becomes
-
మరో మైలురాయి: జియో 5జీ సేవల్లో తొలి రాష్ట్రంగా గుజరాత్
సాక్షి,ముంబై: దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించే లక్క్ష్యంతో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. ఇప్పటికే ట్రూ-5జీ సేవలను పలు నగరాల్లో ప్రారంభించిన జియో తాజాగా మరో ఘనతను సాధించింది. భారతదేశంలో జియో 5 జీ సేవలను పూర్తిగా పొందిన తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. ఈ విషయంలో రిలయన్స్ జన్మభూమి కాబట్టి గుజరాత్ ప్రత్యేక స్థానంలో నిలిచింది. (ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు!) ‘ట్రూ 5G ఫర్ ఆల్’ ఇనిషియేటివ్ కింద జిల్లా ప్రధాన కార్యాలయాలలో 100శాతం ట్రూ 5జీ సేవలను అందించనుంది. ‘జియో ట్రూ-5జీ వెల్కమ్ ఆఫర్’ నేటి (నవంబరు 25) నుంచి 33 జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు పొందుతారు. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. (ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు) గుజరాత్లో ఈ శుభారంభం ఒక ముఖ్యమైన నిజమైన 5G-ఆధారిత చొరవతో జరుగుతోందని కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కింద మొదట గుజరాత్‌లోని 100 పాఠశాలల్ని డిజిటలైజ్ చేసి, దీనితో పాఠశాలల్ని అనుసంధానం చేస్తుందని జియో ప్రకటించింది. ⇒ JioTrue5G కనెక్టివిటీ ⇒ అధునాతన కంటెంట్ ప్లాట్‌ఫారమ్ ⇒ ఉపాధ్యాయ & విద్యార్థి సహకార వేదిక ⇒ స్కూల్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ ఈ సాంకేతికత ద్వారా, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విద్యార్థులు లబ్ది పొందుతారు. డిజిటల్ ప్రయాణంలోనాణ్యమైన విద్య , తద్వారా సాధికారత ఈజీ అవుతుందని కంపెనీ తెలిపింది. 100 శాతం జిల్లా ప్రధాన కార్యాలయాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్ నిలవడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. రాబోయే పది, పదిహేనే ళ్లలో 300-400 మిలియన్ల నైపుణ్యం కలిగిన భారతీయులు వర్క్‌ఫోర్స్‌లో చేరనున్నారు. ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన ప్రమాణాన్ని మాత్రమే అందించడంతోపాటు,2047 నాటికి అభివృద్ధి చెందిన మన దేశ ఆర్థిక వ్యవస్థగా మారాల ప్రధానమంత్రి లక్క్ష్య సాధనతో తోడ్పడుతుందన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో 1.3 బిలియన్ల యూజర్లతో డిజిటల్ రంగంలో ఇండియాను గ్లోబల్ లీడర్‌గా నిలిపిందని పేర్కొంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) -
సాహోరే గుడివాడ బామ్మ..
-
సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్ సెన్సేషన్
సాంప్రదాయ రుచికరమైన వంటల తయారీలో గుడివాడ మస్తానమ్మ స్టయిలే వేరు. సెంచరీ దాటేసిన ఈ గ్రానీ ప్రస్థానం తెలిస్తే అంతా ఔరా అనుకోవాల్సిందే. అవును 106 ఏళ్ళ వయసులో చలాకీగా, తన పనులు తను చేసుకుంటూ నోరూరించే వంటకాలతో, టాలెంట్ ప్రదర్శిస్తూ యూ ట్యూబ్ సంచలనంగా మారిపోయింది. 'కంట్రీ ఫుడ్స్' పేరుతో సొంత ఛానెల్‌ను నడుపుతున్న ఈ బామ్మ లక్షల ఫాలోయర్స్‌తో దుమ్మురేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గుడివాడకు చెందిన మస్తానమ్మ యూట్యూబ్ స్టార్.. యూ ట్యూబ్ సెన్సేషన్. తన వంట ట్యుటోరియల్స్ తో యూట్యూబ్ లో సునామీ సృష్టిస్తోంది. కంట్రీ ఫుడ్స్ ఛానల్ లో రకరకాల వంటల నైపుణ్యంతో గుడివాడ బామ్మ సూపర్ పాపులర్. ఆమె చేతి వంటకాల లిస్ట్ ఒకటా రెండా.. చాలా పెద్దదే. ఎగ్ దోశ, ఫిష్ ఫ్రై , పాయా, అరటి ఆకులతో చేసే స్పెషల్ ఫిష్ ఫ్రై, బ్యాంబూ చికెన్ బిర్యానీ లాంటి ఇతర వంటకాలను సులభంగా వండేస్తోంది. ముఖ్యంగా ఈమె వంటకాల్లో వాటర్ మిలన్ చికెన్ ప్రత్యేకమైందనే చెప్పాలి. ఈ ఒక్క వీడియేకే 66లక్షల వ్యూస్ వచ్చాయంటేనే ఇది ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఈ వెరైటీ వంటకాలతో అమెరికా, బ్రిటన్, దుబాయ్‌లలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అక్కడున్న బంధువులు ఫోన్ చేసి మరీ మస్తానమ్మ వంటకాలపై ప్రశంసలు కురిపించారట. ఒక ఆకలితో ఉన్న రాత్రి తాను, తన ఫ్రెండ్స్ కొంత ఆహారాన్ని సిద్ధం చేసుకున్న సందర్భంలో తాము కూడా యూ ట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనే ఆలోచన వచ్చిందట మస్తానమ్మ మనువడు లక్ష్మణ్ కి. ఇలా మొదలు పెట్టిన ఫస్ట్ వీడియోనే వైరల్‌గా మారడంతో మరింత ఊత్సాహంగా దీన్ని ముందుకు నడిపించారు. ఇతనికి అమ్మమ్మ వెరైటీ రెసిపీలు మరింత సహాయం చేశాయి. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే మొదట్లో ఆమె వీడియోలను షూట్ చేస్తోంటే తనకు ఏమీ అర్థంకాలేదని, కానీ అసలు విషయం తెలిసిన తరువాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందని లక్ష్మణ్ వివరించారు. అంతేకాదు.. ఇటీవల 106 వ పుట్టినరోజు సందర్భంగా చీరలు, గ్రీటింగ్ కార్డులు లాంటి బోలెడన్ని బహుమతులు అందుకుందట గ్రాండ్మా. ముఖ్యంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్‌కు చెందిన ఓ ఫ్యాన్ చీరను పంపించారంటూ లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ బామ్మకు యూ ట్యూబ్ ఫాలోయర్ల సంఖ్య ఎంతో తెలుసా. సుమారు 2 లక్షల 48వేలమంది సబ్ స్కైబర్లు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటు వయసులో లేటెస్ట్ సంచలనంగా మారిన మస్తానమ్మకు మనం కూడా సాహో అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం వాటర్ మిలన్ చికెన్ వీడియోపై ఒక లుక్కేసుకుంటే పోలా.. -
గూగుల్ ప్లే స్టోర్‌లో నెం.1 యాప్ ఇదే!
-
గూగుల్ ప్లే స్టోర్‌లో నెం.1 యాప్ ఇదే!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన 'భీమ్' యాప్ రికార్డులు బద్దలు కొడుతోంది. డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన 'భీమ్' (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ) యాప్ దూసుకుపోతోంది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్ బుక్ వంటి ప్రముఖ యాప్ లను తలదన్ని డోన్ లోడ్ అవుతోంది. ప్రారంభం అయిన మూడు రోజుల్లోనే గూగుల్ ప్లే స్టోర్ చార్ట్ నెంబర్ 1 ప్లేస్ కొట్టేసింది. అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్ , ఫేస్బుక్ వంటి ప్రముఖ యాప్‌లను పక్కకు నెట్టేసింది. భీమ్ యాప్... గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఇరవై లక్షల (రెండుమిలియన్ల) డౌన్ లోడ్స్ సాధించింది. వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, చాలా తక్కువ సమయంలో రెండు మిలియన్లమంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దీంతో భీమ్ విజయంపై ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సులభ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం, (డిసెంబర్ 30) ఆధార్ ఆధారిత మొబైల్ చెల్లింపు అప్లికేషన్ భీమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ పేరిట రూపుదిద్దుకుని, ఆయనకు ఘన నివాళిగా అమలులోకి వచ్చిన భీమ్ ప్రజలు వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ అద్భుతాలు సృష్టిస్తుందని మోదీ కొనియాడిన సంగతి తెలిసిందే. #BHIM from @NPCI_NPCI races to the top of the charts! Dream debut! https://t.co/I9t2C3G5cV — Nandan Nilekani (@NandanNilekani) January 1, 2017 -
సిల్కీ హెయిర్‌తో స్టయిలిష్ బ్లాకీ సంచలనం
మెల్బోర్న్: ఒళ్లంతా సిల్కీ సిల్కీ జుట్టుతో మెరిసిసోతూ...పట్టుకుంటే జారీపోయేలా..నల్లని జుట్టుతో మెరిసిపోతున్న ఓ శునకం తాజాగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. అఫ్ఘాన్ ఆఫ్గాన్‌హౌండ్ జాతికి చెందిన అయిదేళ్ల ఆస్ట్రేలియా డాగ్ కు సోషల్ మీడియాలో ఇతర సూపర్ మోడల్స్‌ను మించిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సాధిస్తోంది. ఒక్క ఫోటోతో సూపర్ మోడల్ గా మారిన ఈస్టయిలిష్ బ్లాకీ పేరు టీ. వివరాల్లోకి వెళితే.. టీ యజమాని ల్యూక్ కవనాగ్ సోషల్ మీడియాలో ఫోటోలుఅప్లోడ్ చేశాడు. అంతే మరుక్షణం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. దాని అందానికి ముగ్ధులైన ఎంతోమంది డానికి అభిమానులుగా మారిపోతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ లో లక్షలకొద్దీ లైక్ లు షేర్లతో చక్కర్లుకొడుతోంది. దీంతో అనేక కంపెనీలు కూడా ఈ టీ కోసం క్యూ కట్టాయి. దీంతో శునకం రాజా యజమాని ల్యూక్ కవనాగ్ ,అతని కుటుంబం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. టీ చాలా అందంగా ఉంటుంది..అందుకే దాని ఫొటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాను.. దీంతో ఒక సూపర్ మోడల్ కంటే ఎక్కువ ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారని డెయిలీ టెలీగ్రాఫ్ .కాం ఒక నివేదికలో తెలిపింది. సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. షో డాగ్ గా ఆకట్టుకున్న టీ ఇటీవల రీటైరయ్యిందట. తాజాగా యానిమల్ యాక్టర్ గా సెకండ్ కరియర్ మొదలు పెట్టింది. అయిదే ఫార్మల్ గా రిటైర్ అయిన టీ తో హాలీవుడ్ నటింప చేసే ఆలోచన ఏదీ లేదని తమకు తెలిపారని రిపోర్టు చేసింది. ఇప్పటికే ఈ శునకం ప్రముఖ శునక ఆహార కంపెనీ స్పోక్స్ డాగ్ కి ప్రచారకర్తగా డాగ్ పర్ ఫ్యూమ్ కంపెనీ హారియత్ అండ్ హౌండ్స్ యాడ్ ప్రచారంలో బిజీగామారింది. చాలామంది ఇంటర్నెట్ ప్రముఖులు కంటే ఎక్కువ సంచలనంగా మారిపోయిందని తెలిపింది. -
వరల్డ్ లక్కీయెస్ట్ పాసింజర్..!
ఆమెను అనుకోని అదృష్టం వరించింది. ఫ్లైట్ ఆలస్యం కావడం భారీగా కలసి వచ్చింది. రాక్ స్టార్ ట్రిప్ అనుభవాన్ని తెచ్చి పెట్టింది. లక్షలమందితోపాటు ప్రయాణించాల్సిన ఆమె... ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎటువంటి గందరగోళం లేకుండా ఒంటరిగా ప్రయాణించే ఛాన్స్ కొట్టేసింది. చైనా మహిళ ఝాంగ్ ఇప్పుడు ప్రపంచంలోనే అద్భుత ప్రయాణీకురాలుగా గుర్తింపు పొందింది. గుయాంజూ కు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఆలస్యం అవుతుందన్న వార్త తెలియడంతో తోటి ప్రయాణీకులంతా అంతకు ముందు ఫ్లైట్ కు టికెట్లు మార్చుకున్నారు. కానీ ఝాంగ్ మాత్రం ఎంత ఆలస్యం అయినా అదే ఫ్లైట్ కోసం ఎదురు చూసేందుకు సిద్ధమైంది. అయితే అలా ఫ్లైట్ ఆలస్యం అయినప్పుడు నష్టపోయేవారే ఎక్కువగా ఉంటారు. కానీ ఝాంగ్ విషయంలో అది రివర్స్ అయ్యింది. మంచు కారణంగా సెంట్రల్ ఉహాన్ నుంచి బయల్దేరాల్సిన CZ2833 ఫ్లైట్ తో పాటు... ట్రైన్లు కూడా అన్నీ లేట్ నడుస్తున్నాయి. అయినా ఝాంగ్ వెనుకాడలేదు. లక్షమంది దాకా ప్రయాణీకులు తమ నిర్ణయాన్ని మార్చుకొని ముందు ఫ్లైట్ కు, ట్రైన్లకు వెళ్ళిపోయారు. దీంతో తర్వాత వచ్చిన ఫ్లైట్ లో కేవలం ఝాంగ్ మాత్రమే ప్రయాణించి, చైనాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇలా ప్రయాణించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చైనా పాపులర్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేసింది. ఇది జీవితంలో అరుదుగా వచ్చే అవకాశం అని, తనకు ఆ అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ప్రయాణంలో ఆమె పైలట్ సహా, ఫ్లైట్ అటెండెంట్స్ నుంచి ప్రత్యేక సేవలను అందుకోవడంతోపాటు ప్రాచుర్యాన్ని కూడా పొందింది. చైనీస్ న్యూ ఇయర్ సమయంలో వందల వేల ప్రయాణీకులు అదే మార్గంలో ప్రయాణిస్తుంటారు. కానీ అటువంటి సమయంలో ఝాంగ్ కు ఈ అరుదైన అవకాశం రావడం ఎంతో అదృష్టమని... మీరు నిజంగా ప్రపంచంలోనే లక్కీయెస్ట్ ప్యాసింజర్ అని ఇలా బ్లాగుల్లో ఎంతోమంది ఆమెకు అభినందనలు తెలిపారు. అయితే ఓ చైనా నెటిజన్ మాత్రం సెలవు దినాల్లో వందలమంది ప్యాసింజర్లతో రద్దీగా ఉండే సమయంలో...ఒకే ప్యాసింజర్ తో ఫ్లైట్ ప్రయాణించడం ఎంతో నష్టమన్నారు. ఎయిర్ లైన్స్ కొంత సమయం ఆగి... మరింతమందిని ఎక్కించుకుంటే సరిపోయేదని, ఎంతో ఫ్యూయెల్ వేస్ట్ చేశారంటూ విమర్శించారు. ఆ గోల్డెన్ టికెట్ ఖరీదు సుమారు 181 డాలర్లని మోటార్ కంపెనీ ఉద్యోగులు విలువ కట్టారు. ఎందుకంటే అది చెల్లించేది తామే అని, సరైన ధర తెలియదని చెప్పారు. ఏది ఏమైనా ఝాంగ్ కు ఒంటరిగా ప్రయాణించే అవకాశం తో పాటు... ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందే అదృష్టం కలసి వచ్చింది.