రవి ఉదయాన్నే లేచి కిరాణంకు వెళ్లి ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాడు. బిల్లు చెల్లించేందుకు యూపీఐ థర్డ్‌పార్టీ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేశాడు. కానీ పేమెంట్ జరగలేదు. మళ్లీ ప్రయత్నించాడు. అయినా పేమెంట్ అవ్వలేదు. క్రితం రోజు రాత్రే తన ఫోన్‌లో ఇంటర్‌నెట్ బ్యాలెన్స్ గడువు ముగిసిన విషయం రవికి గుర్తొచ్చింది. ఇంటికేమో సరుకులు తీసుకెళ్లాలి. కానీ పేమెంట్ చేద్దామంటే నెట్ సదుపాయం లేదు. వెంటనే తనకు ‘యూపీఐ 123పే’ సర్వీసు గుర్తొచ్చింది. దాంతో ఎలాంటి ఇంటర్‌నెట్ సౌకర్యం లేకుండానే యూపీఐ పేమెంట్ చేసి సరుకులతో ఇంటికి వచ్చాడు.
యూపీఐ 123పే ఆల్ట్రా క్యాష్ ద్వారా ఎలాంటి నెట్ సదుపాయం లేకుండానే రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా యూపీఐ సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.
మీ ఫోన్ నుంచి యూపీఐ 123పేకు అనుసంధానంగా ఉన్న ‘08045163666’ నంబరుకు డయల్ చేయండి.
ఐవీఆర్‌ను అనుసరిస్తూ స్థానిక భాషను ఎంచుకోవాలి.
మనీ ట్రాన్సాక్షన్ కోసం ‘1’ ఎంటర్ చేయమని ఐవీఆర్‌లో వస్తుంది. వెంటనే 1 ప్రెస్ చేయాలి.
మీరు ఎవరికైతే డబ్బు పంపాలనుకుంటున్నారో బ్యాంకు వద్ద రిజిస్టర్ అయిన తమ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
ఐవీఆర్ సూచనలు పాటిస్తూ మీ బ్యాంకు పేరును వాయిస్ ద్వారా ధ్రువపరచాల్సి ఉంటుంది. వెంటనే మీ అకౌంట్ చివరి నాలుగు డిజిట్లు ఐవీఆర్ కన్ఫర్మ్ చేస్తుంది.
తర్వాత ఎంత డబ్బు పంపించాలో ఎంటర్ చేయాలి.
ఇదీ చదవండి: వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?
మీరు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారో తిరిగి ఐవీఆర్ ధ్రువపరుస్తుంది. ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో వారి పేరు కూడా చెబుతుంది. తిరిగి కాల్ వస్తుందని చెప్పి కాల్ కట్ అవుతుంది.
అలా కాల్ కట్ అయిన క్షణాల్లోనే ముందుగా మీరు కాల్ చేసిన నంబర్ నుంచే కాల్ వస్తుంది.
మనీ ట్రాన్స్‌ఫర్ ధ్రువపరిచేందుకు ఐవీఆర్‌ను అనుసరించి 1 ప్రెస్ చేయాలి.
తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.
మీరు ఎవరికైతే డబ్బు చెల్లించాలో వారి ఖాతాలో డబ్బు జమైందో కనుక్కుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment