హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అయిదు దేశాల్లో యూపీఐ ఇంటర్నేషనల్ సేవలను ప్రారంభించింది. యూఏఈ, నేపాల్, సింగపూర్, మారిషస్, భూటాన్ వీటిలో ఉన్నాయి. ఈ దేశాల్లో వర్తకులకు ఫోన్‌పే కస్టమర్లు యూపీఐ ఆధారంగా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. సాధారణంగా భారతీయ కస్టమర్లు విదేశీ కరెన్సీ, అంతర్జాతీయ క్రెడిట్/డెబిట్ కార్డు, ఫారెక్స్ కార్డును ఉపయోగించి అక్కడి వర్తకులకు చెల్లించాల్సి ఉంటుంది.
యూపీఐ ఇంటర్నేషనల్ సౌకర్యంతో భారతీయ బ్యాంకు నుంచే విదేశీ కరెన్సీ రూపంలో ఈ లావాదేవీ పూర్తి అవుతుందని ఫోన్‌పే ప్రకటించింది. ఇటువంటి సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి భారతీయ ఫిన్‌టెక్ కంపెనీ తామేనని తెలిపింది. ఈ సౌకర్యం గేమ్ చేంజర్ అవుతుందని వివరించింది. ఫోన్‌పే యూజర్ల సంఖ్య 43.5 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment