అంతర పంటలతో అధిక ఆదాయం
-
అమలాపురం ఉద్యానశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్
ఆత్రేయపురం :
అంతర పంటల ద్వారా రైతులు అధిక ఆదాయాలు పొందవచ్చునని అమలాపురం ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన శుక్రవారం ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో అంతర పంటలను పరిశీలించారు. ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొబ్బరి తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నందున అందులో అంతర పంటగా కోకో, పసుపు, ఆరటి, పూలు, పండ్ల మొక్కలను వేసుకోవడం ద్వారా అధిక అదాయాలు పొందవచ్చున్నారు. కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం మండలాల్లో వేలాది ఎకరాల్లో కొబ్బరిలో కోకో పంట సాగు ద్వారా లాభాలు అర్జిస్తున్నట్టు తెలిపారు. పంటలో సాగు యాజమాన్యం, చీడపీడల నివారణ, ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, కొమ్ము కత్తిరింపులు, కోత అనంతరం చర్యలు, గింజలు పులియబెట్టే పద్ధతులు, ఎండబెట్టే విధానం, కాయలపై మచ్చలు తెగులు, ఇతర వ్యాధులు వ్యాపించడం తదితర విషయాలపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ పంటలో ఉడతలు, ఎలుకలు, గొంగళిపురుగుల నివారణకు పురుగు మందులు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి వేసుకోవాలన్నారు. యూరియా, సూపర్, పొటాష్ సమపాళ్లల్లో కలిపి ప్రతి మొక్కకు 200 నుంచి 300 గ్రాములు అందించాలని సూచించారు. లీటరు నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు కలిపి మొక్కలకు పిచికారీ చేయాలి. అనంతరం ఆయన అంంకపాలెంలో రైతులకు ఎరువులు పురుగు మందులు, కట్టర్స్ ఉచితంగా పంపీణీ చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి బబిత, సర్పంచ్ కరుటూరి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.