న్యూఢిల్లీ: కర్ణాటక బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నవీ టెక్నాలజీస్ తాజాగా క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలను ఆవిష్కరించాయి. వినియోగదారు యూపీఐ ఖాతాకు క్రెడిట్ లైన్‌ను అనుసంధానించడం ద్వారా విభిన్న క్రెడిట్ కార్డ్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు.
ఇక కస్టమర్ యూపీఐ లావాదేవీల ఆధారంగా బ్యాంకులు ప్రీ–సాంక్షన్డ్ క్రెడిట్ లైన్ ఆఫర్ చేస్తాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రీ–క్వాలిఫైడ్ కస్టమర్లకు ఈ సేవలను అందిస్తున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదార్ల అభిప్రాయం మేరకు మరింత మందికి విస్తరిస్తామని వివరించింది. స్వల్పకాలిక నెలవారీ రుణ ఉత్పత్తితో ఈ సేవలు ప్రారంభించినట్టు బ్యాంక్ తెలిపింది.
భవిష్యత్తులో కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఈఎంఐ సౌకర్యాలు, వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ లైన్‌ల వంటి ఇతర వేరియంట్లను జోడించడం కోసం చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది. యూపీఐ ద్వారా ప్రజలు కార్డ్‌లు లేకుండా చెల్లించే విధానాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని భావిస్తున్నామని కర్ణాటక బ్యాంక్ ఎండీ, సీఈవో శ్రీకృష్ణన్ హెచ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment