కోటి దాటిన 'భీమ్‌’ యాప్‌ డౌన్‌లోడ్స్‌ | BHIM app crosses 7 million downloads, 1 million transactions | Sakshi
Sakshi News home page

కోటి దాటిన 'భీమ్‌’ యాప్‌ డౌన్‌లోడ్స్‌

Published Fri, Jan 20 2017 1:14 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

కోటి దాటిన 'భీమ్‌’ యాప్‌ డౌన్‌లోడ్స్‌ - Sakshi

కోటి దాటిన 'భీమ్‌’ యాప్‌ డౌన్‌లోడ్స్‌

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులకు ఉపయోగపడే ’భీమ్‌’ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 1 కోటి మార్కును అధిగమించాయి. 20 రోజుల్లోనే ఏకంగా 1.1 కోట్ల మేర యాప్‌ డౌన్‌లోడ్స్‌ జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. మరోవైపు ఆధార్‌ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు నాలుగు బ్యాంకులు ఇందులో పాలుపంచుకోనున్నట్లు మంత్రి చెప్పారు.

ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత చెల్లింపుల కోసం కొనుగోలుదారులకు మొబైల్‌ ఫోన్లు.. స్మార్ట్‌ఫోన్ల అవసరం కూడా ఉండదని పేర్కొన్నారు. కేవలం ఆధార్‌ ఆధారిత బ్యాంక్‌ ఖాతా ఉంటే సరిపోతుందన్నారు. ప్రస్తుతం 40 కోట్ల పైగా బ్యాంక్‌ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయని రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ చెల్లింపుల సాధనాలు మరింత ప్రాచుర్యంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement