BHIM
-
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!
రవి ఉదయాన్నే లేచి కిరాణంకు వెళ్లి ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాడు. బిల్లు చెల్లించేందుకు యూపీఐ థర్డ్‌పార్టీ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేశాడు. కానీ పేమెంట్ జరగలేదు. మళ్లీ ప్రయత్నించాడు. అయినా పేమెంట్ అవ్వలేదు. క్రితం రోజు రాత్రే తన ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ గడువు ముగిసిన విషయం రవికి గుర్తొచ్చింది. ఇంటికేమో సరుకులు తీసుకెళ్లాలి. కానీ పేమెంట్ చేద్దామంటే నెట్ సదుపాయం లేదు. వెంటనే తనకు ‘యూపీఐ 123పే’ సర్వీసు గుర్తొచ్చింది. దాంతో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే యూపీఐ పేమెంట్ చేసి సరుకులతో ఇంటికి వచ్చాడు.యూపీఐ 123పే ఆల్ట్రా క్యాష్ ద్వారా ఎలాంటి నెట్ సదుపాయం లేకుండానే రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా యూపీఐ సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.మీ ఫోన్ నుంచి యూపీఐ 123పేకు అనుసంధానంగా ఉన్న ‘08045163666’ నంబరుకు డయల్ చేయండి.ఐవీఆర్‌ను అనుసరిస్తూ స్థానిక భాషను ఎంచుకోవాలి.మనీ ట్రాన్సాక్షన్ కోసం ‘1’ ఎంటర్ చేయమని ఐవీఆర్‌లో వస్తుంది. వెంటనే 1 ప్రెస్ చేయాలి.మీరు ఎవరికైతే డబ్బు పంపాలనుకుంటున్నారో బ్యాంకు వద్ద రిజిస్టర్ అయిన తమ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.ఐవీఆర్ సూచనలు పాటిస్తూ మీ బ్యాంకు పేరును వాయిస్ ద్వారా ధ్రువపరచాల్సి ఉంటుంది. వెంటనే మీ అకౌంట్ చివరి నాలుగు డిజిట్లు ఐవీఆర్ కన్ఫర్మ్ చేస్తుంది.తర్వాత ఎంత డబ్బు పంపించాలో ఎంటర్ చేయాలి.ఇదీ చదవండి: వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?మీరు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తిరిగి ఐవీఆర్ ధ్రువపరుస్తుంది. ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో వారి పేరు కూడా చెబుతుంది. తిరిగి కాల్ వస్తుందని చెప్పి కాల్ కట్ అవుతుంది.అలా కాల్ కట్ అయిన క్షణాల్లోనే ముందుగా మీరు కాల్ చేసిన నంబర్ నుంచే కాల్ వస్తుంది.మనీ ట్రాన్స్ఫర్ ధ్రువపరిచేందుకు ఐవీఆర్‌ను అనుసరించి 1 ప్రెస్ చేయాలి.తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.మీరు ఎవరికైతే డబ్బు చెల్లించాలో వారి ఖాతాలో డబ్బు జమైందో కనుక్కుంటే సరిపోతుంది. -
ఫోన్ పే, గూగుల్ పేకు గట్టి పోటీ.. సిద్దమవుతున్న భీమ్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఒక స్వతంత్ర అనుబంధ సంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బీహెచ్ఐఎమ్ (భీమ్) తన ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్‌ను బీహెచ్ఐఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.లలితా నటరాజ్ గతంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేశారు. కాబట్టి నటరాజన్ 'బీహెచ్ఐఎమ్'ను వేగంగా అభివృద్ధి చేస్తారని భావిస్తున్నారు. ఈ అభివృద్ధికి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సహరిస్తున్నట్లు సమాచారం. భారతదేశంలో ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఈ యాప్‌ల మీద ప్రజలు ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం బీహెచ్ఐఎమ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ఆలోచిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 85 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం భవిష్యత్తులో ఆందోళన కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.బీహెచ్ఐఎమ్ అనేది 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాప్‌ని నేరుగా బ్యాంక్ చెల్లింపులు చేయడానికి లేదా యూపీఐ చెల్లింపులు చేయడానికి ఉపయోగించుకుపోవచ్చు. అయితే గూగుల్ పే, ఫోన్ పే వాడకంలోకి వచ్చిన తరువాత బీహెచ్ఐఎమ్ వినియోగం తగ్గిపోయింది. కాబట్టి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది. -
సంక్షోభంలో పేటీఎం - ప్రత్యర్థులకు పెరిగిన డిమాండ్..
ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) ప్రస్తుతం అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. దాని ప్రత్యర్థులు గణనీయమైన వృద్ధి పొందుతున్నాయి. దీంతో పేటీఎం యూజర్లు చాలామంది గూగుల్ పే, ఫోన్‌పే, BHIM యాప్‌ల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదని పేటీఎంకు కొన్ని షరతులు విధించింది. దీంతో కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం పేటీఎం యూజర్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఫిబ్రవరి 3 వరకు ఫోన్‌పే 2.79 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను పొందిందని యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఒక నివేదికలో వెల్లడించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్లు 24.1 శాతం పెరిగి 10.4 లక్షలకు చేరుకుంది. యూజర్లను ఆకర్శించడానికి ఫోన్‌పే కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. దీని ఫలితంగా భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఫ్రీ యాప్ విభాగంలో కంపెనీ అగ్రస్థానానికి చేరుకుంది. యాప్ ర్యాంకింగ్‌లలో కూడా ఈ యాప్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఎక్కువ మంది యూజర్లు విరివిగా ఫోన్‌పే డౌన్లోడ్ చేసుకుంటున్న కారణంగా గూగుల్ ప్లేలో 188వ స్థానంలో ఉన్న కంపెనీ ఫిబ్రవరి 5 నాటికి 33వ స్థానానికి, యాప్ స్టోర్లలో 227వ స్థానం నుంచి 72వ స్థానానికి చేరింది. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్ కూడా ఫిబ్రవరి 3న 1.35 లక్షల ఆండ్రాయిడ్ డౌన్లోడ్లను సాధించి, 21.5 శాతం వృద్ధి కైవసం చేసుకుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల్లో.. 50 శాతం పెరిగి 5.93 లక్షల డౌన్లోడ్స్ పొందింది. దీంతో 356వ స్థానంలో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లేలో 7వ స్థానానికి, యాప్ స్టోర్లలో 171 స్థానం నుంచి 40వ స్థానానికి చేరింది. ఇదీ చదవండి: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు - కారణం ఇదే.. గూగుల్ పే విషయానికి వస్తే.. ఈ యాప్ డౌన్లోడ్ల విషయంలో స్వల్ప వృద్ధిని సాధించింది. ఇది ఫిబ్రవరి 3న 1.09 లక్షల డౌన్లోడ్లను సాధించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు నాలుగు రోజుల వ్యవధిలో ఆండ్రాయిడ్ డౌన్లోడ్స్ 8.4 శాతం పెరిగి 3.95 లక్షలకు చేరుకుంది. -
Upi-Paynow Linked: పేనౌతో ఎస్బీఐ జట్టు
ముంబై: యూపీఐ ప్లాట్‌ఫాం ఆధారంగా సీమాంతర చెల్లింపులకు వెసులుబాటు కల్పించే దిశగా సింగపూర్‌కి చెందిన పేనౌతో జట్టు కట్టినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వెల్లడించింది. భీమ్ ఎస్బీఐపే మొబైల్ యాప్ ద్వారా ఈ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. భారత్ నుంచి సింగపూర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ల ద్వారా, సింగపూర్ నుంచి భారత్‌కు యూపీఐ ఐడీ ద్వారా నగదు బదిలీ చేయొచ్చని వివరించింది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ద్వైపాక్షిక రెమిటెన్సులు ఏటా దాదాపు 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. -
మనీ పర్సుకు బైబై.. ప్రధానంగా 3 కారణాలతోనే అలా!
డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. 2021–22లో దేశంలో ఏకంగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేం ద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు లక్ష కోట్ల డాలర్లకు చేరతాయన్నది హాంకాంగ్‌కు చెంది న క్యాపిటల్ మార్కెట్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా.. ఎందుకీ డిజిటల్ చెల్లింపులు? నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి... 1. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం జనాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించింది. అప్పటికి చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. రోజువారీ లావాదేవీల కోసం ప్రజలు డిజిటల్, ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలుత ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు జరిగాయి. 2. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కరోనా వల్ల బ్యాంకులు, ఆర్థికసంస్థలు విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. సులువైన ఆన్లైన్ పేమెంట్లకు సురక్షిత మార్గాలు తెచ్చాయి. 2016 నాటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులకు దేశంలో పేటీఎం ఒక్కటే అందుబాటులో ఉండగా ఆ తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటివెన్నో వచ్చాయి. 3. డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటం మూడో కారణం. ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర మాత్రం వాటి ద్వారా వచ్చే రాయితీల కోసం 60 శాతం మంది చెల్లింపులు చేస్తున్నట్లు గూగుల్–బీసీజీ సర్వేలో తేలింది. డిజిటల్ చెల్లింపులకు మార్గాలు డెబిట్, క్రెడిట్ కార్డులతో మొదలైన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులకే ఇప్పటికీ పెద్దపీట వేస్తున్నా ప్రి–పెయిడ్, ఎలక్ట్రానిక్ కార్డులు, స్మార్ట్ ఫోన్ యాప్‌లు, బ్యాంక్ యాప్‌లు, మొబైల్ వ్యాలెట్లు, పేమెంట్ బ్యాంకులు, ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీమ్) యాప్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ వ్యాలెట్లు ఐదు, పది రూపాయల లావాదేవీలనూ అనుమతిస్తుండటంతో తోపుడు బండ్ల నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల దాకా వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్‌లో 200 కోట్లున్న యూపీఐ లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న భారతీయుల సంఖ్య వచ్చే ఏడాదికల్లా 66 కోట్లకు చేరుతుందని అంచనా. మార్చిలో మారిన ట్రెండు డిజిటల్ చెల్లింపులు ఇంతలా పెరుగుతున్నా గత మార్చిలో అనూహ్యంగా నగదు చెల్లింపులు భారాగా పెరిగాయి. 2021 మార్చిలో రూ.2,62,539 కోట్ల నగదు చెల్లింపులు జరిగితే గత మార్చిలో రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వాలు పలు పథకాల కింద జనం ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుండటం, వాటిని డ్రా చేసుకోవడం ఇందుకు కారణంగా కన్పిస్తున్నాయి. ఏటీఎం నగదు విత్‌డ్రాయల్స్ కూడా 2020తో పోలిస్తే 2022 మార్చి నాటికి బాగా పెరిగాయి. ఎలా చెల్లిస్తున్నారు? భారతీయులు అత్యధికంగా యూపీఐ విధా నం వాడుతున్నారు. 2021–22లో రూ.84,17,572.48 కోట్ల విలువైన 4.5 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2020–21తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఆధార్ ఆధారిత విధానం (ఏఐపీఎస్) ద్వారా 3,00,380 కోట్ల రూపాయల విలువైన 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత మార్చిలోనే 22.5 లక్షల లావాదేవీల ద్వారా 28,522 కోట్ల రూపాయల డిజిటల్ చెల్లింపులు జరిగాయి. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) ద్వారా 46 కోట్ల లావాదేవీల ద్వారా రూ.37,06,363 కోట్లు చేతులు మారి నట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. టోల్గేట్ చెల్లింపులు దాదాపుగా డిజిటైజ్ అయ్యాయి. 2021– 22లో 24 లక్షల ఫాస్ట్‌ట్యాగ్‌ల రూ.38,077 కోట్ల చెల్లింపులు జరిగాయి. మార్చిలో అత్యధికంగా రూ.4,000 కోట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ల ద్వారా వసూలయ్యాయి. ఇంతలా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్నా దేశంలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో జనం నగదు చెల్లింపులకే మొగ్గుతున్నారు. అయితే ఈ దశాబ్దాంతానికల్లా డిజిటల్ చెల్లింపులు నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
యూపీఐ చార్జీలను రిఫండ్ చేయండి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 1 నుంచి రూపే కార్డులు, భీమ్–యూపీఐ విధానాల్లో చేసిన చెల్లింపులపై విధించిన చార్జీలను కస్టమర్లకు వాపసు చేయాలని బ్యాంకులకు ఆదాయ పన్ను శాఖ సూచించింది. భవిష్యత్‌లోనూ ఈ రెండు విధానాల్లో జరిపే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించవద్దని పేర్కొంది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత నుంచి నిర్దేశిత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) సహా ఇతరత్రా ఎలాంటి చార్జీలు వర్తించబోవని గతేడాది డిసెంబర్లోనే స్పష్టం చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ యూపీఐ లావాదేవీలపై కొన్ని బ్యాంకులు చార్జీలు విధిస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని సీబీడీటీ తెలిపింది. ఇది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. మరోవైపు, ఈ రిఫండ్ల వ్యవహారం బ్యాంకులపై అదనపు భారం మోపుతుందని నాంగియా ఆండర్సెన్ పార్ట్నర్ సందీప్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2019 ఆర్థిక చట్టంలో కేంద్రం ప్రత్యేక నిబంధన చేర్చింది. దీని ప్రకారం రూ. 50 కోట్ల టర్నోవరు దాటిన వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ విధానంలో చెల్లింపులు జరిపేందుకు కస్టమర్లకు వెసులుబాటునివ్వాలి. -
భీమ్ యాప్‌లో లోపం?
ముంబై: యూపీఐ ఆధారిత భీమ్ యాప్‌లో లోపాలున్నాయంటూ కొందరు ఎథికల్ హ్యాకర్లు సోమవారం ఓ వెబ్సైట్ ద్వారా హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను యాప్ నిర్వహణ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొట్టేసింది. 13.6 కోట్ల డౌన్లోడ్లు ఉన్న ఈ యాప్‌లో ఉన్న ఓ లోపం ద్వారా కీలక సమాచారం లీకవుతోందని హ్యాకర్లు వీపీఎన్ మెంటర్ వెబ్సైట్ ద్వారా హెచ్చరించారు. కొన్ని ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఈ ముప్పు తప్పి ఉండేదన్నారు. భీమ్ మొబైల్ పేమెంట్ యాప్ ద్వారా భారీ స్థాయిలో వినియోగదారుల ఆర్థిక సమాచారం పబ్లిక్కు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రొఫైల్స్, లావాదేవీలు, ఆధార్, పాన్, కాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ ప్రూఫ్, ఇతర ప్రొఫెషనల్ సర్టిఫికెట్ల వంటి 409 జీబీల సమాచారం ప్రమాదం బారిన పడినట్లు చెప్పారు. అయితే భీమ్ యాప్ సురక్షితమేనని, ఎలాంటి సమాచారం లీక్ కాలేదని ఎన్పీసీఐ స్పష్టంచేసింది. -
బంపర్ ఆఫర్ : 5 లీటర్ల పెట్రోలు ఉచితం
సాక్షి,ముంబై: ఉచిత పెట్రోలు ఆఫర్‌ను మరి కొన్ని రోజులు పొడిగించింది స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). వినియోగదారులకు 5లీటర్ల దాకా ఉచిత పెట్రోల్ ఆఫర్ చేస్తున్న ఈ పథకం గడువు నవంబరు 23తోనే ముగిసింది. అయితే డిసెంబరు 15వరకు పొడిగించినట్టు ఎస్బీఐ ట్విటర్లో ప్రకటించింది. ఎస్బీఐ కార్డు లేదా, భీమ్ ఎస్బీఐ పే ద్వారా ఇండియన్ ఆయిల్ ఔట్లెట్ల పెట్రోలు కొంటే 5 లీటర్ల వరకూ పెట్రోలు పూర్తిగా ఉచితంగా పొందండి. 2018 డిసెంబర్ 15 వరకు ఈ ఆఫర్ అంటూ ట్విటర్ ప్రకటనలో తెలిపింది. ఆఫర్ పొందాలంటే ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్ బంకులోనైనా కనీసం 100 రూపాయల విలువైన పెట్రోలు కొనుగోలు చేయాలి. 2018 ఏప్రిల్ 1నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒక కస్టమర్ రిపీట్ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను పంపంవచ్చు. అయితే ప్రతీ ఎస్ఎంఎస్కు డిఫరెంట్ కోడ్ ఉండాలి. ఆఫర్ పొందేందుకు అనుసరించాల్సిన విధానం ► ఇండియన్ ఆయిల్ అవుట్లెట్ల నుండి రూ. 100 విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. అదీ భీమ్, ఎస్‌బీఐకార్డు ద్వారా చెల్లింపులకు మాత్రమే. ► 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెలఅధికార కోడ్‌ను 9222222084కు సెండ్ చేయాలి. ► భీమ్ ద్వారా చెల్లిస్తే 12 అంకెల రిఫరెన్స్ కోడ్ , ఎస్బీఐ కార్డుల ద్వారా చెల్లింపుల విషయంలో 6అంకెల కోడ్‌ను నిర్దేశిత నంబరుకు ఎస్ఎంఎస్ చేయాలి. ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇలా అందిన ఎస్ఎంఎస్లలో ఎంపికచేసిన దానికి 50, 100, 150, 200 రూపాయలు స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ప్రచార కాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండు సార్లు ఈ ఆఫర్ పొందే అవకాశం. ఆఫర్ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఈ నగదును ఇండియన్ ఆయిల్ లాయల్టీ ప్రోగ్రాంలో రీడీమ్ చేసుకోవచ్చు. Fuel up with BHIM SBI Pay at any Indian Oil Retail outlet and get up to 5 litres of petrol absolutely free! Offer extended until 15th Dec 2018. For more details, visit: https://t.co/SItjGjVIxN Download now: https://t.co/1ho06MbWn9#IndianOil #NPCI #Offer #Deal #Fuel #Petrol pic.twitter.com/yBixwxYLZH — State Bank of India (@TheOfficialSBI) December 4, 2018 -
దళిత పిల్లల కోసం భీమ్ పాఠశాలలు...!
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు కనీస సదుపాయాల లేమితో కూనారిల్లుతూ, పేద దళితవర్గాల వారికి ప్రైవేట్‌స్కూళ్ల ఫీజులు కట్టే స్థోమత ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చిన్నతనంలో ఈ వర్గాల పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఆలోచనతో భీమ్ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ రావణ్ యూపీలో భీమ్ పాఠశాలలు మొదలుపెట్టాడు. అయితే ఈ స్కూళ్లలోని టీచర్లు గణితం, సైన్స్, ఇతర సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల బోధనకే పరిమితం కావడం లేదు. దేశంలో దళితుల చరిత్ర, కాలక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, దళితజాతిని ఉద్ధరించిన మహానుభావుల జీవితచరిత్ర, వంటివి చిన్నారుల్లో నాటుకునేలా వివరిస్తున్నారు. విద్య ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు సమాజం పట్ల అవగాహన కల్పించి, మార్పునకు రంగం సిద్ధం చేయాలని భావిస్తున్నారు. నేపథ్యం... బడి ముగిశాక కోచింగ్ క్లాస్‌ల రూపంలో దళితుల పిల్లలకు రెండు గంటల పాటు పాఠాలు చెప్పేందుకు మొదట 2015లో ఉత్తరప్రదేశ్ షహరాన్‌పూర్‌లో ఓ పాఠశాలల ప్రారంభించారు. క్రమంగా మీరట్, ఆగ్రా, ముజాఫర్‌నగర్ ,ఇతర జిల్లాలకు ఈస్కూళ్లు విస్తరించాయి. ప్రస్తుతం యూపీలో ఈ స్కూళ్ల సంఖ్య వెయ్యికి పైగానే ఉంది. షహరాన్‌పూర్, హరిద్వార్ జిల్లాల్లోనైతే వీటి సంఖ్య గణనీయంగా ఉంది. చెట్టునీడలో, రవిదాస్ గుడి ఆవరణలో లేదా భీమ్ఆర్మీ కార్యకర్త నివాసంలోనో నిర్వహించే ఈ తరగతులకు అన్ని వయసుల్లోని విద్యార్థులు హాజరవుతారు. ప్రధానంగా స్టేషనరీ సామాగ్రి కోసం రూ.3 వేల వరకు ఖర్చవుతుండడంతో ఆ మొత్తంతోనే ఒక్కో పాఠశాల నిర్వహిస్తున్నారు. టీచర్లు ఎలాంటి పారితోషకం తీసుకోరు. భీమ్ఆర్మీ సభ్యులు పాఠశాల నిర్వహణకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు. ఈ వర్గాలకు చెందిన గ్రాడ్యుయేట్లు, పోస్ట్గ్రాడ్యుయేట్లు రెండేసి గంటల చొప్పున పిల్లలకు సంబంధిత విషయాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలల కొనసాగింపునకు అక్కడి ప్రజలు తమకు తోచిన విధంగా రూ. 50 నుంచి 300 వరకు విరాళాలిస్తున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భీమ్ యాప్: మరోసారి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్లు అందించనుంది. నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్ చేసిన ప్రభుత్వ యాప్ భీమ్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ అఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా గూగుల్ తేజ్, ఫ్లిప్‌కార్ట్ ఫోన్ పే మార్కెటింగ్ వ్యూహాలను ఫాలో అవుతూ ఇపుడు భీమ్ యాప్ ద్వారా కూడా ఆఫర్ల వెల్లువ కురిపించేందుకు తద్వారా వినియోగదారులను భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఆగస్టులో భీమ్ లావాదేవీలు 40.5 శాతం ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 5.75 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన భీమ్ యాప్ ద్వారా అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అమలు చేయనుంది. సుమారు రూ.900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. ఫోన్‌పే, తేజ్, పేటీఎం నమూనాలను పరిశీలించాం. క్యాష్‌బ్యాక్, ప్రోత్సాహకాలు ప్రకటించినప్పుడల్లా లావాదేవీలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. ఇదొక ప్రవర్తనా మార్పు’ అని దీనిపై పనిచేస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలపై దృష్టిపెట్టిన కేంద్రం గూగుల్ తేజ్, ఫోన్‌పే లావాదేవీలు పెరగడం, ఇటు భీమ్ యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్‌లో లావాదేవీలు గణనీయంగా(సింగిల్ డిజిట్‌కు) పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆఫర్‌తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భీమ్ యాప్ ద్వారా తొలి లావాదేవీ జరిపినప్పుడు (కనీస మొత్తం రూ.100కి) రూ.51 క్యాష్ బ్యాక్ లభ్యం. ఇలా వినియోగదారులకు గరిష్టంగా రూ.750 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదే వ్యాపారులకయితే మొత్తంగా ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు. మరిన్ని వివరాలు అధికారిక వెబ్సైట్లో లభ్యం. కాగా భీమ్ యాప్ ద్వారా ఆఫర్లను మొదటిసారి కాదు. గత ఏడాది కూడా, ప్రభుత్వం రెండు కొత్త పథకాలను లాంచ్ చేసింది. భీమ్ రిఫరల్ బోనస్ స్కీమ్, భీమ్ మర్చంట్ క్యాష్ బ్యాక్ స్కీమ్ లను ప్రకటించి.. బహుమతులను అందించిన సంగతి తెలిసిందే. -
రైల్వే టికెట్ బుకింగ్..ఓ గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్లావాదేవాలకు ఊతమిచ్చే ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే టికెట్లను భీమ్, యూపీఐ యాప్ ల ద్వారా బుక్ చేసుకునేలా చర్యలు తీసుకుంది. తద్వారామ లక్షలాది రైల్వే ప్రయాణీకులకు ఊరట నిచ్చింది. దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచి యుపిఐ (యూనిఫైడ్ చెల్లింపు ఇంటర్ఫేస్) చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నామని భారతీయ రైల్వేలు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో యుపిఐ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అమలు చేయబోతున్నామని రైల్వే బోర్డు సభ్యుడు (ట్రాఫిక్) మొహమ్మద్ జంషెడ్ చెప్పారు. ఇప్పుడిక ప్రయాణీకుడు తన క్రెడిట్ / డెబిట్ కార్డును కలిగి ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారు మొబైల్ ఫోన్ లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోగలుగుతారని జంషెడ్ చెప్పారు. బుకింగ్ టిక్కెట్ల కోసం భారత్ క్యూఆర్ కోడ్ ఎంపికను అభివృద్ధి చేయడానికి రైల్వేలు కృషి చేస్తున్నాయన్నారు. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీ వసూలుచేయడంలేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 14వేల కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు మొహమ్మద్ జంషెడ్ ప్రకటించారు. రోజువారీ 97 శాతం బుకింగ్‌లు పాసెంజర్ రిజర్వేషన్ సిస్టం(పీఆర్ఎస్) నగదు ద్వారా, రెండు, మూడు శాతం లావాదేవీలు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రైల్వే అధికారుల ప్రకారం, రోజుకు సుమారు 7.5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. ఐదు లక్షల టిక్కెట్లు పీఆర్ఎస్ కౌంటర్లలో బుకింగ్‌లు జరుగుతున్నాయి. -
ఇక భిమ్ ద్వారా ఉబెర్ చెల్లింపులు
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాకు మద్దతుగా మరో క్యాబ్ అగ్రిగేటర్ చేరిపోయింది. తాజాగా అంతర్జాతీయ క్యాబ్ సర్వీస్ సంస్థ ఊబెర్ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి , భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ ( భిమ్ ) ద్వారా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది. భారత వినియోగదారులకు భిమ్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యాప్‌ల ద్వారా ఈ చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తోంది ఈ వారాంతం నుంచి ఈ పేమెంట్ సదుపాయం అందుబాటులోకి రానుంది. మరో క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా ఇప్పటికే ఈ సెగ్మెంట్లో చేరింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ సహాయంతో యుపిఐ అనుసంధానం జరిగిందనీ, అయితే రైడర్లు ఈ ఫ్లాట్‌ఫాంలో ఉన్న ఇతర 52 బ్యాంకుల్లో దేనితోనైనా సైన్ ఇన్ కావచ్చని ఉబెర్ తెలిపింది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిఢ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది, రాబోయే నెలల్లో మిగతా ఐఓఎస్‌లను అందించనున్నట్టు చెప్పింది. నగదురహిత సమాజాన్ని సృష్టించడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని ఉబెర్ గ్లోబల్ బిజినెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ డేవిడ్ రిచర్ వెల్లడించారు. ఉబెర్ లాంటి గ్లోబల్ బ్రాండ్ల ద్వారా భిమ్, యూపీఊ సేవల ఉపయోగంలో ప్రజల సంఖ్యను పెంచే లక్ష్యాన్ని కేంద్రం ఆశిస్తోందన్నారు. కాగా ఊబెర్‌కు దేశవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వీరంతా వారానికి 9.4 మిలియన్ల రైడ్లను నిర్వహిస్తోంది.. యూపీఐ, భిమ్ సౌకర్యాల ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఊబెర్ ప్రధాన ప్రత్యర్థి ఓలా క్యాబ్ తమ యాప్‌లో యూపీఐ సదుపాయాన్ని ఆరునెలల క్రితమే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
భీమ్ యాప్ డౌన్లోడ్స్ ఎన్నో తెలుసా?
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యాప్ భీం(బీహెచ్ఐఎం) రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారరంభించిన డిజిటల్ పేమెంట్స్ యాప్ కు భారీ ఆదరణ లభిస్తోంది డౌన్ లోడ్స్లో 17 మిలియన్లను దాటిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ యాప్‌ను ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. తొలుత ఈ యాప్‌కు సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని చెప్పిన కాంత్ అవి ఇప్పుడు గణనీయంగా తగ్గాయని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఈ యాప్ కోసం ఐవోస్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీంతో పాపులర్ ఆండ్రాయిడ్ వెర్షన్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే గత ఏడాది నవంబరు, డిసెంబర్ కాలంలో యూఎస్ఎస్డీ ఆధారిత ట్రాన్సాక్షన్లు (ఫీచర్ ఫోన్లో బ్యాంకింగ్ సేవలకు పయోగించే మొబైల్ కోడ్ సందేశం) 45 శాతం పెరిగాయని, నవంబరు 8కి ముందు భారత్‌లో 8 లక్షల పీవోఎస్ మిషన్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 28 లక్షలకు పెరిగిందని అమితాబ్ కాంత్ వెల్లడించారు. కాగా డీమానిటైజేషన్ అనంతరం డిశెంబర్ 30 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్ బీమ్ యాప్ ను లాంచ్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహ అందించే దిశగా ఈయాప్ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ముఖ్యంగా మొబైల్ వాలెట్స్, యూఎస్ఎస్డీ,రూ పే లాంటి డిజిటల్ చెల్లింపులకు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. -
భీమ్ యాప్ తెలుగులో..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్‌నకు సంబంధించి అప్డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) వెల్లడించింది. అప్డేటెడ్ వెర్షన్ 1.2లో కొత్తగా తెలుగు, తమిళం, కన్నడం సహా ఏడు ప్రాంతీయ భాషలు కూడా చేర్చినట్లు పేర్కొంది. ఇప్పటిదాకా ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే ఇది లభిస్తోంది. డిసెంబర్ 30న ప్రవేశపెట్టినప్పట్నుంచీ భీమ్ యాప్‌నకు ఇది రెండో అప్డేట్. లబ్ధిదారు బ్యాంక్ ఖాతాతో అనుసంధానించిన ఆధార్ నంబరుకు నగదు బదిలీ చేసే విధంగా పే టు ఆధార్ నంబర్ ఫీచర్‌ను ఇందులో చేరుస్తున్నట్లు ఎన్పీసీఐ పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల నిబంధనలపై కసరత్తు వినియోగదారుల వివరాల భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సురక్షితం చేసే దిశగా మార్గదర్శకాల రూపకల్పనపై కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో వర్తకులనూ భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులకు సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు గానీ నియంత్రణ వ్యవస్థ గానీ లేదు. పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెర గడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. -
కోటి దాటిన 'భీమ్’ యాప్ డౌన్లోడ్స్
-
కోటి దాటిన 'భీమ్’ యాప్ డౌన్లోడ్స్
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ చెల్లింపులకు ఉపయోగపడే ’భీమ్’ యాప్ డౌన్లోడ్స్ 1 కోటి మార్కును అధిగమించాయి. 20 రోజుల్లోనే ఏకంగా 1.1 కోట్ల మేర యాప్ డౌన్లోడ్స్ జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. మరోవైపు ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు నాలుగు బ్యాంకులు ఇందులో పాలుపంచుకోనున్నట్లు మంత్రి చెప్పారు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత చెల్లింపుల కోసం కొనుగోలుదారులకు మొబైల్ ఫోన్లు.. స్మార్ట్ఫోన్ల అవసరం కూడా ఉండదని పేర్కొన్నారు. కేవలం ఆధార్ ఆధారిత బ్యాంక్ ఖాతా ఉంటే సరిపోతుందన్నారు. ప్రస్తుతం 40 కోట్ల పైగా బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ చెల్లింపుల సాధనాలు మరింత ప్రాచుర్యంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. -
Appకీ కహానీ...
భీమ్... మొబైల్ ఫోన్ ద్వారా వేగంగా, సరళంగా, సులభంగా, భద్రంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘భీమ్’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొద్ది రోజుల కిందట ప్రధాని నరేంద్రమోదీ దీన్ని స్వయంగా ఆవిష్కరించారు. భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. ఈ యాప్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో, బ్యాంక్ అకౌంట్లతో అనుసంధానమై పనిచేస్తుంది. భీమ్ యాప్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్‌తో భీమ్ యాప్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ మీ సిమ్ కార్డులో ఎస్ఎంఎస్ చార్జీకి సరిపడా బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే వెరిఫికేషన్ అవుతుంది. మొబైల్ నంబరే పేమెంట్ అడ్రస్. దీనికి అదనంగా వేరొక కస్టమ్ పేమెంట్ అడ్రస్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కేవలం మొబైల్ నంబర్ ద్వారానే కుటుంబ సభ్యులు, స్నేహితులు, కస్టమర్ల నుంచి సులభంగా డబ్బులను పొందొచ్చు. అలాగే వారికి డబ్బుల్ని పంపొచ్చు. బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. లావాదేవీల వివరాలు పొందొచ్చు. పేమెంట్ అడ్రస్‌ను వేగంగా ఎంట్రీ చేయడం కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఒకేసారి రూ.10,000 పంపొచ్చు. రోజుకు రూ.20,000 వరకు లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో ఇది ఆధార్‌కు అనుసంధానమై వేలిముద్రల ద్వారా కూడా పనిచేసే అవకాశం ఉంది. అయితే దానికన్నా ముందు జనం తమ ఖాతాల్ని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ యాప్ సేవలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. -
గూగుల్ ప్లే స్టోర్‌లో నెం.1 యాప్ ఇదే!
-
గూగుల్ ప్లే స్టోర్‌లో నెం.1 యాప్ ఇదే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 'భీమ్' యాప్ రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన 'భీమ్' (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యాప్ దూసుకుపోతోంది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్ బుక్ వంటి ప్రముఖ యాప్ లను తలదన్ని డోన్ లోడ్ అవుతోంది. ప్రారంభం అయిన మూడు రోజుల్లోనే గూగుల్ ప్లే స్టోర్ చార్ట్ నెంబర్ 1 ప్లేస్ కొట్టేసింది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్బుక్ వంటి ప్రముఖ యాప్‌లను పక్కకు నెట్టేసింది. భీమ్ యాప్... గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఇరవై లక్షల (రెండుమిలియన్ల) డౌన్ లోడ్స్ సాధించింది. వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, చాలా తక్కువ సమయంలో రెండు మిలియన్లమంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో భీమ్ విజయంపై ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సులభ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం, (డిసెంబర్ 30) ఆధార్ ఆధారిత మొబైల్ చెల్లింపు అప్లికేషన్ భీమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట రూపుదిద్దుకుని, ఆయనకు ఘన నివాళిగా అమలులోకి వచ్చిన భీమ్ ప్రజలు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ అద్భుతాలు సృష్టిస్తుందని మోదీ కొనియాడిన సంగతి తెలిసిందే. #BHIM from @NPCI_NPCI races to the top of the charts! Dream debut! https://t.co/I9t2C3G5cV — Nandan Nilekani (@NandanNilekani) January 1, 2017 -
ఇద్దరిని మింగిన మ్యాన్‌హోల్
శుభ్రం చేస్తుండగా ఘటన అత్తాపూర్, న్యూస్‌లైన్: మ్యాన్‌హోల్ ఇద్దరు కార్మికులను మింగేసింది. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసే క్రమంలో ఒకరు అందులో పడిపోగా.. అతడిని కాపాడే క్రమంలో మరో మరోవ్యక్తి మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు... ఉప్పర్‌పల్లిలోని ఇంపీరియల్ రెసిడెన్సీఅపార్ట్మెంట్ ముందు భాగంలో ఉన్న మ్యాన్‌హోళ్లు నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దీంతో అపార్ట్మెంట్ సూపర్వైజర్ వాహెద్ మ్యాన్‌హోళ్లను శుభ్రం చేయించడానికి కనకదుర్గ కాలనీకి చెందిన నారాయణ(40), కిషన్‌బాగ్ కు చెందిన భీములు(26)ను సంప్రదించాడు. రూ.400లు ఇస్తానని చెప్పి ఇద్దరినీ శనివారం ఉదయం 10 గంటలకు తీసుకొచ్చాడు. ముందుగా అపార్ట్మెంట్ ముందు రోడ్డుపై ఉన్న ఒక మ్యాన్‌హోల్ మూత తీశారు. అది పూర్తిగా మురునీటితో నిండిపోవడంతో అపార్ట్మెంట్ ప్రధాన ద్వారం ముందున్న మరో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లారు. అది కూడా మురుగునీటితో నిండిపోవడంతో భీములు లోపలికి దిగి శుభ్రం చేస్తున్నాడు. ఈక్రమంలో ఒక్కసారిగా జారి పడిపోయాడు. ఊపిరాడక పెద్దగా కేకలు వేస్తుండంతో అతడిని రక్షించేందుకు నారాయణ లోపలికి దిగి భీములును పైకి లాగేందుకు యత్నించాడు. పట్టుతప్పి ఇద్దరూ మ్యాన్‌హోల్‌లో పడి మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీసే పనులు ప్రారంభించారు. మ్యాన్‌హోల్ 18 అడుగుల లోతు ఉండటంతో జేసీబీ సహాయంతో మ్యాన్‌హోల్ పక్కనే మరో గొయ్యి తీయించి మృతదేహాలను బయటకు తీశారు. కాగా, కార్మికులిద్దరూ మ్యాన్‌హోల్‌లో పడిపోగానే సూపర్వైజర్ వాహెద్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరి కుటుంబసభ్యులు మృతదేహాలపై పడి గుండెలు పగిలేలా రోదించారు. కూలీల కళ్లముందే... ఘటన జరిగిన మ్యాన్‌హోల్ పక్కన ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. మొదట మ్యాన్‌హోల్‌లో దిగిన భీములు కేకలు వేయడం ఆ ఇంటి వద్ద ఉన్న కూలీలు గమనించారు. అంతలోనే నారాయణ.. భీములను కాపాడేందుకు మ్యాన్హోల్లోకి దిగాడు. కూలీలు చూస్తుండగా ఇద్దరు మ్యాన్‌హోల్‌లో మునిగి మృతి చెందారు. తమ కళ్లముందే ఇద్దరూ నీట మునిగి చనిపోయారని ఆ కూలీలు కన్నీరు పెట్టుకున్నారు. నాయకుల పరామర్శ.... టీడీపీ గ్రేటర్ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ కార్పొరేటర్లు ప్రేమ్‌దాస్‌గౌడ్, సత్యనారాయణలతో పాటు అమీర్‌పేట్ కార్పొరేటర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పత్తాలేని ఇంటి యజమాని.... ఘటన జరిగిన వెంటనే అపార్ట్మెంట్ యజమాని మసూద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, అతను సాయంత్రం 6 గంటల వరకు కూడా ఘటనా స్థలానికి రాలేదు. అతను వచ్చే వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమని కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు. రూ.2 లక్షల నష్టపరిహారం... రాజేంద్రనగర్: పోలీసుల జోక్యంతో అపార్ట్మెంట్ యజమాని మసూద్ శనివారం రాత్రి 8.30కి ఘటనా స్థలానికి వచ్చాడు. మృతుల కుటుంబసభ్యులకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.