breaking news
internet ban
-
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. ఒడిశాలో కర్ఫ్యూ, ఇంటర్నెట్ బంద్
భువనేశ్వర్: ఒడిశాలో దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కటక్‌లో రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్‌లో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.వివరాల ప్రకారం.. మత సామరస్యం విషయంలో వెయ్యి సంవత్సరాల ప్రశాంత చరిత్ర కలిగిన ఒడిశాలోని కటక్‌లో హింస చెలరేగింది. శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య తొలిసారిగా హింస చెలరేగింది. దర్గా బజార్ ప్రాంతం గుండా కఠాజోడి నది ఒడ్డుకు వెళుతున్న దుర్గా మాత నిమజ్జన ఊరేగింపును స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకుంది. అర్ధరాత్రి వేళ డీజే కారణంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తీవ్రమైంది. ఊరేగింపులో ఉన్నవారు ప్రతిఘటించడంతో, పైకప్పుల నుంచి రాళ్లు, గాజు సీసాలు పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ ఘర్షణలో కటక్ డీసీపీ రిషికేశ్ ఖిలారీతో సహా ఆరుగురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, జనాలను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే, అతి కష్టం మీద ఘర్షణలకు కారణమైన వ్యక్తులని తరిమికొట్టిన పోలీసులు.. నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు.କଟକ ରେ ଦୁର୍ଗା ମା ଙ୍କ ଭସାଣି ରେ ଡିସିପି ଙ୍କୁ ପଥର ମାଢ଼❗ ମାନ୍ୟବର @odisha_police ଙ୍କୁ ଅନୁରୋଧ ଏ ସିସିଟିଭି ଫୁଟେଜ କୁ ଯାଞ୍ଚ କରି ଅସାମାଜିକ ଯୁବକ ଙ୍କୁ ତୁରନ୍ତ ଗିରଫ କରି ଆଇନ ଅନୁଯାଇ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରନ୍ତୁ |@dcp_cuttack @CuttackDM @CMO_Odisha @homeodisha @PrithivirajBJP @IPR_Odisha pic.twitter.com/crxfy4iudA— Nrusingha Behera 🇮🇳 (@NrusinghaOdisha) October 5, 2025 వీహెచ్‌పీ ర్యాలీతో మళ్లీ ఉద్రిక్తతలు..కటక్‌లో ఆంక్షలు ఉన్నప్పటికీ విశ్వ హిందూ పరిషత్ ఆదివారం సాయంత్రం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. నగరం తూర్పు శివార్లలోని బిద్యాధర్‌పూర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఘర్షణలు జరిగిన దర్గా బజార్ మీదుగా వెళ్లి, సీడీఏ ప్రాంతంలోని సెక్టార్ 11 వద్ద ముగిసింది. ర్యాలీ సందర్భంగా రూట్లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని, గౌరీశంకర్ పార్క్ ప్రాంతంలో పలు దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటికి నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించిన గుంపులను చెదరగొట్టడానికి కమిషనరేట్ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం 12 గంటల బంద్‌కు వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. ఘర్షణకు అధికారం యంత్రాంగం వైఫల్యమే కారణమని ఆరోపించింది.Results of communal violence in Cuttack. #Cuttack #DurgaPuja pic.twitter.com/pOpbwkOL23— Suraj Sureka (@surajsureka9) October 5, 2025ఇంటర్నెట్ నిలిపివేత..కటక్‌లో హింస, ఉద్రిక్తతలు పెరగడంతో, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి ఒడిశా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కటక్ మున్సిపల్ కార్పొరేషన్, కటక్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే 42 మౌజా పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దర్గా బజార్, గౌరీశంకర్ పార్క్, బిద్యాధర్‌పూర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను పెంచారు. స్థానిక పోలీసులకు సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిని కూడా మోహరించారు. -
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!
రవి ఉదయాన్నే లేచి కిరాణంకు వెళ్లి ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాడు. బిల్లు చెల్లించేందుకు యూపీఐ థర్డ్‌పార్టీ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేశాడు. కానీ పేమెంట్ జరగలేదు. మళ్లీ ప్రయత్నించాడు. అయినా పేమెంట్ అవ్వలేదు. క్రితం రోజు రాత్రే తన ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ గడువు ముగిసిన విషయం రవికి గుర్తొచ్చింది. ఇంటికేమో సరుకులు తీసుకెళ్లాలి. కానీ పేమెంట్ చేద్దామంటే నెట్ సదుపాయం లేదు. వెంటనే తనకు ‘యూపీఐ 123పే’ సర్వీసు గుర్తొచ్చింది. దాంతో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే యూపీఐ పేమెంట్ చేసి సరుకులతో ఇంటికి వచ్చాడు.యూపీఐ 123పే ఆల్ట్రా క్యాష్ ద్వారా ఎలాంటి నెట్ సదుపాయం లేకుండానే రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా యూపీఐ సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.మీ ఫోన్ నుంచి యూపీఐ 123పేకు అనుసంధానంగా ఉన్న ‘08045163666’ నంబరుకు డయల్ చేయండి.ఐవీఆర్‌ను అనుసరిస్తూ స్థానిక భాషను ఎంచుకోవాలి.మనీ ట్రాన్సాక్షన్ కోసం ‘1’ ఎంటర్ చేయమని ఐవీఆర్‌లో వస్తుంది. వెంటనే 1 ప్రెస్ చేయాలి.మీరు ఎవరికైతే డబ్బు పంపాలనుకుంటున్నారో బ్యాంకు వద్ద రిజిస్టర్ అయిన తమ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.ఐవీఆర్ సూచనలు పాటిస్తూ మీ బ్యాంకు పేరును వాయిస్ ద్వారా ధ్రువపరచాల్సి ఉంటుంది. వెంటనే మీ అకౌంట్ చివరి నాలుగు డిజిట్లు ఐవీఆర్ కన్ఫర్మ్ చేస్తుంది.తర్వాత ఎంత డబ్బు పంపించాలో ఎంటర్ చేయాలి.ఇదీ చదవండి: వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?మీరు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తిరిగి ఐవీఆర్ ధ్రువపరుస్తుంది. ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో వారి పేరు కూడా చెబుతుంది. తిరిగి కాల్ వస్తుందని చెప్పి కాల్ కట్ అవుతుంది.అలా కాల్ కట్ అయిన క్షణాల్లోనే ముందుగా మీరు కాల్ చేసిన నంబర్ నుంచే కాల్ వస్తుంది.మనీ ట్రాన్స్ఫర్ ధ్రువపరిచేందుకు ఐవీఆర్‌ను అనుసరించి 1 ప్రెస్ చేయాలి.తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.మీరు ఎవరికైతే డబ్బు చెల్లించాలో వారి ఖాతాలో డబ్బు జమైందో కనుక్కుంటే సరిపోతుంది. -
Manipur: ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తేయండి!
ఇంఫాల్: గిరిజనలు.. గిరిజనేతర వర్గపోరుతో మొదలైన అలర్లు.. హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ నిషేధాన్ని ఎత్తేయాలంటూ శనివారం బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు నెలలుగా అక్కడ నిషేధం అమలులో ఉంది. మే 3వ తేదీ నుంచి మణిపూర్‌లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధం విధించి.. ఆ బ్యాన్‌ను కొనసాగిస్తూ వస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తేయాలని.. కనీసం పాక్షికంగా అయినా నిషేధం ఎత్తివేసి పరిమితంగా అయినా సేవలను అందించాలని ప్రభుత్వాన్ని తన ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు. పైగా రాష్ట్రంలో లీజుకు తీసుకున్న లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు ఉన్నవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వాళ్లకు ఇంటర్నెట్ యాక్సెస్‌ను అనుమతించాలని పేర్కొంది. పర్వత ప్రాంతాల్లో నివసించే కుకీ తెగ.. లోయ ఏరియాల్లో నివసించే మెయితీస్ల మధ్య ఘర్షణలు.. మణిపూర్‌ను రణరంగంగా మార్చేశాయి. తప్పుడు సమాచారం ద్వారా హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందంటూ మే 3వ తేదీ నుంచి ఇంటర్నెట్ను బ్యాన్ చేసి.. పలుమార్లు ఆ నిషేధాన్ని పొడిగించుకుంటూ వస్తోంది బీరెన్ సింగ్ ప్రభుత్వం. అయితే.. హింసతో ప్రాణాలు పోవడం మాత్రం ఆగడం లేదక్కడ. -
అమరావతిలో కర్ఫ్యూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
సాక్షి, ముంబై: త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి. అమరావతి నగరంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు చేపట్టిన బంద్ సందర్భంగా హింస చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా మూడు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. త్రిపురలో మైనార్టీలపై దాడిచేసి, ఓ ప్రార్థనా మందిరాన్ని దుండగులు «ధ్వంసం చేశారన్న వార్తలతో అమరావతిలో శుక్రవారం ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా దుకాణాలపై కొందరు రాళ్లు రువ్వి, ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. శుక్రవారం జరిగిన హింసను వ్యతిరేకిస్తూ శనివారం అమరావతి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్వాయి. ఉదయాన్నే వందలాది మంది కాషాయం జెండాలు చేతబూని వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌కమల్ చౌక్‌తోపాటు పలు ప్రాంతాల్లో దుకాణాలపై రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అమరావతి నగర పరిధిలో కర్ఫ్యూ విధించారు. నాందేడ్, నాసిక్, యావత్మల్ తదితర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజేపీ నేతలు బలవంతంగా దుకాణాలు మూసివేయించారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, హోంశాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ విజ్ఞప్తి చేశారు. అమరావతిలో బీజేపీ కార్యకర్తల బంద్ దృశ్యం -
ఉద్రిక్తత: కేంద్రం మరో కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయం చట్టాలను నిరశిస్తూ ఢిల్లీ సరిహదుల్లో రైతులు చేపట్టిన దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 అనంతరం రాజధానిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమిస్తోంది. రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసాకాండ అనంతరం ఇంటి ముఖం పట్టిన వేలాది మంది రైతులు మళ్లీ ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, ఘజీపూర్, టిక్రి ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ (అంతర్జాలం) సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపింది. దేశ రాజధాని సమీపంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా ఇంటర్నెట్ను నిలిపిస్తున్నట్లు హోంశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. (స్థానికులు కాదు గూండాలు; వెళ్లేది లేదు!) మరోవైపు రైతు దీక్షల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్ రూపంలో ఉగ్రదాడి పొంచి ఉందన్న పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యాఖ్యలపై కేంద్రం అప్రమత్తమైంది. సీఎం వ్యాఖ్యలపై ఇంటిలిజెన్స్ అధికారుల నుంచి సమాచారం సేకరిస్తోంది. మరోవైపు యూపీ గేట్ పరిసరాలను ఖాళీ చేయాలన్న స్థానిక మెజిస్ట్రేట్ ఉత్తర్వును ధిక్కరిస్తూ వందలాదిమంది బీకేయూ(భారతీయ కిసాన్ యూనియన్) సభ్యులు యూపీగేట్ వద్దకు చేరుకుంటున్నారు. వారిని ఖాళీ చేయించేందుకు స్థానిక ప్రభుత్వం కరెంట్ కోతతో సహా పలు యత్నాలు చేస్తోంది. ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే నిరసన ప్రదేశాన్ని సందర్శించి.. ఆర్ధరాత్రి కల్లా స్థలాన్ని ఖాళీ చేయాలనిమౌఖికంగా ఆదేశించారు. దీంతో ఘాజీపూర్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
నిషేధం అన్నారు.. హాయిగా వాడుతున్నారు!
శ్రీనగర్: రాష్ట్రంలో హింసకు కారణమవుతున్న తీవ్రవాదులు, అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నెల రోజులపాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను బుధవారం నిషేధించింది. నిషేధం అమలులోకి వచ్చినా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గురువారం హాయిగా మొబైల్స్ లో ఇంటర్నెట్ సేవలను వినియోగించడం స్థానికంగా కలకలం రేపింది. వేర్పాటు వాదులకు ఆసరాగా నిలుస్తున్న 22 సోషల్ వెబ్సైట్లను ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ ఉత్తర్వులు వెలువరించేందాకా ఈ నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసినా నిషేధం ప్రభావం కేవలం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ నెట్ యూజర్లకే వర్తించినట్లు కనిపించింది. కశ్మీర్ లోయ ఏరియాలో ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ అప్లికేషన్ల వాడకంపై బీఎస్ఎన్ఎల్ ఉన్నతోద్యోగి స్పందించారు. నిషేధం గురించి తెలుసు కానీ, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు రాలేదని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులతో ఈ విషయాన్ని చర్చించి ఇంటర్నెట్ సేవలు నిషేధిస్తామని పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మసూద్ బాలా తెలిపారు. ప్రత్యేకించి నిషేధించిన వెబ్ సైట్లను బ్లాక్ చేయడం తమ వల్ల కాదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించినట్లు ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (వీపీఎన్) ద్వారా యూజర్లు అప్లికేషన్లను యథేచ్చగా వాడుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. -
'ఇంటర్నెట్ వాడకం ఉగ్రవాదులకే బాగా తెలుసు'
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేయాలని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో ముందున్న డోనాల్డ్ ట్రంప్ అన్నారు. సోషల్ మీడియాను ఎరగా వాడి యువకులను ఐఎస్ ఊబిలోకి లాగుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మనల్ని, మన దేశాన్ని నాశనం చేయాలనుకునే మిలిటెంట్లు ఇంటర్నెట్ వాడుతారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఓ డిబెట్ కార్యక్రమానికి హారైన ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇంటర్నెట్ మాధ్యమంగా వాడి ఐఎస్ గ్రూపులోకి చాలా మందిని రప్పించుకుందన్నారు. సామాన్య పౌరుల కంటే కూడా ఇస్లామిక్ మిలిటెంట్లు ఇంటర్నెట్ సేవల్ని బాగా వినియోగించుకుంటారని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ మేధావులు ఎలాగైనా శ్రమించి ఉగ్రసంస్థలు తమ సమాచారాన్ని కనిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీని వాడి ఐఎస్ఎస్ గ్రూపు ఎప్పుడు, ఎక్కడ ఉంటుంది, వారు ఎటువంటి చర్యలకు పాల్పడనున్నారో అలాంటి విషయాలను మీరు ముందుగానే గుర్తించాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అయితే, రిపబ్లికన్ పార్టీకే చెందిన మరో అభ్యర్థి, ఓహియో గవర్నర్ జాన్ కసిక్ ఈ విషయాలను ఖండించారు. ఇంటర్నెట్ను తొలగించాలనుకోవడం మంచి నిర్ణయమా అని ప్రశ్నించారు. ఇంటర్నెట్ అంశంపై ట్రంప్ వ్యాఖ్యలను గమనిస్తే ఆయన సీరియస్ అభ్యర్థి కాదని సెనెటర్ రాండ్ పాల్ అభిప్రాయపడ్డారు. తనపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో.. ఐఎస్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరాక్, సిరియాలలో మాత్రమే ఇంటర్నెట్ సేవలు నిషేధించాలని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు ట్రంప్ స్పష్టంచేశారు. -
జమ్మూకశ్మీర్ లో ఇంటర్నెట్ బంద్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజలు ఇంటర్నెట్ లేకుండా బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటలకు ఇంటర్నెట్ సేవలు నిలిపోనున్నాయి. అసాంఘిక శక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టే అవకాశముందని భావించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. బక్రీద్ పండుగ, ఎద్దు మాంసంపై నిషేధం నేపథ్యంలో రెండు రోజుల పాటు డేటా సేవలు నిలిపి వేయాలని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లను డీజీపీ(కశ్మీర్) ఎస్ జేఎం గిలానీ ఆదేశించారు. డేటా సేవలు నిలిపివేయడంతో ఇంటర్నెట్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లను ఓపెన్ చేయడం సాధ్యం కాదు.


