గూగుల్ ప్లే స్టోర్లో నెం.1 యాప్ ఇదే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 'భీమ్' యాప్ రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన 'భీమ్' (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యాప్ దూసుకుపోతోంది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్ బుక్ వంటి ప్రముఖ యాప్ లను తలదన్ని డోన్ లోడ్ అవుతోంది.
ప్రారంభం అయిన మూడు రోజుల్లోనే గూగుల్ ప్లే స్టోర్ చార్ట్ నెంబర్ 1 ప్లేస్ కొట్టేసింది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్‌బుక్ వంటి ప్రముఖ యాప్‌లను పక్కకు నెట్టేసింది. భీమ్ యాప్... గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఇరవై లక్షల (రెండుమిలియన్ల) డౌన్ లోడ్స్ సాధించింది. వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, చాలా తక్కువ సమయంలో రెండు మిలియన్లమంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో భీమ్ విజయంపై ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సులభ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం, (డిసెంబర్ 30) ఆధార్ ఆధారిత మొబైల్ చెల్లింపు అప్లికేషన్ భీమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట రూపుదిద్దుకుని, ఆయనకు ఘన నివాళిగా అమలులోకి వచ్చిన భీమ్ ప్రజలు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ అద్భుతాలు సృష్టిస్తుందని మోదీ కొనియాడిన సంగతి తెలిసిందే.
#BHIM from @NPCI_NPCI races to the top of the charts! Dream debut! https://t.co/I9t2C3G5cV
— Nandan Nilekani (@NandanNilekani) January 1, 2017