internal
-
యూపీలో బీజేపీకి తగ్గిన సీట్లు.. ఆరు కారణాలు ఇవే!
లక్నో: లోక్ సభ ఎన్నికల్లో తమకు కుంచుకోటగా భావించిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. గత లోక్ సభ ఎన్నికలతో పోల్చితే గణనీయంగా సీట్లు తగ్గాయి. అయితే లోక్ సభ ఎన్నికల్లో వైఫల్యానికి గల కారణాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్‌కు నివేదికి సమార్పించింది. ఈసారిగా ఓటమి, సీట్లు తగ్గుదలకు గల కారణాలను అందులో వివరించారు. ఈ నివేదికను అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ముఖ్యంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్లు ఆమేథీ, అయోధ్యల్లో మొత్తంగా సుమారు 40 వేల కార్యకర్తలు అభిప్రాయలతో తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆశించి సీట్ల రాకపోవడానికి ఈ నివేదిక ఆరు ప్రధానమైన కారణాలను వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పార్టీ ఎమ్మెల్యేలకు పవర్ లేకపోవటం. ప్రభుత్వం అధికారుల చేతిలో అధికారంలో ఉండటంతో పార్టీ కార్యకర్తల తీవ్రంగా అవమానంగా భావించారు. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయలేకపోయాయని ఓ సీనియర్ నేత పేర్కొన్నారు.రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో సుమారు 15 సార్లు పేపర్ల లీక్ అయ్యాయి. దీన్ని ప్రతిపక్షలు ప్రజల్లో తీసుకువెళ్లటంలో విజయం సాధించారు. దీంతో బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మారు.ప్రభుత్వంలో పెద్దస్థాయిలో పోస్టులను కాంట్రాక్టుల ఉద్యోగులతో భర్తీ చేయిటంలో ప్రతిపక్షాల ఆరోపణలు మరింత బలం చేకూరి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.కూర్మీ, మౌర్య సామాజిక వర్గాలు ఓట్లు ఈసారి బీజేపీ పడలేదు. దీంతో పాటు దళిత ఓటర్లను కూడా బీజేపీ తమవైపు తిప్పుకోలేకపోయింది. బీఎస్పీతో ఓటు బ్యాంక్ ఉన్న దళితులను తమవైపుకోని కాంగ్రెస్ ఓటుషేర్‌ను పెంచుకుంది.ఎన్నికలకు ముందుగానే బీజేపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కార్యకర్తలు సైతం ఎన్నికల ప్రచారంలో నిర్లక్ష్యం వహించారు. పలు దశల్లో పోలింగ్ జరగటంతో కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గుతూ వచ్చింది.రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర నాయకులే వ్యాఖ్యలు చేయటంతో వాటిని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లారు. బీజేపీ నేతలు వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోని ప్రతిపక్షాలవైపు మొగ్గుచూపారు.బీజేపీ 370 సీట్ల నినాదంతో ఎన్నికల బరిలోకి దిగగా.. 240 సీట్లకు పరిమితమైంది. దీంతో మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలో వచ్చి మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 సీట్లకు గతంలో 62 సీట్ల నుంచి 33 స్థానాలుకు తగ్గిపోయింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లను గెలుచుకుంది. దీనిపై ఇటీవల యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరీ, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి పార్టీ ఓటమిపై చర్చలు జరిపారు. -
భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం
మాస్కో: భారత అంతర్గత వ్యవహారాలు, సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా దురుద్దేశంతో కలగజేసుకుంటోందని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను అమెరికాలో చంపేందుకు భారతీయ పౌరులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించిందిగానీ నమ్మదగ్గ సాక్ష్యాలను బయటపెట్టలేదని రష్యా గుర్తుచేసింది. రష్యా, సౌదీ అరేబియా తరహా పాలనా విధానాలను దేశంలో అమలుచేయాలని మోదీ సర్కార్ భావిస్తోందని అమెరికా ఒక నివేదిక వెల్లడించడంపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖారోవా గురువారం మాట్లాడారు. ‘‘ పన్నూను అంతమొందించేందుకు భారత ‘రా’ అధికారి, మరో భారతీయుడు నిఖిల్ గుప్తాతో కలిసి కుట్ర పన్నారని అమెరికా ఆరోపించింది. కానీ అందుకు బలమైన సాక్ష్యాలు ఒక్కదాని కూడా బయటపెట్టలేదు. సాక్ష్యాలు చూపకుండా ఊహాగానాలను వ్యాప్తిచేయడం తగదు. భారత విధానాలు, దేశ చరిత్రను అవగాహన చేసుకునే స్థాయి అమెరికాకు లేదు. అందుకే భారత్‌లో మత స్వేచ్ఛపై ఆరోపణలను అమెరికా నిరంతరం గుప్పిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ వాతావరణాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా ప్రయతి్నస్తోంది. అందుకే రాష్ట్రాల్లో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, మత స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని నివేదికలు ఇస్తోంది’’ అని మారియా చెప్పినట్లు రష్యా అధికారిక ‘ఆర్టీ న్యూస్’ ఛానల్ ఒక వార్తను ప్రసారంచేసింది. గత ఏడాది అమెరికాలో పన్నూను భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ (రా) అధికారి చంపాలనుకున్న కుట్రను అమెరికా అధికారులు విజయవంతంగా భగ్నంచేశారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం వెలువరిచింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇలాంటి నిరాధార ఆరోపణలు తగవని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ ఆనాడే ఢిల్లీలో ఆక్షేపించారు. -
Delhi liquor scam: అమెరికా జోక్యంపై అభ్యంతరం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది దేశ అంతర్గత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని స్పష్టంచేసింది. బుధవారం ఢిల్లీలో అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన అసంతృప్తిని తెలియజేసింది. భారత్‌లో అమెరికా మహిళా దౌత్యవేత్త, యాక్టింగ్ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీచేసింది. దీంతో బుధవారం ఆమె ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. విదేశాంగ శాఖ అధికారులతో దాదాపు 30 నిమిషాలు సమావేశమయ్యారు. ‘స్వేచ్ఛగా, పారదర్శకంగా, వేగవంతంగా, చట్టపరంగా న్యాయం పొందే అర్హత సీఎం కేజ్రీవాల్‌కు ఉంది’ అని మంగళవారం అమెరికా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. భారత న్యాయప్రక్రియపై అమెరికా వ్యాఖ్యలను తప్పుబడుతూ భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘దౌత్య సంబంధాలకు సంబంధించి దేశాలు తోటి దేశాల సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాలకు గౌరవం ఇవ్వాలి. తోటి ప్రజాస్వామ్య దేశాల పట్ల ఇదే బాధ్యతతో మెలగాలి. బాధ్యత విస్మరిస్తే బాగుండదు. భారత్‌లో న్యాయవ్యవస్థ స్వతంత్రమైంది. సత్వర న్యాయమే దాని అంతిమ లక్ష్యం. దానిపై ఇతరుల అభిప్రాయాలు అవాంఛనీయం’’ అని ఆ ప్రకటనలో భారత్ తన అసంతృప్తిని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై వ్యాఖ్యలు చేసిన జర్మనీ దౌత్యవేత్త, డెప్యూటీ చీఫ్ మిషన్‌కు ఇటీవల భారత్ సమన్లు జారీచేసిన నేపథ్యంలో మళ్లీ అలాంటి ఘటనే జరగడం గమనార్హం. -
అయిదు దేశాల్లో ఫోన్‌పే సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అయిదు దేశాల్లో యూపీఐ ఇంటర్నేషనల్ సేవలను ప్రారంభించింది. యూఏఈ, నేపాల్, సింగపూర్, మారిషస్, భూటాన్ వీటిలో ఉన్నాయి. ఈ దేశాల్లో వర్తకులకు ఫోన్‌పే కస్టమర్లు యూపీఐ ఆధారంగా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. సాధారణంగా భారతీయ కస్టమర్లు విదేశీ కరెన్సీ, అంతర్జాతీయ క్రెడిట్/డెబిట్ కార్డు, ఫారెక్స్ కార్డును ఉపయోగించి అక్కడి వర్తకులకు చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ ఇంటర్నేషనల్ సౌకర్యంతో భారతీయ బ్యాంకు నుంచే విదేశీ కరెన్సీ రూపంలో ఈ లావాదేవీ పూర్తి అవుతుందని ఫోన్‌పే ప్రకటించింది. ఇటువంటి సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి భారతీయ ఫిన్‌టెక్ కంపెనీ తామేనని తెలిపింది. ఈ సౌకర్యం గేమ్ చేంజర్ అవుతుందని వివరించింది. ఫోన్‌పే యూజర్ల సంఖ్య 43.5 కోట్లు. -
తెలంగాణ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం అంతర్గత సర్వే
-
60 వస్తాయనుకుంటే.. 99 వచ్చాయి
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలపై తొలుత జరిపిన అంతర్గత సర్వేలో కేవలం 60 సీట్లే గెలుస్తామని తేలినట్లు బీజేపీ పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ ఫలితాలతో ఆందోళన చెందకుండా అప్పటికప్పుడు తీసుకున్న నష్ట నివారణ చర్యలతో విజయం సాధించగలిగామని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. 22 ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీ గుజరాత్లో లేకపోవడం, రాష్ట్రంలో కులసమీకరణాలు బీజేపీకి ప్రతికూలంకావచ్చొని అంచనా వేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేకపోవడం తమకు కలిసొచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తుపై స్పందిస్తూ...ఆ పార్టీతో బీజేపీకి పొసగని సంగతిని అంగీకరించారు. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని భావిస్తున్నట్ల చెప్పారు. -
ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో వివాదం
-
ముగిసిన ఏఎన్‌యూ మహిళా కబడ్డీ శిక్షణ
గుంటూరు రూరల్ ః తాడికొండ మండలంలోని లాం గ్రామంలోగల చలపతి ఫార్మసీ కళాశాలలో 15 రోజులుగా జరుగుతున్న ఏఎన్‌యూ అంతర్ కళాశాలల్లో ఎంపికయిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీకి వెళ్ళే మహిళా కబడ్డీ క్రీడాకారుల శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు మాట్లాడుతూ 15 రోజులపాటు శిక్షణ తీసుకున్న అభ్యర్థినులు తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల భారతీయ యూనివర్సిటీలో ఈ నెల 14 నుంచి 17వరకూ జరిగే అంతర్ యూనివర్సిటీల (సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ) పోటీల్లో పాల్గొంటారన్నారు. కళాశాల పిజికల్ డైరెక్టర్ పీ భానుప్రకాష్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. -
భగ్గుమన్న విభేదాలు
టీడీపీ జనచైతన్య యాత్రలో తమ్ముళ్ల తన్నులాట ∙ ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచి వర్గం రాచపల్లిలో ముష్టిఘాతాలు భారీగా పోలీసుల మోహరింపు ప్రత్తిపాడు : జనచైతన్య యాత్రలో టీడీపీలోని విభేదాలు భగ్గుమన్నాయి. ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు ముష్టి ఘాతాలకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని కార్యకర్తలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని గజ్జనపూడి, శరభవరం, రాచపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు. మధ్యాహ్నం రాచపల్లి గుబ్బాలమ్మ గుడి వద్ద పార్టీ పతాకావిష్కరణ, అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వరుపుల శంకుస్థాపన చేయాలి. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి బుద్దరాజు రామలక్ష్మి తోపాటు ఈమె భర్త పీహెచ్సీ అభివృద్ధి కమిటి చైర్మ¯ŒS బుద్దరాజు చంటిరాజు తన వర్గంతో చేరుకున్నారు. మధ్యాహ్నం టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించి, అభివృద్ధిపనులను ప్రారంభించేందుకు ఆప్కాబ్ వైస్ చైర్మ¯ŒS వరుపుల రాజా, టీడీపీ నాయకులు పర్వత రాజబాబు, ఎంపీపీ బత్తుల లోవకుమారి, మాజీ ఎంపీపీ వరుపుల తమ్మయ్యబాబు, మాజీ సర్పంచి బుద్ధరాజు చంటిరాజులతో కలిసి ఎమ్మెల్యే వరుపుల çసుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పతాకాన్ని ఆవిష్కరించే సమయాన గ్రామంలో అభివృద్ధి పనుల సమాచారం టీడీపీకే చెందిన సర్పంచికు గానీ, పార్టీ కార్యక్రమం గ్రామ పార్టీ అధ్యక్షునికి గానీ తెలియజేయాల్సిన అవసరం ఉందోలేదో చెప్పాలంటూ చంటిరాజు ప్రశ్నించారు. దీంతో వరుపుల వర్గీయులకు, చంటిరాజు వర్గీయులు ఒకరిపై ఒకరు అరుపులు, కేకలతో విరుచుకుపడ్డారు. ఒకరికొకరు పిడుగుద్దులకు దిగడంతో ఆ ప్రాంతంలోని మహిళలు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. ఈ సంఘటలో ఇరువర్గాలకు చెందిన మడికి కృష్ణ, బర్ల శ్రీను, ఉపసర్పంచి పెదిరెడ్డి నానీ, ఏనుగు శ్రీను మరో ఇరువురు స్వల్పంగా గాయపడ్డారు. అప్పటికే ప్రత్తిపాడు సీఐ జి. సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం ఎస్సైలు ఎం. నాగ దుర్గారావు, వై. రవికుమార్, పార్థసారథి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించిన కార్యకర్తలను చెదరగొట్టారు. ఈలోగా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టడం, నాయకులంతా అక్కడనుంచి నిష్క్రమించడం జరిగిపోయింది. :ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వాహనాన్ని అడ్డుకునేందుకు సర్పంచి బుద్దరాజు రామలక్ష్మి, ఆమె భర్త పీహెచ్సీ అభివృద్ధి కమిటి చైర్మ¯ŒS చంటిరాజు తన వర్గీయులతో రాహదారిని దిగ్బంధించారు. వెంటనే పోలీసులు కలుగజేసుకుని ఎమ్మెల్యే కారుకు అడ్డంగా ఉన్న కార్యకర్తలను తొలగించడంతో ఎమ్మెల్యేకు మార్గం సుగమం అయింది. -
కర్రపెత్తనంపై కస్సుబుస్సులు
రాజమహేంద్రి ‘దేశం’లో ఆధిపత్య పోరు సిటీలో గోరంట్ల జోక్యం మండిపడుతున్న మేయర్ వర్గం నానాటికీ తీవ్రమవుతున్న విభేదాలు రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. కొంత కాలంగా పార్టీలో రగులుతున్న వర్గవిభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. నగరంలో కర్రపెత్తనం చేస్తూండడం.. ఆయన తీరుపై మేయర్ వర్గం మండిపడుతూండడంతో.. ఇరు పక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో టీడీపీ నేతల వర్గపోరు తారస్థాయికి చేరింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గాన్ని వదిలేసి సిటీపై ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రయత్నాలు సాగించడాన్ని పార్టీలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకప్పుడు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ఇప్పుడు కూడా అక్కడ తన ప్రాబల్యమే ఉండాలనుకుంటే ఎలా అని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాజమహేంద్రవరం టీడీపీలో గోరంట్ల, పార్టీ సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. గోరంట్ల రూరల్‌కు వెళ్లిపోవడంతో ఈ విభేదాలకు ఫుల్స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. కానీ పార్టీలో వర్గపోరు తగ్గలేదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. అన్నింటికీ ఆయన అడ్డమేమిటి? తాజాగా గోరంట్ల, మేయర్ పంతం రజనీ శేషసాయి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. సొంత పార్టీ మేయర్, అందునా మహిళ అని కూడా చూడకుండా ప్రతి విషయంలో గోరంట్ల అడ్డు తగులుతున్నారని రజనీ శేషసాయి వర్గం మండిపడుతోంది. వీరిద్దరి మధ్య గోదావరి పుష్కరాల సందర్భంగా మొదలైన వైరం కాస్తా ఇప్పుడు ముదురు పాకాన పడింది. గోదావరి పుష్కరాల సమయంలో భోజనాల బిల్లు మంజూరుకు గోరంట్ల పట్టుదల పట్టగా, మేయర్ అభ్యంతరం చెప్పారు. దీంతో మొదలైన విభేదాలు చినికిచినికి గాలివానగా మారాయి. పుష్కరాల బిల్లులతో ఆరంభం తన అనుచరులకు అడ్డగోలుగా భోజనాల బిల్లు ఇప్పించుకునేందుకు గోరంట్ల చేసిన ప్రయత్నాలను టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహా పలువురు అప్పట్లో అడ్డుకున్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ భోజనాల బిల్లుపై అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో మేయర్ ఈ బిల్లును పక్కన పెట్టి ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. అయినప్పటికీ మేయర్‌ను బైపాస్ చేసి అప్పటి కమిషనర్ సకలారెడ్డితో తన అనుచరులకు గోరంట్ల బిల్లులు మంజూరు చేయించుకున్నారు. ఇది మేయర్ వర్గం ఆగ్రహానికి కారణమైంది. సకలారెడ్డి తరువాత కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి విజయరామరాజు బాధ్యతలు స్వీకరించారు. పుష్కర ఏర్పాట్లలో వైఫల్యం చెందారంటూ అధికార పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయననే తిరిగి కమిషనర్‌గా తీసుకురావడంలో గోరంట్ల పాత్ర లేకపోలేదని పలువురు అంటున్నారు. మరెన్నో వివాదాలు కమిషనర్‌గా విజయకుమార్‌రాజు బాధ్యతలు స్వీకరించాక గోరంట్ల, మేయర్ వర్గాల మధ్య విభేదాలు మరింతగా రచ్చకెక్కాయి. పుష్కరాల్లో సుమారు కోటిన్నర రూపాయలతో మూడు జనరేటర్లు కొనుగోలు చేశారు. వాటిని పరిశీలించేందుకు వెళ్లిన మేయర్ ఒక జనరేటర్ పని చేయలేదని గుర్తించారు. జనరేటర్‌కు ఎంత ఎక్కువ లెక్కేసినా రూ.30 లక్షలకు మించి ఉండదని టీడీపీ నేతలే అంటున్నారు. అటువంటిది మూడింటిని అంత ఎక్కువ మొత్తంతో కొనుగోలు చేయడం వెనుక గోరంట్ల పాత్ర ఉందన్న విమర్శలున్నాయి. రాజమహేంద్రవరంలో 130 సెల్లార్లకు కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. యజమానుల విజ్ఞప్తుల మేరకు కొంత గడువు ఇద్దామని మేయర్ సూచన చేశారు. కానీ దానిని అధికారులు పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వెనుక గోరంట్ల ముఖ్య అనుచరుల పాత్ర ఉందని అంటున్నారు. ఇటీవల 42వ వార్డులో క్రీడా మైదానానికి నిధులు మంజూరు చేయాలని మేయర్ ఆదేశించారు. అప్పట్లో ఆ స్థలం కోర్టు వివాదంలో ఉందని చెప్పిన అధికారులు తాజాగా రూ.28.50 లక్షలు మంజూరు చేశారు. దీనికి మేయర్ అభ్యంతరం చెప్పారు. ఆ వ్యవహారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. కార్పొరేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మేయర్ తనిఖీలు చేశారు. ఆ సందర్భంగా 17 మంది శానిటేషన్ సిబ్బంది గైర్హాజరయ్యారని గుర్తించి, చర్యలకు ఆదేశించారు. అయితే గైర్హాజరైనవారిపై చర్యలు తీసుకోకుండా గోరంట్ల అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని.. ఇలా మేయర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆమె సన్నిహితులు చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు. చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 39వ వార్డు, కంబాలచెరువు పార్కుల అభివృద్ధికి మేయర్ ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోకపోవడం ఆమెను అవమానించడం కాక మరేమిటని సహచర మహిళా కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. కంబాలచెరువు పార్కు అభివృద్ధికి తమ నేత విజ్ఞప్తి చేసినందువల్లనే గోరంట్ల అడ్డుపడి ఉంటారని గన్ని కృష్ణ వర్గీయులు మండిపడుతున్నారు. ఒకపక్క మేయర్, మరోపక్క గన్ని చెప్పినా పట్టించుకోని అధికారులు.. గోరంట్ల అనుచరుడైన డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు వార్డులో పార్కు, రోడ్డు, డ్రైన్ పనులు చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. గోరంట్ల అనుయాయులైన వాసిరెడ్డి రాంబాబు, పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావుల ద్వారా కార్పొరేషన్‌పై గోరంట్ల పెత్తనం చెలాయిస్తున్నారని మేయర్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గోరంట్ల ఇంట్లో ఇటీవల జరిగిన టీడీపీ కార్పొరేటర్ల సమన్వయ సమావేశంలో మేయర్‌ను అవమానపరిచే రీతిలో పలువురు మాట్లాడటంతో ఆమె కన్నీటిపర్యంతమై బయటకు వచ్చేశారు. వ్యూహాత్మకంగానే మేయర్‌ను ఆహ్వానించి ఇలా వ్యవహరించడం.. తాజాగా చంద్రన్న బీసీ రుణాల పంపిణీ కార్యక్రమ ఆహ్వాన పత్రికలో పేరే లేకుండా చేయడం కూడా ఆమెను అవమానించేందుకేనని అంటున్నారు. ‘మేయర్‌కు అవమానం’ శీర్షికన ‘సాక్షి’ వార్త ప్రచురించడంతో అధికారులు ఆగమేఘాలపై మేయర్ పేరుతో మరో ఆహ్వాన పత్రిక తయారుచేసి అందజేశారు. తెరవెనుక గోరంట్ల ఉండి మేయర్‌ను అడుగడుగునా అవమానించే ఉద్దేశంతోనే అలా చేశారని ఆమె వర్గం మండిపడుతోంది. -
అంతర పంటలతో అధిక ఆదాయం
అమలాపురం ఉద్యానశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ ఆత్రేయపురం : అంతర పంటల ద్వారా రైతులు అధిక ఆదాయాలు పొందవచ్చునని అమలాపురం ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన శుక్రవారం ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో అంతర పంటలను పరిశీలించారు. ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొబ్బరి తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నందున అందులో అంతర పంటగా కోకో, పసుపు, ఆరటి, పూలు, పండ్ల మొక్కలను వేసుకోవడం ద్వారా అధిక అదాయాలు పొందవచ్చున్నారు. కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం మండలాల్లో వేలాది ఎకరాల్లో కొబ్బరిలో కోకో పంట సాగు ద్వారా లాభాలు అర్జిస్తున్నట్టు తెలిపారు. పంటలో సాగు యాజమాన్యం, చీడపీడల నివారణ, ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, కొమ్ము కత్తిరింపులు, కోత అనంతరం చర్యలు, గింజలు పులియబెట్టే పద్ధతులు, ఎండబెట్టే విధానం, కాయలపై మచ్చలు తెగులు, ఇతర వ్యాధులు వ్యాపించడం తదితర విషయాలపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ పంటలో ఉడతలు, ఎలుకలు, గొంగళిపురుగుల నివారణకు పురుగు మందులు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి వేసుకోవాలన్నారు. యూరియా, సూపర్, పొటాష్ సమపాళ్లల్లో కలిపి ప్రతి మొక్కకు 200 నుంచి 300 గ్రాములు అందించాలని సూచించారు. లీటరు నీటిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు కలిపి మొక్కలకు పిచికారీ చేయాలి. అనంతరం ఆయన అంంకపాలెంలో రైతులకు ఎరువులు పురుగు మందులు, కట్టర్స్ ఉచితంగా పంపీణీ చేశారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి బబిత, సర్పంచ్ కరుటూరి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ల చేత ప్రచారం.. పార్టీలో భిన్న వాదనలు
-
కీర్తి ఆజాద్ సస్పెన్షన్‌పై బీజేపీ భేటీ
-
బాంబు పేలుళ్ల ఘటన పై చర్చ