వరల్డ్ లక్కీయెస్ట్ పాసింజర్..! | Chinese woman becomes 'world's luckiest passenger' | Sakshi
Sakshi News home page

వరల్డ్ లక్కీయెస్ట్ పాసింజర్..!

Published Wed, Feb 3 2016 4:29 PM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

వరల్డ్ లక్కీయెస్ట్ పాసింజర్..! - Sakshi

వరల్డ్ లక్కీయెస్ట్ పాసింజర్..!

ఆమెను అనుకోని అదృష్టం వరించింది. ఫ్లైట్ ఆలస్యం కావడం భారీగా కలసి వచ్చింది. రాక్ స్టార్ ట్రిప్  అనుభవాన్ని తెచ్చి పెట్టింది. లక్షలమందితోపాటు ప్రయాణించాల్సిన ఆమె... ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎటువంటి గందరగోళం లేకుండా ఒంటరిగా  ప్రయాణించే ఛాన్స్ కొట్టేసింది. చైనా మహిళ  ఝాంగ్ ఇప్పుడు ప్రపంచంలోనే అద్భుత  ప్రయాణీకురాలుగా గుర్తింపు పొందింది.   

గుయాంజూ కు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఆలస్యం అవుతుందన్న వార్త తెలియడంతో తోటి ప్రయాణీకులంతా అంతకు ముందు ఫ్లైట్ కు టికెట్లు మార్చుకున్నారు. కానీ ఝాంగ్ మాత్రం ఎంత ఆలస్యం అయినా అదే ఫ్లైట్ కోసం ఎదురు చూసేందుకు సిద్ధమైంది. అయితే అలా ఫ్లైట్ ఆలస్యం అయినప్పుడు  నష్టపోయేవారే ఎక్కువగా ఉంటారు. కానీ ఝాంగ్ విషయంలో అది రివర్స్ అయ్యింది. మంచు కారణంగా సెంట్రల్ ఉహాన్ నుంచి బయల్దేరాల్సిన CZ2833 ఫ్లైట్ తో పాటు... ట్రైన్లు కూడా అన్నీ లేట్ నడుస్తున్నాయి. అయినా ఝాంగ్ వెనుకాడలేదు. లక్షమంది దాకా ప్రయాణీకులు తమ నిర్ణయాన్ని మార్చుకొని  ముందు ఫ్లైట్ కు, ట్రైన్లకు వెళ్ళిపోయారు.

దీంతో తర్వాత వచ్చిన ఫ్లైట్ లో కేవలం ఝాంగ్ మాత్రమే ప్రయాణించి, చైనాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇలా ప్రయాణించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చైనా పాపులర్ మైక్రో బ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేసింది. ఇది జీవితంలో అరుదుగా వచ్చే అవకాశం అని, తనకు ఆ అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. ప్రయాణంలో ఆమె పైలట్ సహా, ఫ్లైట్ అటెండెంట్స్ నుంచి ప్రత్యేక  సేవలను అందుకోవడంతోపాటు ప్రాచుర్యాన్ని కూడా పొందింది.

చైనీస్ న్యూ ఇయర్ సమయంలో వందల వేల ప్రయాణీకులు అదే మార్గంలో ప్రయాణిస్తుంటారు. కానీ అటువంటి సమయంలో ఝాంగ్ కు ఈ అరుదైన అవకాశం రావడం ఎంతో అదృష్టమని... మీరు నిజంగా ప్రపంచంలోనే లక్కీయెస్ట్ ప్యాసింజర్ అని ఇలా బ్లాగుల్లో ఎంతోమంది ఆమెకు అభినందనలు తెలిపారు. అయితే ఓ చైనా నెటిజన్ మాత్రం సెలవు దినాల్లో వందలమంది ప్యాసింజర్లతో రద్దీగా ఉండే సమయంలో...ఒకే ప్యాసింజర్ తో ఫ్లైట్ ప్రయాణించడం ఎంతో నష్టమన్నారు.

ఎయిర్ లైన్స్ కొంత సమయం ఆగి... మరింతమందిని ఎక్కించుకుంటే సరిపోయేదని, ఎంతో ఫ్యూయెల్ వేస్ట్ చేశారంటూ విమర్శించారు. ఆ గోల్డెన్ టికెట్ ఖరీదు సుమారు 181 డాలర్లని మోటార్ కంపెనీ ఉద్యోగులు విలువ కట్టారు. ఎందుకంటే అది చెల్లించేది తామే అని, సరైన ధర తెలియదని చెప్పారు. ఏది ఏమైనా ఝాంగ్ కు ఒంటరిగా ప్రయాణించే అవకాశం తో పాటు... ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందే అదృష్టం  కలసి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement