Internet Services
-
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!
రవి ఉదయాన్నే లేచి కిరాణంకు వెళ్లి ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకున్నాడు. బిల్లు చెల్లించేందుకు యూపీఐ థర్డ్‌పార్టీ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేశాడు. కానీ పేమెంట్ జరగలేదు. మళ్లీ ప్రయత్నించాడు. అయినా పేమెంట్ అవ్వలేదు. క్రితం రోజు రాత్రే తన ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ గడువు ముగిసిన విషయం రవికి గుర్తొచ్చింది. ఇంటికేమో సరుకులు తీసుకెళ్లాలి. కానీ పేమెంట్ చేద్దామంటే నెట్ సదుపాయం లేదు. వెంటనే తనకు ‘యూపీఐ 123పే’ సర్వీసు గుర్తొచ్చింది. దాంతో ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే యూపీఐ పేమెంట్ చేసి సరుకులతో ఇంటికి వచ్చాడు.యూపీఐ 123పే ఆల్ట్రా క్యాష్ ద్వారా ఎలాంటి నెట్ సదుపాయం లేకుండానే రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా యూపీఐ సేవలు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.మీ ఫోన్ నుంచి యూపీఐ 123పేకు అనుసంధానంగా ఉన్న ‘08045163666’ నంబరుకు డయల్ చేయండి.ఐవీఆర్‌ను అనుసరిస్తూ స్థానిక భాషను ఎంచుకోవాలి.మనీ ట్రాన్సాక్షన్ కోసం ‘1’ ఎంటర్ చేయమని ఐవీఆర్‌లో వస్తుంది. వెంటనే 1 ప్రెస్ చేయాలి.మీరు ఎవరికైతే డబ్బు పంపాలనుకుంటున్నారో బ్యాంకు వద్ద రిజిస్టర్ అయిన తమ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.ఐవీఆర్ సూచనలు పాటిస్తూ మీ బ్యాంకు పేరును వాయిస్ ద్వారా ధ్రువపరచాల్సి ఉంటుంది. వెంటనే మీ అకౌంట్ చివరి నాలుగు డిజిట్లు ఐవీఆర్ కన్ఫర్మ్ చేస్తుంది.తర్వాత ఎంత డబ్బు పంపించాలో ఎంటర్ చేయాలి.ఇదీ చదవండి: వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?మీరు ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తిరిగి ఐవీఆర్ ధ్రువపరుస్తుంది. ఎవరికైతే డబ్బు పంపించాలనుకుంటున్నారో వారి పేరు కూడా చెబుతుంది. తిరిగి కాల్ వస్తుందని చెప్పి కాల్ కట్ అవుతుంది.అలా కాల్ కట్ అయిన క్షణాల్లోనే ముందుగా మీరు కాల్ చేసిన నంబర్ నుంచే కాల్ వస్తుంది.మనీ ట్రాన్స్ఫర్ ధ్రువపరిచేందుకు ఐవీఆర్‌ను అనుసరించి 1 ప్రెస్ చేయాలి.తర్వాత మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. వెంటనే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది.మీరు ఎవరికైతే డబ్బు చెల్లించాలో వారి ఖాతాలో డబ్బు జమైందో కనుక్కుంటే సరిపోతుంది. -
‘నెట్టింట’ యువతరం
స్మార్ట్‌ఫోన్ సాయంతో యువతకు ఇంటర్నెట్ చేరువ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో 82 శాతం మంది (15–24 ఏళ్ల వయసులోని వారు), పట్టణాల్లో 92 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సర్వేలో తెలిసింది. 15–24 ఏళ్ల వయసులోని 95.7 శాతం గ్రామీణ యువత మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఇది 97 శాతంగా ఉంది. కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ ‘కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే’ (సీఏఎంఎస్) వివరాలను విడుదల చేసింది. 79వ జాతీయ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్)లో భాగంగా ఇది జరిగింది. ఇదీ చదవండి: గాల్లో ఎగిరిన ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..సర్వే వివరాలు..15–24 ఏళ్లలోని 78.4 శాతం యువత అటాచ్డ్ ఫైల్స్‌తో మెస్సేజ్‌లు పంపుకుంటున్నారు. 71.2 శాతం మంది కాపీ–పేస్ట్ టూల్స్ వాడుతున్నారు. 26.8 శాతం మంది సమాచారం కోసం శోధిస్తున్నారు. అలాగే, మెయిల్స్ పంపడం, ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 95.1 శాతం ఇళ్లల్లో టెలిఫోన్/మొబైల్ ఫోన్ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 94.2 శాతంగా ఉంటే, పట్టణాల్లో 97.1 శాతం ఇళ్లకు ఈ సదుపాయం ఉందని సర్వేలో తెలిసింది.9.9 శాతం ఇళ్లల్లోనే డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతం ఇళ్లకే ఈ సదుపాయం ఉంటే, పట్టణాల్లో 21.6 శాతంగా ఉంది.96.9 శాతం మంది యువతీ యువకులు సులభంగా ఉండే ప్రకటనలు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం చేస్తున్నారు. సులభమైన లెక్కలు వేయగలుగుతున్నారు. పురుషుల్లో ఇలాంటి వారు 97.8 శాతంగా ఉంటే, మహిళల్లో 95.9 శాతంగా ఉన్నారు.ఆస్పత్రిపాలైనప్పుడు వైద్యం కోసం జేబులోంచి చేస్తున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో కుటుంబం నుంచి ఏడాదికి రూ.4,129గా ఉంటే, పట్టణాల్లో రూ.5,290గా ఉంది. అదే ఆస్పత్రిలో చేరకుండా పొందే వైద్యం కోసం గడిచిన 30 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటివారు రూ.539 ఖర్చు చేయగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.606గా ఉంది.బస్సు, కారు, ట్యాక్సీ, ఆటో వంటి చౌక ప్రజా రవాణా సాధనాలను పట్టణాల్లోని 93.7 శాతం మంది సౌకర్యవంతంగా పొందుతున్నారు. విద్య, ఉపాధి, శిక్షణ పొందని యువత గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మేర ఉంటే, పట్టణాల్లో 19 శాతం ఉన్నారు. -
నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..
నేపాల్ ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు చెల్లింపులు చేయకపోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచాయి. నేపాల్‌కు చెందిన అప్‌స్ట్రీమ్ భాగస్వాములు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు నేపాల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఇస్పాన్) తెలిపింది.నేపాల్‌లోని ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలు గురువారం రాత్రి తమ సేవలను నిలిపేసినట్లు ఇస్పాన్ పేర్కొంది. ఇంటర్నెట్ మానిటర్ సంస్థ నెట్‌బ్లాక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం..18 నేపాలీ ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఐదు గంటలపాటు సర్వీసులను తగ్గించినట్లు, అందులో కొన్ని బ్యాండ్ విడ్త్‌ను పూర్తిగా తగ్గించినట్లు తేలింది. ఇంటర్నెట్ అంతరాయం కొనసాగవచ్చని, ఈ అంశం తమ పరిధిలో లేదని ఇస్పాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సువాష్ ఖడ్కా తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలకు అధికప్రాధాన్యం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఇదీ చదవండి: భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..స్థానిక బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు సుమారు మూడు బిలియన్ నేపాలీ రూపాయలు (రూ.187 కోట్లు) బకాయిపడ్డారు. అయితే బయటిదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు పాత బకాయిలు చెల్లిస్తేనే సర్వీసులు అందిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కొంతకాలంగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవల ఇంటర్నెట్ సర్వీసులు నిలిపేసినట్లు తెలిసింది. నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ లెక్కల ప్రకారం ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారని సమాచారం. -
ప్రపంచంలోనే చైనా ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఆవిష్కరణ
బీజింగ్: ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనీస్ కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబిట్ల డేటాను ప్రసారం చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ వేగం ప్రస్తుత ప్రధాన ఇంటర్నెట్ కంటే పది రెట్లు ఎక్కువని పేర్కొంది. సింఘువా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్లు దీనిని అభివృద్ధి చేశాయి. బీజింగ్-వుహాన్- గ్వాంగ్‌జౌలను అనుసంధానిస్తూ ప్రత్యేకమైన ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా దాదాపు 3,000 కిలోమీటర్ల వరకు ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లు సాధారణంగా సెకనుకు కేవలం 100 గిగాబిట్ల వేగంతో పనిచేస్తాయి. అమెరికా ఐదవ తరం ఇంటర్నెట్ కూడా సెకనుకు 400 గిగాబిట్ల వేగాన్ని కలిగి ఉంది. కానీ చైనా కనిపెట్టిన ఇంటర్నెట్ సెకనుకు 1.2 టెరాబిట్ (1,200 గిగాబిట్)ల డేటాను ప్రసారం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. బీజింగ్-వుహాన్-గ్వాంగ్జౌ ప్రాజెక్టు చైనా భవిష్యత్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం. ఇది కేవలం ఒక సెకనులో 150 హై-డెఫినిషన్ ఫిల్మ్‌లకు సమానమైన డేటాను బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని హువాయ్ టెక్నాలజీస్ వైస్-ప్రెసిడెంట్ వాంగ్ లీ వివరించారు. ఇదీ చదవండి: హమాస్ ఇజ్రాయిల్ మధ్య కుదిరిన డీల్! -
సగానికిపైగా వినియోగదారులకు ఇంటర్నెట్ కష్టాలు!
జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సరఫరాకు సంబంధించి గత ఆరు నెలలుగా వందలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డీఎస్ఎల్ సేవలపై కొన్ని సంస్థలు ఇంటర్నెట్ అంతరాయంపై సర్వే నిర్వహించాయి. ఇంటర్నెట్ సేవలు అందించే కంపెనీలు దాదాపు రూ.75వేల కోట్లతో వినియోగదారులకు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. అయినప్పటికీ కనెక్టివిటీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. నిరంతరం ఇంటర్నెట్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో 56శాతం మంది నెట్ కనెక్షన్లో అంతరాయం వల్ల ఇబ్బందిపడుతూ సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీలు ముందుగా వాగ్ధానం చేసిన వేగం కంటే నెట్ తక్కువ వేగంతో వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. వీరిలో 21శాతం మంది ప్రతి నెలా మూడుసార్లకు పైగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశం అంతటా 303 జిల్లాల నుంచి 51,000 మందితో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 67శాతం పురుషులు, 33శాతం మహిళలు ఉన్నారు. 46శాతం మంది వినియోగదారులు తమ ఫిర్యాదులను పరిష్కరించడానికి సర్వీస్ ప్రొవైడర్లు 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ఇదీ చదవండి: డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రిమోట్ వర్క్, వర్క్‌ఫ్రంహోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని నివేదిక చెబుతుంది. 70శాతం మంది యూజర్లు ఇంటర్నెట్ సరఫరాలో మెరుగైన సేవలందించే ఇతర సర్వీస్ ప్రొవైడర్‌కు మారడానికి ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కొన్ని సర్వేల నివేదికల ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగించే సరళి ఈ కింది విధంగా ఉంది. * ఇంటర్నెట్ వ్యాప్తి 2012లో దేశవ్యాప్తంగా 12.6 శాతం నుంచి 2022 నాటికి 48.7 శాతానికి పెరిగింది. * ప్రపంచ వ్యాప్తంగా 692 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ రెండో స్థానంలో ఉంది. * గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఎక్కువ. * తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నప్పటికీ..పేదరికం, అవగాహన లేకపోవడం, స్పష్టమైన లింగ వ్యత్యాసం వంటి కారణాల వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఇంకా ఆశించినమేర ఉండడం లేదు. * 2028 నాటికి 244 మిలియన్ కుటుంబాలు ఇంటర్నెట్ వినియోగిస్తాయని అంచనా. * 2020 నాటికి దేశంలో 622 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వచ్చే ఐదేళ్లలో దాదాపు 45 శాతం పెరుగుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 900 మిలియన్లకు చేరుకోనుంది. -
సారీ..రీచార్జ్‌కు డబ్బుల్లేవు
బనశంకరి: రాష్ట్రంలో వేలాది గ్రామాలు, పట్టణాల్లో పేద బాలలకు విద్యా, పోషణ సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు తీవ్ర కష్టం వచ్చింది. డిజిటలీకరణ మాటలకే పరిమితమైంది. అంగన్వాడీ కార్యకర్తలు, పర్యవేక్షకులకు అందించిన స్మార్ట్ ఫోన్లు అలంకారంగా మిగిలాయి. నిరుపేద కుటుంబాల పిల్లలు, గర్భిణీలు, బాలింతలు సమగ్ర సమాచారం మొత్తం ఆన్లైన్లో నమోదై ఉండాలని కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన పథకం ప్రారంభించింది. ప్రతి అంగన్వాడీ కి అందించిన స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం రీచార్జ్ చేయకపోవడంతో ఇంటర్నెట్ అందక పనిచేయడం లేదు. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన పథకం లక్ష్యం నెరవేరలేదు. ఆరు నెలలుగా సమస్య పోషణ అభియాన కింద 2020లో 62,581 అంగన్వాడీ, 3,331 ఉపకేంద్రాలతో పాటు మొత్తం 65, 911 కేంద్రాల కార్యకర్తలకు శామ్సంగ్ గ్యాలక్సీ ఏ–10 ఎస్ మోడల్ స్మార్ట్‌ఫోన్, ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ సిమ్‌లను సర్కారు అందజేసింది. కొత్తగా ప్రారంభించిన 1050 అంగన్వాడీలకు ఇంకా ఇవ్వలేదు. ఈ పథకానికైన వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60–40 కింద భరిస్తాయి. ఎయిర్‌టెల్‌కు డబ్బు చెల్లించక సుమారు 6 నెలలుగా 65,911 స్మార్ట్ ఫోన్లు మూగబోయాయి. దీనిపై అంగన్వాడీలు పై అధికారులకు ఫిర్యాదు చేస్తే నిధుల కొరత అని సమాధానం వచ్చింది. రెండువారాల కిందట బెంగళూరులో జరిపిన రాష్ట్రస్థాయి అంగన్వాడీల ఆందోళలోనూ ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మళ్లీ చేతితో ఫైళ్లు రాయడం, రికార్డుల నిర్వహణ లాంటి పనులు ప్రారంభమయ్యాయి. జీతాలు, ప్రోత్సాహక ధనానికి ఇబ్బందులే రాష్ట్రంలో 62 వేల అంగన్వాడీల్లో 1.24 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పనిచేస్తున్నారు. వీరికి సేవ ఆధారంగా పురస్కారాలు, గౌరవవేతనం పెంచే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. 20 ఏళ్లకు పైబడి సేవలందించినవారికి రూ.1,500, 10 నుంచి 20 ఏళ్లు సరీ్వస్ కు రూ.1,250, 10 ఏళ్లలోపు సరీ్వసు ఉన్నవారికి రూ వెయ్యి చొప్పున జీతం పెంచుతామని సీఎం బసవరాజబొమ్మై బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి నాలుగు నెలలు గడిచినప్పటికీ గౌరవవేతనం పెంపు వీరికి అందలేదని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గత 3 నెలలనుంచి జీతాలు కూడా అందలేదని సమాచారం. గత వారం నుంచి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అందింది రెండునెలలు వేతనమేనని తెలిపారు. పెండింగ్ జీతం కూడా త్వరలోనే మంజూరు చేస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ప్రియాంక తెలిపారు. స్మార్ట్ ఫోన్లకు త్వరలో రీచార్జ్ చేస్తామని మహిళా శిశుసంక్షేమ శాఖా మంత్రి హాలప్ప ఆచార్ తెలిపారు. సొంత ఖర్చుతో కొందరు నిత్యం యాప్‌లో పిల్లలు నమోదు, ఆహార సామగ్రి, గర్భిణీలు సమాచారం నమోదు చేయడానికి అనుకూలంగా ఉండేది. సిమ్ రీచార్జ్ చేయకపోవడంతో గత ఆరునెలలుగా ఇబ్బందిగా ఉందని అంగన్వాడీ కార్యకర్త లక్ష్మీ తెలిపారు. ఇబ్బందులు పడలేక కొందరు కార్యకర్తలు సొంత డబ్బుతో రీచార్జ్ చేసుకున్నట్లు చెప్పారు. (చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ..) -
గ్రామగ్రామానికీ ఇంటర్నెట్
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా చింటూరు మండలం పేగ గ్రామం అడవి మధ్యలో ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సరిహద్దు దండకారణ్యానికి ఆనుకొని ఈ గ్రామం ఉంది. ఆ ఊరిలో మొబైల్ ఫోను సిగ్నల్స్ కూడా ఉండవు. ఊరంతా తిరిగితే ఎక్కడో ఓ చోట అప్పుడప్పుడూ ఫోను సిగ్నల్స్ వచ్చిపోతుంటాయి. అలాంటి కుగ్రామంలో సైతం అంతరాయం లేకుండా నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం ఉండేలా ప్రభుత్వం ఇటీవల కేబుల్‌ను ఏర్పాటు చేసింది. మొబైల్ ఫోనుకు సైతం ఇంటర్నెట్ అందని ఇటువంటి గ్రామాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. 5,929 గ్రామాలకు దాదాపు రూ. 76 కోట్లు ఖర్చుతో కొత్తగా ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2020 జనవరి 26 నుంచి మారుమూల గ్రామాల్లో సైతం ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది నవంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,929 గ్రామాల్లోని సచివాలయాల్లో మొబైల్ ఇంటర్నెట్ ద్వారానే అక్కడి సిబ్బంది ఆన్లైన్ సేవలు అందించారు. మొబైల్ సిగ్నల్స్ లేనప్పుడు లేదంటే సిగ్నల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆన్లైన్ సేవలకు అంతరాయం కలుగుతుండేది.దీనికి పరిష్కారంగా ఏపీలోని అన్ని గ్రామాలకు కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ వసతి కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఒకట్రెండు నెలల్లోనే అన్ని గ్రామాల్లో సచివాలయాలకు కేబుల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
రష్యా తో ‘లైఫ్ లైన్స్’కు ముప్పు!
ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఆక్రమించేసింది. ఇంటర్నెట్ లేనిది క్షణమైనా గడవని పరిస్థితి. కొద్ది గంటలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ సేవలు లేదా సామాజిక మాధ్యమ యాప్‌లు నిలిచిపోతే అదో పెద్ద వార్త అవుతోంది. అలాంటిది ఇంటర్నెట్కు జీవనాడులుగా పరిగణించే సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను ఎవరైనా కత్తిరించేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రపంచం స్తంభించిపోతుంది. అండర్ వాటర్ క్యాప్సుల్ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (ఫైల్) వివిధ ఖండాలను కలుపుతున్న ఆప్టికల్ ఇంటర్నెట్, రక్షణ వ్యవస్థలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, ఆర్థిక కార్యకలాపాలు, క్యాబ్ సర్వీసులు, ఫుడ్ డెలివరీలు... ఇలా ఒకటేమిటి ప్రతిదీ నిలిచిపోతుంది. ప్రపంచం అతలాకుతలమవుతంది. ఇప్పుడదే ముప్పు రష్యా నుంచి పొంచి వుందని అమెరికా, బ్రిటన్‌తో సహా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణ్వాయుధ పోటీ గతించిన ముచ్చట. శత్రుదేశాలను దెబ్బతీయడానికి, ప్రపంచ దేశాలను భయపెట్టడానికి రష్యా, చైనాలు ఇప్పటికే సైబర్ దాడులను సమర్థమంతమైన ఆయుధంగా వాడుతున్నాయి. ఇతర దేశాల్లోని కీలక వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తూ, వాటిని కుప్పకూల్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాకింగ్, డేటా చౌర్యం జరుగుతోంది. అందుకే ప్రపంచదేశాలన్నీ ‘సైబర్ సెక్యూరిటీ’ని అతిపెద్ద సవాల్‌గా స్వీకరించాయి. ఈ తరుణంలోనే రష్యా గత ఐదారేళ్లుగా కొత్త యుద్ధ తంత్రానికి తెరలేపింది. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటూ... ఏ క్షణమైనా వాటిని తుంచేసే విధంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వీటిలో నుంచి ప్రసారమయ్యే సమాచారాన్ని తస్కరించే సాంకేతికతలనూ అభివృద్ధి చేస్తోంది. భారీగా పెట్టుబడులు పెడుతోంది. కొత్తగా నియమితులైన బ్రిటన్ చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ టోనీ రాడకిన్ ఈ జీవనాడులకు రష్యా నుంచే ప్రధాన ముప్పు పొంచి వుందని గతవారం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సముద్రగర్భంలోని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను పరిరక్షించుకోవడానికి.. ప్రత్యేక నిఘా నౌకను 2024 కల్లా జలప్రవేశం చేయిస్తామని బ్రిటన్‌కు చెందిన రాయల్ నేవీ ఇటీవల ప్రకటించింది. ఇది అణ్వాయుధ యుద్ధంతో సమానమైన ముప్పని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్ష మంది సైన్యాన్ని మోహరించడంతో రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా, నాటో దేశాలు రష్యాను పలుమార్లు హెచ్చరించాయి. దీంతో రష్యా అభివృద్ధి చేస్తున్న సముద్రగర్భ సాంకేతికతలు, సమకూర్చుకుంటున్న సాధానాలపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రష్యా ఇలాంటి తీవ్ర చర్యలకు దిగే అవకాశాలు తక్కువే అయినా... అమెరికా, నాటో దేశాలతో ఘర్షణ ముదిరితే... రష్యా దీన్నో ఆయుధంగా వాడే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం. రష్యా ఏయే మార్గాల్లో ప్రపంచానికి జీవనాడులైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌ను దెబ్బతీయగలదో చూద్దాం.. 436: వివిధ సముద్రాల మీదుగా పలు ఖండాలను, ప్రపంచ దేశాలను కలుపుతూ కడలి గర్భంలో మొత్తం 436 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్స్ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు.. 12,87,475 కిలోమీటర్లు. ఇవే నేటి మన ప్రపంచపు జీవనాడులు (లైఫ్ లైన్స్). నిరంతరాయ ఇంటర్నెట్ సేవలకు మూలాధారం. వీటిలో అన్నింటికంటే పొడవైనది అమెరికా– ఆసియా ఖండాలను కలిపేది. ఈ కేబుల్‌లైన్ పొడవు 20,004 కిలోమీటర్లు. 97%: అంతర్జాతీయంగా నిత్యం జరిగే కమ్యూనికేషన్స్‌లో 97 శాతం ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. శాటిలైట్స్ మన కమ్యూనికేషన్స్ అవసరాల్లో మూడు శాతం మాత్రమే తీరుస్తున్నాయి. 10 లక్షల కోట్ల డాలర్లు: సముద్రపు అడుగుభాగంలోని 436 కేబుల్ లైన్స్ ద్వారా ప్రతిరోజూ 10 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ప్రపంచం ఆర్థిక రంగానికి ఇదే లైఫ్‌లైన్. -
సెన్సార్ చిక్కులు.. రూ.40 వేల కోట్ల నష్టం!!
సెన్సార్ చిక్కులు సాధారణంగా ఈ మాటను తరచూ సినీ పరిశ్రమలో వింటుంటాం. అయితే వెబ్ కంటెంట్ విషయంలో ఆ చిక్కులు తక్కువే!. అందుకే ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ, ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ కంటెంట్‌కూ కోతలు తప్పడం లేదు. దీనివల్ల గ్లోబల్ ఎకానమీకి వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇంటర్నెట్ సెన్సార్షిప్ వల్ల పోయినేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. డిజిటల్ సెక్యూరిటీ & రైట్స్ గ్రూప్ ‘టాప్10వీపీఎన్’ నివేదిక ప్రకారం.. ఈ నష్టం మొత్తంగా 5.5 బిలియన్ డాలర్లకు(సుమారు 40 వేల కోట్ల రూపాయలకు పైనే) ఉందని తెలుస్తోంది. 2021లో ఇంటర్నెట్-సోషల్ మీడియాపై ఆంక్షలు, ఇంటర్నెట్ అంతరాయం(షట్‌డౌన్), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రభుత్వాల ఆధిపత్యం-కఠిన చట్టాల అమలు, వెబ్ కంటెంట్‌పై ఉక్కుపాదం.. తదితర కారణాల వల్ల ఈ మేర నష్టం వాటిల్లినట్లు నివేదిక పేర్కొంది. ►ఎక్కువ నష్టపోయింది మయన్మార్ దేశం. సుమారు 2.8 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో 18 వేల కోట్ల రూపాయలపైనే) నష్టపోయింది. మిలిటరీ చర్యల వల్లే ఈ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఇక నైజీరియా ఈ లిస్ట్‌లో రెండో ప్లేస్‌లో ఉంది. జూన్‌లో ట్విటర్‌ను బ్లాక్ చేయడం తదితర పరిణామాల వల్ల నైజీరియా 1.5 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. ►భారత్‌లో కొత్త ఐటీ రూల్స్ వల్ల ఈ నష్టం ప్రధానంగా వాటిల్లింది. దీనికి తోడు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధం-ఆంక్షలు, ఓటీటీ కంటెంట్‌పై ఉక్కుపాదం(పూర్తిస్థాయి సెన్సార్షిప్ రాలేదింకా), కరోనాపై ఫేక్- అశ్లీల కంటెంట్, ఇతర కథనాల నియంత్రణ తదితర కారణాలు ఉన్నాయి. (లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది). ►2021 ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆంక్షలతో 486 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడగా.. 2020లో 268 మిలియన్ ప్రజలు ఇబ్బందిపడ్డారు. అంటే 81 శాతం పెరిగిందన్నమాట. కేవలం ప్రభుత్వాల ఆంక్షలు-నిషేధాజ్ఞల కారణంగా వాటిల్లిన నష్టం 36 శాతానికి(2020తో పోలిస్తే) పెరిగింది. ఎలాగంటే.. ఇంటర్నెట్ షట్‌డౌన్, కఠిన ఆంక్షల వల్ల ఈమేర నష్టం వాటిల్లితే.. ఒకవేళ మొత్తంగా ఇంటర్నెట్ ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కదా!. అసలు నష్టం ఎందుకు వాటిల్లుతుందంటే.. ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇతరత్ర సేవలు, అడ్వర్టైజింగ్, కస్టమర్ సపోర్ట్ సేవలకు విఘాతం, ప్రత్యేకించి సోషల్ మీడియా ఆగిపోవడం వల్ల ఆదాయానికి భారీ గండిపడుతుంది. 2022లో మొదలైంది.. ఇక ఈ ఏడాదిలోనూ ఇంటర్నెట్ స్వేచ్ఛకు అడ్డుకట్ట పడడం ఇప్పటికే మొదలైంది. కజకస్తాన్(మధ్య ఆసియా దేశం), సూడాన్‌లలో నెలకొన్న సంక్షోభాల దృష్ట్యా ఇంటర్నెట్ షట్‌డౌన్ కొనసాగుతోంది. వీటి నష్టం వివరాలు ఇప్పట్లో చెప్పడం కష్టం. చదవండి: భారత్‌లో ఇక ఏరకంగానూ పోర్న్ వీడియోల వీక్షణ కుదరదు! -
Starlink: డబ్బులు కట్టి నెలలు అవుతున్నా..ఇంత వరకు పత్తాలేదు..!
ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నా..ఇప్పటికే ప్రీ ఆర్డర్లు బుక్ చేసుకున్న వినియోగదారులకు ఇంటర్నెట్ను అందించడంలో ఎలన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో శాటిలైట్ ఇంటర్నెట్ కోసం వినియోగదారులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని నెలలు కావొస్తున్నా ఇంటర్నెట్ సేవలు అందడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్,10 యూరోపియన్ కంట్రీస్ కలిపి మొత్తం 14దేశాల్లో పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కానీ 90శాతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్న యూఎస్‌లో..కొందరికి శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే విషయంలో ఎలన్ మస్క్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. జాన్ డ్యూరాన్ అనే వ్యక్తి ఫిబ్రవరిలో 100 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.7,503.50) డిపాజిట్ చెల్లించాడు. డిపాజిట్ చెల్లించిన తరువాత స్టార్ లింక్ కిట్ అందుతుంది. కానీ జాన్ ప్రీ ఆర్డర్ బుక్ చేసుకొని 9నెలలు అవుతున్నా స్టార్‌లింక్ నుంచి ఎలాంటి రిప్లయి రాలేదు. కాంటాక్ట్ చేసినా ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి సెప్టెంబర్‌లో స్టార్‌లింక్ ప్రీ ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు జాన్ తెలిపారు. నేను పిచ్చివాడిని కాదు,స్టార్ లింక్ సర్వీస్ విషయంలో చాలా అసంతృప్తికి గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం జాన్ ఇంటర్ నెట్ కోసం ఫోన్ నుండి మొబైల్ హాట్‌స్పాట్‌ను ఉపయోగిస్తున్నాడు. ఒక జానే కాదు మరి కొంతమంది వినియోగదారులు సైతం ప్రీ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయడంతో కట్టిన మనీ తిరిగి ఇచ్చేశారని,మరి ఇంటర్నెట్ సేవల్ని ఎప్పుడు అందిస్తారో చెప్పాలని అంటున్నారు.ఇప్పటికే ఎలన్ మస్క్ వరల్డ్ వైడ్‌గా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ను అందించేందుకు 1600 శాటిలైట్లను స్పేస్‌లోకి పంపారు. మొత్తంగా 42వేల శాటిలైట్లను పంపే పనిలో పడ్డారు. త్వరలో వరల్డ్ వైడ్‌గా ఇంటర్నెట్ను అందిచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఎలన్ వినియోగదారుల నుంచి వస్తున్న విమర్శలపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. చదవండి: అన్న కుక్కను దువ్వుతుంటే.. తమ్ముడి ఆస్తులు పెరుగుతున్నాయ్ -
‘ఛా! నెట్ మరీ నెమ్మదిగా పనిచేస్తోంది’ ఇలా మీకెప్పుడైనా అనిపించిందా?
ఛా...నెట్ మరీ నెమ్మదిగా పనిచేస్తోంది!! ఇలా మీకెప్పుడైనా అనిపించిందా?అనిపించే ఉంటుంది లెండి....ఎందుకంటే మనం ఉండేది సింగపూర్‌లో కాదు కదా! ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది అక్కడే! మిగిలిన విషయాల మాటేమోగానీ..ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో...భారత్ స్థానం అక్షరాలా 68! సగటు వేగం సెకనుకు 62.45 మెగాబైట్స్ మాత్రమే! ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లోని నెట్స్పీడ్లను పరిగణలోకి తీసుకుని మరీ..స్పీడ్‌టెస్ట్ అనే సంస్థ రూపొందించిన జాబితా ఇది! సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ వేగం అనేది మనం ఉన్న ప్రాంతంలోని పలు విషయాలపై ఆధారపడి ఉంటుంది. టాప్ ర్యాంక్‌లో ఉన్న సింగపూర్‌లో ఇది సెకనుకు 262.2 మెగాబైట్స్ కాగా..దక్షిణ అమెరికా దేశం క్యూబాలో వేగం కేవలం సెకనుకు 3.46 మెగాబైట్స్ మాత్రమే. ఈ భారీ అంతరానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది మౌలిక సదుపాయాల గురించి. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు సర్వీస్ ప్రొవైడర్లు పాతకాలపు రాగి తీగలను వాడుతున్నారా? లేక ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వాడుతున్నారా? అన్న అంశంపై వేగం ఆధారపడి ఉంటుంది. రెండో కారణం.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సమాచారాన్ని సరఫరా చేసే సముద్రగర్భ తీగలకు ఎంత దగ్గరగా మనం ఉన్నామన్నది. ఎందుకంటే వీటిద్వారానే దాదాపు 97% సమాచారం ఒకచోటు నుంచి ఇంకోచోటికి వెళుతూంటుంది మరి! ఈ రెండు అంశాల్లోనూ భారత్‌కు కొంత సానుకూలత ఉంది. దేశంలో నెట్ ప్రసారాలకు వాడేది ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లే అన్నది అందరికీ తెలిసిన విషయమే. సముద్రగర్భ కేబుల్స్ కూడా దేశానికి ఇరువైపుల ఉండే విశాల తీర ప్రాంతాల ద్వారానే వెళుతూంటాయి. నెట్ వేగాన్ని నిర్ణయించే మూడో విషయం దేశ భౌగోళిక స్వరూపం. భారత్ లాంటి భారీ దేశాల్లో ఇంటర్నెట్కు సంబంధించిన మౌలిక సదుపాయాలను కల్పించడం లేదా ఆధునీకరించడం అంత సులువైన పనేమీ కాదు. కేవలం 280 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న, జనాభా సాంద్రత అత్యధికంగా ఉన్న సింగపూర్ లాంటి దేశాలకు చాలా సుళువు. అందుకే అక్కడి నెట్ వేగం అంత ఎక్కువన్నమాట. చివరగా.. ప్రభుత్వ విధానాలు. ఇంటర్నెట్ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యం కూడా వేగాన్ని నిర్ణయిస్తూంటుంది. అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను వివిధ కారణాల వల్ల కుదించి ఇచ్చే తుర్కమెనిస్తాన్ వంటి దేశాల్లో సహజంగానే నెట్ వేగం తక్కువగా ఉంటుందన్నమాట. స్పీడ్‌టెస్ట్ జాబితా రూపొందింది ఇలా... ప్రపంచదేశాల్లో ఇంటర్నెట్ వేగాన్ని లెక్కించేందుకు స్పీడ్‌టెస్ట్ సంస్థ 190 దేశాల్లో సర్వే నిర్వహించింది. టెలిఫోన్ లేదా భూగర్భ కేబుళ్ల ద్వారా అందే ఇంటర్నెట్ సర్వీసులతోపాటు మొబైల్ కనెక్షన్లనూ పరిగణలోకి తీసుకుని జాబితా రూపొందించింది. ముందుగా చెప్పుకున్నట్లు ఈ జాబితా ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక వేగంతో ఇంటర్నెట్ సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోగల దేశం సింగపూర్. ప్రపంచం మొత్తమ్మీద ఇంటర్నెట్ సగటు వేగం సెకనుకు వంద మెగాబైట్ల కంటే చాలా ఎక్కువ. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు సింగపూర్ ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. గత ఏడాది డిజిటల్ రంగంలో సృజనాత్మక ఆవిష్కరణల కోసమే సుమారు 252 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొంత భాగాన్ని టెలికామ్ రంగ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు కేటాయించింది. అత్యల్ప వేగమున్న క్యూబాలో పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఇప్పటికీ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ మాత్రమే అందుబాటులో ఉంది. వేగం సెకనుకు 3.46 మెగాబిట్స్ మాత్రమే. సముద్రగర్భ కేబుళ్లతో అనుసంధానమూ ఇక్కడ తక్కువే. చాలా దేశాలకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కేబుళ్లతో అనుసంధానం ఉంటే.. క్యూబాలో కేవలం ఒకే ఒక్క కేబుల్ ద్వారా సేవలందుతున్నాయి. ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల ద్వారా సెకనుకు గిగాబైట్ల వేగంతోనూ ఇంటర్నెట్ అందించవచ్చు. 5జీ వస్తే ఏమవుతుంది? భారత్‌తోపాటు చాలా దేశాల్లో ప్రస్తుతం నాలుగోతరం ఇంటర్నెట్ టెక్నాలజీని వాడుతున్నారు. దీన్నే 4జీ అని కూడా పిలుస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా అందే గరిష్ట వేగం సెకనుకు వంద మెగాబిట్స్ మాత్రమే! మరి.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 195.52 మెగాబైట్ల వేగం ఎలా వస్తోందని సందేహిస్తున్నారా? చాలా సింపుల్. రెండేళ్ల క్రితమే ఆ దేశం సెకనుకు 10 గిగాబైట్స్ డౌన్లోడింగ్ సామర్థ్యమున్న 5జీ టెక్నాలజీని ఉపయోగించడం మొదలుపెట్టింది. చైనా ఈ ఏడాది ఈ అత్యాధునిక మొబైల్ ఇంటర్నెట్ సేవలను అందించడం మొదలుపెట్టగా మొబైల్ ఇంటర్నెట్ వేగాల్లో టాప్–10 జాబితాలో ఉన్న దేశాల్లో 5జీ అమలు వివిధ స్థాయుల్లో అమల్లో ఉంది. మొబైల్ ఇంటర్నెట్లో టాప్ దుబాయి! ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందితే మొబైల్ ఇంటర్నెట్లో సెల్ టవర్ల ద్వారా లభిస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. స్పీడ్‌టెస్ట్ సిద్ధం చేసిన జాబితా ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ వేగంలో అందరికంటే ముందున్నది యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (దుబాయి). సెకనుకు 195.52 మెగాబైట్ల వేగంతో ఇంటర్నెట్ను అందుకోవచ్చు. ఈ రంగంలో భారత్ పరిస్థితి మరీ అధ్వాన్నం. మొత్తం 140 దేశాల్లోని మొబైల్ ఇంటర్నెట్ వేగాలను స్పీడ్ టెస్ట్ జాబితాలో నమోదు చేస్తే అందులో సెకనుకు 17.96 మెగాబైట్లతో భారత్ 126వ స్థానంలో ఉంది. సుమారు రెండు మెగాబిట్ల అదనపు వేగంతో పాకిస్తాన్ 120వ స్థానంలో ఉండగా.. కీన్యా, ఇథియోపియా, క్యూబా, ఎల్ సాల్వడార్ వంటి పేద దేశాల్లోనూ సెకనుకు 20 మెగాబైట్ల కంటే ఎక్కువ వేగంతో నెట్ లభిస్తోంది. -
వీటిలో ఇంటర్నెట్ సేవలు బంద్..!
రేపటి నుంచి అనగా సెప్టెంబర్ 30 నుంచి పలు డివైజ్‌ల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. Let’s Encrypt’sకు చెందిన IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో పలువురు ఈ సర్టిఫికేట్లను కల్గిన డివైజ్‌లో వరల్డ్ వైడ్ వెబ్సేవలను పొందలేరని టెక్నికల్ నిపుణులు పేర్కొన్నారు. లెట్స్ ఎన్‌క్రిప్ట్ (Let's Encrypt) అనేది నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మొబైల్, ల్యాప్‌టాప్, పర్సనల్కంప్యూటర్స్ వంటి పరికరాల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఈ ఆర్గనైజేషన్ ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్ సహాయంతో మనం వాడే డివైజ్‌లకు ఏలాంటి హాని లేకుండా, సురక్షితమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అంతేకాకుండా మీ పర్సనల్ డేటాను హ్యక్ కాకుండా చూస్తోంది. మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు యూఆర్ఎల్ అడ్రస్‌లో మొదట హెఛ్టీటీపీఎస్తో ఆయా వెబ్సైట్ వస్తోంది. ఈ విషయాన్ని మనలో కొంత మంది గమనించే ఉంటాం. హెఛ్టీటీపీఎస్ ప్రారంభమయ్యే వెబ్సైట్ అత్యంత సురక్షితమని అర్థం. ఈ ప్రాసెస్ పూర్తిగా IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ సహాయంతోనే జరుగుతుంది. చదవండి: Jeans Could Get Pricey: జీన్స్, టీషర్ట్స్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్...! ప్రభావం ఎక్కువగా వీటిపైనే..! IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ ఆప్డేట్ అయిన డివైజ్‌లకు ఏలాంటి ప్రాబ్లమ్ లేదు. ఏళ్ల తరబడి ఎలాంటి ఆప్డేట్కు నోచుకొని డివైజ్‌ల్లో ఇంటర్నెట్ సేవలు ముగియనున్నాయి. టెక్ క్రచ్ నివేదిక ప్రకారం...మాక్ఓఎస్ 2016 వర్షన్, పలు ఓల్డ్ ఐఫోన్స్, విండోస్ ఎక్స్పీ(విత్ సర్వీస్ పాక్ 3), ప్లే స్టేషన్ కన్సోల్ 3. ప్లేస్టేషన్ 4 వంటి అప్‌గ్రేడ్ కాని వాటిలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. ఇలా చేస్తే బెటర్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత 7.1.1 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న అన్ని ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఇంటర్నెట్ పని చేయదు. ఐవోఎస్ 10 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న ఐఫోన్లలో కూడా ఇంటర్నెట్ సేవలు పని చేయవు. మీ డివైజ్ లలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, వెంటనే మీ ఫోన్ లో చెక్ చేసి, పాత వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేయండి. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ వర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు మోజిలా ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చునని తెలుస్తోంది. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! -
‘చిన్నారుల భద్రత’ కోసం గూగుల్ కార్యక్రమం
న్యూఢిల్లీ: భారత్‌లో చిన్నారులకు ఇంటర్నెట్ భద్రతపై అవగాహన కల్పించేందుకు గూగుల్ తన గ్లోబల్ ‘బీ ఇంటర్నెట్ అవెసమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హాస్య పుస్తక ప్రచురణలకు ప్రసిద్ధి చెందిన ‘అమర్ చిత్ర కథ’ భాగస్వామ్యంతో ఎనిమిది భారతీయ భాషల్లో ఇంటర్నెట్ భద్రతకు సంబంధించి పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. ఇంటర్నెట్ యూజర్ల భద్రతను పెంచేందుకు మెరుగుపరిచిన ‘గూగుల్ సేఫ్టీ సెంటర్’ను ఎనిమిది భారతీయ భాషల్లో ప్రారంభించింది. భారత్‌లోని భద్రతా బృందంలో మానవ వనరులను కూడా గణనీయంగా పెంచినట్టు తెలిపింది. దీంతో తప్పుడు సమాచారం, మోసాలు, చిన్నారుల భద్రతకు ముప్పు, నిబంధనల ఉల్లంఘన, ఫిషింగ్ దాడులు, మాల్వేర్కు వ్యతిరేకంగా మరింత గట్టిగా పనిచేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. ‘‘నిత్యం ఇంటర్నెట్ పట్ల చాలా మంది తమ నమ్మకాన్ని చాటుతున్నారు. నూతన సేవలను స్వీకరిస్తున్నారు. వారి విశ్వాసాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ సంజయ్‌గుప్తా పేర్కొన్నారు. -
ఉన్నత విద్యకు కొత్త రూపు: సీఎం జగన్
ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేటు వర్సిటీలుగా మార్చాలంటే వాటికి అత్యుత్తమ ప్రమాణాలను అర్హతగా నిర్దేశించాలి. వాటికి ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్థలతో జాయింట్ సర్టిఫికేషన్ ఉండాలి. ఐదేళ్ల కాలం పాటు ఇది కొనసాగాలి. ఈ ప్రమాణాలను అందుకుంటేనే ప్రైవేటు యూనివర్సిటీగా అనుమతి ఇవ్వడానికి తగిన అర్హత ఉన్నట్లు పరిగణించాలి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు ప్రభుత్వ కోటాలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకు కూడా ఆ నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం–2006కు సవరణలు చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రయివేటు యూనివర్సిటీల చట్టం–2006 సవరణకు రూపొందించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ప్రయివేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు ప్రభుత్వ కోటా కింద భర్తీ చేసే ప్రతిపాదనలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రయివేటు యూనివర్సిటీలు స్థాపించే వారికి అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కోవిడ్–19 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆన్‌లాక్ ఉత్తర్వుల మేరకు దశల వారీగా కాలేజీల పునః ప్రారంభం, క్లాసుల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఎయిడెడ్ కాలేజీల నిర్వహణ పూర్తిగా ఇటు ప్రభుత్వ యాజమాన్యంలో, లేక అటు ప్రయివేటు యాజమాన్యాల చేతిలో ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎయిడెడ్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుందని, లేని పక్షంలో ప్రైవేటు యాజమాన్యాలే నడుపుకొనేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్ల మాధ్యమం వల్ల ఇబ్బందులు రాకుండా చర్యలు – ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలి. వెంటనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. – ఆంగ్ల మాధ్యమానికి విద్యార్థులు సంసిద్ధులయ్యేలా ఆయా కోర్సులలో తగిన మార్పులు, చేర్పులు చేపట్టాలి. డిగ్రీ మొదటి ఏడాదిలోనే ఆయా కోర్సులలో ఇందుకు సంబంధించిన అంశాలను ప్రవేశపెట్టాలి. – 11, 12 తరగతులలో (జూనియర్ కాలేజీల్లో) కూడా ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశ పెట్టాలి. ఒకేసారి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల ఇబ్బందులు రాకుండా పాఠ్య పుస్తకాలను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ముద్రించాలి. ప్రతి గ్రామానికీ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ – ప్రతి గ్రామానికీ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ను తీసుకు వస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. దీనివల్ల పట్టణ ప్రాంత విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. – అమ్మ ఒడి, వసతి దీవెన పథకాల లబ్ధిదారులకు ఇచ్చే నగదుకు ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లను సరసమైన ధరకు ఇచ్చేలా చూస్తున్నామని తెలిపారు. ఈ చర్యలు విద్యా రంగంలో, నైపుణ్య రంగంలో పెనుమార్పులను తీసుకు వస్తాయని పేర్కొన్నారు. – వర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీలలో నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో సిఫార్సులకు చోటు ఉండరాదన్నారు. నియామకాలన్నీ పారదర్శకంగా జరగాలని చెప్పారు. యూనివర్శిటీల్లో అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలున్న బోధనా సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ లెర్నింగ్ కోసం ఇంటర్నెట్లేని వైఫై ప్రోటోకాల్ రాష్ట్రంలోని ఉన్నత విద్యలో ఆన్లైన్ లెర్నింగ్ కోసం ఇంటర్నెట్లేని వైఫై ప్రోటోకాల్ ప్రాజెక్టును ఏర్పాటుచేసేందుకు ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. రిమోట్ డివైజ్ ద్వారా ఒకేసారి 500 మంది యూజర్లు కనెక్ట్ అయ్యేందుకు ఇందులో అవకాశముంటుంది. ఒక్కో రిమోట్ డివైజ్ పరిధి 100 మీటర్లు కాగా ల్యాప్ టాప్, ట్యాబ్, టీవీలతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్షణాల్లో డేటాను ట్రాన్స్ఫర్ చేయగలుగుతుందని అధికారులు వివరించారు. ఇంటర్నెట్ సౌకర్యం వచ్చిన తర్వాతకూడా ఆ సదుపాయాన్ని వాడుకునేలా డివైజ్‌ల రూపకల్పన ఉందని సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సీఎం అంగీకారం తెలిపారు. కాగా సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రేపు అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలు బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు సింగూ, తిక్రీ, ఘాజిపూర్ వంటి ఢిల్లీ సరిహద్దుల్లో ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను రేపు రాత్రి 11 గంటల వరకు నిలివేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ రూల్స్ 2017లోని రూల్ 2లోని సబ్ రూల్ 1 కింద ప్రజా భద్రతను కాపాడటం, ప్రజా అత్యవసర పరిస్థితి దృష్ట్యా టెలికాం సేవలను తాత్కాలికంగా సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.(చదవండి: అమెరికాపై కేసు వేసిన షియోమీ) కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెలల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఢిల్లీలో ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్ విధించింది. ఉత్తరప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసు అధికారులు ఢిల్లీ సరిహద్దులో ఖాజీపూర్ సమీపంలో ముళ్ల తీగలతో కంచె వేశారు. ఖాజీపూర్ నిరసన స్థలంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. -
వైఫై బూత్‌లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ)ల ద్వారా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పీఎం–వాణి’గా వ్యవహరించే ఈ పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేజ్... దేశంలో భారీ వైఫై విప్లవానికి తెరతీయనుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఈ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పనున్నారు. ‘పీడీఓలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, అలాగే ఫీజు వంటివి ఏవీ వర్తించవు. చిన్న షాపులు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల రూపంలో ఈ పీడీఓలు ఉంటాయి’ అని కేబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఎలా పనిచేస్తుందంటే... వైఫై యాక్సెస్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణ, అలాగే సబ్స్క్రయిబర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం వంటివన్నీ పీడీఓ నిర్వర్తిస్తుంది. పీడీఓలకు అగ్రిగేటర్‌గా వ్యవహరించే పీడీఓఏ... పీడీఓలకు అవసరమైన అనుమతులు, అకౌంటింగ్ సంబంధిత అంశాలను చూస్తుంది. యూజర్లు రిజిస్టర్ చేసుకోవడం, దగ్గర్లో ఉన్న ‘వాణి’ సదుపాయం కలిగిన వైఫై హాట్స్పాట్లను గుర్తించి, డిస్ప్లే చేయడం వంటివన్నీ ఉండే విధంగా అప్లికేషన్‌ను యాప్ ప్రొవైడర్లు అభివృద్ధి చేస్తారు. యాప్ ప్రొవైడర్లు, పీడీఓఏలు, పీడీఓల వివరాలను పొందుపరిచేందుకు ఒక కేంద్రీయ రిజిస్ట్రీ ఉంటుంది. ప్రారంభంలో ఈ కేంద్రీయ రిజిస్ట్రీని సీ–డాట్ నిర్వహిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. పీడీఓలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అయితే, పీడీఓఏలు ఇంకా యాప్ డెవలపర్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా, ఎలాంటి ఫీజు లేకుండానే టెలికం శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోపు అనుమతి లభిస్తుంది. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మాయమైపోయిన పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లు.. మళ్లీ కొత్త రూట్లో ప్రజల ముందుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. సందు చివర కిరాణా షాపులు, చిన్నా చితకా టీ కొట్లు, పాన్ షాపుల్లో కూడా పబ్లిక్ వైఫై బూత్‌లు త్వరలో దర్శనమివ్వనున్నాయి. గతంలో పబ్లిక్ కాల్ ఆఫీస్ (పీసీఓ) స్థానంలో ఇప్పుడు పబ్లిక్ డేటా ఆఫీస్(పీడీఓ)లు కొలువుదీరనున్నాయి. మొబైల్ డేటాతో పనిలేకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ... ఎంత కావాలంటే అంత డేటాను లోడ్ చేసుకొని, ఎంచక్కా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టేయొచ్చన్నమాట!! దేశంలో లక్షలాది వైఫై హాట్స్పాట్లను సృష్టించేందుకు ఈ ‘వాణి’ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. కంటెంట్ పంపిణీలో సమానావకాశాలను అందించడంతో పాటు చౌకగా కోట్లాది మందికి బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీన్ని కనెక్టివిటీ సేవల్లో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్)గా చెప్పుకోవచ్చు. – ఆర్ఎస్ శర్మ, ట్రాయ్ మాజీ చైర్మన్ లైసెన్స్ రహిత సంస్థలు అట్టడుగు స్థాయిలో వైఫై సేవలను అందించేందుకు వీలు కల్పించే ఈ కీలక చర్యకు మేం ముందునుంచీ మద్దతిస్తున్నాం. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తికి ఇది ఎంతగానో చేదోడు అందిస్తుంది. ప్రజలను డిజిటల్ పౌరులుగా మార్చేస్తుంది. అదే సమయంలో వ్యాపారాభివృద్ధితో పాటు కిరాణా స్టోర్లు, టీ షాపులు వంటి చిన్న స్థాయి వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మొత్తంమీద చూస్తే సామాజిక–ఆర్థికాభివృద్ధితో పాటు గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ దీని ద్వారా సాకారమవుతుంది. – టీవీ రామచంద్రన్, బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ప్రెసిడెంట్ కొత్త కొలువులు పెరుగుతాయ్... ‘వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే విధంగా ఈ ప్రక్రియ మొత్తం ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో దేశంలో స్థిరమైన, మరింత సమర్థవంతమైన హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (డేటా) సేవలను కోరుకుంటున్న యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. 4జీ మొబైల్ కవరేజీ లేని ప్రాంతాల్లో దీని అవసరం మరింతగా ఉంది. పబ్లిక్ వైఫైను అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ఈ అవసరాలను తీర్చగలం’ అని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించింది. -
జమ్మూకశ్మీర్‌లో ప్రయోగాత్మకంగా 4జీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల పూర్తిస్థాయి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా ఆగస్టు 15 తరువాత ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల 4జీ ఇంటర్నెట్ సేవలు అందించనున్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ జమ్మూకశ్మీర్‌లోని ఒక్కో జిల్లాలో ప్రయోగా త్మకంగా 4జీ ఇంటర్నెట్ సర్వీసులు అందించి, రెండు నెలల తరువాత సమీక్షించాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఆ తరువాత దశలవారీగా విస్తరిస్తామని ఆయన తెలిపారు. జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ బి.ఆర్.గవాయిలతో కూడిన బెంచ్ స్పందిస్తూ.. కేంద్రం నిర్ణయం సమంజసంగానే కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. -
పేదలకు కష్టమే
సాక్షి, హైదరాబాద్ : ఈ ఫొటోలో కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని కందిబండ గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 5 వేలు జనాభా ఉంది. గ్రామ పరిధిలో గాంధీనగర్ తండా, మంగలికుంట తండా, నల్లబండ గూడెం ఆవాస గ్రామాలు ఉన్నాయి. వాటిలో 1,450 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామాల విద్యార్థులు అందరూ ఉన్నత పాఠశాల విద్య కోసం కందిబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వస్తారు. 1976 నుంచి ఈ గ్రామంలో హైస్కూల్ విద్య ప్రారంభమైంది. ప్రస్తుతం కందిబండ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులున్నారు. వీరిలో 30 మంది పదోతరగతి చదవాల్సి ఉంది. ఈ పాఠశాలలో ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిన కేయాన్ ప్రొజెక్టర్ ఉంది కానీ అది పేరుకు మాత్రమే. దాన్ని ఎన్నడూ ఉపయోగించింది లేదు... అది పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. ఇక ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో 90 శాతం మందికి ఫోన్లు ఉన్నాయి. కానీ ఆన్లైన్ తరగతులకు ఉపకరించే స్మార్ట్ఫోన్లు మాత్రం 30 శాతం మందికే ఉన్నాయి. ఈ పాఠశాలలో చదువుకుంటోంది కూడా ఎక్కువ శాతం మధ్యతరగతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల విద్యార్థులు. వీరిలో స్మార్ట్ఫోన్లు వాడేవారు చాలా తక్కు వ. సాధారణ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తుంటారు. గ్రామంలోని ఏ ఒక్క కుటుంబం కూడా రెండు లేదా మూడు స్మార్ట్ఫోన్లు కలిగి లేదు. ఉన్న ఒక్క స్మార్ట్ ఫోనూ ఇంటి యజమాని చేతిలో ఉంటుంది. ఇక, విద్యార్థులకు ఫోన్ల ద్వారా ఆన్లైన్ తరగతులంటే మాత్రం ఈ పాఠశాలలో చదువుకుంటున్న వారిలో 90 శాతానికి పైగా విద్యార్థులు పాఠాలు వినే పరిస్థితి లేదు. స్మార్ట్ఫోన్లున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కూడా సమయానికి ఫోన్ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఇంటర్నెట్ మాటేంటి? గ్రామీణ విద్యార్థులు సమీపంలోని పట్టణాల్లో ఉండే ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ తరగతులంటే వీరికి కష్టకాలమే. ఎందుకంటే అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదు. మారుమూల ప్రాంతాల్లో వీడియో రూపంలో ఏకధాటిగా 30–60 నిమిషాల పాటు పాఠం వినే విధంగా మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ సహకరించడం అనుమానమే. కొత్త ఫోన్ కొనాలంటే స్మార్ట్‌ఫోన్ లేని కుటుంబాలు కొత్తగా ఫోన్లు కొనాలంటే వారి ఆర్థిక స్తోమత సరిపోదు. ప్రస్తుతం కనీసం రూ.10వేలు పెట్టి స్మార్ట్‌ఫోన్ కొని, పిల్లలకు ఆన్లైన్ పాఠాలు నేర్పించడం కష్టమే. ఆన్లైన్ పాఠాలు వినాలంటే ముందు స్కూలు ఫీజు కట్టాలి. పుస్తకాలు కొనాలి. అప్పుడే విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలకు సంబంధించిన పాస్వర్డ్లు ఇస్తున్నారు. కరోనా తెచ్చిపెట్టిన ఫోన్ చదువులు గ్రామీణ, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా భారం కానున్నాయి. ఇక ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుకునే లక్షలాది మంది విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు చెప్పాలంటే ట్యాబ్‌లు ఇవ్వడం వంటి ప్రత్యేక చర్యలు చేపడితే తప్ప ఉపయోగం కనిపించట్లేదు. టీవీలు పాతవి... ఇక టీవీల విషయానికి వస్తే 95 శాతం ఇళ్లలో టీవీలు మాత్రం ఉన్నాయి. ఈ టీవీల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న టీవీలు 10 శాతం కూడా లేవు. ఎప్పటి నుంచో వినియోగిస్తున్న ఈ టీవీల్లో సరిగా బొమ్మ కనిపించడమే కష్టమని, ఈ టీవీల్లో చూసి పాఠాలు నేర్చుకునే పరిస్థితి లేదని విద్యార్థులంటున్నారు. ఫిజిక్స్, గణితం లాంటి సబ్జెక్టుల్లో రాసుకుని చదువుకునేదే ఎక్కువ ఉంటుందని, అలా రాసుకునేందుకు తమ ఇళ్లలో ఉన్న టీవీలు పనికిరావని వారు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో పాఠాలు చెప్తాం... టీవీ చానెల్లో చూసి నేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే కందిబండ గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థుల పరిస్థితి ఏంటనేది అంతుపట్టడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన చింతల రాజు, ఎల్లమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరు పాత ఇనుప సామాన్ల బేరం చేస్తూ జీవనం సాగి స్తున్నారు. రాజు కుమార్తె అనూష ఏడో తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో తరగతులు ప్రారంభం కావడంతో అనూష దిక్కుతోచని స్థితిలో పడింది. తమకు స్మార్ట్‌ఫోన్ కొనే స్తోమత లేదని తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని అనూష తన టీచర్‌కు చెప్పింది. దీంతో అదే పాఠశాలకు చెందిన ఇంకో విద్యార్థిని ఇంటికయినా వెళ్లి చదువుకోవాలని టీచర్ సూచిం చింది. కానీ కరోనా భయం అనూషను బయటకు వెళ్లనీయడం లేదు. ఈ నేపథ్యంలో తమలాంటి నిరుపేద కుటుంబాలకు ఆన్లైన్ విద్య భారమేనని అనూష కుటుంబం చెపుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 68.37 లక్షల కుటుంబాలు, 2.4 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. స్మార్ట్ఫోన్లు తెలంగాణ వ్యాప్తంగా 40 శాతం కుటుంబాలకు లేవని అధికారిక గణాంకాలే చెపుతున్నాయి. అనేక సర్వేల్లోనూ ఈ విషయం వెల్లడయింది. దీంతో ఫోన్ల ద్వారా పాఠాలు చెప్పాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఈ 40 శాతం కుటుంబాల్లోని విద్యార్థులు చదువుకు దూరమయినట్టే. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో టీవీ చానెల్ ద్వారా పాఠాలు చెప్పాలనుకున్నా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాల్లో పాత టీవీలే ఉపయోగిస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు లేని కుటుంబాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. ఇక, ఈ టీవీల్లో ఒక కుటుంబంలోని ఇద్దరు పిల్లలు పాఠాలు నేర్చుకోవాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే... కరోనా కారణంగా విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికే ప్రారంభించిన ఆన్లైన్ తరగతులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థుల మధ్య అంతరానికి దారి తీయడమే కాదు...ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగాల మధ్య అగాధాన్ని కూడా పెంచుతున్నాయి. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 28 లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. -
చౌకగా ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం
సాక్షి, అమరావతి: చౌకగా ఇంటర్నెట్తో పాటు, నాణ్యతగా ఫైబర్ నెట్ సేవలందించడమే లక్ష్యమని పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్‌కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రానున్న 2-3 ఏళ్ల కాలంలో 60 లక్షల మంది సబ్స్క్రైబర్లకు ఫైబర్ నెట్ సేవలు అందిస్తామన్నారు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారన్నారు. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా దశలవారీగా కొత్త సబ్స్క్రైబర్లను పెంచుతామన్నారు. బుధవారం మంత్రి తన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ, మండలాల్లో రూటర్ల సంఖ్య వీలైనంతవరకూ తగ్గించడంపై దృష్టి పెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేలా చూడడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వ్యాఖ్యానించారు. (ఫ్యాబ్రిక్ హబ్‌గా ఏపీ) గ్రామీణ ప్రజలందరికీ అందుబాటులోకి ఇంటర్నెట్ తెస్తామన్నారు. నిర్దేశించుకున్న గ్రామపంచాయతీలు, మండలాలలో పక్కాగా ఫైబర్ నెట్వర్క్ సేవలు అందుతాయని స్పష్టం చేశారు. రూటర్ల ఇన్‌స్టాలేషన్‌లో మరింత పారదర్శకతతోపాటు, కొత్త పరికరాల సేకరణ, అంచనా, ఆర్థిక భారం తగ్గించేందుకు 'టెక్నికల్ కమిటీ' ఏర్పాటు చేశామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. (‘కనెక్షన్’ కింగ్: టీడీపీ అండ.. రూ.కోటి స్వాహా) -
ఇంటింటికీ ఇంటర్నెట్
సిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా టీ–ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీ–ఫైబర్ పనులు సాగుతున్నాయని, ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరి తహారం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటుతూ భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవర్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. న్యాయమైన వాటా వాడుకుంటున్నాం కృష్ణా, గోదావరి నదుల్లో న్యాయమైన నీటి వాటాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ద్వారా వాడుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు దీర్ఘకాలంగా మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశానికి రైతులే వెన్నెముక అని, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత కరెంటును అందిస్తున్నామని, పెట్టుబడి సాయం గా ఇంతటి కరోనా కష్టకాలంలో 57 లక్షల మంది రైతులకు రూ. 7,200 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులకు బీమా కల్పించి ధీమా ఇస్తున్నామని, ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. దమ్మున్న, దక్షత ఉన్న, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కేసీఆర్ అని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి ఏం చేసినా రైతుల లాభం కోసమే తప్ప తన స్వప్రయోజనాల కోసం కాదన్నారు. అక్కరకొచ్చే పంటలు వేస్తే లాభదాయకం అవుతుందని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారని, పంటల సాగులో మార్పు వచ్చిందన్నారు. పాలనా సౌలభ్యం కోసం.. రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా, 30 రెవెన్యూ డివిజన్లను 73 రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. 439 మండలాలు ఉండగా అదనంగా 131 మండలాలను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 3,400 తండాలను కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 42 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఇకపై అభివృద్ధిపైనే దృష్టి వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. రూ.15 కోట్ల వ్యయంతో వీర్నపల్లి మం డలం రాశిగుట్టతండా, మద్దిమల్ల, సోమారం పేట, వన్‌పల్లి, శాంతినగర్ వద్ద నిర్మించిన ఐదు వంతెనలను మంత్రి ప్రారంభించారు. కంచర్లలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గర్జనపల్లిలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
ఆన్‌లైన్‌తో ఆటలొద్దు.. అవి అప్లోడ్ చేయొద్దు
సాక్షి, బెంగళూరు : అనవసరంగా మీ ఆడపిల్లల ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయరాదు. దీనివల్ల మీకు అవమానాలు తప్పవు అని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ ప్రజలను హెచ్చరించారు. సోమవారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో సైబర్ నేరాలు పెచ్చు మీరుతున్నాయి. కొందరుఇంట్లో కూర్చుని అకృత్యాలకి పాల్పడుతున్నారు. ఆన్లైన్లో పాఠాల పేరుతో అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసుకుని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందితే తక్షణం చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. (భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్ ) ఆ నేరాలు పెరుగుతున్నాయి ఇంటర్నెట్ అనేది ఇంట్లో ఉన్న కిటికీ, తలుపులు వంటివి. ఇంటిని ఎలా కాపాడుకుంటామో అలాగే ఆన్లైన్ గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీ ఇంట్లో అక్కచెల్లెలు, భార్యా పిల్లలు ఫోటోలను దయచేసి ఆన్లైన్లో పెట్టరాదు. కొందరు మీ కుటుంబసభ్యుల ఫోటోలను అశ్లీలంగా సృష్టించి మిమ్మల్ని భయబ్రాంతులకు గురి చేయవచ్చు. ఇలాంటి ఘటనలు లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చున్న వారితో జరుగుతున్నాయి అని హెచ్చరించారు. (ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు ) పోలీస్ స్టేషన్లలో కరోనా జాగ్రత్తలు గత మూడు నెలల నుంచి పోలీసులు కరోనాతో పోరాటం చేస్తున్నామని, మార్చి నుంచి అన్ని పోలీస్స్టేషన్లలో మాస్కులు ధరించడం, వేడి నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలని హెచ్చరించామన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని చోట్ల వ్యాపించి బలి తీసుకుంటోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ ఉమ్మరాదని, నిత్యం వేడినీరు తాగాలని సూచించామన్నారు. కొన్ని పోలీస్స్టేషన్లలో వాషింగ్మెషిన్లు కూడా పెట్టామని తెలిపారు. కరోనా సోకిన పోలీసుల రక్షణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
లాక్డౌన్ వేళ.. ఆన్లైన్ బాట
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్డౌన్ నడుస్తోంది.. దాదాపు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.. ఈ నేపథ్యంలో.. ఓవర్ ద టాప్( ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్ తెరలపై బొమ్మలు మరింతగా సందడి చేస్తున్నాయి. ప్రజలు తమ స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, ఆహా తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అతుక్కుపోతున్నారు. తమకు ఇష్టమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర కార్యక్రమాలు తెగ చూసేస్తున్నారు. దీంతో గత పది రోజుల్లో ఓటీటీల వ్యూయర్షిప్ 25శాతం పెరిగింది. ►లాక్డౌన్ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రై మ్, హాట్‌స్టార్, జీ5, హంగామా డిజిటల్, ఆహా.. వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మరింతగా విస్తరిస్తున్నాయి. ►రిలయన్స్ జియో, ఎయిర్టెల్, టాటాస్కై వంటి డీటీహెచ్ సర్వీసులు కూడా తమ ప్యాకేజీల్లో ఓటీటీలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ►రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటీటీల వీక్షణం అంతకంతకూ పెరుగుతోంది. ►గతంలో ఉదయం 6 నుంచి 8, తిరిగి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఓటీటీల వ్యూయర్‌షిప్‌నకు పీక్ టైమ్‌గా ఉండగా.. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు పీక్ టైమ్‌గా ఉంటోంది. ►ఓటీటీల వ్యూయర్షిప్ తక్కువ ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల సమయంలోనూ ప్రస్తుతం వ్యూయర్షిప్ బాగా పెరిగింది. ►ఇక లాక్డౌన్ సమయంలో.. చూడదగ్గ సూపర్హిట్లు, అవార్డులు సాధించిన సినిమాలు, ఇతర కార్యక్రమాల జాబితాలను కూడా జాతీయ, ప్రాంతీయ న్యూస్ చానళ్లు ప్రత్యేకంగా వివరిస్తుండటంతో ప్రజలు వాటిని చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ►ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కొత్త చందాదారులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు కూడా. ►ఏప్రిల్ 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హెడ్డీ లేదు.. ఎస్‌డీనే.. క్వాలిటీనే.. ►లాక్డౌన్ నేపథ్యంలో పలు ఐటీ, ఇతర కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తుండటంతో బ్రాడ్‌బ్యాండ్ సేవలందించే టెలికాం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లపై లోడ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ►మరోవైపు ఇళ్లల్లో ఉన్న వాళ్లు ఓటీటీల ద్వారా సినిమాలు, ఇతర కార్యక్రమాలను ఎక్కువగా చూస్తుండటంతో లోడ్ మరింత అధికమవుతోంది. ►ఈ నేపథ్యంలో టెలికాం సర్వీసు ప్రొవైడర్ల సేవలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ తమ ప్రసారాలను హెడ్డీ కాకుండా ఎస్డీ క్వాలిటీతో ఇవ్వాలని కేంద్ర టెలికాం శాఖ ఆదేశించింది. ఆన్లైన్ పుస్తకాలూ ఫ్రీ ►ఆన్లైన్లో పుస్తకాలను అందిస్తున్న సంస్థలన్నీ వాటి సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించాయి. ►అమెజాన్ బుక్స్, కేంబ్రిడ్జ్ బుక్స్ లాంటి సంస్థలతో ప్రపంచంలోని దాదాపు అన్ని సంస్థలు ఆన్లైన్లో పుస్తకాలు చదువుకునేందుకు చార్జీలు వసూలు చేయడం లేదు. ►పిల్లలు ఇష్టపడే పలురకాల చిత్రాలను కూడా ప్రఖ్యాత సంస్థలు ఉచితంగా అందిస్తున్నాయి. అందులో అమర్‌చిత్రకథ లాంటి వెబ్సైట్లు కూడా ఉన్నాయి. -
కశ్మీర్లో ‘సోషల్’పై నిషేధం ఎత్తివేత
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేస్తూ అక్కడి పాలనా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. మార్చి 17 వరకు అన్ని వెబ్సైట్లను 2జీ స్పీడ్‌తో, ఫిక్స్డ్ లైన్ ఇంటర్నెట్తో వాడుకునేలా పరిమితి విధించారు. గతంలో జనవరి 25న ఇంటర్నెట్ సేవల పాక్షిక పునరుద్ధరణ జరిగినప్పుడు కొన్ని వెబ్సైట్లనే వాడే చాన్సుండేది. ఇప్పుడు పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ల మాదిరిగా గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాకే ప్రీపెయిడ్ సిమ్‌లకు సేవలు అందుబాటులో ఉంటాయని హోంశాఖ ముఖ్య కార్యదర్శి షలీన్ తెలిపారు. అయితే హైస్పీడ్ 4జీ నెట్వర్క్ సేవలపై నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేయడంపై మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇతిజ ట్విటర్లో స్పందించారు. సోషల్ మీడియాను నియంత్రించడం వల్ల ప్రయోజనం లేదని జమ్మూకశ్మీర్ పాలక యంత్రాంగం ఎట్టకేలకు తెలుసుకుందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు గతేడాది ఆగస్టు 5న తన తల్లి మెహబూబా ముఫ్తీ చివరిసారిగా ట్వీట్ చేశారని గుర్తు చేశారు. సోషల్ మీడియాపై నిషేధం తొలగించడంతో మొదటిసారి కశ్మీర్ నుంచి ట్వీట్ చేస్తున్నట్టు వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. (చదవండి: మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆపరేషన్ కమలం?) -
2023 నాటికి 90 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు: సిస్కో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2023 నాటికి ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య 90.7 కోట్లకు చేరుతుందని, జనాభాలో ఈ సంఖ్య 64 శాతమని సిస్కో తన వార్షిక ఇంటర్నెట్ నివేదికలో వెల్లడించింది. 2018లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 39.8 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ సంఖ్య జనాభాలో 29 శాతమని వివరించింది. ‘2018లో 76.3 కోట్ల మొబైల్ యూజర్లు ఉంటే, 2023 నాటికి 96.6 కోట్లకు చేరతారు. నెట్వర్క్డ్ డివైసెస్ 150 కోట్ల నుంచి 210 కోట్లకు చేరతాయి. మొబైల్ కనెక్టెడ్ డివైసెస్ 110 కోట్ల నుంచి 140 కోట్లకు ఎగుస్తాయి. వైర్డ్/వైఫై కనెక్టెడ్ డివైసెస్ 36 కోట్ల నుంచి 69.7 కోట్లను తాకనున్నాయి. నెట్వర్క్డ్ డివైసెస్‌లో స్మార్ట్ఫోన్ల వాటా 42 శాతం నుంచి 38 శాతంగా ఉండనుంది. 2023 నాటికి నెట్వర్క్డ్ డివైసెస్‌లో 66% స్మార్ట్ఫోన్లు, 34% వైఫై/వైర్డ్ కనెక్టెడ్ డివైసెస్ ఉంటాయి. 5జీ కనెక్షన్లు 6.72 కోట్లకు చేరతాయి. మొబైల్ కనెక్షన్లలో 4జీ వాటా 53.1%కి ఎగుస్తుంది. 2018లో ఇది 37.9%గా ఉంది. 2018లో 2,070 కోట్ల మొబైల్ యాప్స్ డౌన్లోడ్ అయితే, 2023 నాటికి ఈ సంఖ్య 4,620 కోట్లకు చేరుతుంది. మొబైల్ కనెక్షన్ సగటు స్పీడ్ 4.6 ఎంబీపీఎస్ నుంచి 16.3 ఎంబీపీఎస్‌కు చేరనుంది’ అని తన నివేదికలో వివరించింది. -
కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలు షురూ
జమ్మూ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ల్యాండ్‌లైన్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగానికి ఇప్పటికే కేంద్రం అనుమతులివ్వగా.. 5 నెలల తర్వాత శనివారం కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్ సర్వీసులను పునరుద్ధరించారు. 2జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలనూ పునరుద్ధరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్లపై 2జీ ఇంటర్నెట్ సేవలను కశ్మీర్‌లోని బండిపోరా, కుప్వారా జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతోపాటు కొన్ని పరిమితులతో సాఫ్ట్వేర్ సర్వీసులు అందించే కంపెనీలకు ల్యాండ్ లైన్ ద్వారా ఇంటర్నెట్ పొందే అవకాశాన్ని కల్పించినట్లు జమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ తెలిపారు. ‘ ఆంక్షల పాక్షిక సడలింపు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని టెలికం సంస్థలకు సూచించాం. అన్ని భద్రత, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పాం’ అని ఆయన అన్నారు. ఈ ప్రీపెయిడ్ మొబైల్ ఫోన్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చే విషయాన్ని పరిశీలించేందుకు టెలికం సంస్థలు వినియోగదారుల వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుందని రోహిత్ చెప్పారు. గత ఏడాది ఆగస్టు నుంచి జమ్మూ కశ్మీర్లో టెలికామ్ సేవలను ఆపేయగా.. సుప్రీంకోర్టు వారం క్రితం వ్యక్తం చేసిన అభ్యంతరాలతో తాజాగా ఆంక్షల తగ్గింపు మొదలైంది. ‘శనివారం నుంచి వాయిస్, ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారి ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్ మొత్తమ్మీద ప్రీపెయిడ్ సిమ్‌కార్డుల్లో ఇకపై ఈ సేవలు అందుబాటులోకొస్తాయి’ అని రోహిత్ వివరించారు.