హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే తాజాగా క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ ప్రారంభించింది. బ్యాంకులు ఆఫర్ చేసే ప్రీ–అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ను యూపీఐకి అనుసంధానించి కస్టమర్లు సులభంగా చెల్లింపులు జరుపవచ్చు.
రుణాల విషయంలో యూపీఐపై రూపే క్రెడిట్ కార్డులు విజయవంతం అయిన తరువాత కంపెనీ నుంచి ఇది రెండవ ఉత్పాదన అని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ తెలిపారు. రుణ లభ్యత విషయంలో దేశంలో క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలు సంచలనం కలిగిస్తాయని అన్నారు.
వినియోగదారు యూపీఐ ఖాతాకు క్రెడిట్ లైన్‌ను జోడించడం ద్వారా విభిన్న క్రెడిట్ కార్డ్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. యూజర్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్ ద్వారా వర్తకులకు పేమెంట్స్ చేయవచ్చు. కస్టమర్ యూపీఐ లావాదేవీల ఆధారంగా బ్యాంకులు స్వల్పకాలిక ప్రీ–సాంక్షన్డ్ క్రెడిట్ లైన్ ఆఫర్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment