యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ల ద్వారా జరిగే క్రెడిట్ కార్డ్ లావాదేవీలు రూ.10,000 కోట్లకు చేరాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎండీ, సీఈఓ దిలీప్ అస్బే తెలిపారు. అందులో యూపీఐ సేవలందించే బ్యాంకులు తమ వినియోగదారులకు సుమారు రూ.100 కోట్లు నుంచి రూ.200 కోట్ల వరకు లోన్లు అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ..‘యూపీఐ ద్వారా చేసే క్రెడిట్ కార్డుల వినియోగం రూ.10వేల కోట్లకు చేరింది. కార్డు లావాదేవీలను అసరాగా చేసుకుని బ్యాంకులు దాదాపు రూ.200 కోట్ల వరకు ప్రి అప్రూవ్డ్ లోన్లు ఇస్తున్నాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంక్ ముందంజలో ఉంది. దాంతోపాటు స్వల్ప కాల వ్యవధి కలిగిన రుణాలను కూడా బ్యాంకులు విడుదల చేస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చిన్నమొత్తంలో రుణాలను అందించడం ద్వారా కొత్త కస్టమర్‌లను సంపాదించాలని భావిస్తున్నాయి’ అన్నారు.
ఇదీ చదవండి: బీమా కంపెనీలపై 12 శాతం పెనాల్టీ!
క్రెడిట్‌కార్డు లావాదేవీలపై యూపీఐ ద్వారా లోన్లు ఇవ్వడం బ్యాంకులకు కొంత లాభాలు చేకూర్చే అంశమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సర్వీసులను వినియోగదారులకు చేరవేసేందుకు బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి యూపీఐ ద్వారా బ్యాంకులు మాత్రమే లోన్లు ఇవ్వగలవు. ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌లు కూడా బ్యాంకుల మాదిరి లోన్లు ఇచ్చేలా వెసులుబాటు పొందాలని భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ఆర్‌బీఐ అనుమతులు కావాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment