ప్రతిపక్షనేతను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. హార్టికల్చర్‌లో కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి జగన్ స్పందిస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ సచివాలయం అనే కాన్సెప్ట్‌ను అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో అమలు చేస్తామని, ఇందులో అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రైతులకు టెక్నికల్‌గా సలహాలు, సూచనలు ఇచ్చే హార్టికల్చర్ విద్యార్థుల సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. మరో ఆరునెలల్లో దేవుడి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం వస్తుందని, చంద్రబాబు హయాంలో ధర్నాల చేసి అనవసరంగా చదువులు పాడుచేసుకోవద్దని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విద్యార్థులకు సూచించారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన హార్టికల్చర్ విద్యార్థులు
-
ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు (అర్బన్ ఫార్మింగ్)పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ నెల 24న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు జీడిమెట్ల విలేజ్(పైపులరోడ్డు)లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. అర్బన్ ఫార్మింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ తదితర అంశాలపై కేరళకు చెందిన నిపుణురాలు డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. 25 మంది సీనియర్ ఇంటిపంటల సాగుదారులు తమ అనుభవాలను వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా పాల్గొంటారని ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగలవారు 79977 24936, 79977 24983, 79977 24985 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
పుచ్చ సాగు మెళకువలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీజన్లతో సంబంధం లేకుండా పుచ్చకాయలను ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. ఇక వేసవికాలంలో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ పంటల్లో అంతరపంటగా పుచ్చకాయ పైరును సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పుచ్చ తీగలు పూత, కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు సాగు జాగ్రత్తలు చాలా కీలకం. తెగుళ్లు ఆశిస్తే..పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్తగూడెం, జూలూరుపాడు, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, పాల్వంచ తదితర మండలాల్లో 238 ఎకరాల్లో ఈ పుచ్చపంటను సాగు చేస్తున్నారు. పాటించాల్సిన సాగు మెళకువలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జినుగు మరియన్న ఇలా వివరించారు. సాగు విధానం.. పుచ్చపంటను వ్యవసాయ భూముల్లో నేరుగా వేసుకోవచ్చు. లేదంటే వివిధ పంటల్లో అంతర పంటగా దీనిని సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 80 నుంచి 90 రోజుల వ్యవధిలో రూ.60వేల రూపాయల పైచిలుకు నికర ఆదాయం పొందొచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. విత్తనం సాగు చేసే దశనుంచే..రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తెగుళ్ల పీడను గుర్తించాలి. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి..తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడం ఉత్తమం. రసాయన ఎరువులను అధికంగా వినియోగించొద్దు. సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా కూడా మంచి దిగుబడి పొందొచ్చు. తెగుళ్ల నివారణ.. ఆకుమచ్చ తెగులు ఈ పంటలో కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల సాఫ్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఆకు ముడత నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫిల్ లేదా సువాస్ రెండు మిల్లీ లీటర్లతోపాటు ఐదు మిల్లీలీటర్ల వేపనూనెను కలిపి పిచికారీ చేయాలి. నాణ్యమైన ఉత్పత్తికి, కాయ ఎదుగుదలకు పంటకాలంలో వారానికి ఒకసారి 19:19:19 లేదా 13:0:45 లను కేజీ పరిమాణాన్ని డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించాలి. అలాగే నాణ్యతకు, నిల్వకు దోహదపడే బోరాన్ మూలకాన్ని బోరాక్స్ రూపంలో పిచికారీ చేయాలి. లీటరు నీటికి రెండు గ్రాములు లేదా పంట కాలంలో ఎకరానికి రెండు నుంచి మూడు కేజీలపై పాటుగా లేదా డ్రిప్ అందించాలి. -
ఉద్యాన పంటలకు విరివిగా రాయితీలు
- ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు - రాయదుర్గం ఉద్యానశాఖ అధికారి నెట్టికంఠయ్య గుమ్మఘట్ట: ఉద్యాన పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు పలు రకాల రాయితీలను అందుబాటులోకి తెచ్చినట్లు రాయదుర్గం ఉద్యానశాఖ అధికారి నెట్టికంఠయ్య తెలిపారు. రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ సబ్సిడీ పథకాలను అర్హులైన ప్రతి రైతూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేలైన విత్తనంతో పెంచిన మొక్కలను కొనుగోలు చేసేలా రైతులను చైతన్య పరుస్తున్నామని ఆయన తెలిపారు. ఎదుగుదల ఉన్న మొక్కను నాటడం వల్ల అధిక దిగుబడి సాధించేందుకు రైతులకు వెసులుబాటు కలుగుతుందన్నారు. అదేవిధంగా చీడపీడల బాధ కూడా తక్కువగా ఉంటుందన్నారు. రాయదుర్గం పరిసర ప్రాంతాల ఐదు మండలాల్లో సపోట, మామిడి, అంజూర, దానిమ్మ, జామ పంటలకు నేలలు అనువైనవని చెప్పారు. రైతుకు ఇష్టమైన క్షేత్రంలో మొక్కలను కొనుగోలు చేస్తే పరిశీలించి సబ్సిడీలు మంజూరు చేస్తామన్నారు. రైతులకు ప్రోత్సాహకం : ఉద్యాన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రకాల రాయతీలు అందిస్తోందని నెట్టికంఠయ్య పేర్కొన్నారు. వీటిని రైతుల సద్వినియోగం చేసుకుంటే రైతులు లాభాలు గడించొచ్చన్నారు. ముఖ్యంగా మేలైన విత్తనాలతో పెంచిన మొక్కలను మాత్రమే రైతులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాటిని నాటుకొని సంరక్షించే క్రమంలో తెగుళ్ల నివారణకు రాయితీపై మందులు ఇస్తామన్నారు. సాగు వివరాలతో ముందుకొచ్చే రైతులకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. రాయితీల వివరాలు ఇలా.. : మామిడి మొక్కకు రూ.10, జీడి మామిడి మొక్కకు రూ. 8 రాయితీగా అందిస్తారు. చీడపీడల నివారణ పథకం : పంటల్లో సమగ్ర చీడపీడల నివారణకు 30 శాతం సబ్సిడీ పై అవసరమైన పురుగు మందులు (హెక్టారుకు రూ. 5 వేలకు మించకుండా) ఇస్తారు. పూల తోటలకు.. : హెక్టారుకు రూ. 16 వేలు మించకుండా 40 శాతం రాయితీ, ఒక రైతుకు రెండు హెక్టార్ల వరకు అందిస్తారు. పందిళ్ల పై సాగు.. : పందిళ్లు ఏర్పాటు చేసి కూరగాయాలు సాగుచేస్తే 50 శాతం రాయితీ. హెక్టారుకు గరిష్టంగా రూ. 2.50 లక్షలు. పందిళ్లు సాగు వల్ల నాణ్యమైన సరుకుతో పాటు దిగుబడులు 25 నుంచి 30 శాతం పెరుగుతాయి. సోర, కాకర, బీర, దొండ, పొట్ల కూరగాయాలను పందిళ్ల పై సాగు చేయవచ్చు. ఆయిల్ పామ్సాగుకు : మొక్కలపై 80 శాతం రాయితీ. హెక్టారుకు రూ. 12 వేలు గరిష్ట సబ్సిడీ. సాగు ఖర్చుల నిమిత్తం ఏటా రూ.ఐదు వేలు. నాలుగేళ్ల వరకు సాగు ఖర్చులు అందిస్తారు. నాలుగేళ్ల వరకు ఆయిల్ పామ్‌లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. దీని కోసం హెక్టారుకు రూ. 5 వేలకు మించకుండా 50 శాతం రాయితీ. 2017–18 ఏడాదికి సంబంధించిన పథకాలు : పండ్ల తోటల విస్తీర్ణ పథకం : బొప్పాయి (30 హెక్టార్లు) ఒక హెక్టారుకు రూ.18,739 సబ్సిడీ ఉంటుంది. అరటి హెక్టారుకు రూ.30,734, దానిమ్మ కైతే 50 హెక్టార్లు. హెక్టారుకు రూ.16004 తో అందుతుంది. రక్షిత సేద్యం : మల్చింగ్ 60 హెక్టార్లు, ఒక్కో హెక్టారుకు రూ. 16వేల సబ్సిడీ. నీటి కుంటలు 20్ఠ20్ఠ3 ఎమ్. 20 ఎన్ఓ. ఒక్కో యూనిట్‌కు రూ. 75 వేల సబ్సిడీ. ప్యాక్ హౌస్‌లు : 20 నెంబర్. ఒక్కో యూనిట్‌కు రూ.2 లక్షలు. పారిహౌజ్లలో కూరగాయాల పెంపకం కోసం : 2000 ఎస్క్యూ2 లాంటివి అందుబాటులో ఉన్నాయన్నారు. -
కోతల తర్వాత .. విశ్రాంతి అవసరం
అనంతపురం అగ్రికల్చర్ : కాయకోత పూర్తయిన మామిడి తోటలకు కొద్దిరోజులు విశ్రాంతిని ఇవ్వాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. జూన్ మాసంలో మామిడి, సపోటా తోటల్లో యాజమాన్య చర్యలను వివరించారు. + కాయ కోత పూర్తయిన మామిడి తోటలకు అవకాశం ఉంటే నీటి తడి ఇవ్వాలి. తర్వాత 20 రోజుల పాటు పూర్తీగా విశ్రాంతి ఇవ్వాలి. అనంతరం జాగ్రత్తగా కత్తిరింపులు చేయాలి. గాలి వెలుతురు, సూర్యకిరణాలు బాగా తగిలేలా కత్తిరించాలి. అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలు, రెమ్మలు, పూత కొమ్మలు, గొడుగు కొమ్మలు అంటే చిటారు కొమ్మలను తీసివేయాలి. కత్తిరింపుల తర్వాత కోసిన భాగాలకు బోర్డోపేస్టు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్టు పూయాలి. తొలకరి వర్షాల తర్వాత తోటలను శుభ్రం చేసి బాగా దున్నుకోవాలి. చెట్ల చుట్టూ పెద్ద పాదులు చేసుకోవాలి. ఎకరాకు 10 కిలోలు జీలుగ లేదా 25 కిలోలు జనుము లాంటి పచ్చిరొట్ల విత్తనాలు వేసుకుని 45 నుంచి 50 రోజుల సమయంలో భూమిలో కలియదున్నితే భూసారం బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టుకు బాగా చివికిన పశువుల ఎరువు 100 కిలోలు లేదా 10 కిలోల వర్మీకంపోస్టు వేసుకోవాలి. చెట్టు ప్రధాన కాండం నుంచి 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల దూరంలో పాదులు చేసుకుని ఎరువులు వేయాలి. + సపోటా తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఎండిన కొమ్మలు, తెగుళ్లు సోకిన కొమ్మలు తీసివేయాలి. చెట్ల లోపలి భాగంలో ఎండ తగలని కొమ్మలు, వంకర టింకర పెరిగినవి, గుబురుగా ఉన్న కొమ్మలు కత్తిరించేయాలి. కొత్తగా సపోటా సాగు చేసే రైతులు పొలం బాగా దున్నుకోవాలి. ఒక మీటరు వెడల్పు, ఒక మీటర్ లోతుగా గుంతలు తవ్వి ఒక్కో చెట్టు 10 మీటర్ల దూరంలో నాటుకోవాలి. + దానిమ్మ మొక్కలకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. కత్తిరింపులు చేయడం, పాదులు తవ్వుకోవడం, ఎరువులు వేయడం లాంటి చేయకూడదు. ఒక శాతం బోర్డోమిశ్రమం మందును 20 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేసుకుంటే బ్యాక్టీరియా మచ్చ తెగులును అదుపు చేయవచ్చు. + ద్రాక్ష తోటలపై 500 పీపీఎం సైకోసిల్ ద్రావణం పిచికారి చేయాలి. కొమ్మలు ముదరడానికి కత్తిరించిన 45 నుంచి 120 రోజుల వరకు సిఫారసు చేసిన మోతాదుల్లో పొటాష్ ఎరువులు వేయాలి. మజ్జిగ తెగులు నివారణకు ముందుగా 1 శాతం బోర్డోమిశ్రమం పిచికారి చేసిన తర్వాత రెండో సారి 2.5 గ్రాములు మెటలాక్సిల్+ మాంకోజెబ్, మూడోసారి 3 గ్రాములు సెమోక్సానిల్ + మాంకోజెబ్, నాలుగోసారి 3 గ్రాములు ఫోసిటైల్ అలుమినియం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. + నిమ్మలో తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద లాంటి పచ్చిరొట్ట పైర్లు వేసుకుని పూత సమయంలో కలియదన్నితే భూసారం పెరుగుతుంది. సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేయాలి. సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని లేతాకులపై పిచికారి చేసుకోవాలి. చెట్ల మొదళ్లకు బోర్డో పేస్టు పట్టించాలి. కొత్త చిగుర్లను ఆశించే పేనుబంక, నల్లదోమ, ఆకుముడుత, ఆకులు తినే సీతాకోకచిలుక పురుగులను నివారించుకోవాలి. -
నులిపురుగులతో జాగ్రత్త !
- అరటి రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి – కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ జాన్‌సుధీర్ అనంతపురం అగ్రికల్చర్ : కూరగాయలు, పండ్లతోటలకు నష్టం కలిగించే వాటిలో నులిపురుగులు (నెమటోడ్స్) ప్రధానమైనవని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. కంటికి కనబడనంత స్థాయిలో ఉండే నులిపురుగులు అరటిని ఆశించి అపార నష్టాన్ని కలిగిస్తాయన్నారు. వీటి నివారణకు రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. అరటిలో నులిపురుగులు కాండం కుళ్లు తెగుళ్లు, ముక్కుపురుగు, పేనుబంక, పనామా, వెర్రి తెగులు తదితర చీడపీడలు అరటిని ఆశించి నష్టం కలిగిస్తాయి. వీటితో పాటు ఒక్కోసారి నులిపురుగలు కూడా అపార నష్టాన్ని కలిగిస్తాయి. కంటికి కనిపించని నులిపురుగులు పిల్ల వేర్లను ఆశించి వాటి నుంచి రసం పీల్చడం వల్ల అరటి మొక్కలు కుంగిపోతాయి. అరటి తోటల్లో మొక్కల చివరనున్న ఆకు ఎండిపోవడం, అరటిగెల పరిమాణం, పండ్ల సంఖ్య తగ్గిపోవడం, అభివృద్ధి చెందకమునుపే పండిపోవడం వంటి రోగలక్షణాలు తోటల్లో కనిపిస్తాయి. ఇలాంటి మొక్క వేర్లను పరిశీలిస్తే మూడు రకాలైన నులిపురుగులు వేర్ల లోపలి భాగంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పురుగులు మొదట తోటలో అక్కడక్కడా పాయలుగా కనిపించి ఆ తర్వాత తోట అంతా ఆక్రమిస్తాయి. ఈ పురుగులు ఎక్కువగా అరటి రెండో పంటకు ఆశిస్తాయి. కోత కోసిన తరువాత దాని వేర్ల నుంచి పుట్టుకువచ్చే కొత్త పిలకలకు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఎందుకంటే పురుగులకు కావాల్సిన కొత్త వేర్లు ఉంటాయి. వేర్ల పైభాగాన గోధుమ రంగు కండె ఆకారంలో మచ్చలు ఉంటాయి. వీటి సంఖ్య ఎక్కువైనప్పుడు వేర్ల లోపలి భాగమంతా కుళ్లినల్లగా మారిపోతుంది. దీని వల్ల అరటి మొక్క పటుత్వం కోల్పోయి పడిపోవచ్చు. ఈ పురుగులు ఇతర సూక్ష్మజీవులతో కలిసి వేర్లు కుళ్లేలా చేస్తాయి. దీని వల్ల పనామా అనే తెగుళ్లు అరటి తోటలకు సంక్రమిస్తుంది. నివారణ పురుగులు ఎక్కువగా ఉన్న తోటల్లో మొదట పంట కోసిన తర్వాత దాని నుంచి వచ్చే పిలకలను పెంచకూడదు. ఎక్కువ నులిపురుగులు ఆశించిన తోటల్లో 6 నుంచి 8 నెలల పాటు పంట సాగు చేయకుండా ఎండబెడితే ఫలితం ఉంటుంది. విత్తనము పిలకలను 55 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన వేడినీళ్లలో 10 నిమిషాలు ఉంచి నాటితే మంచి ఫలితం ఉంటుంది. పిలకలను శుద్ధి చేసి వాటిని బురద మట్టిలో ముంచి వాటిపై 40 గ్రాములు ఫ్యూరడాన్ గుళికలు చల్లాలి. ఆరిన తర్వాత నాటుకోవాలి. ఇలా చేయడం వల్ల విత్తన పిలకల నుంచి సంక్రమించే నులిపురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. -
ఉద్యానతోటల్లో యాజమాన్యం
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత (ఏప్రిల్) వేసవిలో అరటి, నిమ్మ, సపోటా, దానిమ్మ, బొప్పాయి తోటల్లో ఆశించిన పీడచీడలు, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. + వేసవిని దృష్టిలో పెట్టుకుని అరటిలో అవసరాన్ని బట్టి సక్రమంగా నీటి తడులు ఇవ్వాలి. తొండంపై ఎండ పడి పాడుకాకుండా ఎండు అరటి చెత్తతో కప్పాలి. ఆఖరి హస్తం విచ్చుకున్న నాలుగైదు రోజుల తర్వాత 5 గ్రాములు పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్‌ను జిగురు మందుతో కలిపి 15 రోజుల వ్యవధిలో మందులు మార్చి రెండు సార్లు పిచికారి చేయాలి. గెలలను పాలిథీన్ సంచుల్లో కప్పి ఎండవేడి నుంచి రసం పీల్చు పురుగుల నుంచి రక్షించుకోవాలి. వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసంపీల్చు పురుగుల నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 మిల్లిలీటర్ల డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. గెలలు సగం తయారయ్యాక కార్శిపంట (రెండోపంట) కోసం ఒక సూది పిలకను వదిలి మిగతావన్నీ కోసేయాలి. + నిమ్మచెట్లపై మంగు నివారణకు 3 మిల్లిలీటర్ల డైకోఫాల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కొత్తగా వేసే తోటల్లో గుంతలు తవ్వి ఆరబెట్టాలి. చెట్ల పాదుల్లో ఎండు ఆకులు లేదా వరిపొట్టును మల్చింగ్గా వేసుకుంటే వేసవిలో నీటిఎద్దడికి గురికాకుండా కాపాడుకోవచ్చు. + సపోటా లేత తోటలకు తప్పనిసరిగా నీరు పెట్టాలి. తయారైన కాయలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి. తయారైన కాయలపై ఉన్న పొడివంటి పదార్థం రాలిపోయి కాయలు బంగాళాదుంపలా కనపడతాయి. అలాంటి కాయలు చర్మాన్ని గోకినపుడు కండపైభాగం ఆకుపచ్చగా కాకుండా పసుపు రంగులో ఉంటుంది. కాయలను తొడిమితో సహా కోయాలి. + దానిమ్మ తోటల్లో కత్తిరింపులు చేయడం, పాదులు తవ్వకం, ఎరువులు వేయడం లాంటివి ఇపుడు చేయకూడదు. బ్యాక్టీరియా మచ్చతెగులును అదుపులోకి ఉంచడానికి 1 శాతం బోర్డోమిశ్రమాన్ని 20 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేసుకోవాలి. + బొప్పాయి తోటల్లో ఇపుడున్న వాతావరణానికి ఆకుడముడు తెగులు ఉధృతి కనిపిస్తుంది. పొలంలో తెల్లదోమ ఉధృతిని గమనించడానికి పసుపు రంగు జిగురు పూసిన కార్డులను ఎకరాకు 15 చొప్పున మూడు అడుగుల ఎత్తులో అమర్చాలి. తెల్లదోమ ఉధృతిని ఉన్నట్లు గమనిస్తే 1 గ్రాము అసిఫేట్ లేదా 0.3 మిల్లిలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 1 గ్రాము డయాఫెన్డ్యూరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. -
రేపు డ్రైలాండ్ హార్టికల్చర్‌పై రైతులకు శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్: వర్షాధార పండ్లతోటల పెంపకం (డ్రైలాంండ్ హార్టికల్చర్)పై రేపు (బుధవారం) స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ ఎస్.చంద్రశేఖర్‌గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు హాజరై ప్రస్తుత వేసవిలో డ్రైలాండ్ హార్టికల్చర్ పండ్లతోటల్లో ఆచరించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించి వివరిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 08554–270430, 81420 28268 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ప్రమాదంలో ఉద్యానం
- కరువు దెబ్బకు పండ్లతోటల విలవిల - కాపాడుకోవడానికి రైతుల క‘న్నీటి’ కష్టాలు - ఇప్పటికే ఏడు వేల ఎకరాల్లో ఎండుముఖం - చోద్యం చూస్తున్న ప్రభుత్వం చిన్నూరుబత్తలపల్లికి చెందిన రైతు చంద్రశేఖర్ నాయుడిది. పదేళ్ల క్రితం వెయ్యి చెట్లు నాటాడు. వీటికి నీరు పెట్టేందుకు నాలుగు బోర్లు వేయించాడు. ప్రస్తుతం అన్నింటిలోనూ నీరు అడుగంటిపోయింది. కనీసం వంద చెట్లకు కూడా అందివ్వలేని పరిస్థితి. దీంతో రైతు రెండు ట్యాంకర్లు తీసుకుని రైతుల వద్ద నీటిని కొనుగోలు చేసి చీనీచెట్లను కాపాడుకుంటున్నాడు. ఇందుకోసం ప్రతిరోజూ రూ.2,500 దాకా ఖర్చవుతోంది. అనంతపురం అగ్రికల్చర్ / ధర్మవరం : జిల్లాలో ఉద్యాన రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తోటలను సాగుచేస్తే సకాలంలో వర్షాలు కురవక, బోర్లలో నీరు అడుగంటిపోయి అవి నిలువునా ఎండిపోతున్నాయి. వెయ్యి అడుగులు లోతుకు బోర్లు వేసినా నీరు పడక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎండుతున్న తోటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. కొందరు కొత్తగా బోర్లు వేయిస్తుండగా.. మరి కొందరు ట్యాంకర్లతో నీరు తోలుతున్నారు. విపత్తు సంభవించడం ఖాయమని ముందే తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. జిల్లా వ్యాప్తంగా 1.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 22 రకాలకు పైగా పండ్లతోటలు సాగవుతున్నాయి. ఇందులో అత్యధికంగా చీనీ తోటలు 44 వేల హెక్టార్లు, మామిడి 40 వేల హెక్టార్లలో సాగవుతున్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగు వేల హెక్టార్లలో చీనీ తోటలు, రెండు వేల హెక్టార్లలో మామిడి, మరో వేయి హెక్టార్లలో ఇతర పండ్లతోటలు ఎండిపోయాయి. రెండు వేల హెక్టార్లలో మల్బరీ తోటలు కూడా ఎండుముఖం పట్టాయి. బోరుబావుల నుంచి నీరు రాకపోవడంతో మరో 15- 20 వేల హెక్టార్లలో పండ్లతోటలు ఎండిపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వేసవిలో పండ్లతోటల రైతులకు ఎంతలేదన్నా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. చీనీ తోటలకు రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ‘అనంత’లో ఇప్పుడు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, నార్పల, శింగనమల, తాడిమర్రి, బత్తలపల్లి, గార్లదిన్నె, రాప్తాడు, ఆత్మకూరు, ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో చీనీ తోటలు భారీ విస్తీర్ణంలో ఉన్నాయి. మరో 22 మండలాల్లోనూ కొంత విస్తీర్ణంలో సాగయ్యాయి. ఏటా 6.50 నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల చీనీ దిగుబడులు వస్తున్నాయి. వీటి ద్వారా రైతులు రూ.1,100 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు టర్నోవర్ చేస్తున్నారు. ఒక ఎకరా చీనీ తోట సాగుకు మొదటి సంవత్సరం రూ.40 వేలు ఖర్చవుతుండగా.. రెండో ఏడాది రూ.20 వేలు, మూడో ఏడాది రూ.25 వేలు, నాల్గో ఏడాది రూ.30 వేలు, ఐదో ఏడాది రూ.35 వేలు వెచ్చించాలి. ఐదేళ్ల తర్వాత మొదటి పంట చేతికి వస్తుంది. ఆ తరువాత కూడా ఏటా రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఇలా రూ.లక్షలు వెచ్చించి పెంచిన చీనీ తోటలు ఒక్కసారి ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర వేదన చెందుతున్నారు. ఒకవైపు తీవ్ర వేసవితాపం, అరకొర నీటి తడులు ఇవ్వడం వల్ల చీనీకి ఎండుకుళ్లు తెగులు సోకే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల దిగుబడులు తగ్గిపోతాయి. నాణ్యమైన ఉత్పత్తులు రావు. మార్కెటింగ్ సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ ఏడాది చీనీ రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. చోద్యం చూస్తున్న ప్రభుత్వం ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా ప్రసిద్ధి గాంచిన ‘అనంత’ను ఉద్యాన హబ్‌గానూ తీర్చిదిద్దుతామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఈ వేసవిలో పండ్లతోటలను కాపాడడానికి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. చీనీ, మామిడితో పాటు అరటి, దానిమ్మ, బొప్పాయి, కర్భూజా, కళింగర, సపోటా, రేగు, జామ తదితర తోటలన్నీ ప్రమాదంలో పడ్డాయి. వీటిని వేసవి గండం నుంచి గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ఎలాంటి రక్షణ చర్యలూ చేపట్టడం లేదు. ఈ విషయంలో జిల్లా మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ధ చూపకపోవడం దారుణమని రైతుసంఘాల నాయకులు మండిపడుతున్నారు. రక్షకతడి అంటూ గత కొంత కాలంగా ఊరిస్తున్నా ఆ దిశగా అనుమతులు రాకపోవడంతో ఉద్యానశాఖ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. గతేడాది వేరుశనగ పూర్తిగా ఎండిపోయిన తర్వాత రక్షకతడి అంటూ రూ.కోట్లు ఖర్చు పెట్టి హడావుడి చేసి ఒక్క ఎకరా పంటను కాపాడలేకపోయిన ప్రభుత్వం.. పండ్లతోటల విషయంలోనూ అదే చేస్తుందేమోనన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. పుణ్యకాలం దాటిన తర్వాత రక్షకతడులు ఇచ్చినా ప్రయోజనం ఉండదని అంటున్నారు. బోర్లెన్ని తవ్వినా.. జిల్లాలో గత ఏడాది ఆగస్టు నుంచి వరుణుడు జాడ కరువైపోయింది. దానికి తోడు ఎండలు మండుతున్నాయి. భూగర్భజలాలు సగటున 26 మీటర్ల లోతుకు పడిపోయాయి. బోరుబావుల నుంచి గుక్కెడు నీరు రావడం గగనమైపోయింది. తోటలను కాపాడుకునేందుకు రైతులు కొత్తగా 800 నుంచి 1,000 అడుగుల లోతుకు బోర్లు వేయిస్తూ భగీరథ యత్నం చేస్తున్నారు. అయినా నీటి జాడ దొరకడం లేదు. ఉన్న అప్పులకు తోడు బోర్ల తవ్వకం కోసం కొత్త అప్పులు చేయాల్సి రావడంతో రైతుల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైపోతోంది. ప్రభుత్వం ఆదుకోవాలి ఉద్యాన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎన్ని బోర్లు వేయించినా చుక్కనీరు పడటం లేదు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకునేందుకు డబ్బు చెల్లించి ఎండిపోతున్న తోటలను కాపాడాలి. - సుధాకర్‌నాయుడు, చిన్నూరు బత్తలపల్లి, ధర్మవరం మండలం పరిహారం ఇవ్వాలి బోరుబావుల్లో నీరురాక తోటలు ఎండిపోతే రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. నేను ఐదెకరాల్లో సుమారు 650 చెట్లను సాగుచేస్తే 300 మేర ఎండిపోయాయి. -తిమ్మారెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం బిల్లులు ఇవ్వాలి రెండు వేల చెట్లకు ప్రతి రోజూ నాలుగు ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుతున్నాం. రోజుకు దాదాపు ఎనిమిది వేల దాకా ఖర్చు వస్తోంది. ప్రభుత్వం ట్యాంకర్లకు అయ్యే ఖర్చు భరిస్తే కొంత ఊరట లభిస్తుంది. గత ఏడాది బిల్లులు ఇస్తామన్నారు.. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఈసారైనా ఇవ్వాలి. - దామోదర్‌రెడ్డి, శివంపల్లి, తాడిమర్రి మండలం రూ.42 కోట్లతో ప్రతిపాదనలు పంపాం: బీఎస్ సుబ్బరాయుడు, ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ చీనీ, మామిడి తోటలు ఎండిపోకుండా రక్షకతడి ఇవ్వడానికి రూ.42 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యానశాఖ కమిషనరేట్‌కు మార్చిలోనే ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు వేయి హెక్టార్లలో చీనీ, మామిడి ఎండినట్లు నివేదికలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అలాగే ఏడీలు, హెచ్‌వోల ద్వారా ఎండుతున్న పంటల విస్తీర్ణం వివరాలను సేకరిస్తున్నాం. వాటిని కూడా రేపోమాపో ప్రభుత్వానికి పంపుతాం. కనీసం ఆరు వేల హెక్టార్లలో చీనీతోటలకు, రెండు వేల హెక్టార్లలో మామిడి తోటలకు ర„ý కతడులు ఇవ్వడానికి అనుమతులు కోరాం. -
ఉద్యాన రైతులకు సాంకేతిక పరిజ్ఞానం
వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి సాక్షి, హైదరాబాద్: ఉద్యాన సాగులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో రైతులకు అందించాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ కార్యదర్శి పార్థసారథి అధికారులకు సూచించారు. ఆదివారం జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, పాలీహౌస్ రైతులు, అభ్యుదయ రైతులు, సూక్ష్మ సేద్య కంపెనీల ప్రతినిధులకు ఉద్యాన పంటల సాగులో అత్యాధునిక పద్ధతులు, మెళకువలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన పంట సాగు విధానంలో అధిక దిగుబడి సాధించేందుకు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన, సాంకేతిక సమాచారం అందించాలని పార్థసారథి అన్నారు. నర్సరీ చట్టంలో సవరణ చేసిన వివరాలను జిల్లా అధికారులు పాటించాలని, ప్రతి నర్సరీలో నాణ్యమైన నారు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండటంతో పాటు కేటాయించిన జిల్లాల్లో స్థానికంగా నివాసం ఉండాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల కమిషనర్ వెంకట్రాంరెడ్డి ఆదేశించారు. పట్టు పరిశ్రమ పథకాల అమలుకు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లతో మాట్లాడినట్లు చెప్పారు. సమావేశంలో ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, సెంటర్ అఫ్ ఎక్సలెన్సీ ఇన్చార్జి లహరి, రాజ్ కుమార్, రాష్ట్ర పాలీ హౌస్ రైతుల సంఘం అధ్యక్షులు నర్సింహారెడ్డి పాల్గొన్నారు. -
ఉద్యాన పంటలవారీగా ఎఫ్‌పీఓ క్లస్టర్లు
అనంతపురం అగ్రికల్చర్ : ఉద్యానపంటలకు సంబంధించి ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య (ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్–ఎఫ్‌పీవో) క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ అంశంపై సోమవారం తిరుపతిలో జరిగిన జోనల్‌స్థాయి సమావేశంలో ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి ఆదేశాలు ఇచ్చినట్లు మంగళవారం ఆయన 'సాక్షి'కి తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 22 ఏఫ్పీఓలు ఏర్పాటు చేశామన్నారు. వారందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు డిసెంబర్ నెలాఖరులోగా సర్వసభ్య సమావేశాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంటల వారీగా క్లస్టర్లతో పాటు పాలీహౌస్, షేడ్‌నెట్స్, గ్రీన్హౌస్, ప్యాక్‌హౌస్ లాంటి రక్షిత సేద్యపు పద్ధతుల ప్రోత్సానికి ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారన్నారు. అలాగే కమిషనర్ ఆదేశాల మేరకు వచ్చే 2017–18తో పాటు వచ్చే ఐదేళ్లకు సంబంధించి వార్షిక ప్రణాళికలు, ప్రతిపాదనలు తయారు చేసి పంపనున్నట్లు తెలిపారు. యాక్షన్‌ప్లాన్ తయారీకి వారంలోగా ఏడీలు, హెచ్ఓలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఉద్యాన విద్యార్థుల ధర్నా
హైదరాబాద్: ఉద్యానశాఖలోని ఉద్యాన విస్తరణాధికారి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యాన డిప్లొమా విద్యార్థుల సంఘం ఆందోళనకు దిగింది. సోమవారం మధ్యాహ్నం సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఫుడ్ ఈజ్ ఫస్ట్ మెడిసిన్!
ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు. ఆయురారోగ్యాలనిచ్చేది ఆహారమే. రసాయనిక అవశేషాల్లేని అమృతాహారమే ఆరోగ్యదాయకమైనది. పోషకాహార నిపుణులు చెబుతున్నదేమిటంటే.. పెద్దగా శారీరక శ్రమ చేయని వారంతా రోజువారీ అన్నం లేదా రొట్టె కంటే కూర ఎక్కువ పరిమాణంలో తినాలి. తినే కూరలో సగం ఆకుకూరలుండాలి. మిగతా సగంలో దుంపలు, కూరగాయలు ఉండాలి. కానీ, కూరగాయలే ఎక్కువగా తింటున్నాం. హైదరాబాద్ నగరవాసులకు మార్కెట్లో అందుబాటులో ఉన్న కూరగాయలు, ఆకుకూరల నాణ్యత ఎలాంటిది? కలుషిత జలాలతోటి, అధిక మోతాదుల్లో రసాయనిక ఎరువులు, విష రసాయనాలు వేసి సాగు చేసిన వ్యవసాయోత్పత్తులే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. నగరవాసులను అత్యధికంగా సుగర్, గుండెజబ్బులు, కేన్సర్ తదితర వ్యాధుల బారిన పడెయ్యడంలో రసాయనిక అవశేషాలు మెండుగా ఉన్న ఆహారోత్పత్తుల పాత్ర చాలా ఎక్కువన్న స్పృహ ప్రజల్లో ఇటీవల విస్తృతమవుతోంది. ఈ పూర్వరంగంలో రసాయన అవశేషాల్లేని ఇంటిపంటల సాగు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇంటిపంటల వల్ల అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి. చేతికి మట్టి అంటితే మనసు తేలికపడుతుందని ఇటీవలి వైద్య పరిశోధనలు తేల్చాయి. చిటికెడు మట్టిలోనే కోటానుకోట్ల సూక్ష్మజీవరాశి ఉంటుంది. చెంచాడు సారవంతమైన మట్టి జీవంతో తొణకిసలాడుతూ ఉంటుంది. అటువంటి మట్టిలో ప్రపంచంలోని మనుషుల సంఖ్య కన్నా ఎక్కువ సూక్ష్మజీవులుంటాయని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) ప్రకటించింది. మట్టిని చేతులు, కాళ్లతో తాకినప్పుడు అందులోని సూక్ష్మజీవుల వల్ల మనసు తేలికపడుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే కాసేపు మొక్కల్లో పని చేస్తే మనోల్లాసం కలుగుతుంది. మానసిక వత్తిడి తగ్గుతుంది. దీన్నే ‘హార్టీకల్చర్’ థెరపీ’ అంటున్నారు! -
ఇడియా నుంచి ఎయిర్‌టెల్‌కి ..
- మారిన ఉద్యాన, ఏపీఎంఐపీ అధికారుల ఫోన్ నంబర్లు కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యాన అధికారులతో పాటు ఏపీఎంఐపీ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. ఐడియా నుంచి ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు మారారు. కర్నూలు ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రఘునాథరెడ్డికి 79950 86793, నంద్యాల ఏడీ సతీష్‌కు 79950 86794 నంబర్లు ఇచ్చారు. కర్నూలు ఏడీ కార్యాలయం టెక్నికల్ అధికారికి 79950 87012, కోడుమూరు ఉద్యాన అధికారికి 79950 87013, డోన్ 79950 87014, కర్నూలు 79950 87015, పత్తికొండ 79950 87016, ఎమ్మిగనూరు 79950 87017, మంత్రాలయం 7995087018 నంబర్లు కేటాయించారు. ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు 79950 87059, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ మురళిమోహన్ రెడ్డికి 79950 87060 నంబర్లు వచ్చాయి. ఎంఐఏఓల నంబర్లు సైతం మారాయి -
షేడ్‌నెట్స్‌కు ప్రోత్సాహం కరువు
ఒంగోలు : పంట దిగుబడులపై వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. వర్షాకాలం, చలికాలంలోనే వివిధ పంటలు సాగవుతాయి. హరిత గృహల్లో కూరగాయలు, పూలు, సుగంధ, ఔషధ మొక్కలు పండించవచ్చు. ఎంతో ప్రయోజనకరమైన షేడ్‌నెట్స్ పథకం అమలకు సకాలంలో విధి, విధానాలు విడుదల చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఫలితంగా పథకాన్ని సద్వినియోగం చేసుకునే రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది సగం పూర్తయినా నేటికీ విధి, విధానాలు విడుదల చేయడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. షేడ్‌నెట్స్ అంటే.. వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా పంటలు సాగయ్యే విస్తీర్ణం మేర షేడ్‌నెట్స్ నిర్మిస్తారు. దీని నీడ కింద పంటలు సాగవుతాయి. డ్రిప్ పద్ధతిలో కూడా వీటికింద సాగు చేసే పంటలకు నీరందించే అవకాశం ఉంది. కూరగాయల నారుమడి మధ్య క్రమపద్ధతిలో బోదెలు తీయడం (ప్లాంటింగ్ బెడ్స్) ఈ విధానంలో ముఖ్యమైంది. ఈ విధానంలో కూరగాయల సాగు పద్ధతి మంంచి ఫలితాలు ఇస్తాయి. ఇంకా షేడ్‌నెట్స్ శాశ్వత పద్ధతిలో ఇనుము,అల్యూమినియం పైపులపై పరారుణ కిరణాలు తట్టుకునే పాలిథిన్ షీటు కప్పి తుంపర్లు, బిందు సేద్యం ద్వారా పైర్లను సాగు చేస్తుంటారు. ఇంకా కర్రలపై షేడ్‌నెట్స్ పరిచి వాటికింద మిరప, క్యారెట్, కూరగాయలు, ఆకుకూరలు, నారుమడులు, పూల తోటలు సాగు చేయవచ్చు. తదితర కూరగాయలు, కొత్తిమీర వంటివి పండిస్తుంటారు. వాతావరణ పరిస్థితులను అధిగమించి ఎండకాలంలోనూ పాలిహౌజ్, షేడ్నట్స్ కింద పంటలు పండించడంతో అన్ సీజన్లో పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ప్రారంభం నుంచి పథకం అమలకు నిబంధనలు గుదిబండగా మారాయి. 50 శాతం రాయితీ ఇస్తున్నా.. ప్రభుత్వం విధించే నిబంధనలతో పాటు సకాలంలో విధి, విధానాలు విడుదల చేయకపోవడంతో పథకం ఆశించిన స్థాయిలో అమలకు నోచుకోవడం లేదు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో.. జిల్లాలో ఉద్యాన శాఖ ఏడీ–1, 2 పరిధిలో 10 వేల చదరపు మీటర్లలో షేడ్‌నెట్స్ కింద పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. ఒక్కో రైతుకు అర ఎకర విస్తీర్ణంలో షేడ్‌నెట్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. 50 శాతం రాయితీ అమలులో ఉంది. ఒక రైతుకు రూ.6 లక్షల వరకు ఆర్థిక సాయం కల్పించే అవకాశం ఉంది. రైతులకు పూర్తిగా అవగహన లేకపోవడం.. ఉద్యాన అధికారులు రైతులకు అవగహన కల్పించకపోవడం పథకం ఆశించిన స్థాయిలో అమలకు నోచుకోలేదు. పథకం అమలులో విధి, విధానాలు సక్రమంగా పాటించలేదని అంతకుముందు ఏడాది రైతులకు రాయితీలు మంజూరు చేయలేదు. ఈ వివాదం రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. షేడ్‌నెట్స్ వేసుకున్న రైతులు రూ.కోటి వరకు నష్టపోయారు. గతేడాదీ కాలయాపనే.. గతేడాది షేడ్‌నెట్స్ నిర్మాణానికి రెండు వేల చదరపు మీటర్లు, రూ.60 లక్షల వరకు నిధులు కేటాయించారు. కొత్తగా విడుదల చేసిన గైడ్‌లైన్స్ చాంతాడంత ఉండటంతో వాటిని చదివే తీరిక అధికారులకు లేకుండా పోయింది. నిత్యం వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్ష సమావేశాలకు హజరవుతుండటంతో అప్పటి ఉద్యాన శాఖ అధికారి ఈ పథకాన్ని అటకెక్కించారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పథకం ఆశించిన స్థాయిలో రైతుల దరి చేరలేదు. ఈ సంవత్సరం ఈ పథకం అమలకు ఉద్యానశాఖ ఏడీ–1 పరిధిలో రూ.9.20 లక్షల నిధులు కేటాయించారు. ఇంత వరకూ పథకం అమలకు విధి, విధానాలు ప్రభుత్వం విడుదల చేయలేదని ఉద్యాన శాఖ ఏడీ–1 ఎం.హరిప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం విధి, విధానాలు విడుదల చేసిన వెంటనే రైతులకు ఈ పథకంపై అవగహన కల్పిస్తామని ఆయన వివరించారు. -
పండ్ల తోటల్లో ‘అక్టోబర్’ యాజమాన్యం
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ నెలలో పండ్లతోటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. ఏ తోటలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇలా వివరించారు. మామిడి తోటల్లో... – మామిడిని ఆశించే ఆకుమచ్చ, కొమ్మ ఎండు తెగులు నివారణకు ఒక లీటరు నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి పిచికారీ చేయాలి. – బెరడు లేదా కాండం తొలిచే పురుగులను నివారించాలంటే రంధ్రాల్లో ఉన్న పురుగులను ఇనుప చువ్వలతో తీసివేయాలి. తర్వాత ఆ రంధ్రాల్లో డైక్లోరోవాస్ మందు ద్రావణం లేదా పెట్రోల్‌లో ముంచిన దూదిపెట్టి బంకమట్టితో మూసివేయాలి. చెట్లకు నీరు పెట్టడం ఆపేయాలి. – పిండి పురుగులు గమనిస్తే 2 శాతం మిథైల్ పెరాథియాన్ పొడిమందు చల్లిన మట్టితో చెట్టు చుట్టూ కప్పేయాలి. వీటి పిల్లపురుగులు చెట్ల కాండం మీదకు పాకకుండా శీతాకాలంలో చెట్టు మొదళ్లకు భూమి నుంచి ఒక అడుగు ఎత్తులో ఒక అడుగు నిడివి కలిగిన పాలిథీన్ షీట్ కాండం చుట్టూ చుట్టి దానిపైన గ్రీసు పూయాలి. పైకిపోలేని పిల్ల పురుగులు గుంపులుగా గుమికూడతాయి. పదునైన చాకుతో వీటిని గీకివేసి నాశనం చేయవచ్చు. లేదంటే ఒక లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల పాస్ఫామిడాన్ కానీ, లేదా ఒక మిల్లీలీటరు డైక్లోరోవాస్ కానీ లేదా 0.3 మిల్లీలీటరు ఇమిడాక్లోప్రిడ్ కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి. సీతాఫలం తోటల్లో... – ఫక్వానికి వచ్చిన సీతాఫలం కాయలను కోసేయాలి. కాయతొలిచే ఈగ ఆశించిన కాయలను, రాలిన కాయలను ఏరివేసి కాల్చిపారేయాలి. ఈగ ఆశించిన తోటల్లో మిథైల్ యూజినాల్ ఎరలు ఎకరాకు నాలుగైదు చొప్పున చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి. అరటి తోటల్లో... అరటి తోటల్లో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీరు పెడుతుండాలి. చెట్టు చుట్టూ వచ్చే పిలకలను ఎప్పటికప్పుడు తీసేయాలి. తెల్ల చక్కెరకేళి రకానికి మూడవ దఫా కింద 110 గ్రాముల యూరియా, 80 గ్రాముల ఎంవోపీ ఎరువు వేసుకోవాలి. దానిమ్మ తోటల్లో... దానిమ్మ తోటల్లో కత్తిరింపులు చేసిన తర్వాత సిఫారసు చేసిన మోతాదుల్లో ఎరువులు వేయాలి. కాపునకు వచ్చిన తోటల్లో ప్రతి మొక్కకూ సాలీనా 30 నుంచి 40 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ ఎరువులు రెండు దఫాలుగా వేయాలి. మొదటి తడికి ముందు ఒకసారి, కాయ ఎదిగే దశలో మరోసారి వేసుకోవాలి. కొత్తగా వచ్చిన చిగుర్లపైన బ్యాక్టీరియా మచ్చతెగులు లక్షణాలు, శిలీంధ్ర మచ్చ తెగులు లక్షణాలు కనిపిస్తే పది లీటర్ల నీటికి 2.5 గ్రాముల స్ట్రెప్టోసైక్లీన్, 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి. -
మామిడి తాండ్ర ఉత్పత్తిపై అధ్యయనం
∙కోస్తాలో మండపీతల పెంపకంపై ప్రత్యేక దృష్టి ∙కలెక్టర్ అరుణ్‌కుమార్ జిల్లా కలెక్టరేట్ (కాకినాడ రూరల్) : జిల్లాలోని నాలుగు ప్రధాన కేంద్రాలుగా 14 గ్రామాల్లో ఏటా 4,200 టన్నుల మేర మామిడితాండ్ర ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు పెంపొందించడంపై సమగ్ర అధ్యయనం చేయనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కాకినాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉద్యాన, మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ద్వారా ఉత్పత్తి అవుతున్న మామిడి తాండ్ర తయారీలో సాంకేతిక పరమైన అంశాలను జత చేస్తే వీరికి మరింత మార్కెటింగ్ సౌకర్యాలు లభిస్తాయన్నారు. తొండంగి, పండూరు, కోరుకొండ, ఆత్రేయపురం వంటి ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా ఉన్న మామిడితాండ్ర తయారీదారులకు అవసరమైన మెళకువలు నేర్పించడం ద్వారా, సోలార్ డ్రైయర్ల వినియోగించే ప్రక్రియ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచవచ్చన్నారు. మామిడితాండ్ర ఉత్పత్తిపై అధ్యాయనం చేయడానికి ఒక ఏజెన్సీని గుర్తించాలని డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారిని, ఉద్యానవనశాఖ అధికారులను కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. ఈ అధ్యాయనానికి అవసరమైన కన్సల్టెన్సీకి జిల్లాకు వినూత్న కార్యక్రమాల అమలు కోసం విడుదలైన నిధుల నుంచి ఫీజు చెల్లిస్తామన్నారు. మండ పీతల పెంపకం జిల్లాలో పల్లం, చిరయానం ప్రాంతాల్లో మండపీతలను పెంచే రైతులను ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులకు కల్టెకర్ అరుణ్‌కుమార్ సూచించారు. మండపీతల పెంపకానికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 300 చెరువులకు మండపీతల సీడ్ అవసరమని ఈ ఉత్పత్తి కేంద్రం త్వరలో బాపట్లలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అదే విధంగా తాళ్లరేవు మండలం పోలేకుర్రులో ఉన్న 176 రొయ్యల చెరువుల పనితీరును కూడా పరిశీలించి మత్స్యకారులను ప్రోత్సహించాలన్నారు. కూరగాయల గ్రేడింగ్ సెంటర్లు జిల్లాలోని లంక గ్రామాలైన కేదారలంక, థానేలంక, ఊబలంక వంటి ప్రాంతాల్లో రైతులను గ్రూపులుగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లుగా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో కూరగాయల గ్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ అధికారులకు సూచించారు. కూరగాయల గ్రేడింగ్ కేంద్రం ఏర్పాటుకు పెదపట్నంలో స్థలాన్ని కేటాయించాలని అమలాపురం ఆర్డీవోకు ఫోన్లో సూచించారు. మడికి వద్ద జాతీయ రహదారిపై ఉన్న కూరగాయల మార్కెట్ సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున ఈ మార్కెట్‌ను వేరొక ప్రాంతానికి మార్చాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మైక్రో ఇరిగేషన్ పనులను సమీక్షించారు. ఈ ఏడాది 3 వేల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పనులు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. మత్స్యశాఖ డీడీ ఎస్.అంజలి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి ఎం.సుబ్బారావు, మత్స్యశాఖ ఏడీలు కె.కనకరాజు, శ్రీనివాసరావు, రామతీర్థం, ఉద్యానవనశాఖ ఏడీలు కె.గోపీకుమార్, సిహెచ్.శ్రీనివాసులు, కె.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
హార్టికల్చర్ ప్రవేశ పరీక్షలో సునీల్‌కు రెండో ర్యాంకు
కిర్లంపూడి : హార్టికల్చర్ బీఎస్సీ ప్రవేశ పరీక్షలో ముక్కొల్లు విద్యార్థి దొడ్డా సునీల్ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. సునీల్ రామచంద్రపురం కళాశాలలో రెండేళ్ల పాటు హార్టికల్చర్‌లో డిప్లొమా కోర్సు చదివాడు. ఇటీవల జరిగిన హార్టికల్చర్ బీఎస్సీ ప్రవేశ పరీక్ష రాసి ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా సునీల్‌కు తల్లిదండ్రులు వీరలక్ష్మి, వీరన్న (బాబ్జి) స్వీటు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు గ్రామస్తులు అతడిని అభినందించారు. -
అంతర పంటలతో అధిక ఆదాయం
అమలాపురం ఉద్యానశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ ఆత్రేయపురం : అంతర పంటల ద్వారా రైతులు అధిక ఆదాయాలు పొందవచ్చునని అమలాపురం ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన శుక్రవారం ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో అంతర పంటలను పరిశీలించారు. ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొబ్బరి తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నందున అందులో అంతర పంటగా కోకో, పసుపు, ఆరటి, పూలు, పండ్ల మొక్కలను వేసుకోవడం ద్వారా అధిక అదాయాలు పొందవచ్చున్నారు. కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం మండలాల్లో వేలాది ఎకరాల్లో కొబ్బరిలో కోకో పంట సాగు ద్వారా లాభాలు అర్జిస్తున్నట్టు తెలిపారు. పంటలో సాగు యాజమాన్యం, చీడపీడల నివారణ, ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, కొమ్ము కత్తిరింపులు, కోత అనంతరం చర్యలు, గింజలు పులియబెట్టే పద్ధతులు, ఎండబెట్టే విధానం, కాయలపై మచ్చలు తెగులు, ఇతర వ్యాధులు వ్యాపించడం తదితర విషయాలపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ పంటలో ఉడతలు, ఎలుకలు, గొంగళిపురుగుల నివారణకు పురుగు మందులు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి వేసుకోవాలన్నారు. యూరియా, సూపర్, పొటాష్ సమపాళ్లల్లో కలిపి ప్రతి మొక్కకు 200 నుంచి 300 గ్రాములు అందించాలని సూచించారు. లీటరు నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు కలిపి మొక్కలకు పిచికారీ చేయాలి. అనంతరం ఆయన అంంకపాలెంలో రైతులకు ఎరువులు పురుగు మందులు, కట్టర్స్ ఉచితంగా పంపీణీ చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి బబిత, సర్పంచ్ కరుటూరి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచండి
హిందూపురం రూరల్: వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి పేర్కొన్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి రైతులకు సూచనలు, సలహాలు అందించాలన్నారు. సోమవారం కిరికెరలోని కేంద్ర పట్టు పరిశోధన కేంద్రంలో నల్లచెరువు, పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర ఉద్యానవన శాఖ డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఏడాదికి 50 వేల హెక్టార్ల ఉద్యానవన పంట సాగును లక్ష్యంగా నిర్దేశించామని ఇప్పటి వరకు 22 వేల హెక్టార్లల్లో పంట సాగు పూర్తి చేశామన్నారు. అమరాపురం, రొళ్ల మండలాల్లో 100 హెక్టార్లల్లో వక్క తోట పంటలు అంతర్ పంటగా మిర్యాల సాగు చేయడానికి ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ డివిజన్ అధికారులు సుదర్శన్, రామ్ ప్రసాద్, జయకుమార్, ధరణి, అనిత, నరేష్, ఎంపీఈఓలు, ఫీల్డ్ కన్స్ల్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన కోతలు
కడప అగ్రికల్చర్: ఉద్యాన తోటలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ఉద్యానశాఖలు జిల్లాకు నిధులు కేటాయించాయి. పండ్లతోటలు, కూరగాయల సాగును పెంచడానికి రైతులను చైతన్యపరిచి సాగును చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. జిల్లా ఉద్యాన అధికారులు ఈ ఏడాది ఆయా పంటల సాగు, ఇతర పనులకు సంబంధించి ప్రణాళికలు తయారుచేసి పంపారు. ఈ పథకాల అమలుకుగాను జిల్లాలోని ఉద్యానశాఖ–1, 2లకు నిధులు విడుదల చేశారు. అయితే గతేడాది రూ. 35 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది రూ.7 కోట్లు కోత పెట్టి రూ. 28 కోట్లు మాత్రమే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సబ్బిడీ నిధులు మంజూరు చేశాయి. కేటాయింపులు ఇలా.. పండ్లతోటల విస్తరణ, పునరుద్ధరణ, పాతతోటల అభివృద్ధికి గాను జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ఉద్యాన శాఖలు రూ.18.05 కోట్లు విడుదల చేశాయి. ఆధునిక పద్ధతిలో హైబ్రిడ్ కూరగాయలను సాగుచేసే రైతులను ప్రోత్సహించేందు కోసం రూ.13.62 లక్షలు కేటాయించారు. ఇందులో పండ్ల తోటల విస్తరణకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. మిగతా వాటికి కేంద్ర, రాష్ట్ర ఉద్యానశాఖలు సగం సబ్సిడీ ఇస్తుండగా, మరో సగం ఆయా పంటలు సాగుచేసే రైతులు భరించాల్సి ఉంటుంది. ఉద్యానశాఖ–1,2 ద్వారా అరటి, మామిడి, చీనీ, నిమ్మ, దానిమ్మ,జామ, బొప్పాయి పండ్లతోటల విస్తరణలో భాగంగా 2222.5 హెక్టార్లకు రూ. 8.89 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఈ తోటల నిర్వహణకు రూ.2.57కోట్లు ఎరువులు, పురుగుమందులు, చెట్లకొమ్మల కత్తిరింపులకు సబ్సిడీ రూపంలో ఇస్తారు. అలాగే 2 వేల హెక్టార్లలోని ముదురు పండ్ల తోటల అభివృద్ధికి సంబంధించి రూ.6.59 కోట్లు ఖర్చుచేయనున్నారు. అలాగే 78 ఫాంపాండ్స్ నిర్మాణాలకు రూ.97 లక్షలు అందిస్తారు. కూరగాయల సాగుకు అంతంతమాత్రమే ఈ ఏడాది రాష్ట్రీయ వికాస్ యోజన కింద 454 హెక్టార్లలో కూరగాయ తోటల సాగుకు రూ.13.62 లక్షల సబ్సిడీని ఇవ్వనున్నారు. అలాగే మల్చింగ్‌కు 1,000 హెక్టార్లను ఎంపిక చేసి రూ.1.60 కోట్ల సబ్సిడీని మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంటు ఇన్ హార్టికల్చర్ కింద రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. సేంద్రియ వ్యవసాయంలో బాగంగా 50 సంచార వర్మీకంపోస్టు యూనిట్లకుగాను రూ.25 లక్షలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు అనుమతులు ఇచ్చారు. అదేవిధంగా యాంత్రీకరణలో భాగంగా 626 పరికరాల కొనుగోలుకు రూ.102.08 కోట్లు అందించాలని నిర్ణయించారు. ఊతకర్రల సాయంతో ఏర్పాటు చేసుకునే 36.95 హెక్టార్ల కూరగాయల సాగుకుగాను రూ.6.93లక్షలు, శాశ్వత పందిళ్లలో కూరగాయలను 15 హెక్టార్లలో సాగు చేయించడానికి రూ. 37.50 లక్షలు ఇస్తారు. పంట కోత అనంతరం మార్కెట్‌కు ఉత్పత్తులను తీసుకెళ్లే 27,095 ప్లాస్టిక్ క్రేట్స్కు రూ.32.51లక్షల సబ్సిడీని అందిస్తారు. ఇతరత్రా వాటి అమలుకు రూ.5.22 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాంయింపులు కన్నా ఇవి తక్కువే. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకుంటేనే అనుమతులు: ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ముందుగా బిందు, తుంపర సేద్య యూనిట్లు ఏర్పాటు చేసుకుంటేనే సాగుకు అనుమతులు ఇవ్వాలనే నిబంధనలు పెట్టారు. జిల్లాలో పులివెందుల, ముద్దనూరు, లక్కిరెడ్డిపల్లె, కమలాపురం, రాయచోటి డివిజన్లలో తప్పనిసరిగా డ్రిప్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా ఉద్యాన డివిజన్లలో భూగర్భజలాలు అడుగంటి ఉన్నందున బిందు, తుంపర సేద్య పరికరాల అవసరం ఉంటుంది. కానీ మైదుకూరు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు ఉద్యాన డివిజన్లలో భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నందున ఆయా రైతులకు అంతగా బిందు, తుంపర సేద్య పరికరాల అవసరం ఉండదు. అటువంటి చోట తప్పనిసరిగా డ్రిప్ ఏర్పాటు చేసుకుంటేనే పంటలసాగుకు అనుమతులు ఇస్తామనడాన్ని ఆయా ప్రాంత రైతులు వ్యతిరేకిస్తున్నారు. డ్రిప్, తుంపర పరికరాలు తమ ప్రాంతాలకు అవసం లేదని, అయినంత మాత్రాన సూక్ష్మ సేద్య అనుమతులు ఇవ్వరా? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. -
వంద ఎకరాల్లో పాలీహౌస్‌లు
కూసుమంచి: ఖమ్మం జిల్లాలో వంద ఎకరాల్లో పాలీహౌస్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన కూసుమంచిలో విలేకరులతో మాట్లాడుతూ పాలీ హౌస్‌ల ద్వారా కూరగాయల సాగుతో ఒక ఎకరంలోనే నాలుగు ఎకరాల పంటను పండించవచ్చని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీలను అందిస్తుందని పేర్కొన్నారు. ఎకరానికి రూ. 40 లక్షలు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం రూ. 30 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుందని, జిల్లాలో ఇప్పటి వరకు 13 ఎకరాల్లో పాలీహౌస్‌లను నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలో రెండు వేల ఎకరాల్లో బిందుసేద్యంతో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశామని , రైతులు డ్రిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉద్యాన పంటలకు పాలేరులో అనువైన భూములు.. పాలేరు నియోజకవర్గంలో ఉద్యాన పంటల సాగుకు అనువైన భూములు ఉన్నాయని, రైతులు ఈ పంటల సాగుపై దృష్టి సారించాలని డీడీ కోరారు. నియోజకవర్గంలో ఆపిల్, బెర్రీ,సీతాఫలం సాగును ప్రోత్పహిస్తున్నామని, ఈ పంటలు సాగుచేసే ైరె తులకు తగిన సబ్సిడీలు ఇస్తున్నామని అన్నారు.తెలంగాణలో ఖమ్మం జిల్లాలోనే బోడకాకర సాగు చేస్తున్నారని దానిని మరింత పెంచడానికి ఔత్సాహిక రైతులు ముందుకు రావాలని కోరారు. ఉద్యాన పంటల విస్తరణకు మండలానికి అధికారి.. ఉద్యానవన పంటలసాగును విస్తరించేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకోసం ప్రతి మండలానికి ఒక అధికారితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించినట్లు డీడీ తెలిపారు. ఉద్యానవన రైతులకు 50 శాతం సబ్సిడీలతో కూరగాయల విత్తనాలను సరఫరా చేయటమే కాకుండా శాశ్వత పందిళ్ల ఏర్పాటుకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని అన్నారు. బిందు, సూక్ష్మ సేద్యంతో కూరగాయలను పండించాలని రైతులను కోరారు. హరితహారం ద్వారా జిల్లాలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో 4 లక్ష మొక్కలను నాటుతున్నట్లు వివరించారు. సమావేశంలో ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, తహసీల్దారు వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ పాలేరు నియోజకవర్గ అధికారి బివీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యానశాఖలో పోస్టుల భర్తీకి బ్రేక్
హైదరాబాద్: ఉద్యానశాఖలో పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. ఆ శాఖ ప్రతిపాదించిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ తోసిపుచ్చినట్లు సమాచారం. ‘ఇప్పుడున్న వారితో సరిగా పనిచేయించుకోండి. వారిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నాక అవసరమైతే అప్పుడు చూద్దాం’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో ఉద్యానశాఖలో పోస్టుల భర్తీ జరుగుతుందని భావించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఉద్యానశాఖను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావించింది. సర్కారు ఆదేశంతోనే ఉద్యానశాఖ కూడా పోస్టుల భర్తీపై ప్రతిపాదనలు పంపింది. వాస్తవంగా 521 పోస్టులు అవసరమని గతంలో ప్రతిపాదించింది. చివరకు 208 హెచ్‌ఈవో పోస్టులు నింపాలని సర్కారు ప్రాథమికంగా అంగీకరించింది. ఎందుకోగానీ సీఎం వాటిని తిరస్కరించినట్లు తెలియడంతో అధికారులు నిరాశకు లోనయ్యారు. -
బెడ్ విధానంతో పసుపులో అధిక దిగుబడి
► హార్టికల్చర్ ఓఎస్డీ కిషన్‌రెడ్డి, డీడీహెచ్ సంగీత లక్ష్మి ► కోరుట్లలో పసుపు రైతులకు అవగాహన సదస్సు కోరుట్ల రూరల్ : బెడ్ విధానం సాగుతో పసుపు పంటలో అధిక దిగుబడి సాధించవచ్చని హార్టికల్చర్ ఓఎస్డీ, శాస్త్రవేత్త కిషన్‌రెడ్డి, డీడీహెచ్ సంగీతలక్ష్మీ అన్నారు. సోమవారం పట్టణంలోని వాసవీ కల్యాణ భవనంలో పసుపు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పసుపులో శాస్త్రీయ విధానం, విత్తనాల ఎంపిక తదితర అంశాలను రైతులకు వివరించారు. ఈ పద్దతిలో 4 అడుగుల వెడల్పులో బోజలు నిర్మించి విత్తనాలు వేయాలన్నారు. ఒక్కో ఎకరానికి 2 క్వింటాళ్ల విత్తనం అవసరమవుతుందని, ఈ విధానం ద్వారా రైతులు ఒక్కో ఎకరానికి సుమారు 40 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల వరకు పసుపు దిగుబడి సాధించవచ్చన్నారు. ఈ విధానంలో తేమ శాతం తక్కువ అవసరమన్నారు. దీని కోసం డ్రిప్ సిస్టం తప్పని సరిగా వినియోగించాలన్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం డివిజన్లో మొదటి విడతలో 70 మంది రైతులను ఎంపిక చేసి, వీరికి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు రూ.50వేలలో 70 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. ఒక్కో రైతుకు రూ.35 నుంచి రూ.38 వేల వరకు రాయితీ అందజేస్తామని వివరించారు. పంటకు ఏమైనా చీడపీడలు ఆశించి నష్టం చేస్తే ఫోటోలను వాట్సప్ ద్వారా తమకు పంపితే నివారణ పద్దతులు సూచిస్తామన్నారు. ఈ విధానాన్ని అమెరికాలో వాట్సప్ అగ్రికల్చర్ అంటారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఈ విధానాన్ని మరింత విస్తరించటానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలువురు రైతులు మాట్లాడుతూ డ్రిప్ పరికరాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుందని, ప్రభుత్వం తగినంత బడ్జెట్ కేటాయించి డ్రిప్ పరికరాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీహెచ్-2 జగిత్యాల మరియన్న, హార్టికల్చర్ అధికారి జావిద్ పాషా, హెచ్‌ఈఓలు రమేష్, వాసవి, అన్వేష్, అనిల్, హార్టీకల్చర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
పేలవంగా హార్టీకల్చర్ షో
► భారీగా స్టాల్స్ అద్దెలు... సౌకర్యాలు నిల్ ► కానరాని ఇంటర్నేషనల్ సంస్థలు ► కేవలం ఐదు రాష్ట్రాల నుంచే ఎగ్జిబిటర్ల రాక విజయవాడ: లయోలా కళాశాలలో ఏర్పాటైన ఉద్యానవన ఎగ్జిబిషన్లో స్టాల్స్ అద్దెలు ఎక్కడా లేనంత భారీగా వసూలు చేశారు. మూడు రోజులు నిర్వహించిన ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారు. దాంతో ప్రభుత్వం ఆర్బాటంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఉద్యానవన ఉత్పత్తుల మామిడి ప్రదర్శన పేలవంగా కొనసాగింది. సీఎం చంద్రబాబు ఈ ఎగ్జిబిషన్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం నాడు 300 మంది మాత్రమే హాజరయ్యారు. మంగళవారం సందర్శకులు నామమాత్రంగానే వచ్చారు. ఎగ్జిబిషన్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ అయిన (సీఐఐ) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్‌కి అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. స్టాల్స్ నిర్వాహకులకు సీఐఐ సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. భారీగా అద్దెలు మాత్రం వసూలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. ఏసీ స్టాల్స్‌కు రూ.45వేలు అద్దె వసూలు చేశారు. దాదాపు 150 ఏసీ స్టాల్స్ ద్వారా రూ.65.50 లక్షల అద్దె వసూలు చేశారు. అదే విధంగా సాధారణ స్టాల్స్ 50 ఏర్పాటు చేశారు. వీటికి ఒక్కొకదానికి రూ.20వేల చొప్పున అద్దె వసూలు చేశారు. మొదటి రోజు ఏసీ స్టాల్స్‌లో ఏసీలు పని చేయలేదు. స్టాల్స్ యజమానులకు, సిబ్బందికి భోజన వసతి, లావెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో స్టాల్స్ నిర్వాహకులు, సందర్శకులు, రైతులు నానా అగచాట్లు పడ్డారు. హైదరాబాద్ హైటెక్‌లో జరిగే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో విజయవాడ కంటే తక్కువగా స్టాల్‌కు రూ.30వేల మాత్ర మే అద్దె వసూలు చేసేవారని వివిధ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. బెంగళూరులో జరిగే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో కూడా స్టాల్‌కు రూ.32 వేలు అద్దె తీసుకున్నారని, ఇక్కడ భారీగా వ సూలు చేశారని వాపోయారు. మహా రాష్ట్ర, ఢిల్లీ, హార్యానా, గుజరాత్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వ్యవసాయ పరికరాలు తయారు చేసే కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వీటిలో అధికంగా మన రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్, రెయిన్‌గన్స్, ప్లాస్టిక్ షీట్స్, పాలీహౌస్ తదితరాలు తయారు చేసే కంపెనీలు తమ వస్తువులను ప్రదర్శించాయి. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీల సామగ్రి రాకపోవటంతో రైతులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొరియా, జపాన్, తైవాన్, చైనా తదితర దేశాల కంపెనీల వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తే బాగుండేదని రైతులు పేర్కొన్నారు. ఆర్గానిక్ పంటలపై దృష్టి సారించండి గుణదల : ఉద్యాన పంటలు పడించే రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మెరుగైన దిగుబడులు సాధించడంతోపాటు ఆరోగ్యవంతమైన పంటలను అందించిన వారవుతారని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం మామిడి ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు నూతన విధానాలను అందిపుచ్చుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో ఫుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, దేశంలోనే ఉద్యాన పంటల సాగులో బొప్పాయి, మిరప, ఆయిల్ ఫామ్ మొదటి స్థానంలో ఉన్నాయని, మామిడి, టమాట పంటలు రెండో స్థానంలో ఉన్నాయని, అన్ని రకాల ఉద్యాన పంటల్లో దేశంలో మొదటి స్థానం సాధించటానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మామిడి మేళాలో ప్రదరించిన రైతులకు అవార్డు, సర్టిఫికెట్, రూ.5 వేల నగదు బహుమతులను అందించారు. -
విధిలేక తింటున్నాం
- ఆహార కల్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన - కల్తీ నుంచి బయటపడేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం - కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర కూడా దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు - రాష్ట్రావసరాలకు తగ్గట్లు పూలు, పండ్లు, కూరగాయలు పండించాలి - సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇవ్వాలి - ఉద్యానశాఖలో మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలు ఏర్పాటు చేయాలి - ప్రభుత్వపరంగానే ప్రజలకు పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి అందించాలి - ఉద్యానశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘‘పండ్లు, కూరగాయలు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి... ఇలా ప్రతిదీ కలుషితం అవుతోంది. కల్తీలేని వస్తువంటూ లేకుండా పోయింది. ఏది తినాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయానక పరిస్థితి నుంచి బయటపడేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కల్తీల బారినుంచి ప్రజలను కాపాడేందుకు ఉద్యానశాఖ క్రియాశీలం కావాలన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఉద్యానశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అవసరాలకు సరిపడా పూలు, పండ్లు, కూరగాయలు, మసాలాలు రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యేందుకు, రైతులు లాభదాయక వ్యవసాయం చేసేందుకు, ప్రజలు రసాయనాలు ఎక్కువగాలేని కూరగాయలు, పండ్లను తినేందుకు, కల్తీలేని మసాలాలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. ఉద్యానశాఖను కూడా విస్తరించి మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, యాంత్రీకరణ వంటి విభాగాలను ఏర్పాటు చేసి అదనపు సంచాలకులను నియమించాలని ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ఆదేశం... ప్రజలు ప్రతీ రోజూ ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని... నాణ్యమైనవి కాకున్నా విధిలేకే అందుబాటులో ఉన్నవి తినాల్సి వస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈ దుస్థితిని అధిగమించేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ శివార్లలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగానే పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి వంటి వస్తువులు ప్రజలకు అందించాలని చెప్పారు. దీనికోసం ఉద్యానశాఖలో అదనపు సంచాలకుడిని, కావాల్సినంత సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. కరివేపాకు కూడా దిగుమతా...? కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాలకు నిత్యం లక్షల టన్నుల కూరగాయలు, పండ్లు, పూలు అవసరమవుతుంటే అందులో 90 శాతం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకొని ఓవైపు దుబాయ్ వలస వెళ్తుంటే మరోవైపు మనకు కావాల్సిన కూరగాయలు, పండ్లు మాత్రం బెంగుళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. చివరకు కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర కూడా దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కావాల్సినన్ని కూరగాయలు, పండ్లను ఇక్కడే పండించాలని... తద్వారా దిగుమతి చేసుకునే బాధ తప్పుతుందని... మన రైతులు బాగుపడతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాల పరిసరాల్లోని రైతులకు అవగాహన కల్పించి కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాలన్నారు. సూక్ష్మ సేద్యం ద్వారా పంటలు సాగు చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ ఇవ్వాలని... ఎస్సీ, ఎస్టీ రైతులకు మరింత ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. రైతులంతా ఒకే రకం కూరగాయలు పండించడం వల్ల కూడా గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉండవని... కాబట్టి ఉద్యానశాఖ అధికారులే వ్యవసాయ భూములను జోన్లుగా విభజించి ఎక్కడ ఏవి సాగు చేయాలో రైతులకు నిర్దేశించాలని సూచించారు. వేరే రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చి అమ్ముతూ లాభం పొందుతున్న నేపథ్యంలో మన రైతులు ఎందుకు లాభం పొందడంలేదని ప్రశ్నించారు. ఉద్యానశాఖలో మార్కెటింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెట్ వచ్చేలా కృషిచేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించాలని సూచించారు. వేప, నిమ్మ, సీతాఫల, కానుగ ఆకులతో ఎరువులు తయారుచేసేలా బయో పెస్టిసైడ్స్ రూపొందించాలని చెప్పారు. పూల తోటలపై దృష్టిపెట్టండి... హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల కోసం వేల టన్నుల పూలను ప్రతీ రోజూ వాడుతున్నారని... అవి కూడా పక్క రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పూల తోటలు పెంచేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పాలీహౌజ్‌లు ఎన్ని, ఇంకా ఎన్నింటికి అవసరం ఉంది, రాష్ట్రానికి ఎంత మొత్తంలో కూరగాయలు, పండ్లు, పూలు అవసరం, ప్రస్తుతం ఎంత ఉత్పత్తి ఉంది, ఎంత దిగుమతి చేసుకుంటున్నాం? తదితర విషయాలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే జూన్ నాటికి ఉద్యానశాఖ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. -
9 మందిపై సస్పెన్షన్ వేటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘ఉపాధి’ నిధులను మింగేసిన తొమ్మిది మందిపై వేటుపడింది. వారందర్నీ సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాలు అధికారుల్ని కదలించాయి. అటు చెరువు గట్ల అభివృద్ధి పనుల అవినీతికి, ఇటు హార్టికల్చర్ అక్రమాలకు ఒకే ఉద్యోగుల బృందం కారణమని జిల్లా జల యాజమాన్య సంస్థ(డ్వామా) వర్గాలు ప్రాథమిక నిర్ణయానికొచ్చాయి. తెర్లాంలో కుమ్మక్కై వ్యవహారాన్ని నడిపాయని అభిప్రాయపడ్డాయి. ‘సాక్షి’లో ‘గట్టు తెగిన అవినీతి’, ‘మొక్కల మాటున మెక్కేశారు’ శీర్షికన ప్రచురించిన కథనాల్ని నిశితంగా పరిశీలించి, క్షేత్ర స్థాయిలో విచారణ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఇప్పటికే రికార్డులన్నీ సీజ్ చేశాయి. ఎంబుక్‌లను పరిశీలిస్తున్నాయి. ఈ రెండింటిలోనూ అదే ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్టు డ్వామా అధికారులు అంచనాకు వచ్చారు. గురువారం సాయంత్రమే కలెక్టర్‌కు రిపోర్టు సమర్పించారు. ఆ వెంటనే వారినక్కడ కొనసాగించడం సరికాదని, వెంటనే రిలీవ్ చేయాలని మండల అధికారులకు ఉత్తర్వులు పంపించారు. అంతటితో ఆగకుండా రాత్రి 8.30గంటల సమయంలో ఇందులో ప్రమేయం ఉన్న వారందర్నీ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని డ్వామా పీడీ ప్రశాంతి ‘సాక్షి’ వద్ద ధ్రువీకరించారు. ఒక ఇంజినీరింగ్ కన్సల్టెంట్, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక ఏపీఓతో పాటు ఎంపీడీఓ వ్యవహారాన్ని తప్పు పట్టారు. అడిషనల్ పీఓ ఎస్.ఈశ్వరమ్మ, జూనియర్ ఇంజినీర్(ఇంజినీరింగ్ కన్సల్టెంట్) ఎం.భాస్కరరావు, టెక్నికల్ అసిస్టెంట్లు ఎస్.రామకృష్ణ, ఎం.సునీత, ఎస్.శ్రీనివాసరావు, ఆర్.శంకరరావు, కంప్యూటర్ ఆపరేటర్లు ఎం.వి.రమణారావు, ఎం.రవికుమార్, వి.సూర్యనారాయణలను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా బాధ్యతారాహిత్యంగా ఉన్నారన్న అభియోగంతో ఎం పీడీఓపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ మొత్తం వ్యవహారంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కేంద్ర బిందువుగా ఉన్నారని ఆరోపణలొస్తున్నాయి. అంతా ఆయనే చేశారని ఇప్పటికే అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక, ఎంపీడీవో బాధ్యతారాహిత్యాన్ని డ్వా మా వర్గాలు ఎత్తి చూపుతున్నాయి. పనుల్ని మరింతగా పర్యవేక్షించి, అవతవకలకు ఆస్కారం లేకుండా చూసుకోవల్సి ఉంది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని డ్వామా వర్గాలు అభిప్రాయపడ్డాయి. నిర్లక్ష్యంగా ఉండడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సిబ్బంది జేబులోకి 4 రోజుల వేతనం చెరువు పనులు, మొక్కల పెంపకంలో జరిగిన అవకతవకలకు కారణమైన తెర్లాం ఉపాధి సిబ్బందిపై తాజాగా మరికొన్ని ఆరోపణలు వచ్చాయి. తెర్లాం మండలంలోని పనుకువలస పంచాయతీ, సోమిదవలసలో మే 21 నుంచి 27 వరకు జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వారం పనులు చేస్తే...రెండో వారం పనులు చేయకపోయినా...రెండు వారాల్లో పనులు చేసినట్లు మస్తర్లు వేసి సిబ్బంది భారీగా స్వాహాకు పాల్పడినట్లు తెలిసింది. రెండు రోజులు పనులు చేపట్టగా మొత్తం ఆరు రో జులకు మస్తర్లు వేసి పే-ఆర్డర్ నం.1500766లో రూ.2,38,878లు డ్రా చేసినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ పే ఆర్డర్లో సుమారు 70 మంది వేతనదారులకు, అత్యధిక వేతనము రూ.145 నుంచి రూ 180ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ పేమెంట్‌లో రెండు రోజుల మొత్తం వేతనదారులకిచ్చి, మిగతా నాలుగు రోజుల వేతనం సిబ్బంది జేబులో వేసుకున్నట్లు సమాచారం. -
పరిహారం... పరిహాసం!
అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు ఏటా తగ్గుతున్న పంట విస్తీర్ణం ఒక్క కోలారు జిల్లాలోనే రూ.189 కోట్ల మేర పంట నష్టం పరిహారం చెల్లింపుల్లో ఉదాసీనత కనీస పెట్టుబడులూ దక్కని వైనం పాలకుల వైఫల్యానికి పరాకాష్ట కనుచూపు మేరలో ఎక్కడా పచ్చని చెట్లు కనిపించవు. తాగేందుకు నీళ్లు కూడా లభ్యం కావు! ఒకవేళ దొరికినా విషతుల్యం... ఫ్లోరైడ్ మయం. ఇక్కడ వ్యవసాయం చేయడమంటే సాహసమే. బోరుబావి ఏర్పాటు చేయాలంటే 1500 అడుగుల లోతున నీటి కోసం సోధించాల్సిందే. అదృష్టం బాగుంటే అరకొరగా నీరు లభ్యమవుతుంది. లేదంటే అన్నదాత అప్పుల పాలవ్వాల్సిందే. ఇది ప్రకృతి శాపం కాదు.. పాలకుల అసమర్థతను ఎత్తి చూపుతూ దశాబ్ధాలుగా కరువు కాటకాలతో చిక్కి శల్యమై పోతున్న కోలారు జిల్లా దుస్థితి. నీటి బొట్టు కోసం ఇక్కడ పుడమి తల్లి తహతహలాడుతోంది. నీటి పథకాల పేరుతో కాలయాపన చేయడం ప్రజాప్రతినిధులకు ప్రహసనంగా మారింది. వ్యక్తిగత పరువుకు పాకులాడుతుండడంతో పది మందికి ఉపయోగపడే నీటి పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. వరుస పంట నష్టాలను చవి చూస్తున్న అన్నదాతలను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు సైతం చర్యలు చేపట్టకపోవడంతో ఏటా పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోలారు జిల్లాలో రైతు ఉనికికి ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోలారు: దశాబ్దాలుగా కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న కోలారు జిల్లాలో ప్రతి ఏటా పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. వర్షాభావ పరిస్థితులు నెలకొని వరుస పంట నష్టాలతో అన్నదాతలు చిక్కి శల్యమైపోతున్నారు. అధికారుల లెక్క ప్రకారం కోలారు జిల్లాలో 1.02 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణం ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల గత ఏడాది 79,025 హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేయగలిగారు. ఇందులో 50 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా 13,160 హెక్టార్లలో వేరుశనగను విత్తారు. ఇందులో 12వేల హెకా్టార్లలో పంట నష్టం వాటిల్లిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. అలాగే 48,162 హెక్టార్లలో రాగి పంట సాగు చేపడితే 47,397 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. పంట పెట్టుబడులు సైతం దక్కకపోవడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. మొత్తానికి ఈ ఏడాది 4.97 లక్షల క్వింటాళ్ల దిగుబడి తగ్గడంతో రూ. 84.75 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఎండుతున్న తోటలు కోలారు జిల్లాలో 1,06,262 హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. ఇందులో 53,209 హెక్టార్లలో పండ్ల తోటలు ఉండగా 45 వేల హెక్టార్లలోని తోటలు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయాయి. దీంతో రూ. 103.48 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 2014 నవంబర్ 20న ఆర్.బి.సిన్హా నేతృత్వంలోని కరువు పరిశీలన కేంద్ర ృందం కోలారు జిల్లాలో పర్యటన చేసి అధ్యయనం చేసిన సమయంలో జిల్లాలో రూ. 189 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు నివేదికను జిల్లా యంత్రాంగం అందజేసింది. మామిడి పంటలకు ప్రపంచ ప్రసిధ్ది పొందిన కోలారు జిల్లాలో నేడు నీటి కొరత వల్ల మామిడి చెట్లు ఎండుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎండుతున్న మామిడి చెట్లను గుర్తించి రైతులు బాధతో వాటిని కొట్టి వేస్తున్నారు. అరకొర సాయం కోలారు జిల్లాలో ఇంత భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. నామమాత్రంగా పంట నష్ట పరిహారాన్ని విదిల్చి పాలకులు చేతులు దులుపుకుంటున్నారు. రూ. వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం లెక్కలు చూపిస్తున్నా కేవలం రూ. 28.74 కోట్ల మేర పరిహారాన్ని ప్రభుత్వం అందించడం రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పంట పెట్టుబడుల కింద ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులకు కనీసం వడ్డీకి కూడా పరిహారం సరిపోకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా అన్నదాతలను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పంట సాగు చేసేందుకు ఎవరూ ముందుకు రారని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇక ‘గ్రీన్స్‌హౌస్’ సాగు
పుణేలో శిక్షణ పొందిన ఉద్యాన అధికారులు ఆధునిక టెక్నాలజీతో ఉద్యాన పంటల సాగుకు సన్నాహాలు పంటల సాగుకు ప్రభుత్వం పెద్దపీట ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో గ్రీన్హౌస్ వ్యవసాయానికి కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌ల్లో పంటల సాగుకు ప్రాధాన్యం ఇస్తుంది. ఆధునిక సాంకేతిక పరి/ా్ఞనంతో గ్రీన్హౌస్లను ఏర్పాటు చేసి వాటిలో ఉద్యాన పంటలను పండించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 5 జిల్లాలో గ్రీన్ హౌస్‌ల వ్యవసాయాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంతో పాటు పొరుగున ఉన్న బెంగళూరు, చెన్నై తదితర మహానగరాలు, పెద్ద నగరాలు, పట్టణాలకు కూరగాయలు, పూలు తదితర ఉద్యాన పంటలను సరఫరా చేరుుంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పద్ధతిలో రైతులు ఆధిక ఆదాయూన్ని గడించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ గ్రీన్హౌస్ సాగు విధానానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఒక్కో గ్రీన్ హౌస్‌కు రూ.11 నుంచి రూ. 15 లక్షల వెచ్చించి నిర్మింపజేయూలని ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. మొదటి విడతగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. రెండో విడత ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ సాగు విధానాన్ని చేపట్టాలని రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గ్రీన్హౌస్ వ్యవసాయాన్ని రాష్ట్రంలో రైతులతో చేయించాలని ఆసక్తి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులు, నీటి వనరులు, ఏటేటా పడిపోతున్న భూగర్భజలాలు తదితర కారణాలతో రైతులను ఆధునిక వ్యవసాయం వైపునకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉన్న వనరులను వినియోగించుకుంటూ మార్కెట్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని పంటలను సాగు చేస్తూ డిమాండ్ తగిన ధరలకు రైతులు అమ్ముకునే విధంగా సాగు పద్ధతులు తీసుకురావాలని ప్రభుత్వం గ్రీన్హౌస్ విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ వ్యవసాయంపై తొలుత ఉద్యాన అధికారులకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 జిల్లాలకు చెందిన 45 మంది ఉద్యాన అధికారులకు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోర్త్ హార్వెస్ట్ టెక్నాలజీస్ సంస్థ, మహాబలేశ్వరంలో శిక్షణ ఇప్పించారు. జిల్లా నుంచి ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు కె.సూర్యనారాయణ, కస్తూరి వెంకటేశ్వర్లు, ఉద్యాన అధికారులు ఉదయ్‌కుమార్(అశ్వారావుపేట), బి.వి.రమణ(కల్లూరు), భారతి(సత్తుపల్లి), సందీప్‌కుమార్ (ఇల్లెందు) శిక్షణ పొందారు. శిక్షణ గురించి ఉద్యాన అధికారి కె.సూర్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు. -
జిల్లాకు కేటాయింపులు అంతంతే..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్త రాష్ట్రంలో కొంగొత్త ఆశల నడుమ ప్రవేశపెట్టిన తొలి పద్దులో జిల్లాకు అన్యాయమే జరిగింది. ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతలకు తగిన ప్రాధాన్యం లభించకపోగా, చేవెళ్ల-ప్రాణహితకు అరకొర నిధులే దక్కాయి. సాగునీటిరంగానికి పెద్దపీట వేస్తారని భావించినా..తెలంగాణ ప్రభుత్వం కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.5 కోట్లు విదిల్చడం గమనార్హం. ఈ నిధులు కూడా కేవలం సర్వే పనులకు మాత్రమే నిర్ధేశించారు. రూ.9వే ల కోట్ల అంచనా వ్యయంతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుకు 2014-15 బడ్జెట్లో మోక్షం కలుగుతుందనే ఆశలను ఆవిరి చేసిన టీఆర్ఎస్ సర్కారు.. ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసేలా బడ్జెట్లో ప్రస్తావించడం శుభపరిణామంగా చెప్పవచ్చు. జిల్లాకు తలమానికంలా నిలిచే ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించింది. ఐటీ ఆధారిత సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేసింది. దీంట్లో భాగంగా నిర్దేశించిన కారిడార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను వ్యయం చేయనుంది. ఉద్యానవనాల సాగును ప్రోత్సహించేందుకు ‘గ్రీన్హౌస్ కల్టివేషన్’ కింద 300 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో పొందుపరిచింది. ఇది రైతాంగానికి ఒకింత ఊరట కలిగించే అంశం. ‘పాలమూరు-రంగారెడ్డి’ స్వరూపమిది.. పది లక్షల ఎకరాలకు సాగునీరందించడం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముఖ్య ఉద్దేశం. వరదలు వచ్చే సమయంలో వివిధ సందర్భాల్లో 35-90 రోజులపాటు జూరాల నుంచి 50వేల క్యూసెక్కుల వరద నీరు దిగువప్రాంతానికి చేరుతుంది. ఈక్రమంలో ఆ జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్లలో జలాలను నిల్వ చేస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 7లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎత్తిపోతల కోసం 2,300 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,000 కోట్లు. తాజా బడ్జెట్లో ప్రభుత్వం కేవలం రూ.5కోట్లు మాత్రమే కేటాయించింది.. ధారూరు, పెద్దేముల్ మండలాల్లోని 18 గ్రామాల్లోని 9,200 ఎకరాల ఆయక ట్టుకు నీరందించే కోటిపల్లివాగు ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.50లక్షలు కేటాయించింది. ఏడు జిల్లాలకు సాగునీరందించే ప్రాణాహిత -చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు అత్తెసరు నిధులే ఇచ్చింది. బడంగ్పేట్లో మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజీకి రూ.72.45లక్షలు ఇస్తున్నట్లు పేర్కొంది. గ్రీన్‌హౌజ్ సాగుకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రాజధానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉండడంతో జిల్లా ఉద్యానశాఖకు కేటాయింపు ఆశాజనకంగా ఉండనుంది. -
ఉద్యానానికి ఊతం
తునికిబొల్లారంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రం రూ.12 కోట్లతో వంద ఎకరాల్లో విస్తరిస్తాం పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సాక్షి, సంగారెడ్డి: ఉద్యాన పంటలకు ఊతమిచ్చే విధంగా ములుగు మండలంలోని తునికిబొల్లారంలో రూ.12 కోట్ల వ్యయంతో వంద ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ, ఉద్యానవనశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్రంలో తెలంగాణలోని పది జిల్లాల ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ అధికారులకు నిర్వహించిన ఒకరోజు సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, వ్యవసాయ, ఉద్యానశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఉద్యాన శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్ హెచ్‌యూ వైఎస్ ఛాన్సలర్ బీఎంసీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పండ్లతోటల పెంపకంలో రైతులకు సమగ్ర అవగాహన, శాస్త్ర పరిశోధనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా తునికి బొల్లారంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉద్యాన సాగులో వెనుకబడి ఉన్న తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాస్త్ర పరిశోధనలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి వారికి ఆర్థికంగా లబ్ధిచేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డిలోని ఫల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కీలకభూమిక పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యాన సాగులో చిన్న రైతులను కూడా ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే పండ్ల తోటల పెంచేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను కోరారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, తెలంగాణలోని ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలన్నారు. పండ్లతోటలు సాగు చేసే రైతులు క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. జామ, నేరెడు పండ్ల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. త్వరలోనే రైతులకు భూసార హెల్త్‌కార్డులు అందజేస్తామన్నారు. ఉద్యానవనశాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌కు జిల్లా దగ్గరగా ఉన్నందున రైతులు కూరగాయలు, పండ్ల మార్కెటింగ్‌కు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు కూరగాయలు, పండ్లు సాగు చేయాలని సూచించారు. వైఎస్సార్ హెచ్యు వైస్ చాన్సలర్ బీఎంసీ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలోని వాతావర ణం కూరగాయలు, పండ్ల సాగుకు అనుకూలంగా ఉంటుందని, అయితే రైతులకు అధిక దిగుబడి ఇచ్చే మేలైన పండ్ల రకాలు ఎంచుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులకు మంచి ఆదాయం సమకూరుతుందన్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా పండ్లతోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ అధికారులకు సూచించారు. ప్రోత్సాహకాలు ఇవ్వండి: రైతుల వినతి పండ్ల తోటల సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం కల్పించాలని సదస్సులో పాల్గొన్న పలువురు రైతులు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ జిల్లాకు చెందిన నరేశ్‌రెడ్డి మాట్లాడుతూ, పండ్లతోటల సాగుకు అవసరమైన సబ్సిడీలు ఇవ్వాలని, డ్రిప్ ఇరిగేషన్ నిబంధనలను సడలించాలని, రైతులు తాము కోరిన వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసే సౌలభ్యం కల్పించాలని కోరారు. ఖమ్మం జిల్లాకు చెందిన రైతు గంగారెడ్డి మాట్లాడుతూ, అరటి సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. మరో రైతు జనార్దన్ మాట్లాడుతూ, కార్బైడ్ అవసరం లేని విధంగా మామిడి పండ్లను మగ్గించేందుకు అవసరమైన చిన్నపాటి గోదాంల నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు. దీనిపై మంత్రి పోచారం స్పందిస్తూ, పండ్ల తోటలు సాగు చేసే రైతులకు అవసరమైన ప్రోత్సాహకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సదస్సులో ఉద్యానవనశాఖ జేడీ వెంకటరామిరెడ్డి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి రామలక్ష్మి, జేడీఏ హుక్యానాయక్, పశుసంవర్థకశాఖ జేడీ లక్ష్మారెడ్డి, పది జిల్లాల ఉద్యానవనశాఖ అధికారులు ఫల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
అన్నదాత అభ్యున్నతికి కట్టుబడ్డాం: ప్రత్తిపాటి
అనంతపురం: వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హార్టికల్చర్ ద్వారా వ్యవసాయ కుటుంబాలను ఆదుకుంటామన్నారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడివుందని స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వ్యవసాయంపై విధానపత్రం తయారు చేశామని చెప్పారు. అనంతపురం జిల్లా గరుడాపురంలో 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. -
ఆశల పల్లకి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకంలో గత పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కొత్త ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేయాలని సంకల్పించింది. గతంలో పాలకమండలిలో 18 మంది ఉంటే, అందులో నలుగురు మార్కెటింగ్, మత్స్య, ఉద్యానవన, వ్యవసాయ శాఖల ఏడీలు సభ్యులుగా ఉండేవా రు. మిగతా 14 మందిలో ఐదుగురు సన్న, చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళావర్గాల నుం చి ఒక్కొక్కరు ఉండేవారు. కొత్త కమిటీల ఏర్పాటు నేపథ్యంలో మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధి లో ఉన్న 13 మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి 10 నుంచి 15 మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, నిజామాబాద్, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాలు కూడా ఈ మార్కెట్లోకే వస్తాయి. మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దాదన్నగారి విఠల్‌రావుకు కేసీఆర్ గట్టి హామీ ఇచ్చా రని అంటున్నారు. డిచ్పల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు దినేశ్‌కుమార్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శక్కరికొండ కృష్ణ, ధర్పల్లి నుంచి పీసు రాజ్‌పాల్‌రెడ్డి, సిరికొండ మండలం నుంచి గడీల రాములు, జక్రాన్‌పల్లి మండలం నుంచి అర్గుల్ నర్సయ్య రేసులో ఉన్నారు. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి కూడా ఈ పదవిని కోరుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి, భిక్కనూర్ మార్కెట్ కమిటీలున్నాయి. కామారెడ్డి చైర్మన్ పదవిని ఇటీవల జడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన మంద వెంకటేశ్వర్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హామీ ఇచ్చిన ట్టు ప్రచారం జరుగుతోంది. మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ మాచారెడ్డి మండలం అక్కాపూర్‌కు చెందిన పొన్నాల లక్ష్మారెడ్డి కూడా రేసులో ఉన్నారు. భిక్కనూరు మార్కెట్ కమిటీకి సంబంధించి అధికారిక ప్రక్రి య పూర్తి కాకపోవడంతో ఇంకా అక్క డ చైర్మన్ పదవి విషయంలో ఎవరూ బయటపడటం లేదు. ఆర్మూర్‌లో ఆర్మూర్, జక్రాన్‌పల్లి, బాల్కొండ, వేల్పూర్ మండలాలను కలుపుతూ మార్కెట్ కమిటీ ఉంది. ఆర్మూర్ నియోజకర్గ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని బాల్కొండ, వేల్పూర్ మండలాలు, నిజామాబాద్ రూరల్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం ఉండడంతో ముగ్గురు శాసనసభ్యులకు సమ్మతమయ్యే నేతనే మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి సన్నిహతులుగా ఉన్న పలువురు నాయకులు చైర్మన్ పీఠాన్ని దక్కిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్ మండల పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గంగారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జీ యామాద్రి భాస్కర్, అంకాపూర్ సొసైటీ చైర్మన్ మార గంగారెడ్డి, వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు కొట్టాల చిన్నారెడ్డి తదితరులు పోటీలో ఉన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. మద్నూర్ చైర్మన్ కోసం జుక్కల్ మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ సాయాగౌడ్, బిచ్కుంద మండలానికి చెందిన శ్రీహరి, సీతారాంపల్లికి చెందిన ఎం.సిద్ధిరాం రేసులో ఉన్నారు. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని నిజాంసాగర్ మండ లానికి చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు, టీఆర్ఎస్ నాయకుడు వినయ్‌కుమార్, పిట్లం మండలానికి చెందిన అన్నారం వెంకట్రాంరెడ్డి, తిమ్మానగర్ దేవేందర్‌రెడ్డితో పాటు ప్రస్తుత మార్కె ట్ కమిటి చైర్మన్ క్రిష్ణారెడ్డి ఆశిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి, గాంధారి మార్కెట్ కమిటీలున్నాయి. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కృష్ణాగౌడ్ (సిట్టింగ్ చైర్మన్), అశోక్‌రెడ్డి (లింగంపేట మండలం శెట్పల్లిసంగారెడ్డి) వెంకట్‌రెడ్డి (నాగిరెడ్డిపేట) పోటీ పడుతున్నారు. గాంధారి చైర్మన్ పదవిని సత్యం (సర్వాపూర్), రాంకిషన్‌రావు (గాంధారి) ఆశిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నార్ల సురేష్ గుప్తా పోటీలో ఉన్నా రు. వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవికి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు నరొజీ గంగారాం పోటీలో ఉన్నారు. మంత్రి ఆశీస్సులు మెండుగా ఉన్న వీరిద్దరు చైర్మన్లుగా ఖరారైనట్లేనన్న చర్చ ఉంది. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మా ర్కెట్ కమిటీకి ఉప్లూర్‌కు చెందిన చిన్నారెడ్డి, భీమ్‌గల్ జడ్పీటీసీ మాజీ సభ్యుడు ప్రకాష్‌గౌడ్, కమ్మర్పల్లి నాయకులు స్వామిరెడ్డి, వే ముల శ్రీనివాస్, మోర్తాడ్ మండలం సుంకెట్‌కు చెందిన తీగెల సంతోష్ పోటీ పడుతున్నారు. చిన్నారెడ్డికి ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రె డ్డి, జీవన్‌రెడ్డి, ఎంపీ కవితల ఆశీస్సులున్నాయన్న ప్రచారం ఉంది. ప్రకాష్‌గౌడ్‌కు కేసీఆ ర్తోనే సత్సంబంధాలు ఉన్నాయంటుం డగా, మిగిలిన నాయకులు ప్రశాంత్‌రెడ్డి మెప్పు కోసం యత్నిస్తున్నారు. బోధన్ వ్యవసాయ మార్కెట్ కోసం చాలామందే పోటీ పడుతున్నారు. ఖండ్గాం ఎం పీటీసీ సభ్యుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు వి.శ్యాంరావు, బోధన్‌కు చెందిన ప్రము ఖ వ్యాపారి, మైనార్టీ నాయకుడు కరీం ఈ ప దవిని ఆశిస్తున్నారు. ఇంతకు ముందు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అనుచరులే చైర్మన్లుగా వ్యవహరించగా, ఎమ్మెల్యే షకీల్ ఎవరికి అ వకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాలు ని జామాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలోకి వ స్తాయి. ఈ నియోజకవర్గంలోని సిరికొండ మండలం మాత్రం భీంగల్ మార్కెట్ కమిటీ పరిధికి వస్తుంది. భీమ్‌గల్ చైర్మన్ పదవి కో సం పలువురు పోటీ పడుతున్నారు. -
హార్టికల్చర్‌కు అనుకూలమే!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :బత్తాయి సాగుకు జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. రాష్ట్రంలోనే కాదు... దేశంలోనే జిల్లాది ప్రథమస్థానం. జిల్లాలో 5లక్షల హెక్టార్ల సేద్యపు భూమిలో ఉద్యానవన పంటలసాగు ఏకంగా 1.20లక్షల హెక్టార్లు. ఇందులో బత్తాయిసాగు ఏకంగా 70శాతం విస్తీర్ణంలో ఉంది. దీంతోపాటు మామిడి, నిమ్మ వంటి తోటల పెంపకంతోపాటు, అరటి, సపోటా, బొప్పాయి, జామ, దానిమ్మ తోటల సాగూ బాగానే ఉంది. మునుపెన్నడూ లేని రీతిలో ఉద్యానవన పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. కేవలం ఒక్క బత్తాయి దిగుబడి ద్వారానే జిల్లాలో 1600 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మరింత ఊతం లభిస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. రైతులను ఆదుకోలేకపోతున్న పథకాలు జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా రాష్ట్రీయ ఉద్యానవన మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తదితర పథకాలు అమలవుతున్నా అవి ఏ మాత్రమూ రైతులను ఆదుకోలేకపోతున్నాయి. ఉద్యానవన కార్యక్రమాల అభివృద్ధి, రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సలహాలు ఇవ్వడానికి, ప్రయోగాలు చేసే ఆదర్శ రైతులకు బాసటగా నిలవడానికి హార్టికల్చర్ యూనివర్సిటీ ఎంతో ఉపకరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పక్కనే ప్రభుత్వ భూమి సుమారు వెయ్యి ఎకరాల దాకా ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కాకుంటే ఇవి చవుడు నేలలు కావడం ప్రతికూలాంశమని చెబుతున్నారు. ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కనీసం 1200 నుంచి 1500 ఎకరాల భూమి అవసరం ఉంటుందని, నీరు సమృద్ధిగా ఉండాలని ఉద్యానవనశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. పంటల ప్రయోగాలకు, కొత్త వంగడాల తయారీకి అనువైన భూములు, నీరున్న ప్రాంతాన్ని అధికారులే గుర్తించాల్సి ఉంది. ఇప్పటికే మార్కెట్ సౌకర్యం లేక, ఒక్కోసారి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల బత్తాయి రైతు విసిగి వేసారాడు. ఇక, మావల్ల కాదని.. తోటలు నరికి మళ్లీ వరి వైపు పరుగులు పెడుతున్నారు. ఈ పరిణామం మరిన్ని అనర్థాలకు కారణం అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భూగర్భ జలాల వినియోగంతోపాటు, విద్యుత్ వినియోగమూ బాగా పెరిగే ముప్పు ఉంది. ఈ పరిస్థితుల్లో బత్తాయి రైతులు తోటల పెంపకం నుంచి పక్కకు తప్పుకోకుండా చూడడానికి హార్టికల్చర్ యూనివర్సిటీ కొంతవరకు ఉపయోగ పడుతుందని చెబుతున్నారు. యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే... జిల్లాలో ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే అది రైతుల పాలిట వరమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం 150 మంది శాస్త్రవేతలు యూనివర్సిటీలో కొలువుదీరే అవకాశం ఉంది. మరో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీటిలో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలన్న నిబంధన కూడా ఉంది. తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన కొత్త రకాల సృష్టి ఇక్కడే జరుగుతుంది కాబట్టి, జిల్లా రైతుల పొలాలే ప్రయోగశాలలు అవుతాయి. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు శాస్త్రవేత్తల ద్వారా తక్షణం అందుతాయి. -
ఆకట్టుకున్న హార్టికల్చర్ ఎక్స్పో
-
ఆశలు రేపుతున్న ఆయిల్‌పామ్
=మెట్ట భూములకు లాభదాయకం =ఆసక్తి చూపుతున్న రైతులు =మూడు వేల ఎకరాలకు విస్తరించిన సాగు మాడుగుల, న్యూస్‌లైన్: వరి, చెరకు పంటల సాగుకు సమతల భూములుండాలి. కొండ పరీవాహక ప్రాంతాల్లో భూములు సాధారణంగా ఎగుడు దిగుడుతో ఏటవాలుగా ఉం టాయి. వీటిలో వరి, చెరకు పంటల సాగుకు వీలు కాదు. ఈ భూముల్లో ఒకప్పుడు గిరి రైతులు జొన్నలు, చోళ్లు తదితర పంటలతో అరకొర ఆదాయం పొందేవారు. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం అంది స్తున్న ప్రోత్సాహాన్ని మెట్ట భూముల రైతులు అందిపుచ్చుకున్నారు. గతంలో ఎకరాకు రూ. 1500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయాన్ని చూసిన వారు ఇప్పుడు ఏకంగా రూ.40 నుం చి రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పైగా ప్రభుత్వం నుంచి పెట్టుబడితో పాటు రుణం లభించడం రైతులను మరింత ఆకట్టుకుంటోంది. ఐదెకరాల మెట్ట భూమి ఉన్న రైతులు ఆ పొలంలో బోరు తవ్వించుకుంటే ఉద్యానవన శాఖ ఆయిల్ పామ్ తోట ల పెంపకానికి హెక్టారుకు రూ.35 వేల చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తోంది. ఏపీఎంఐసీ అధికారులు ఈ మొక్కలకు 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ సిష్టంను ఏర్పాటు చేస్తున్నారు. రైతు కొద్ది మొత్తం పెట్టుబడి పెట్టగలిగితే ఆ తర్వాత 25 ఏళ్ల పాటు ఏకదాటిగా శాశ్వత ఆదాయం వస్తుందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంతో పాటు మంచి లాభాలు వస్తుండడంతో మాడుగుల మండలంలో సుమారు మూడు వేల ఎకరాలలో అయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారు. మొక్కలు నాటాక కొద్ది రోజుల సంరక్షణ అనంతరం అదే భూముల్లో అంతర పంటగా వంగ, బెండ, కంద వంటివి సాగు చేసుకోవచ్చని, దీని వల్ల ఏడాదికి గరిష్టంగా రూ.30 వేల ఆదాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుబాటులో మిల్లులు గతంలో పామాయిల్ మిల్లులు అందుబాటు లో లేక రైతులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మాడుగుల మండలంలో మూడు మిల్లులు ఏర్పాటు చేశారు. గెలలు కోసిన నాలుగైదు గంటలలో మిల్లులకు తరలిస్తున్నారు. ఏటా పెట్టుబడి లేకుండా, పెద్దగా కూలీల అవసరం లేకుండా ఆదాయం వస్తుందని రైతులు సక్కింటి రాంబాబు, డి.రాములు తెలిపారు. ఇతర రాష్ట్రాలలోకు ఎగుమతి ఇక్కడ మిల్లుల్లో తయారయ్యే పామాయిల్‌ను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మండలంలో ఆయిల్‌పామ్ తోటలు, మిల్లుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 9 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారుల అంచనా. మంచి లాభాలు ఆయిల్‌పామ్ సాగుతో ఏటా మంచి లాభాలు వస్తున్నాయి. ప్రస్తుతం కూలీలు లభించకపోవడంతో వ్యవసాయం చేయలేక పోతున్నాం. పెద్దగా పెట్టుబడి, కూలీ లు అవసరం లేకపోవడంతో ఆయిల్‌పామ్ తోటలపై ఆసక్తి చూపించాము. - సురేష్ కుమార్, రైతు, కృష్ణంపాలెం పెద్ద మొత్తంలో రాయితీలు ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తోంది. ఐదు నుంచి పదెకరాల్లో సాగు చేసుకునే వారికి 75 శాతం రాయితీ వస్తోంది. రైతులు తమ భూమిలో బోరు నిర్మించుకుని ఉద్యాన వన శాఖాధికారులను సంప్రదిస్తే ఆయిల్‌పామ్ తోటల సాగుకు సహకారం అందిస్తారు. - పి.శ్రీనివాసరావు, ఫీల్డ్ సూపర్వైజర్