ముగిసిన ఏఎన్‌యూ మహిళా కబడ్డీ శిక్షణ
గుంటూరు రూరల్ ః తాడికొండ మండలంలోని లాం గ్రామంలోగల చలపతి ఫార్మసీ కళాశాలలో 15 రోజులుగా జరుగుతున్న ఏఎన్‌యూ అంతర్ కళాశాలల్లో ఎంపికయిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీకి వెళ్ళే మహిళా కబడ్డీ క్రీడాకారుల శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు మాట్లాడుతూ 15 రోజులపాటు శిక్షణ తీసుకున్న అభ్యర్థినులు తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల భారతీయ యూనివర్సిటీలో ఈ నెల 14 నుంచి 17వరకూ జరిగే అంతర్ యూనివర్సిటీల (సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ) పోటీల్లో పాల్గొంటారన్నారు. కళాశాల పిజికల్ డైరెక్టర్ పీ భానుప్రకాష్ మేనేజర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.