హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2023 నాటికి ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య 90.7 కోట్లకు చేరుతుందని, జనాభాలో ఈ సంఖ్య 64 శాతమని సిస్కో తన వార్షిక ఇంటర్నెట్ నివేదికలో వెల్లడించింది. 2018లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 39.8 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ సంఖ్య జనాభాలో 29 శాతమని వివరించింది. ‘2018లో 76.3 కోట్ల మొబైల్ యూజర్లు ఉంటే, 2023 నాటికి 96.6 కోట్లకు చేరతారు. నెట్‌వర్క్‌డ్ డివైసెస్ 150 కోట్ల నుంచి 210 కోట్లకు చేరతాయి.
మొబైల్ కనెక్టెడ్ డివైసెస్ 110 కోట్ల నుంచి 140 కోట్లకు ఎగుస్తాయి. వైర్డ్/వైఫై కనెక్టెడ్ డివైసెస్ 36 కోట్ల నుంచి 69.7 కోట్లను తాకనున్నాయి. నెట్‌వర్క్‌డ్ డివైసెస్‌లో స్మార్ట్‌ఫోన్ల వాటా 42 శాతం నుంచి 38 శాతంగా ఉండనుంది. 2023 నాటికి నెట్‌వర్క్‌డ్ డివైసెస్‌లో 66% స్మార్ట్‌ఫోన్లు, 34% వైఫై/వైర్డ్ కనెక్టెడ్ డివైసెస్ ఉంటాయి. 5జీ కనెక్షన్లు 6.72 కోట్లకు చేరతాయి. మొబైల్ కనెక్షన్లలో 4జీ వాటా 53.1%కి ఎగుస్తుంది. 2018లో ఇది 37.9%గా ఉంది. 2018లో 2,070 కోట్ల మొబైల్ యాప్స్ డౌన్లోడ్ అయితే, 2023 నాటికి ఈ సంఖ్య 4,620 కోట్లకు చేరుతుంది. మొబైల్ కనెక్షన్ సగటు స్పీడ్ 4.6 ఎంబీపీఎస్ నుంచి 16.3 ఎంబీపీఎస్‌కు చేరనుంది’ అని తన నివేదికలో వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment