Credit Line
-
ఫోన్‌పే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే తాజాగా క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ ప్రారంభించింది. బ్యాంకులు ఆఫర్ చేసే ప్రీ–అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ను యూపీఐకి అనుసంధానించి కస్టమర్లు సులభంగా చెల్లింపులు జరుపవచ్చు.రుణాల విషయంలో యూపీఐపై రూపే క్రెడిట్ కార్డులు విజయవంతం అయిన తరువాత కంపెనీ నుంచి ఇది రెండవ ఉత్పాదన అని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ తెలిపారు. రుణ లభ్యత విషయంలో దేశంలో క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలు సంచలనం కలిగిస్తాయని అన్నారు.వినియోగదారు యూపీఐ ఖాతాకు క్రెడిట్ లైన్‌ను జోడించడం ద్వారా విభిన్న క్రెడిట్ కార్డ్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. యూజర్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్ ద్వారా వర్తకులకు పేమెంట్స్ చేయవచ్చు. కస్టమర్ యూపీఐ లావాదేవీల ఆధారంగా బ్యాంకులు స్వల్పకాలిక ప్రీ–సాంక్షన్డ్ క్రెడిట్ లైన్ ఆఫర్ చేస్తున్నాయి. -
క్రెడిట్ కార్డ్‌లు లేకుండానే చెల్లింపులు
న్యూఢిల్లీ: కర్ణాటక బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నవీ టెక్నాలజీస్ తాజాగా క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలను ఆవిష్కరించాయి. వినియోగదారు యూపీఐ ఖాతాకు క్రెడిట్ లైన్‌ను అనుసంధానించడం ద్వారా విభిన్న క్రెడిట్ కార్డ్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు.ఇక కస్టమర్ యూపీఐ లావాదేవీల ఆధారంగా బ్యాంకులు ప్రీ–సాంక్షన్డ్ క్రెడిట్ లైన్ ఆఫర్ చేస్తాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రీ–క్వాలిఫైడ్ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదార్ల అభిప్రాయం మేరకు మరింత మందికి విస్తరిస్తామని వివరించింది. స్వల్పకాలిక నెలవారీ రుణ ఉత్పత్తితో ఈ సేవలు ప్రారంభించినట్టు బ్యాంక్ తెలిపింది.భవిష్యత్తులో కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఈఎంఐ సౌకర్యాలు, వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ లైన్ల వంటి ఇతర వేరియంట్లను జోడించడం కోసం చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది. యూపీఐ ద్వారా ప్రజలు కార్డ్‌లు లేకుండా చెల్లించే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని భావిస్తున్నామని కర్ణాటక బ్యాంక్ ఎండీ, సీఈవో శ్రీకృష్ణన్ హెచ్ అన్నారు. -
యూపీఐతో ‘క్రెడిట్ లైన్’ వినియోగం
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రయోజనాల పరిధిని మరింత పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెస్తోంది. బ్యాంకులు కస్టమర్లకు మంజూరుచేసే ‘ప్రీ–శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్’నూ యూపీఐ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, సేవింగ్స్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు, ప్రీపెయిడ్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్‌లను యూపీఐకి లింక్ చేయవచ్చు. ఇకపై ‘ప్రీ–శాంక్షన్డ్ క్రెడిట్ లైన్స్’నూ యూపీఐకి అనుసంధానం చేయడానికి వీలవుతుంది. ప్రీ–శాంక్షన్డ్ క్రెడిట్ లైన్ అంటే– బ్యాంకులు రుణ గ్రహీతకు ముందస్తుగా మంజూరుచేసే రుణ సదుపాయం. రుణగ్రహీత ఏ సమయంలోనైనా వినియోగించుకోగలిగే ముందస్తు ఆమోదిత (పరిమితి) రుణం. ఇది క్రెడిట్ చెల్లింపు లాంటిది. దీని కింద (క్రెడిట్ లైన్) తుది వినియోగదారు రుణాన్ని వడ్డీతో తర్వాత తేదీలో తిరిగి చెల్లించవచ్చు. ఈ సదుపాయాన్ని పొందేందుకు యూపీఐ వినియోగదారులు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ద్వారా తక్షణ నగదు బదిలీ కోసం ఉపయోగించే యూపీఐ లావాదేవీలు ఆగస్టులో 10 బిలియన్ మార్కును దాటాయి. జూలైలో యూపీఐ లావాదేవీల సంఖ్య 9.96 బిలియన్లు (996.4 కోట్లు). జూన్‌లో 9.33 బిలియన్లు. -
కష్టకాలంలో శ్రీలంకకు అండగా భారత్..!
మన పక్కనే ఉన్న శ్రీలంక దేశం తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం కుదిపేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం దెబ్బతినడంతో ఆ దేశ ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు రోజు రోజుకి తరిగిపోతున్నాయి. దీంతో చమరు, నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో శ్రీలంక, భారత్ సహాయాన్ని కోరింది. అత్యవసర చమురు కొనుగోళ్లకు కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వాలని శ్రీలంక మనదేశాన్ని ఆశ్రయించింది. ఈ విషయంపై గత రెండు వారాలుగా జరుగుతున్న చర్చల తర్వాత భారత్ ఆ దేశానికి 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై కూడా సంతకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. "భారతీయ సరఫరాదారుల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి శ్రీలంకకు ఈ 500 మిలియన్ డాలర్లు ఇచ్చినట్లు" ఒక అధికారి తెలిపారు. అలాగే, భారతదేశం నుంచి అత్యవసరమైన ఆహారం, ఔషధ దిగుమతుల కోసం మరో 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ పై చర్చలు జరుగుతున్నాయని ఒక భారతీయ దౌత్యవేత్త తెలిపారు. ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు భారీగా పడిపోవడంతో నిత్యావసర సరుకులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి ధరలు ఆ దేశంలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ దేశంలో కరెంట్ కోతలు కూడా ఎక్కువ కావడంతో నిరుద్యోగ రేటు కూడా భారీగా పెరిగిపోతుంది. ఆ దేశంలో ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో రికార్డు స్థాయి 25 శాతానికి చేరుకుంది.ఆ దేశం డబ్బును ఆదా చేయడానికి విదేశీ దౌత్య కార్యాలయాలను కూడా మూసివేసింది. గత సంవత్సరం చివరి నుంచి మూడు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఆ దేశానికి ఇచ్చే క్రెడిట్ రేటింగ్స్ తగ్గించడంతో కొన్ని దేశాలు ఆ దేశానికి అప్పులు ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేస్తున్నాయి. అలాగే, చైనా నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుంది. (చదవండి: 'మేక్ ఇన్ ఇండియా' కోసం భారీగా కస్టమ్స్ సుంకం మినహాయింపులు!) -
కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్‌ను కోరిన శ్రీలంక
న్యూఢిల్లీ: మన పక్కనే ఉన్న శ్రీలంక దేశం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ దేశాన్ని ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం కుదిపేస్తుంది. కరోనా మహమ్మారి వల్ల పర్యాటక రంగం భారీగా దెబ్బతినడంతో ఆదాయం కూడా భారీగా పడిపోయింది. దీంతో ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిల్వలు పొదుపు చేసే క్రమంలో దిగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. వీటికోసం కూడా శ్రీలంక దిగుమతులపై ఆధారపడుతుంది. ఇది ఇలా ఉంటే మరోపక్క ఆ దేశంలో చమురు నిల్వలు రోజు రోజుకి ఆడగంటి పోతున్నాయి. దీంతో ముడి చమురు కొనుగోళు చేయడానికి శ్రీలంక మనదేశాన్ని 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వాలని సహాయాన్ని కోరింది. ఆ దేశంలో ప్రస్తుతం చమురు నిల్వలు వచ్చే జనవరి వరకు మాత్రమే దేశ అవసరాలకు సరిపోతాయని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్ పిలా హెచ్చరించిన కొన్ని రోజుల తర్వాత శ్రీలంక మన దేశాన్ని సహాయం చేయాలని కోరింది. ఆ దేశ ప్రభుత్వం నడుపుతున్న సీలోన్ పెట్రోలియం కార్పొరేషన్(సీపీసీ) రెండు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ సిలోన్, పీపుల్స్ బ్యాంకులకు దాదాపు 3.3 బిలియన్ డాలర్లు వరకు బకాయి పడింది. (చదవండి: డీమార్ట్ దెబ్బకు బిలియనీర్ అయిపోయాడే...!) దీంతో ఆ అప్పులను తీర్చడానికి ‘భారత్’ను సహాయం అర్దిస్తుంది. భారతదేశం, శ్రీలంక దేశాల ఇంధన కార్యదర్శులు త్వరలో రుణం కోసం ఒప్పందంపై సంతకం చేయాలని భావిస్తున్నారని ఆర్థిక కార్యదర్శి ఎస్ ఆర్ అట్టిగాల్లె పేర్కొన్నారు. గత వారం వంట గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇంధన రిటైల్ ధరల పెంపును నిలిపివేసింది. ప్రపంచ చమురు ధరల పెరుగుదల వల్ల ఈ ఏడాది చమురు దిగుమతులపై ఎక్కువ ఖర్చు చేయవలసి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో దేశ చమురు బిల్లు 41.5 శాతం పెరిగి 2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు
న్యూఢిల్లీ: మారటోరియంపరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటునిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్ బ్యాంక్‌కు ఇది తోడ్పడుతుంది. అయితే, దీనిపై యస్ బ్యాంక్ సాధారణంగా కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆర్బీఐ ఇదే తరహా రుణ సదుపాయం కల్పించింది. అటుపై 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. అప్పట్లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా విత్‌డ్రాయల్స్ కన్నా డిపాజిట్లే అధికంగా ఉన్నాయని, యస్ బ్యాంక్ ఇప్పటిదాకానైతే రుణ సదుపాయం వినియోగించుకోలేదని .. అసలు ఆ అవసరం కూడా రాకపోవచ్చని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉందని యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ మరోసారి భరోసానిచ్చారు. బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని, బైటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. రుణ వితరణలో లొసుగులు, మొండిబాకీలు, నిధుల కొరతతో సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్‌పై మార్చి 5న ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టడంతో బుధవారం నుంచి యస్ బ్యాంక్ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. పూరి జగన్నాథుని డిపాజిట్లు ఎస్బీఐలోకి మళ్లింపు.. పూరి జగన్నాథస్వామి ఆలయానికి చెందిన రూ. 389 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాను ఎస్బీఐకి బదలాయించినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. ఈ ఎఫ్డీపై రూ. 8.23 కోట్ల మేర వడ్డీ జమైనట్లు వివరించింది. మరో రూ. 156 కోట్ల రెండు ఎఫ్డీలను ఈ నెలాఖరులోగా బదలాయించనున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణన్ కుమార్‌కు యస్ బ్యాంక్ లేఖ రాసింది. ఈడీ విచారణకు అనిల్ అంబానీ.. యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ తదితరులపై మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినట్లు. ఈ నెల 30న మరోసారి హాజరు కావాలని సూచించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్‌నకు చెందిన తొమ్మిది కంపెనీలు యస్ బ్యాంక్ నుంచి రూ. 12,800 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. బడా కార్పొరేట్లకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు రూ. 4,300 కోట్ల పైగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, మార్చి 21న విచారణకు హాజరు కావాలంటూ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రకు ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. -
ఎంత నగదు వాడుకుంటే అంతే వడ్డీ!
• దేశంలోనే తొలి క్రెడిట్ లైన్ యాప్ మనీటాప్ • రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు నగదు లభ్యత • హైదరాబాద్‌లో సేవలు ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు వ్యాపార సముదాయాలకు మాత్రమే అందుబాటులో ఉన్న క్రెడిట్ లైన్ సేవలు ఇప్పుడు వ్యక్తిగత వినియోగదారులకూ చేరాయి. క్రెడిట్ లైన్ అంటే బ్యాంకులు ఎలాంటి వడ్డీలేకుండా రూ.5 లక్షల వరకూ నగదును అందిస్తాయి. అయితే బెంగళూరుకు చెందిన మనీటాప్ స్టార్టప్... ఆర్బీఎల్ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని ఈ సేవలను వ్యక్తిగత వినియోగదారులకూ అందుబాటులోకితీసుకొచ్చింది. గురువారమిక్కడ మనీటాప్ సేవలను ప్రారంభించిన సందర్భంగా సంస్థ కో–ఫౌండర్ అనుజ్ కక్కర్ విలేకరులతో మాట్లాడారు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా మనీటాప్ యాప్‌ను డౌన్‌లోడ్‌చేసుకోవాలి. సంబంధిత వివరాలు అందజేశాక... క్రెడిట్ హిస్టరీ ఆధారంగా బ్యాంక్ నుంచి అనుమతి రాగానే.. కస్టమర్ కనిష్టంగా రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకు నగదును పొందే వీలుంటుంది. అయితే ఈపరిమితిలో ఎంత నగదును వాడుకుంటే దానికి మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు కూడా కనిష్టంగా నెలకు 1.25 శాతం ఉంటాయి. అసలును 2 నెలల నుంచి 3 ఏళ్ల లోపు నెలవారి వాయిదా (ఈఎంఐ)పద్ధతుల్లో చెల్లిస్తే సరిపోతుంది. గతేడాది అక్టోబర్‌లో సేవలను ప్రారంభించిన మనీటాప్.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె, బరోడా నగరాల్లో సుమారు 70 వేల మంది వినియోగించుకుంటున్నారు. -
జూలై 6 వరకూ గ్రీస్ బ్యాంకుల మూత...
ఏటీఎం విత్‌డ్రాయెల్ పరిమితి రోజుకు 65 డాలర్లు బెయిలవుట్ డీల్‌పై 5న రిఫరెండమ్ ఏథెన్స్: గ్రీస్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. జూలై 6వ తేదీ వరకూ బ్యాంకులు పనిచేయవని, బ్యాంకులు మూసి ఉంచిన ఈ కాలంలో రోజుకు 60 యూరోలు (65 డాలర్లు) మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చంటూ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఉత్తర్వులు ఈ సంక్షోభాన్ని స్పష్టంచేశాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డానికి కొత్త రుణాలు తీసుకోవాల్సి ఉండగా... ఈ రుణాల కోసం పెట్టే షరతుల్ని అంగీకరించాలా? వద్దా అనేది తేల్చడానికి ప్రభుత్వం జూలై 5న రిఫరెండమ్ (ప్రజాభిప్రాయ సేకరణ) జరపనుంది. ఆ మర్నాటి వరకూ బ్యాంకింగ్‌కు సంబంధించి కొన్ని పరిమితులు విధించింది. జూన్ 28 నుంచి జూలై 6 వరకూ అమల్లో ఉండే ఈ పరిమితులపై అధ్యక్షుడు, ప్రధాని సంతకం చేశారు. డిక్రీ ప్రధానాంశం...: ‘‘షరతులకు కట్టుబడనిదే గ్రీస్‌తో రుణ ఒప్పందాన్ని (క్రెడిట్ లైన్) పొడిగించే ప్రశ్నేలేదని జూన్ 27న యూరో గ్రూప్ నిర్ణయించింది. దీంతో లిక్విడిటీకి (ద్రవ్య సరఫరా) ఇబ్బందులొచ్చే పరిస్థితి ఏర్పడింది’ అని తాజా డిక్రీలో పేర్కొన్నారు. గ్రీస్ బ్యాంకులకు అందించే అత్యవసర ద్రవ్య సహాయం(ఈఎల్ఏ) కింద అదనపు నిధులు ఇవ్వబోమని సైతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ఆదివారం స్పష్టంచేసింది. నగదు ఉపసంహరణలపై ఆంక్షలు విధిస్తారని ఆదివారమే వార్తలు రావటంతో ప్రజలు ఏటీఎంల ముందు బారులు తీరారు. పెన్షనర్లూ పెద్ద ఎత్తున ఏటీఎంల ముందు బారులు తీరారు. మినహాయింపులూ ఉన్నాయ్..: బ్యాంక్ లావాదేవీల పరిమితుల నుంచి పెన్షన్ పేమెంట్లను ప్రభుత్వం మినహాయించింది. బ్యాంక్ అకౌంట్లలోకి వివిధ సంస్థలు వేతన బదలాయింపులు చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని తెలిపింది. గ్రీస్‌లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. షాపుల్లో కార్డ్ పేమెంట్ల విషయంలో సాధారణ పరిస్థితులే ఉంటాయి. అయితే నగదు విదేశీ బదలాయింపుల అంశానికి మాత్రం ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి అవసరం.