ఆన్‌లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రధానంగా యూపీఐని ఎక్కువ మంది వాడుతుండడంతో, క్రెడిట్ కార్డు(credit card) వినియోగదారులు కొనుగోళ్లు చేయడానికి డిజిటల్ చెల్లింపులను ఎంచుకుంటున్నారు. తిరిగి కార్డు బిల్లులు చెల్లించేందుకు కూడా యూపీఐను ఎంచుకుంటే మరింత సులువుగా పేమెంట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే యూపీఐ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేయడం ఎలా?
మొదటిసారి యూపీఐని ఉపయోగిస్తుంటే, డిజిటల్ చెల్లింపులు చేయడానికి, మీ క్రెడిట్ కార్డు(credit card)లను ఉపయోగించడానికి భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
క్రెడిట్ కార్డును యూపీఐతో జత చేయాలి. అందుకు యాప్ ఓపెన్ చేసి ‘యాడ్ పేమెంట్ మెథడ్’ విభాగానికి వెళ్లాలి.
క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకుని క్రెడిట్ కార్డ్ నంబర్, సివీవీ, ఎక్స్‌పైరీ తేదీ వంటి వివరాలను ఇవ్వాలి.
తర్వాత మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. దాంతో యూపీఐకు కార్డు లింక్ అవుతుంది.
క్రెడిట్ కార్డు ఖాతాను లింక్ చేసిన తర్వాత కార్డుతో యూపీఐ ఐడీని సృష్టించాలి. యూపీఐ ఐడీ అనేది సంఖ్యలు, అక్షరాలు, స్పెషల్ సింబల్స్ కలిగిన ఒక ప్రత్యేక గుర్తింపు. మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన ఈ ఐడీ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడానికి, స్వీకరించడానికి సహాయపడుతుంది.
యూపీఐ ఐడీ చెక్ చేసుకోవడానికి యాప్‌లోని ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి ‘యూపీఐ ఐడీ’ని ఎంచుకోవాలి.
ఇదీ చదవండి: మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం
క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయడం ఎలా?
క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. లేదా ‘పే ఫోన్ నంబర్’ లేదా ‘పే కాంటాక్ట్స్’ వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
తర్వాత యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. యాప్ క్యూఆర్ కోడ్, ఫోన్ నంబర్ లేదా కాంటాక్ట్ నంబర్‌ను ధ్రువీకరించిన తర్వాత, బదిలీ చేయాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి.
తర్వాత చెల్లింపులు చేయడానికి క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి.
యూపీఐ పిన్ ఎంటర్ చేసి లావాదేవీ(UPI payments)ని పూర్తి చేయాలి.
యాప్‌లో సంబంధిత చెల్లింపు ఎంపికల్లో ‘సెల్ఫ్ ట్రాన్స్ఫర్’ను కూడా ఎంచుకోవచ్చు. ఇది ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment